
తెలంగాణలో ఫోక్ సాంగ్స్ కి యూట్యూబ్ లో ఎంత క్రేజ్ ఉందో స్పెషల్ గా చెప్పక్కర్లేదు. పాట అలా విడుదలైందో లేదో ఇలా పాపులర్ అయిపోతోంది.
పాట విడుదల చేసిన వారం, రెండు వారాల్లోనే మిలియన్ల కొద్దీ వ్యూస్ వచ్చేస్తున్నాయి. రీసెంట్ గా గత నెలలో ‘ బాసింగ బలాలు’ పేరిట ఓ పాట విడుదల చేశారు. ఈ పాట కేవలం రెండు వారాల్లోనే 15 మిలియన్ల వ్యూస్ సంపాదించింది. అయితే.. ఈ పాట ఎంత హిట్ అయ్యిందో.. ఈ పాటలో డ్యాన్స్ చేసిన ఫోక్ డ్యాన్సర్ మరింత పాపులారిటీ సంపాదించుకుంది. తనే ఫోక్ డ్యాన్సర్ వైష్ణవి సోనీ.
తెలంగాణకు చెందిన వైష్ణవీ సోనీ ది మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. తల్లి గృహిణి. తండ్రి చిన్న వ్యాపారాలు చేస్తూ ఉంటారు. ప్రస్తుతం బిటెక్ చదువుతున్న వైష్ణవి.. తాను స్కూల్ ఏజ్ లో ఉన్నప్పటి నుంచే ఈ ఫోక్ సాంగ్స్ చేయడం మొదలుపెట్టింది. ఫోక్ సాంగ్స్ చేయడం అంటే కేవలం డ్యాన్స్ వస్తే సరిపోదు. యాక్టింగ్ కూడా చేయాల్సి ఉంటుంది. పాటని డ్యాన్స్ కంటే ఎక్స్ ప్రెషన్స్ తోనే నడిపించాల్సి ఉంటుంది. ఇక.. సోని ఏ పాట చేసినా తన ఎక్స్ ప్రెషన్స్ తో చింపేస్తుంది. అయితే.. చిన్న తనంలో తనకు పెద్దగా నటన మీద ఆసక్తి లేదని..తన తల్లి, తండ్రులకు ఎక్కువ ఆసక్తి ఉండటంతో.. తనతో ఈ పాటలు చేయించారని ఓ ఇంటర్వ్యూలో చెప్పింది. అయితే.. ఈ పాటల ద్వారా తనకు గుర్తింపు రావడంతో.. రాను రాను తనకు కూడా ఈ పాటలు, నటపై ఆసక్తి పెరిగిందని చెప్పింది.
వైష్ణవి ఇప్పటి వరకు చాలా ఫోక్ సాంగ్స్ లో అద్భుతంగా డ్యాన్స్ చేసింది. వాటిలో టాప్ సాంగ్ మాత్రం ‘ తట్టుకోలేనే’ ఈ పాట ఆమె కెరీర్ లోనే మొదటిది. చాలా చిన్న వయసులోనే ఈ పాటలో నటించినా.. అనుభవం ఉన్నట్లే నటించి అందరినీ ఆకట్టుకుంది. ఆ తర్వాత ‘ మల్లె చెట్టు కింద కూర్చున్న’, ‘ గున్న గున్న ఓయ్’, ‘ పోరి రాయే జాతర’, ‘బాగుంది బాగుంది’, ‘బాసింగ బలాలు’. ప్రస్తుతం ఈ బాసింగ బలాలు యూట్యూబ్ లో బాగా ట్రెండ్ అవుతోంది. ఇక.. తన పాటల సెలక్షన్ మొదట్లో మొత్తం వాళ్ల అమ్మే చూసుకునేదాని.. ఇప్పుడు తాను చూసుకుంటున్నానని.. పాట మొదట విని నచ్చితేనే చేస్తాను అని చెప్పింది.
కేవలం యూట్యూబ్ లోనే కాదు.. ఇన్ స్టాగ్రామ్ లోనూ మంచి క్రేజ్ ఉంది. దాదాపు 6 లక్షల మంది ఫాలోవర్స్ ఉన్నారు. ఆమె పాటలకు యూట్యూబ్ లో సపరేటు ఫ్యాన్ బేస్ ఉంది. ఫోక్ డ్యాన్సర్ నాగ దుర్గ తర్వాత.. అంత క్రేజ్ ఈ వైష్ణవి సోని సంపాదించుకుంది. మరి... నాగ దుర్గ ఎలాగైతే.. సినిమాల్లోకి అడుగుపెట్టిందో.. వైష్ణవి కూడా అలానే సినిమా ఛాన్సులు అందుకుంటుందో లేదో చూడాలి.