
కృత్రిమ మేధ (ఏఐ) వేగంగా అభివృద్ధి చెందుతున్న వేళ వైద్యులను కూడా అది భర్తీ చేస్తుందా అనే ప్రశ్న తరచూ వినిపిస్తోంది.
వ్యాధులను ముందుగానే గుర్తించడం, స్కాన్లను విశ్లేషించడం, చికిత్సకు అవసరమైన సమాచారాన్ని క్షణాల్లో అందించడం వంటి పనుల్లో ఏఐ ఇప్పటికే కీలక పాత్ర పోషిస్తోంది. అయితే వైద్య రంగ భవిష్యత్తు పూర్తిగా ఏఐ చేతుల్లోకి వెళ్లదని, డాక్టర్లు-ఏఐ కలిసి పనిచేసే విధానమే ముందున్న దారిగా వైద్య నిపుణులు అభిప్రాయపడుతున్నారు.వృద్ధాప్యంలో వైద్యం, గుండె జబ్బులు, క్యాన్సర్, మానసిక ఆరోగ్యం, శ్వాసకోశ వ్యాధులు, ఈఎన్టీ, జనరల్ మెడిసిన్ వంటి విభాగాలకు చెందిన వైద్యులు ఒకే విషయాన్ని స్పష్టం చేస్తున్నారు. ఏఐ ఎంత శక్తిమంతమైనదైనా, మానవీయ స్పర్శ, అనుభవం, నైతిక నిర్ణయాలు, రోగిలో విశ్వాసాన్ని నింపే సామర్థ్యాన్ని భర్తీ చేయలేదని చెబుతున్నారు.ప్రస్తుతం ఏఐ భారీ స్థాయిలో వైద్య సమాచారాన్ని విశ్లేషించి వ్యాధి ప్రమాదాన్ని ముందుగానే అంచనా వేయగలుగుతోంది. వృద్ధుల్లో ఒకేసారి అనేక ఆరోగ్య సమస్యలు ఉన్నప్పుడు చికిత్సను వ్యక్తిగత అవసరాలకు అనుగుణంగా రూపొందించడంలో కూడా ఇది సాయపడుతోంది. కొందరు వైద్యులు తాము రాసే మందుల జాబితాను కూడా ఏఐతో పరిశీలించి అవసరంలేని మందులను తగ్గిస్తున్నట్లు వెల్లడించారు.స్కాన్ల విశ్లేషణ, క్యాన్సర్‌ను తొలిదశలో గుర్తించడం, రోగి చరిత్రను వేగంగా పరిశీలించడం వంటి అంశాల్లో ఏఐ ఉపయోగకరంగా మారుతోంది. దీంతో వైద్యులు రోగులతో మరింత సమయం గడపడానికి అవకాశం లభిస్తుందని నిపుణులు చెబుతున్నారు. అయితే చికిత్స అంటే కేవలం పరీక్షల నివేదికలు చూడటం మాత్రమే కాదని వారు గుర్తుచేస్తున్నారు. భయంతో వచ్చిన రోగికి ధైర్యం