
దురిశెట్టి ధర్మరాజు జీ తెలుగు న్యూస్ (zee telugu news)లో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఆయనకు దాదాపు జర్నలిజంలో నాలుగు సంవత్సరాల పాటు అనుభవం ఉంది.
ఇక్కడ సోషల్, ఆస్ట్రాలజీ, టెక్నాలజీ, ఆటోమొబైల్స్, బిజినెస్, జాతీయం అంశాలకు సంబంధించిన తాజా వార్తలతో పాటు విశ్లేషణ పూరితమైన కథనాలను అందిస్తారు. అలాగే ఆయనకు వెబ్‌సైట్‌కు సంబంధించిన వీడియో కంటెంట్‌పై కూడా అవగాహన ఉంది..
Iraqi MP Gold Underwear Seized News: ఇరాక్ దేశాన్ని కుదిపేస్తున్న భారీ అవినీతి, అక్రమ ఆస్తుల వ్యవహారంలో అక్కడి ప్రభుత్వం అత్యంత సంచలన నిర్ణయం తీసుకుంది. దేశ చరిత్రలోనే ఎన్నడూ లేని విధంగా ప్రభుత్వ ఫెడరల్ ఇంటెగ్రిటీ కమిషన్‌తో పాటు ప్రత్యేక భద్రతా దళాలు ఉమ్మడిగా దేశవ్యాప్తంగా మెరుపు దాడులు నిర్వహిస్తూ వస్తున్నారు.. ఈ భారీ ఆపరేషన్‌లో భాగంగా పలువురు కీలక రాజకీయ నేతలతో పాటు ప్రభుత్వ ఉన్నతాధికారులు, సిట్టింగ్ పార్లమెంట్ సభ్యులు (MPs) జైళు పాలయిన్నట్లు తెలుస్తోంది. వారిలో ముఖ్యంగా ఇరాక్ సిట్టింగ్ ఎంపీ హింద్ అల్-అబ్బాసిని భద్రతా దళాలు వ్యూహాత్మకంగా అదుపులోకి తీసుకోవడం అంతర్జాతీయంగా పెను సంచలనం సృష్టించింది.
కుబేరులను మించిన ఎంపీ.. సిట్టింగ్ ఎంపీ హింద్ అల్-అబ్బాసి అరెస్ట్ అనంతరం ఆమె నివాసాలతో పాటు కార్యాలయాల్లో అధికారులు నిర్వహించిన తనిఖీల్లో బయటపడ్డ సంపదను చూసి దర్యాప్తు సంస్థల అధికారులకు మైండ్ బ్లాంక్ అయ్యింది.. ప్రజల సొమ్మును ఏ స్థాయిలో లూటీ చేశారో కళ్లకు కట్టేలా అక్కడ లగ్జరీ వస్తువులు, నోట్ల కట్టలు దర్శనమివ్వడం విశేషం.
అధికారిక నివేదికల ప్రకారం.. ఎంపీ అల్-అబ్బాసి నివాసం నుంచి అధికారులు దాదాపు 57 మిలియన్ డాలర్లతో పాటు భారీ నగదును స్వాధీనం చేసుకున్నట్లు అధికారు ఓ ప్రకటనలో వెల్లడించారు. దీనితో పాటు ఏకంగా 27 కిలోల స్వచ్ఛమైన బంగారాన్ని ఇంటిలో సీజ్ చేసిన్నట్లు తెలుస్తోంది.
బంగారు లోదుస్తులు.. ఈ సోదాల్లో కేవలం డబ్బు, బంగారమే కాకుండా అధికారులను తీవ్ర ఆశ్చర్యానికి గురిచేసిన మరో అంశం లగ్జరీ వస్తువులు.. సదరు ఎంపీ నివాసంలో విలాసవంతమైన వస్తువులతో పాటు, ప్రత్యేకంగా ఆర్డర్ ఇచ్చి తయారు చేయించుకున్న కోట్ల విలువైన బంగారు లోదుస్తులు (Golden Underwear) లభ్యమవ్వడం ప్రపంచ వ్యాప్తంగా ఆశ్చర్యం కలిగిస్తోంది. ప్రజాధనాన్ని దోచుకుని, ఎంతటి విలాసానికి అలవాటు పడ్డారో భావించవచ్చు.
వందల కోట్లు రికవరీ.. ప్రభుత్వ నిధులను పక్కదారి పట్టించి.. అక్రమంగా ఆస్తులు కూడబెట్టిన వారిపై ఇరాక్ ఫెడరల్ అధికారులు ప్రస్తుతం తీవ్రస్థాయిలో దాడులు నిర్వహిస్తోంది. కేవలం హింద్ అల్-అబ్బాసి మాత్రమే కాకుండా.. వివిధ ప్రావిన్సుల్లో డజన్ల కొద్దీ ప్రస్తుత, మాజీ ప్రజాప్రతినిధులతో పాటు ఉన్నతాధికారులను సైతం భద్రతా దళాలు అదుపులోకి తీసుకున్నాయి. దోచుకున్న ప్రతి పైసాను తిరిగి ప్రభుత్వ ఖజానాకు చేర్చడమే లక్ష్యంగా ఈ యాంటీ గ్రాఫ్ట్ ప్రక్రియ కొనసాగుతోందని ఉన్నత అధికారులు చెబుతున్నారు..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.