
ఆంధ్రప్రదేశ్ జ్యుడిషియల్ ఆఫీసర్స్ అసోసియేషన్ ప్రతినిధులు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును కలిశారు. అమరావతిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో జరిగిన ఈ భేటీలో రాష్ట్రంలో న్యాయశాఖ ఎదుర్కొంటున్న పలు...
ఆంధ్రప్రదేశ్ జ్యుడిషియల్ ఆఫీసర్స్ అసోసియేషన్ ప్రతినిధులు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును కలిశారు. అమరావతిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో జరిగిన ఈ భేటీలో రాష్ట్రంలో న్యాయశాఖ ఎదుర్కొంటున్న పలు సమస్యలపై వారు సుదీర్ఘంగా చర్చించారు.
అమరావతి, జూన్ 30: ఆంధ్రప్రదేశ్ జ్యుడిషియల్ ఆఫీసర్స్ అసోసియేషన్ ప్రతినిధులు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును కలిశారు. అమరావతిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో జరిగిన ఈ భేటీలో రాష్ట్రంలో న్యాయశాఖ ఎదుర్కొంటున్న పలు సమస్యలపై వారు సుదీర్ఘంగా చర్చించారు. రాష్ట్రంలో జిల్లాల పునర్విభజన జరిగిన తర్వాత న్యాయ పరిపాలన పరంగా కొన్ని సాంకేతిక ఇబ్బందులు తలెత్తాయని, వాటిని వెంటనే పరిష్కరించాలని అసోసియేషన్ ప్రతినిధులు సీఎంకు విజ్ఞప్తి చేశారు. పరిపాలనా సౌలభ్యం కోసం జ్యుడిషియల్ జిల్లాల పునర్విభజన చేపట్టాలని, ప్రజలకు న్యాయసేవలు మరింత వేగంగా అందేలా కొత్త కోర్టులను ఏర్పాటు చేయాలని ఈ సందర్భంగా ముఖ్యమంత్రిని కోరారు. జిల్లా మార్పుల వల్ల తలెత్తిన న్యాయపరమైన సరిహద్దుల ఇబ్బందులను సరిచేయాల్సిన అవసరం ఉందని వివరించారు.
జ్యుడిషియల్ అధికారుల సంక్షేమానికి ప్రభుత్వం అండగా నిలవాలని ప్రతినిధులు కోరారు. ఇందులో భాగంగా ఏపీ జ్యుడిషియల్ ఆఫీసర్స్ అసోసియేషన్ భవన నిర్మాణానికి అనువైన స్థలాన్ని కేటాయించాలని విన్నవించారు. న్యాయాధికారుల కుటుంబ సభ్యుల ఆరోగ్య భద్రతను దృష్టిలో ఉంచుకుని వారికి క్యాష్‌లెస్ వైద్య చికిత్స సౌకర్యాన్ని కల్పించాలని అధికారుల సంఘం కోరింది. దీంతో పాటు ప్రస్తుతం ఇస్తున్న సాఫ్ట్ లోన్ పరిమితిని కూడా పెంచాలని వారు ముఖ్యమంత్రికి నివేదించారు.
దశలవారీగా పరిష్కరిస్తాం.. సీఎం చంద్రబాబు హామీ
అసోసియేషన్ ప్రతినిధులు కోరిన అంశాలపై సీఎం చంద్రబాబు నాయుడు సానుకూలంగా స్పందించారు. న్యాయాధికారులు ఎదుర్కొంటున్న సాంకేతిక, వ్యక్తిగత సమస్యలన్నింటినీ ప్రభుత్వం పరిశీలిస్తుందని చెప్పారు. జ్యుడిషియల్ అధికారుల సంక్షేమానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని, వారు లేవనెత్తిన ప్రతి అంశాన్ని దశలవారీగా పరిష్కరించేందుకు అవసరమైన చర్యలు చేపడతామని సీఎం చంద్రబాబు స్పష్టమైన హామీ ఇచ్చారు.