
భారత మాజీ ఉపరాష్ట్రపతి, పద్మ విభూషణ్ ముప్పవరపు వెంకయ్య నాయుడుకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు.
నేడు వెంకయ్య నాయుడు పుట్టినరోజు సందర్భంగా చంద్రబాబు 'ఎక్స్' (ట్విట్టర్) వేదికగా ఓ ప్రత్యేక సందేశాన్ని పోస్ట్ చేశారు.వెంకయ్య నాయుడు సంపూర్ణ ఆయురారోగ్యాలతో, ఆనందంగా ఉండాలని చంద్రబాబు ఆకాంక్షించారు. భారతీయ విలువలతో పాటు తెలుగు భాషాభివృద్ధికి ఆయన చేస్తున్న కృషి స్ఫూర్తిదాయకమని కొనియాడారు."భారత మాజీ ఉపరాష్ట్రపతి, పద్మ విభూషణ్ శ్రీ వెంకయ్య నాయుడు గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. భారతీయ విలువలను, తెలుగుదనాన్ని సమున్నతంగా చాటుతూ, తెలుగు భాషాభివృద్ధికి నిరంతరం కృషి చేస్తున్న మీ సేవలు అందరికీ స్ఫూర్తిదాయకం. మీరు సంపూర్ణ ఆయురారోగ్యాలతో, ఆనందంగా, మరెన్నో జన్మదిన వేడుకలను జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను" అని చంద్రబాబు తన ట్వీట్లో పేర్కొన్నారు.