
‘అంబాజీపేట మ్యారేజి బ్యాండు’, ‘లిటిల్ హార్ట్స్’, ‘హే బల్వంత్’ చిత్రాలతో ప్రేక్షకుల్లో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సొంతం చేసుకున్న తెలుగమ్మాయి శివానీ నాగారం కోలీవుడ్ ఎంట్రీ ఖరారైన సంగతి...
Jul 1 2026 12:20 PM | Updated on Jul 1 2026 12:29 PM
‘అంబాజీపేట మ్యారేజి బ్యాండు’, ‘లిటిల్ హార్ట్స్’, ‘హే బల్వంత్’ చిత్రాలతో ప్రేక్షకుల్లో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సొంతం చేసుకున్న తెలుగమ్మాయి శివానీ నాగారం కోలీవుడ్ ఎంట్రీ ఖరారైన సంగతి తెలిసిందే. ‘టూరిస్ట్ ఫ్యామిలీ’, ‘విత్ లవ్’ సినిమాల ఫేమ్ అభిషేక్ జీవంత్ హీరోగా గౌతమ్ శివరామ్ దర్శకత్వంలో ఓ మూవీ రూదుతోంది. డ్రామా కంపెనీ సమర్పణలో ఎ. బాలమురుగన్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో శివానీ నాగారం, యోగలక్ష్మీ హీరోయిన్లుగా నటిస్తుండగా, కన్నడ నటుడు శివరాజ్‌కుమార్ ప్రధాన పాత్రలో నటిస్తున్నారు.
ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. అభిషేక్ , శివరాజ్ కుమార్, శివానీలపై కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు మేకర్స్. ఈ సినిమా చిత్రీకరణకు సంబంధించిన ఓ వీడియోను తాజాగా మేకర్స్ సోషల్ మీడియాలో షేర్ చేశారు. ‘‘తమిళంలో నేను నటిస్తున్న తొలి సినిమా ఇది. నాకు కొంచెం తమిళ భాష వస్తుంది. ఈ సినిమా నాకు చాలా ప్రత్యేకం. శివ రాజ్‌కుమార్ సార్‌తో కలిసి నటిస్తున్నాను. అభిషేక్ చాలా ప్రతిభావంతుడు. ఆయనతో పనిచేయడం సంతోషంగా ఉంది’’ అని ఆ వీడియోలో పేర్కొన్నారు శివానీ నాగారం. ఈ చిత్రాన్ని ఈ ఏడాదే రిలీజ్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారని కోలీవుడ్ సమాచారం.
ప్రేమలో పడిన యంగ్ హీరోయిన్.. ప్రియుడు ఇతడే (ఫొటోలు)
సత్యదేవ్ ‘రావు బహదూర్’ ట్రైలర్ లాంఛ్ ఈవెంట్.. (ఫోటోలు)
అక్కినేని అఖిల్ ‘లెనిన్’ మూవీ HD స్టిల్స్
‘హ్యాంగ్‌మ్యాన్’ మూవీ ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ (ఫొటోలు)
ఆ 70 వేల సీసీ కెమెరాలు ఏమైపోయాయి?.I 18 నెలలుగా సీసీటీవీ ఫుటేజ్ మాయం...
సాయి కృష్ణ కేసులో సిట్ రిమాండ్ రిపోర్ట్ చూపిస్తూ బాబుకు వైఎస్ జగన్ సూటి ప్రశ్నలు
క్రిమినల్స్ అయితే ఎందుకు పిలిచి ముసలి కన్నీరు కార్చుతున్నావ్
అమ్మతోడు జరిగింది ఇదే! డెలివరీ బాయ్ దాడిపై హీరో అఖిల్ రాజు క్లారిటీ