Venezuela Earthquake| ఇంటర్నెట్‌డెస్క్: వెనెజువెలా భూకంప విలయంలో 79 ఏళ్ల బామ్మ మృత్యువును జయించింది. కొన్నిరోజుల పాటు శిథిలాల కింద నలిగిన ఆమెను భారత సైన్యం (Indian Army) సజీవంగా వెలికితీసింది.
‘ఆపరేషన్ అమిస్తాద్’లో భాగంగా వెనెజువెలాలో మానవతా సహాయం అందిస్తోన్న మన దేశ సైన్యం బుధవారం ఎక్స్ వేదికగా ఈ విషయాన్ని వెల్లడించింది.
‘‘ఆపరేషన్ అమిస్తాడ్ (Operation Amistad)లో భాగంగా భవన శిథిలాల నుంచి 79 ఏళ్ల వృద్ధురాలిని రక్షించి, ఇండియన్ ఆర్మీ ఫీల్డ్ హాస్పిటల్లో చికిత్స అందిస్తున్నాం. భవనం కూలిపోవడంతో ఆమె కాలు విరిగింది. ఆహారం, వైద్యం అందక తీవ్ర అనారోగ్యానికి గురైంది. కాపాడిన వెంటనే వైద్యబృందం అధునాతన వైద్యసహాయం అందిస్తోంది. ఈ క్లిష్ట సమయంలో వెనెజువెలా ప్రజలకు మానవతా సహాయం చేసేందుకు కట్టుబడి ఉన్నాం’’ అని భారత సైన్యం ఎక్స్‌లో రాసుకొచ్చింది.
జంట భూకంపాలతో వెనెజువెలా అతలాకుతలమైంది (Earthquake). ఆ విపత్తు సంభవించిన తర్వాత భారత్ ఆపన్న హస్తం చాచింది. ‘ఆపరేషన్ అమిస్తాద్’ పేరిట ప్రత్యేక విమానంలో సహాయక బృందాన్ని, వైద్య సాయాన్ని పంపింది.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.