
దాదాపు మూడేళ్ల గ్యాప్ తర్వాత సమంత తన మా ఇంటి బంగారం చిత్రంతో బాక్సాఫీస్ వద్ద రికార్డుల వేట మొదలు పెట్టింది. దాదాపు మూడేళ్ల గ్యాప్ తర్వాత సమంత (Samantha) తన మా ఇంటి బంగారం (Maa Inti Bangaaram)...
దాదాపు మూడేళ్ల గ్యాప్ తర్వాత సమంత తన మా ఇంటి బంగారం చిత్రంతో బాక్సాఫీస్ వద్ద రికార్డుల వేట మొదలు పెట్టింది.
దాదాపు మూడేళ్ల గ్యాప్ తర్వాత సమంత (Samantha) తన మా ఇంటి బంగారం (Maa Inti Bangaaram) చిత్రంతో బాక్సాఫీస్ వద్ద రికార్డుల వేట మొదలుపెట్టింది. ఒక నటిగా సమంతకున్న క్రేజ్ ఏంటో ఈ సినిమా మరోసారి నిరూపించింది. ఫ్యామిలీ ఆడియెన్స్ టార్గెట్‌గా వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఇప్పటి వరకు వచ్చిన లేడీ ఓరియెంటెడ్ చిత్రాలలో టాప్ పొజిషన్లో నిలిచే అవకాశం ఉందా..? అస్సలు ఇప్పటి వరకు వచ్చిన లేడీ ఓరియెంటెడ్ సినిమాలలో సమంత పొజిషన్ ఏంటి..?
టాలీవుడ్లో లేడీ ఓరియెంటెడ్ సినిమాలంటేనే అందరికీ ముందుగా గుర్తొచ్చే పేరు అనుష్క శెట్టి. పదిహేడేళ్ల క్రితం ఆమె చేసిన మ్యాజిక్ అంతా ఇంతా కాదు. ఈమె నటించిన లేడీ ఓరియెంటెడ్ చిత్రం అరుంధతి 65 కోట్ల వసూళ్లతో అప్పట్లో సంచలనం సృష్టించింది. ఆ తర్వాత రుద్రమదేవి చిత్రంతో 82 కోట్ల వసూళ్లను సాధించి, ఒక హీరోయిన్ సెంట్రిక్ సినిమా ఏ రేంజ్లో సక్సెస్ అవ్వగలదో బాక్సాఫీస్‌కు చూపించింది. ఇక భాగమతి సినిమాతో మరో 60 కోట్ల మార్కును దాటి, అనుష్క తనకంటూ ఒక ప్రత్యేకమైన సామ్రాజ్యాన్ని నిర్మించుకున్నారు. ఈ సినిమాలన్నీ ఇప్పటికీ ఒక బెంచ్‌మార్క్‌గా నిలిచిపోయాయి.
ఇక పక్కా లేడీ ఓరియెంటెడ్ సినిమాల జాబితాలో మహానటి చిత్రం 84.50 కోట్ల వసూళ్లతో టాప్ ప్లేస్‌లో ఉంది. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో కీర్తి సురేష్ మహానటి సావిత్రి గా నటించి, ఆమె జీవితాన్ని కళ్ళకు కట్టినట్లు చూపించారు. కలెక్షన్ల పరంగా ఇప్పటి వరకు ఈ చిత్రం ఫస్ట్ ప్లేస్‌లో నిలిచింది. అయితే, ఇప్పుడు సమంత నటించిన మా ఇంటి బంగారం చిత్రం ఈ రికార్డులను సవాలు చేస్తోంది. కేవలం పది రోజుల్లోనే 80 కోట్ల వసూళ్లను దాటి, వేగంగా దూసుకుపోతున్న ఈ సినిమా ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. సమంత పర్ఫార్మెన్స్ ఈ చిత్రానికి ప్రధాన ఆకర్షణగా నిలిచింది.
కానీ, ఇప్పుడు సమంత మా ఇంటి బంగారం సినిమాతో సీన్ పూర్తిగా మారిపోయింది. అనుష్క నెలకొల్పిన రికార్డులను ఒక్కొక్కటిగా దాటుకుంటూ, ఇప్పటికే 80 కోట్లకు పైగా వసూళ్లు సాధించి జెట్ స్పీడ్‌తో దూసుకెళ్తోంది. కేవలం పది రోజుల్లోనే ఈ స్థాయి వసూళ్లు సాధించడం అంటే మామూలు విషయం కాదు. సమంత ఈ సినిమాతో ఏకంగా ఫస్ట్ ప్లేస్‌కే టార్గెట్ చేస్తుంది. ఇప్పటి వరకు టాప్ పొజిషన్లో మహానటి ఫస్ట్ ప్లేస్‌లో ఉండగా, రుద్రమదేవి సెకండ్ హైయెస్ట్ గ్రాసర్‌గా నిలిచింది. ఆ తరువాత ప్లేస్‌లో సమంత మా ఇంటి బంగారం మూడో ప్లేస్‌లో నిలిచింది.
అయితే, ఇక్కడే ఒక చిన్న ట్విస్ట్ ఉంది. జులై 3న రాబోయే రెండు భారీ చిత్రాలు నాగబంధం, రావు బహదూర్ బాక్సాఫీస్ లెక్కలను మార్చేసే అవకాశం ఉంది. ఈ సినిమాలపై ప్రేక్షకులలో భారీ అంచనాలు ఉన్నాయి కాబట్టి, మా ఇంటి బంగారం చిత్రానికి థియేటర్ల సంఖ్య తగ్గే ఛాన్స్ ఉంది. ఇప్పటికే బిజినెస్ పరంగా ఈ సినిమా క్లైమాక్స్‌కు చేరుకుంది. మరి ఈ కొత్త సినిమాల పోటీని సమంత తన సత్తాతో అధిగమిస్తుందా..? మహానటి రికార్డును బద్దలు కొట్టి, చరిత్రలో కొత్త అధ్యాయాన్ని మొదలుపెడుతుందో లేదో చూడాలి.