
మీకు హెవీ, రాయల్ లుక్ కావాలంటే నెమలి ఆకారంలో ఉన్న స్టడ్ జుంకాలు ఎంచుకోవాలి. పింక్ పూసలతో అలంకరించిన ఈ స్టడ్స్ రూ.300లకే లభిస్తాయి. చెవులకు మంచి అందాన్ని ఇస్తాయి.
కాలేజీకి వెళ్లే అమ్మాయిలకు ఇలాంటి జుంకాలు చాలా అందంగా ఉంటాయి. గులాబి రంగు పువ్వు డిజైన్ కి.. కింద మూడు జుంకాలు ఉంటాయి. ఇవి డ్రెస్సుల మీదకు కూడా ఉంటాయి.
ఈ మధ్య హ్యాంగింగ్ ఇయర్ రింగ్స్‌లో ఈ డిజైన్ తెగ వైరల్ అవుతోంది. డబుల్ జుంకాలో ముత్యాల పూసలను జతచేశారు. ఇది జుంకా సూయ్-ధాగా ఇయర్ రింగ్స్ రెండింటికీ పర్ఫెక్ట్ కాంబోలా ఉంటుంది.
వైట్, పింక్, గ్రీన్ స్టోన్స్‌తో అలంకరించిన ఈ హ్యాంగింగ్ జుంకాను మీరు పెళ్లిళ్లు లేదా పండుగలకు ధరించవచ్చు. నెమలి స్టడ్కు కింద మూడు జుంకాలు, కింద పూసలను వేలాడదీశారు.
ఈ డిజైన్ కూడా పికాక్ స్టడ్తోనే ఉంది. కానీ దీనిపై చాలా పింక్ స్టోన్స్ ఉపయోగించారు. జుంకా కూడా జాలీ కట్ వర్క్ ఇచ్చారు. ట్రెడిషనల్ లుక్ కోసం దీన్ని మీరు చీరల మీద ట్రై చేయచ్చు.
గోల్డ్ ప్లేటెడ్ టెంపుల్ జుంకా డిజైన్ చాలా యూనిక్‌గా ఉంటుంది. మీరు దీన్ని బంగారంతో కూడా చేయించుకుని ఎలిగెంట్ బ్యూటీతో మెరిసిపోవచ్చు. గోల్డ్ ప్లేటింగ్‌లో తక్కువ ధరకే లభిస్తుంది.
Gold Ring: 3 గ్రాముల్లోనే గోల్డ్ రింగ్ డిజైన్స్ బడ్జెట్ లో లగ్జరీ లుక్
Pearl Choker: మెడ నిండుగా ముత్యాల చోకర్లు.. ఓసారి చూసేయండి..!
Multipurpose Blouse Designs:ఏ చీరలకైనా సూటయ్యే మల్టీ పర్సస్ డిజైన్లు
Pendant Designs:లైట్ వెయిట్ మంగళసూత్రాలకు సూటయ్యే పెండెంట్స్