
రాకింగ్ స్టార్ యశ్ హీరోగా గీతూ మోహన్‌దాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ యాక్షన్ ఎంటర్టైనర్ 'టాక్సిక్: ఎ ఫెయిరీటేల్ ఫర్ గ్రోన్-అప్స్'పై రోజురోజుకూ అంచనాలు పెరుగుతున్నాయి.
తాజాగా మేకర్స్ 'లేడీస్ & లేడీస్' పేరుతో ఓ పవర్ఫుల్ ప్రమోషనల్ వీడియోను విడుదల చేసి సినిమాపై మరింత ఆసక్తిని పెంచారు. ఈ వీడియోలో టాక్సిక్ ప్రపంచాన్ని శాసించే మహిళా పాత్రలను పరిచయం చేస్తూ, కథలో వారి ప్రాధాన్యతను చూపించారు. నయనతార, కియారా అద్వానీ, తారా సుతారియా, రుక్మిణి వసంత్, హుమా ఖురేషీ ఒక్కో ఫ్రేమ్‌లో తమ పవర్ఫుల్ స్క్రీన్ ప్రెజెన్స్‌తో ఆకట్టుకున్నారు. నయనతార పవర్ ఫుల్ పాత్రలో కనిపించగా, కియారా అద్వానీ మిస్టీరియస్, ఎమోషనల్ షేడ్స్‌తో మెస్మరైజ్ చేసింది. తారా సుతారియా తన స్టైలిష్ అటిట్యూడ్‌తో మెప్పించగా, రుక్మిణి వసంత్ ఇనేత్న్స్ కూడిన పాత్రలో కనిపించింది. హుమా ఖురేషీ కూడా తన డాషింగ్ లుక్‌తో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. మహిళ కోణంలో సాగే పవర్ఫుల్ వాయిస్ ఓవర్ వీడియోకు మరింత మిస్టరీని జోడించింది.
వీడియో ప్రారంభంలోనే "పిల్లలు... దూరంగా ఉండండి. తల్లిదండ్రులు... మీ పిల్లలను దూరంగా ఉంచండి. తాతలు, బామ్మలు... మీ మనవళ్లను కూడా దూరంగా ఉంచండి. ముత్తాతలు... మీ సొంత రిస్క్‌పై చూడండి" అనే డిస్క్లైమర్‌తో సినిమాకు ఉన్న బోల్డ్ టోన్‌ను ఆసక్తికరంగా పరిచయం చేశారు. స్టైలిష్ విజువల్స్, పవర్ఫుల్ యాక్షన్, మిస్టరీతో 'టాక్సిక్' మరోసారి ప్రేక్షకుల్లో క్యూరియాసిటీని పెంచింది. యాక్షన్‌తో పాటు బలమైన మహిళా పాత్రలకు కూడా సమాన ప్రాధాన్యత ఉంటుందని ఈ వీడియో స్పష్టం చేసింది.
గీతూ మోహన్‌దాస్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో యశ్ హీరోగా, నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. నయనతార, కియారా అద్వానీ, తారా సుతారియా, రుక్మిణి వసంత్, హుమా ఖురేషీ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. కన్నడ, ఇంగ్లీష్ భాషల్లో ఏకకాలంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని హిందీ, తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో కూడా విడుదల చేయనున్నారు. కేవీఎన్ ప్రొడక్షన్స్, మాన్స్టర్ మైండ్ క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రం 2026 ఆగస్టు 26న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కానుంది.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి