
నేటి ఉద్యోగ జీవితం ఒత్తిడితో నిండిపోయింది. ఎక్కువసేపు పని చేయడం, మానసిక ఒత్తిడి, నిద్రలేమి, అనారోగ్యకరమైన జీవనశైలి వంటి అంశాలు పునరుత్పత్తి ఆరోగ్యంపై ప్రభావం చూపే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు.
ఇంటర్నెట్ డెస్క్: నేటి వేగవంతమైన జీవనశైలి, ఉద్యోగ ఒత్తిడి, తీరికలేని దినచర్య వల్ల అనేక ఆరోగ్య సమస్యలు వస్తున్నాయి. వీటిలో సంతానోత్పత్తి సమస్యలు కూడా ఒకటి. ఎక్కువసేపు పని చేయడం, నిరంతర మానసిక ఒత్తిడిలో ఉండటం, ఆరోగ్యకరమైన జీవనశైలిని పాటించకపోవడం వంటి కారణాలు స్త్రీ, పురుషుల పునరుత్పత్తి ఆరోగ్యంపై ప్రభావం చూపే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు.
రోజంతా ఒకే చోట కూర్చొని పనిచేయడం వల్ల శారీరక కదలికలు తగ్గిపోతాయి. దీని కారణంగా శరీరంలో రక్తప్రసరణ సరిగా జరగక, పునరుత్పత్తి ఆరోగ్యంపై ప్రభావం పడే అవకాశం ఉంటుంది. అలాగే రాత్రివేళల వరకు మొబైల్, ల్యాప్‌టాప్ లేదా కంప్యూటర్ వాడటం వల్ల నిద్ర దెబ్బతింటుంది. దీనివల్ల శరీరంలోని హార్మోన్ల సమతుల్యత కూడా ప్రభావితమవుతుంది.
కేవలం పని ఒత్తిడి మాత్రమే కాదు, మరికొన్ని అలవాట్లు కూడా సంతానోత్పత్తి సామర్థ్యాన్ని తగ్గించే ప్రమాదం ఉంది. అవి..
అధికంగా కాఫీ లేదా కెఫిన్ పానీయాలు తీసుకోవడం
దీర్ఘకాలిక ఒత్తిడి వల్ల శరీరంలో కార్టిసాల్ హార్మోన్ స్థాయులు పెరుగుతాయి. ఇది మహిళల్లో అండం విడుదల ప్రక్రియపై ప్రభావం చూపే అవకాశం ఉంది.
పునరుత్పత్తి ఆరోగ్యాన్ని ఎలా కాపాడుకోవాలి?
సంతానోత్పత్తి ఆరోగ్యాన్ని మెరుగుపరచాలంటే జీవనశైలిపై ప్రత్యేక శ్రద్ధ అవసరం. అందుకోసం..
యోగా, ధ్యానం వంటి పద్ధతులతో ఒత్తిడిని తగ్గించుకోవాలి.
సంతానం కోసం ప్రణాళిక ఉంటే ఆలస్యం చేయకుండా వైద్యులను సంప్రదించాలి.
పని ప్రదేశంలో రసాయనాల ప్రభావం ఉంటే తగిన భద్రతా పరికరాలు తప్పనిసరిగా ఉపయోగించాలి. పని ఒత్తిడి ఒక్కటే సంతానలేమికి కారణం కాదు. వయస్సు, ఆరోగ్య పరిస్థితులు, హార్మోన్ల మార్పులు, జీవనశైలి, ఇతర వైద్య కారణాలు కూడా ప్రభావం చూపుతాయి. కాబట్టి గర్భధారణలో ఇబ్బందులు ఎదురైతే తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది.
Note: ఇందులోని సమాచారం ఇంటర్నెట్లో అందుబాటులో ఉన్న వివరాల ఆధారంగా మీకు అందించడం జరుగుతోంది. ABN ఆంధ్రజ్యోతి దీనిని ధ్రువీకరించడం లేదు.
తులసి ఆకులు నమిలితే కిడ్నీ స్టోన్స్ కరిగిపోతాయా?
ఈ డ్రై ఫ్రూట్స్‌ను మితంగా తినాలి.. ఎక్కువగా తింటే డేంజర్