
దురిశెట్టి ధర్మరాజు జీ తెలుగు న్యూస్ (zee telugu news)లో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఆయనకు దాదాపు జర్నలిజంలో నాలుగు సంవత్సరాల పాటు అనుభవం ఉంది.
ఇక్కడ సోషల్, ఆస్ట్రాలజీ, టెక్నాలజీ, ఆటోమొబైల్స్, బిజినెస్, జాతీయం అంశాలకు సంబంధించిన తాజా వార్తలతో పాటు విశ్లేషణ పూరితమైన కథనాలను అందిస్తారు. అలాగే ఆయనకు వెబ్‌సైట్‌కు సంబంధించిన వీడియో కంటెంట్‌పై కూడా అవగాహన ఉంది..
Goa Beer Price List 2026 News: భారత్‌లో పర్యాటక ప్రదేశాల్లో ఒక్కటైన గోవాకు నిత్యం వివిధ ప్రాంతాల నుంచి యువత వెళ్తూనే ఉంటారు. అక్కడి అందమైన సముద్ర తీరాలతో పాటు రాత్రిపూట పార్టీలు యువతను ఎంతగానో ఆకట్టుకుంటాయి. వీటితో పాటు చాలా మందిని ఆకర్షించే మరో ముఖ్యమైన అంశం అక్కడ తక్కువ ధరలకే మద్యం అందుబాటులో ఉండడం.. ముఖ్యంగా బీర్ ప్రియులకు గోవా ఒక పెద్ద హబ్. అయితే, ఈ 2026 సంవత్సరంలో గోవాలోని వైన్ షాపుల్లో ప్రముఖ బ్రాండ్ల బీర్ల ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకోవాలనే ఆసక్తి అందరిలోనూ ఉంటుంది. గోవాలోని అంజునా ప్రాంతంలో ఉన్న వైన్ స్టోర్లలో తాజాగా ఉన్న బీర్ ధరల వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం..
కింగ్‌ఫిషర్ ప్రియులకు పండగే.. భారతదేశంలో అత్యధికంగా అమ్ముడయ్యే కింగ్‌ఫిషర్ బీర్ వివిధ రకాల్లో గోవాలో అందుబాటులో ఉంది. తాజా ధరల వివరాల్లోకి వెళితే.. కింగ్‌ఫిషర్ ప్రీమియం (Kingfisher Premium) ఇక్కడ కేవలం రూ.75 లకే లభిస్తోంది. అలాగే కింగ్‌ఫిషర్ స్ట్రాంగ్ (Kingfisher Strong)ధర రూ. 85తో అందుబాటులో ఉంది.. ఇక కింగ్‌ఫిషర్ అల్ట్రా (Kingfisher Ultra) ప్రీమియం వేరియంట్ రూ.100కి, కింగ్‌ఫిషర్ అల్ట్రా మాక్స్ (Kingfisher Ultra Max) ధర రూ.110తో లబిస్తోంది.
ఇక కొత్త రుచులు ఇష్టపడే వారి కోసం కింగ్‌ఫిషర్ తెచ్చిన ఫ్లేవర్డ్ బీర్లు మరింత చీప్ ధరలకే అందుబాటులో ఉన్నాయి. కింగ్‌ఫిషర్ మ్యాంగో బెర్రీ ట్విస్ట్ (Mango Berry Twist)తో పాటు కింగ్‌ఫిషర్ లెమన్ మసాలా (Lemon Masala) క్యాన్లు కేవలం రూ.70లకే అందుబాటులో ఉండడం విశేషం..
ట్యూబోర్గ్, బడ్వైజర్, కార్ల్స్‌బర్గ్ ధరలు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన ఇతర బ్రాండ్ల ధరలు కూడా గోవాలో చాలా తక్కువ ధరలకు అందుబాటులో ఉన్నట్లు తెలుసతోంది.. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఇవి చాలా తక్కువ కావడం గమనార్హం... ముఖ్యంగా ట్యూబోర్గ్ గ్రీన్ (Tuborg Green)ధర రూ.80కే లభిస్తోంది. అలాగే ట్యూబోర్గ్ స్ట్రాంగ్ (Tuborg Strong) రూ. 90కే, బడ్వైజర్ ప్రీమియం (Budweiser Premium) ధర రూ.100తో, బడ్వైజర్ మాగ్నమ్ (Budweiser Magnum) స్ట్రాంగ్ బీర్ రూ.115తో విక్రయిస్తున్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా యువత ఎంతగానో ఇష్టపడే కార్ల్స్‌బర్గ్ స్మూత్ (Carlsberg Smooth) ధర రూ. 100తో అందుబాటులో ఉంది. దీంతో పాటు కార్ల్స్‌బర్గ్ ఎలిఫెంట్ (Carlsberg Elephant) రూ.115కే అందుబాటులో ఉండడం విశేషం..
ప్రీమియం, ఇంపోర్టెడ్ బీర్ల ధరల వివరాలు.. కాస్త ఖరీదైన, విదేశీ బ్రాండ్లను ఇష్టపడే వారి కోసం కూడా గోవాలో మరీ చీప్ ధరలకే అందుబాటులో ఉన్నాయి. ముఖ్యంగా హైనెకెన్ సిల్వర్ (Heineken Silver) ధర రూ.110కే అందుబాటులో ఉండడం విశేషం.. దీంతో పాటు భారతీయులు ఎంతో ఇష్టపడే బిరా వైట్ (Bira White) క్రాఫ్ట్ బీర్ ధర రూ.125కే లభిస్తోంది. అలాగే గ్లోబల్ బ్రాండ్ కరోనా ఎక్స్ట్రా (Corona Extra) ధర రూ.130కే సేల్ చేస్తున్నారు. దీంతో పాటు ఫేమస్ వీట్ బీర్ హోగార్డెన్ (Hoegaarden) ధర రూ.120కే లభిస్తోంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.