
విజయవాడలో సంచలనం సృష్టించిన గాదె సాయి కృష్ణ (25) కస్టడీ మృతి కేసులో ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) దర్యాప్తును ముమ్మరం చేసింది. ఈ కేసులో తాజాగా మరో ఇద్దరు పోలీస్ కానిస్టేబుళ్లను అరెస్ట్ చేసింది.
దీంతో ఇప్పటివరకు అరెస్టయిన వారి సంఖ్య ఐదుకు చేరింది.కృష్ణలంక పోలీస్ స్టేషన్లో విధులు నిర్వర్తిస్తున్న కానిస్టేబుళ్లు బాబూరావు, సాంబయ్యలను సిట్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. కేసులో ఐదో నిందితుడిగా బాబూరావు, ఆరో నిందితుడిగా సాంబయ్య ఉన్నారు. వారిని రెండో ఏసీఎం కోర్టులో హాజరుపరచగా, న్యాయమూర్తి వారికి 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించారు. బాబూరావును అవనిగడ్డ జైలుకు, సాంబయ్యను గన్నవరం జైలుకు తరలించాలని న్యాయస్థానం ఆదేశించింది. ఈ కేసులో ప్రధాన నిందితుడైన సర్కిల్ ఇన్స్పెక్టర్ (ఎస్హెచ్ఓ) ఎస్.ఎస్.వి.వి. నాగరాజుకు వీరిద్దరూ సహకరించారని ఆరోపణలు ఉన్నాయి.మే 6వ తేదీన పోలీసులు అదుపులోకి తీసుకున్న సాయి కృష్ణ అదృశ్యమయ్యాడు. లాకప్‌లో చిత్రహింసలకు గురిచేసి, కొట్టి చంపేశారని, ఆ తర్వాత మృతదేహాన్ని ఎలక్ట్రిక్ శ్మశానవాటికలో దహనం చేసి ఆధారాలు మాయం చేశారని అతని కుటుంబం ఆరోపిస్తోంది. సాయి కృష్ణ తల్లి విజయలక్ష్మి ఫిర్యాదు మేరకు జూన్ 19న భారతీయ న్యాయ సంహిత కింద పోలీసులు కేసు నమోదు చేశారు.కస్టడీలో తీవ్ర గాయాల వల్లే సాయి కృష్ణ మరణించాడని సిట్ ఇప్పటికే కోర్టుకు నివేదించింది. అంతేకాకుండా పోలీస్ స్టేషన్‌లోని సీసీటీవీ ఫుటేజీని ఉద్దేశపూర్వకంగా తొలగించారని కూడా దర్యాప్తులో తేలింది. కొన్ని కేసులు, నాన్-బెయిలబుల్ వారెంట్లు ఉన్న సాయి కృష్ణను మార్కాపురంలో అదుపులోకి తీసుకుని, కృష్ణలంక పోలీస్