
చాలా మంది హీరోయిన్స్ ఇప్పుడు సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెట్టి సినిమాలు చేస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నారు. ఒకప్పుడు హీరోయిన్స్ గా రాణించిన వారు
ఇప్పుడు సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెట్టి సహాయక పాత్రల్లో మెప్పిస్తున్నారు. చాలా మంది హీరోయిన్స్ కొన్ని సినిమాలతోనే మాయం అవుతున్నారు. పది సినిమాలు కూడా పూర్తి కాకుండానే కనిపించకుండా పోతున్నారు ముద్దుగుమ్మలు. అదృష్టం కలిసి రాక ఆఫర్స్ లేక సోషల్ మీడియాతోనే గడుపుతున్నారు కొందరు. అందం, నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్నప్పటికీ ఛాన్స్‌లు రాక ఇండస్ట్రీకి దూరం అయ్యారు చాలా మంది. అలాంటి వారు చాలా మంది ఉన్నారు. వారిలో ఈ ముద్దుగుమ్మ ఒకరు. హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ ఆతర్వాత అంతగా గుర్తింపు తెచ్చుకోలేకపోయింది. దాంతో అవకాశాలు తగ్గి క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా చిన్న చిన్న పాత్రలు చేసింది. అయినా కూడా పెద్దగా గుర్తింపు రాలేదు. దాంతో సినిమాలకు గ్యాప్ ఇచ్చింది. ఏకంగా ఆరేళ్ళ తర్వాత రీసెంట్ గా ఓ బోల్డ్ వెబ్ సిరీస్ తో రీ ఎంట్రీ ఇచ్చి అందరిని షాక్ అయ్యేలా చేసింది.. ఇంతకూ ఆమె ఎవరంటే..
ముద్దుగుమ్మ పూనమ్ బజ్వా.. ఈ చిన్నదానికి గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. 1985 ఏప్రిల్ 5న ముంబైలో జన్మించింది ఈ అందాల భామ. పంజాబీ కుటుంబానికి చెందిన ఈ అమ్మడు.. కాలేజీలో చదువుతున్నప్పుడే మడలింగ్ పై ఆసక్తి పెంచుకుని 2005లో మిస్ పూణె అందాల పోటీలో గెలుపొంది పేరు తెచ్చుకుంది. 2005లో కూచుపూడి వెంకట్ దర్శకత్వం వహించిన మొదటి సినిమాతో తొలిసారిగా స్క్రీన్ పై మెరిసింది. నవదీప్ హీరోగా నటించిన ఈ సినిమా పర్లేదనిపించుకుంది. దీని తర్వాత బాస్ అనే మరో సినిమాలో నటించి మెప్పించింది. బాస్ సినిమాలో అక్కినేని నాగార్జున హీరో గా నటించారు.
భాస్కర్ దర్శకత్వంలో వచ్చిన పరుగు సినిమాలతో సహా పలు తెలుగు చిత్రాలలో నటించింది. 2007లో హరి దర్శకత్వం వహించిన సేవాల్ చిత్రంతో ఆమె తమిళంలో నటిగా రంగప్రవేశం చేసింది. తెలుగులో ఈ అమ్మడు చివరిగా ఎన్.టి.ఆర్. కథానాయకుడు సినిమాలో మెరిసింది. ఈ గారపాటి లోకేశ్వరి పాత్రలో నటించింది. 2020లోఈ అమ్మడు దర్శకుడు సునీల్ రెడ్డితో కలిసి లివింగ్ టూ గెదర్‌లో ఉన్నట్లు వార్తలు వచ్చాయి. 2019 తర్వాత పూనమ్ బజ్వా సినిమాల్లో నటించలేదు. దాదాపు ఆరేళ్ళు సినిమాలకు దూరంగా ఉన్న ఈ ముద్దుగుమ్మ రీసెంట్ గా ష్...3 అనే సిరీస్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఏ బోల్డ్ సిరీస్ ప్రముఖ ఓటీటీ సంస్థ ఆహా లో అందుబాటులో ఉంది. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే ఈ ముద్దుగుమ్మ తన గ్లామరస్ ఫోటోలను షేర్ చేస్తూ అభిమానులకు మత్తెక్కిస్తోంది..
A post shared by Poonam Bajwa (@poonambajwa555) మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి