
కేకే-5 గనిలో ప్రమాదం.. ఒకరికి గాయాలు
మంచిర్యాల జిల్లా మందమర్రి ఏరియాలోని కేకే-5 గనిలో ప్రమాదం జరగింది. గనిలో మూడో సీమ్‌లో 14 లెవెల్ వద్ద ఎస్డీఎల్ యంత్రంతో ఆపరేటర్ శంకర్ పనిచేస్తుండగా ఒక్కసారిగా సైడ్ వాల్ కూలింది.

మంచిర్యాల జిల్లా మందమర్రి ఏరియాలోని కేకే-5 గనిలో ప్రమాదం జరగింది. గనిలో మూడో సీమ్‌లో 14 లెవెల్ వద్ద ఎస్డీఎల్ యంత్రంతో ఆపరేటర్ శంకర్ పనిచేస్తుండగా ఒక్కసారిగా సైడ్ వాల్ కూలింది.

Personal Finance: ఈ పెట్టుబడిలో 8 నుండి 12 శాతం రాబడులకు సంబంధించిన ఈ లెక్కలు పూర్తిగా ఊహాజనితమైనవని గుర్తుంచుకోవడం ముఖ్యం. మ్యూచువల్ ఫండ్ల వాస్తవ రాబడులు మార్కెట్ పరిస్థితులపై ఆధారపడి ఉంటాయి. హెచ్చుతగ్గులకు లోనవుతాయి. అందువల్ల, పెట్టుబడి పెట్టే ముందు..

Personal Finance: మీ కాలపరిమితి ముగిసిన తర్వాత కూడా మీరు డిపాజిట్‌ను పొడిగించుకునే అవకాశం ఉంది. మీరు 1-సంవత్సరం TDని 6 నెలల వరకు, 2-సంవత్సరాల టీడీని 12 నెలల వరకు పొడిగించుకోవచ్చు. 3, 5 సంవత్సరాల టీడీలను 18 నెలల వరకు..

Personal Finance: EMI కేవలం 1000 రూపాయలే.. రేపు చూద్దాంలే.. ఇలా అనుకుంటే ఏం జరుగుతుందో తెలుసా?

Personal Finance: మీకు 50 ఏళ్లు వచ్చేసరికి కనీసం కోటి రూపాయలు ఉండాలంటే ఏం చేయాలి? ఎవ్వరు చెప్పని ప్లాన్ మీ కోసం..!

అశోక్ క్రిందింటి జీ తెలుగు డిజిటల్ మీడియాలో సీనియర్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2022 నుంచి స్పోర్ట్స్, వినోదం, క్రైమ్, రాజకీయ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో ఏడేళ్లకుపైగా అనుభవం ఉంది. Dr Subhash Chandra Case: తుది లీగల్ ఆర్డర్ లేకుండా పదిహేను రోజులుగా సాగుతున్న మీడియా ట్రయల్‌పై నేషనల్ కంపెనీ లా అప్పిలేట్ ట్రిబ్యునల్ (NCLAT) దృష్టికి ఎస్సెల్ గ్రూప్ ఛైర్మన్ సుభాష్ చంద్ర తీసుకువెళ్లారు. అదేవిధంగా ఈ కేసును మళ్లీ మొదటి నుంచి ఏకంగా ఐదుగురు సభ్యుల ప్రత్యేక బెంచ్‌ను ఏర్పాటు చేయడాన్ని తీవ్రంగా తప్పుబట్టారు. దీనిపై నేషనల్ కంపెనీ లా అప్పిలేట్ ట్రిబ్యునల్ ముందు సుభాష్ చంద్ర తరుఫున న్యాయవాదులు బలమైన వాదనలు వినిపించారు. NCLAT తాత్కాలిక ఛైర్మన్ జస్టిస్ యోగేష్ ఖన్నా, సాంకేతిక సభ్యులు బరుణ్ మిత్రా, అజయ్ దాస్ మెహ్రోత్రాలతో కూడిన ధర్మాసనం ముందు బుధవారం ఈ పిటిషన్లపై విచారణ జరిగింది. సుభాష్ చంద్ర తరఫున సీనియర్ న్యాయవాది సస్మిత్ పాత్ర వాదనలు వినిపిస్తూ.. ప్రస్తుతం ఈ కేసులో ఎలాంటి అధికారిక తుది ఉత్తర్వు అమల్లో లేదని స్పష్టం చేశారు. అయినా.. రూ.22,006 కోట్ల మేర ఉన్న క్లెయిమ్‌లకు బదులుగా ఆయన కేవలం రూ.6.5 కోట్లు మాత్రమే చెల్లిస్తున్నారంటూ ఆయన ప్రతిష్టను దిగజార్చేలా తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని తెలిపారు. ఈ రూ.22,006 కోట్ల రుణం సుభాష్ చంద్ర వ్యక్తిగతంగా తీసుకున్నది కాదని.. ఎస్సెల్ గ్రూప్ కంపెనీలు తీసుకున్న రుణాలకు ఆయన గ్యారెంటర్‌గా మాత్రమే ఉన్నారని చెప్పారు. ఆయన వ్యక్తిగత ఆస్తుల నికర విలువ రూ.31.79 కోట్లు ఉండగా.. దాని ఆధారంగానే నిబంధనల ప్రకారం రూ.6.25 కోట్లు రుణదాతలకు, మరో రూ.25 లక్షలు న్యాయ ప్రక్రియ ఖర్చుల కోసం రీపేమెంట్ ప్లాన్‌ను రూపొందించారని వివరించారు. రీపేమెంట్ ప్లాన్‌ను ఆమోదిస్తూ ఎలాంటి

