
కేజీఎఫ్ 2 వచ్చిన దాదాపు నాలుగేళ్ల తర్వాత `టాక్సిక్`తో రాబోతున్నాడు హీరో యశ్. ఈ మూవీ కూడా చాలా సార్లు వాయిదా పడుతూ వస్తోంది. ఇప్పుడు ఎట్టకేలకు మూవీ ఆడియెన్స్ ముందుకు రాబోతుంది.
తాజాగా రిలీజ్ డేట్‌ని ప్రకటించారు. ఆగస్ట్ లో రిలీజ్ చేయబోతున్నారు. లేడీ డైరెక్టర్ గీతూ మోహన్‌దాస్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో నయనతార, కియారా అద్వానీ, రుక్మిణి వసంత్, హ్యూమా ఖురేషి, తారా సుతారియా వంటి వారు హీరోయిన్లుగా నటించారు.
యాక్షన్ థ్రిల్లర్‌గా రూపొందిన ఈ మూవీని కేవీఎన్ ప్రొడక్షన్, మాన్స్టర్ మైండ్ క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మించాయి. ఈ మూవీ ఆగస్ట్ 26న విడుదల చేయనున్నట్టు టీమ్ వెల్లడించింది. తాజాగా మేకర్స్ 'లేడీస్ & లేడీస్' పేరుతో ఓ పవర్ఫుల్ ప్రమోషనల్ వీడియోను విడుదల చేసి సినిమాపై మరింత ఆసక్తిని పెంచారు. ఈ వీడియోలో టాక్సిక్ ప్రపంచాన్ని శాసించే మహిళా పాత్రలను పరిచయం చేస్తూ, కథలో వారి ప్రయారిటీని చూపించారు.
నయనతార, కియారా అద్వానీ, తారా సుతారియా, రుక్మిణి వసంత్, హుమా ఖురేషీ ఒక్కో ఫ్రేమ్‌లో తమ పవర్ఫుల్ స్క్రీన్ ప్రెజెన్స్‌తో ఆకట్టుకున్నారు. నయనతార పవర్ ఫుల్ పాత్రలో కనిపించగా, కియారా అద్వానీ మిస్టీరియస్, ఎమోషనల్ షేడ్స్‌తో మెస్మరైజ్ చేసింది. తారా సుతారియా తన స్టైలిష్ అటిట్యూడ్‌తో మెప్పించగా, రుక్మిణి వసంత్ ఇంటెన్స్ తో కూడిన పాత్రలో కనిపించింది. హుమా ఖురేషీ కూడా తన డాషింగ్ లుక్‌తో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. మహిళ కోణంలో సాగే పవర్ఫుల్ వాయిస్ ఓవర్ వీడియోకు మరింత మిస్టరీని జోడించింది.
వీడియో ప్రారంభంలోనే `పిల్లలు... దూరంగా ఉండండి. తల్లిదండ్రులు... మీ పిల్లలను దూరంగా ఉంచండి. తాతలు, బామ్మలు... మీ మనవళ్లను కూడా దూరంగా ఉంచండి. ముత్తాతలు... మీ సొంత రిస్క్‌పై చూడండి` అనే డిస్క్లైమర్‌తో సినిమాకు ఉన్న బోల్డ్ టోన్‌ను ఆసక్తికరంగా పరిచయం చేశారు. స్టైలిష్ విజువల్స్, పవర్ఫుల్ యాక్షన్, మిస్టరీతో 'టాక్సిక్' మరోసారి ప్రేక్షకుల్లో క్యూరియాసిటీని పెంచింది. యాక్షన్‌తో పాటు బలమైన మహిళా పాత్రలకు కూడా సమాన ప్రయారిటీ ఉంటుందని ఈ వీడియో స్పష్టం చేసింది. ఇందులో లేడీస్‌తో యష్ చేసే యాక్షన్ హైలైట్‌గా నిలిచింది.
గీతూ మోహన్‌దాస్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో యశ్ హీరోగా, నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. నయనతార, కియారా అద్వానీ, తారా సుతారియా, రుక్మిణి వసంత్, హుమా ఖురేషీ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. కన్నడ, ఇంగ్లీష్ భాషల్లో ఏకకాలంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని హిందీ, తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో కూడా విడుదల చేయనున్నారు.