
రాకింగ్ స్టార్ యశ్ హీరోగా, గీతూ మోహన్ దాస్ దర్శకత్వంలో ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కుతున్న చిత్రం 'టాక్సిక్: ఎ ఫెయిరీ టేల్ ఫర్ గ్రోన్ అప్స్'.
ఈ సినిమా నుంచి తాజాగా ఓ ఆసక్తికరమైన గ్లింప్స్ వీడియోను చిత్ర నిర్మాణ సంస్థ కేవీఎన్ ప్రొడక్షన్స్ విడుదల చేసింది. 'లేడీస్ & లేడీస్' పేరుతో రిలీజ్ చేసిన ఈ వీడియో, సినిమాలోని మహిళా పాత్రలను ప్రపంచానికి పరిచయం చేసింది. ఈ గ్లింప్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లో ఉంది.ఈ వీడియో సినిమాలోని డార్క్, స్టైలిష్ ప్రపంచాన్ని ఆవిష్కరించింది. పవర్, మిస్టరీ, యాటిట్యూడ్‌తో నిండిన ఈ గ్లింప్స్‌లో హీరోయిన్ల లుక్స్ ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. ముఖ్యంగా, "పిల్లలు దూరంగా ఉండండి.. తల్లిదండ్రులు మీ పిల్లలను దూరంగా ఉంచండి.. తాతయ్యలు, మీ మనవళ్లను దూరంగా ఉంచండి.. ముత్తాతలు, మీ సొంత రిస్క్‌తో చూడండి" అంటూ వీడియో మొదట్లోనే ఇచ్చిన హెచ్చరిక, సినిమా ఎంత బోల్డ్‌గా, వైల్డ్‌గా ఉండబోతుందో స్పష్టం చేసింది. ఈ వీడియోలో కనిపించిన నయనతార, కియారా అద్వానీ, తారా సుతారియా, రుక్మిణి వసంత్, హ్యూమా ఖురేషి తమ ప్రజెన్స్‌తో ప్రతి ఫ్రేమ్‌ను డామినేట్ చేశారు. నయనతార ఎంతో తీవ్రమైన, దృఢమైన పాత్రలో కనిపిస్తుండగా, కియారా అద్వానీ ఆకర్షణీయమైన, విషాదభరితమైన ఎనర్జీతో ఆకట్టుకుంది. అలాగే, తారా సుతారియా ఉల్లాసంగా, రుక్మిణి వసంత్ తీవ్రమైన లుక్‌లో, హ్యూమా ఖురేషి ఆకర్షణీయమైన స్టీలీ గ్లింప్స్‌తో తమ పాత్రల తీరును తెలియజేశారు. దీనికి తోడు ఓ మహిళ చెప్పే వాయిస్ ఓవర్ వీడియోకి మరింత మిస్టరీని జోడించింది.కేవీఎన్ ప్రొడక్షన్స్,