
స్మార్ట్ కిచెన్‌కి ఓటేస్తున్న అతివల సంఖ్య నానాటికీ పెరుగుతోంది. అందుకు తగ్గట్టుగానే ఉత్పత్తిదారులూ పరికరాల్ని తయారుచేస్తున్నారు.
యాప్ సహాయంతోనే ఫ్యాన్ కట్టేయడం, లైట్లు ఆపడం, ఎక్కడ ఉన్నా సీసీ కెమెరాల ద్వారా ఇంటిని గమనించడం అన్నీ ఈ జాబితాలోనివే.
స్మార్ట్ కిచెన్‌కి ఓటేస్తున్న అతివల సంఖ్య నానాటికీ పెరుగుతోంది. అందుకు తగ్గట్టుగానే ఉత్పత్తిదారులూ పరికరాల్ని తయారుచేస్తున్నారు. యాప్ సహాయంతోనే ఫ్యాన్ కట్టేయడం, లైట్లు ఆపడం, ఎక్కడ ఉన్నా సీసీ కెమెరాల ద్వారా ఇంటిని గమనించడం అన్నీ ఈ జాబితాలోనివే. ఇదే తరహాలో వంటింట్లో పనులు సులువు చేయడానికీ పరికరాలు వస్తున్నాయి. వాటిల్లో ఇవి కొన్ని.
హడావుడిగా బయలుదేరతామా... కాస్త దూరం వెళ్లాక గ్యాస్, నీళ్ల పంపు కట్టామా లేదా అని ఆలోచిస్తాం. వెనక్కి రాలేం, ముందుకు వెళ్లలేం. రోజంతా ఇవే ఆలోచనలు వెంటాడుతూ ఉంటాయి. ఈ ‘స్మార్ట్ వాల్వ్ కంట్రోలర్’ని వాడితే ఆ చింత ఉండదు. దీన్ని గ్యాస్, నీళ్ల పంపు ఉండే వాల్వ్‌కు దగ్గరగా బిగిస్తే సరి. వైఫైతో పనిచేస్తుంది. సంబంధిత అప్లికేషన్ని ఫోన్లో డౌన్లోడ్ చేసుకుని, దానికి పరికరాన్ని కనెక్ట్ చేయాలి. అవసరం అయినప్పుడు యాప్‌ని వినియోగించి వీటిని కట్టామా లేదా చూడొచ్చు. ఈ పరికరం అలెక్సా, గూగుల్ అసిస్టెంట్ సహాయంతో పనిచేస్తుంది. కాబట్టి, ఆఫ్ చేయడం మరచిపోతే... అలెక్సా గ్యాస్ బంద్ చేయి అంటే చాలు వాల్వ్ కట్టేస్తుంది.
ఎంత జాగ్రత్తగా ఉన్నా కొన్నిసార్లు గ్యాస్ లీకేజ్ సమస్యల్ని ఎదుర్కోవాల్సి వస్తుంది. సమయానికి గుర్తించకపోతే పరిస్థితులు చేయిదాటిపోతుంటాయి. అలాంటి ప్రమాదాల బారిన పడకూడదంటే ఈ ‘గ్యాస్ లీక్ డిటెక్టర్’ను వినియోగించాల్సిందే. స్టవ్ వెనక ఉన్న గోడ మీద దీన్ని అతికించాలి. సంబంధిత అప్లికేషన్ని ఫోన్లో డౌన్లోడ్ చేసుకుని, పరికరాన్ని లింక్ చేసుకోవాలి. ఇది లీకేజ్‌ని తొందరగా పసిగడుతుంది. డిస్ప్లే మీద ఎప్పటికప్పుడు శాతాన్ని చూపిస్తూ ఉంటుంది. ప్రమాద స్థాయికి చేరుకున్నప్పుడు అలారమ్ మోగుతుంది. లీకేజ్ స్థాయిని బట్టి పరికరంలో ఉండే ఎరుపు, పసుపు బటన్లు ఆన్ అయ్యి సంకేతాలు ఇస్తాయి. అనుకోకుండా మంటలు చెలరేగినప్పుడు కూడా ఈ అలారమ్ మోగుతుంది.
చాలామంది ఏళ్ల తరబడి గ్యాస్పైపుల్ని వాడుతుంటారు. అవేమో కొన్నిసార్లు వదులైపోతాయి. దాంతో స్టవ్ నుంచి పైప్ విడిపోవడం, ఎలుకలు కొరికేయడం వంటి సమస్యలు వస్తుంటాయి. వీటిని వెంటనే గుర్తించకపోతే అంతే సంగతులు. ఇలాంటి సమస్యలకు తావివ్వకూడదంటే ఈ ‘ఇండియాస్ అల్టినోప్రో గ్యాస్ సేఫ్టీ డివైజ్’ను ఉపయోగిస్తే సరి. పరికరం కింద ఉండే నల్లటి రింగ్‌ను లాగి పట్టుకుని రెగ్యులేటర్ ఫిట్ చేసినట్లే సిలిండర్‌కు దీన్ని అతికించాలి. సరిగ్గా అతుక్కున్న తర్వాత రింగ్‌ని వదిలేస్తే లాక్ పడుతుంది. గట్టిగా లాగి లాక్ అయ్యిందో లేదో చెక్ చేసుకోవాలి. సాధారణ రెగ్యులేటర్‌ను డివైజ్పైన ఉన్న బ్రాస్ వాల్వ్‌పై ఎప్పటిలాగే అమర్చాలి. సిలిండర్ వాల్వ్ ఆన్ చేసి, పరికరం నాబ్‌ను స్విచ్ ఆన్ చేస్తే... పనిచేయడం మొదలవుతుంది. ఈ పరికరం పైపులో సమస్యలు, కట్ అయినప్పుడు లీకేజ్‌ను గుర్తించి గ్యాస్ సరఫరాను సెకన్లలో నిలిపి వేస్తుంది. మీటర్లో సూది కిందికి పడిపోతుంది. దాంతో మనకీ సమస్య తెలుస్తుంది. అలానే సిలిండర్‌లో గ్యాస్ ఎంత ఉందో, ఎప్పుడు అయిపోతుందో కూడా ఈ మీటర్ ద్వారా తెలుసుకోవచ్చు. హై-ప్రెజర్‌ను నియంత్రించి, స్టవ్‌కు కావాల్సినంత గ్యాస్‌నే సరఫరా చేసేందుకూ సహాయపడుతుంది. దాంతో 10-20శాతం వరకు ఆదా కూడా చేయొచ్చు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
For digital advertisements Contact : 040 - 23318181 eMail: marketing@eenadu.in
This website follows the DNPA Code of Ethics.