
Kayadu Lohar Incident News: 'అల్లూరి' సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన బ్యూటీ కయాదు లోహర్. కన్నడ చిత్రసీమలో హీరోయిన్గా తొలి చిత్రంలో అవకాశం దక్కించుకున్న ఈ బ్యూటీ ఆ తర్వాత తెలుగు, తమిళ, మలయాళ, మరాఠీ...
Kayadu Lohar Incident News: 'అల్లూరి' సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన బ్యూటీ కయాదు లోహర్. కన్నడ చిత్రసీమలో హీరోయిన్గా తొలి చిత్రంలో అవకాశం దక్కించుకున్న ఈ బ్యూటీ ఆ తర్వాత తెలుగు, తమిళ, మలయాళ, మరాఠీ చిత్రాల్లో నటిస్తూ మెప్పిస్తుంది. అయితే తన స్కూల్ డేస్‌లో జరిగిన ఓ చేదు జ్ఞాపకాన్ని గుర్తుచేసుకుంది.
అస్సాంలోని తేజ్‌పూర్‌లో.. 10 ఏప్రిల్ 2000 నాడు జన్మించింది హీరోయిన్ కయాదు లోహర్. ప్రస్తుతం దక్షిణాది చిత్ర పరిశ్రమలో చాలా బిజీగా గడుపుతోంది.
ఇటీవల ఒక ఇంటర్వ్యూలో, కయాదు లోహర్ తన పదవ తరగతి రోజుల్లో ఎదుర్కొన్న ఒక చేదు అనుభవాన్ని గుర్తుచేసుకుంది. ఇది సోషల్ మీడియాలో పెద్ద చర్చకు దారితీసింది.
ఆమె 10వ తరగతి చదువుతున్నప్పుడు.. ఇంటి దగ్గర్లోని ట్యూషన్‌కు వెళ్లే కయాదును ప్రతిరోజూ రోడ్డుపై కొంతమంది అబ్బాయిలు ఏడిపించేవారట. మొదటి రెండు రోజులు మౌనంగా కృషించిపోయి.. మూడో రోజు మాత్రం సహనం కోల్పోయిందట.
అబ్బాయిల వేధింపులు తాళలేక.. రోడ్డుపై ఉన్న రాయి తీసుకొని వాళ్లపై విసిరిందట. ఆ రాయి నేరుగా ఓ అబ్బాయి తలకు తగిలి రక్తం తీవ్రంగా పోయిందట. దీంతో భయపడిన కయాదు లోహర్ అక్కడి నుంచి పారిపోయినట్లు తెలుస్తోంది.
"ఒకరిపై రాళ్లు విసిరి గాయపరచడం తప్పు. కానీ ఆ సమయంలో నేను అనుభవించిన బాధ, నిస్సహాయత, కోపమే దానికి కారణమయ్యాయి" అని ఆనాటి పరిస్థితిని కయాదు గుర్తుచేసుకున్నారు.
"నేను సాధారణంగా చాలా ప్రశాంతంగా ఉండే వ్యక్తిని. కానీ ఎవరైనా తప్పు చేసినప్పుడు, చూస్తూ ఊరుకోకుండా వాళ్లకు తగిన సమాధానం ఇవ్వాలని నేను నమ్ముతాను" అని హీరోయిన్ కయాదు సూటిగా వెల్లడించింది.
కయాడూ నటించిన 'ఇదయం మురళి' జూలై 10న విడుదల కానుండగా.. జి.వి.ప్రకాష్ కుమార్ హీరోగా నటించిన 'ఇమ్మోర్టల్' జూలై 23న ప్రేక్షకుల ముందుకు రానుంది. వీటితో పాటు 'ఖలీఫా', 'ది ప్యారడైజ్' వంటి సినిమాల్లో కయాదు నటిస్తోంది.