
Venezuela Earthquake: ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు మానవత్వమే అన్నిటికంటే గొప్పదని భారతదేశం మరోసారి నిరూపించింది.
Indian Army rescued a 79 year old woman trapped under the rubble following the earthquake in Venezuela.
Venezuela Earthquake: ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు మానవత్వమే అన్నిటికంటే గొప్పదని భారతదేశం మరోసారి నిరూపించింది. జంట భూకంపాలతో అతలాకుతలమైన వెనెజువెలా(Venezuela Earthquake)ను ఆదుకునేందుకు భారత్ ‘ఆపరేషన్ అమిస్తాద్’ (Operation Amistad) పేరిట ప్రత్యేక సహాయక బృందాలను, వైద్య సామగ్రిని పంపింది. ఈ ఆపరేషన్లో భాగంగా భారత సైన్యం ప్రాణాలను పణంగా పెట్టి సహాయక చర్యలు అందిస్తూ, అంతర్జాతీయంగా దేశ ప్రతిష్టను చాటిచెబుతోంది.
Petrol-Diesel: వాహనదారులకు గుడ్ న్యూస్.. పెట్రోల్, డీజిల్ విక్రయాలపై నో లిమిట్.. ఆంక్షలు ఎత్తివేసిన కేంద్రం
ఈ క్రమంలోనే ఒక అద్భుతం చోటుచేసుకుంది. భూకంపం కారణంగా కూలిపోయిన భవన శిథిలాల కింద కొన్నిరోజుల పాటు నలిగిపోయిన 79 ఏళ్ల వృద్ధురాలిని భారత సైన్యం సజీవంగా వెలికితీసింది. విపరీతమైన గాయాలు, విరిగిన కాలుతో, ఆహారం మరియు వైద్యం అందక మృత్యువు అంచుల వరకు వెళ్లిన ఆ బామ్మను మన సైన్యం సురక్షితంగా రక్షించింది. ఈ విషయాన్ని భారత సైన్యం బుధవారం ఎక్స్ (ట్విట్టర్) వేదికగా గర్వంగా వెల్లడించింది.
ప్రస్తుతం ఆ వృద్ధురాలికి ఇండియన్ ఆర్మీ ఫీల్డ్ హాస్పిటల్లో అధునాతన వైద్య సేవలు అందిస్తున్నారు. ఈ క్లిష్ట సమయంలో వెనెజువెలా ప్రజలకు మానవతా సహాయం అందించేందుకు తాము ఎల్లప్పుడూ కట్టుబడి ఉంటామని భారత సైన్యం స్పష్టం చేసింది. ప్రాణాల కోసం కొట్టుమిట్టాడుతున్న బామ్మను రక్షించి, ఆమెకు పునర్జన్మ ప్రసాదించిన భారత ఆర్మీపై ప్రపంచవ్యాప్తంగా ప్రశంసల జల్లు కురుస్తోంది.