ఎమర్జెన్సీ సమయాల్లో డబ్బు అవసరమైనప్పుడు మొబైల్ లోన్ యాప్స్ ఎంతో సులభంగా లోన్స్ అందిస్తుననట్లు కనిపిస్తాయి. కొన్ని క్లిక్స్, ప్రాథమిక వ్యక్తిగత వివరాలు అందించగానే నిమిషాల్లో నగదు జమ చేస్తామనే ఆకర్షణీయమైన ఆఫర్లు చాలా మందిని ప్రశ్నలు అడగకుండా అప్పు తీసుకునేలా చేశాయి. అయితే అసలు సమస్య ఇక్కడే మొదలవుతుంది. ప్రస్తుతం అనేక లోన్ యాప్స్ తక్షణ ఆమోదం, తక్కువ వడ్డీ రేట్లు, ఎలాంటి కాగిత పత్రాలు అవసరం లేదనే ప్రచారాలతో వినియోగదారులను వలలో వేసుకుంటున్నాయి. దీని వల్ల ఆర్థికంగా నష్టపోవడమే కాకుండా పర్సనల్ ఇన్ఫర్మేషన్ సైబర్ నేరగాళ్ల చేతుల్లోకి వెళ్లే ప్రమాదం ఉంది.కడప రైతు కిరాక్ ప్లాన్! యూట్యూబ్ చూసి లక్షల లాభాలు.. ప్రధాని ప్రశంసలుఅప్పు కాదు.. ముందు అప్పు ఇచ్చే సంస్థ గురించి తెలుసుకోండి.. రుణం ఎంత త్వరగా వస్తుందనే దానికంటే అసలు మీకు రుణం ఇస్తున్నది ఎవరు అనే విషయాన్ని తెలుసుకోవడం చాలా ముఖ్యం. స్పష్టత లేని రుణదాత వివరాలు, వడ్డీ రేట్లు, చార్జీలపై సమాచారం లేకపోవడం, ఫోన్ లోని అనవసరమైన సమాచారానికి అనుమతులు అడగడం, ఎటువంటి క్రెడిట్ పరిశీలన లేకుండా తక్షణ ఆమోదం తెలపడం వంటివి నకిలీ యాప్స్ ప్రధాన లక్షణాలు. అద్భుతమైన డిజైన్ లేదా తక్షణ రుణం అని చెప్పినంత మాత్రాన ఆ సంస్థ నిజమైనదని నమ్మకూడదు.యాప్ స్టోర్ వివరాలను సరిచూసుకోండి.. ఏదైనా యాప్ గూగుల్ ప్లే స్టోర్ లేదా ఆపిల్ యాప్ స్టోర్ లో లభ్యమైనంత మాత్రాన దానిని వెంటనే నమ్మలేం. యాప్‌ను డౌన్లోడ్ చేసే ముందు దాని డెవలపర్ పేరు, వివరణ, ప్రైవసీ పాలసీ, కస్టమర్ కేర్ వివరాలు, వినియోగదారుల రివ్యూలను క్షుణ్ణంగా పరిశీలించాలి. ముఖ్యంగా ఈ వివరాలన్నీ ఆ రుణదాత అధికారిక వెబ్‌సైట్‌లోని వివరాలతో సరిపోలుతున్నాయో లేదా చూసుకోవాలి. యాప్ డెవలపర్ వివరాలకు, అధికారిక వెబ్సైట్ కు తేడా ఉంటే ఈ యాప్‌కు దూరంగా ఉండటమే మంచిది.నియంత్రణ సంస్థల అనుమతులు ఉన్నాయా?మీకు రుణం

శ్రీకృష్ణుడు రోహిణి నక్షత్రంలో జన్మించాడు. అయితే ఈ నక్షత్రంలో జన్మించిన వారిలో కొన్ని ప్రత్యేకమైన లక్షణాలు ఉంటాయని చెబుతున్నారు పండితులు. కాగా, ఇప్పుడు మనం శ్రీ కృష్ణుడు జన్మించిన నక్షత్రంలో జన్మించిన వ్యక్తుల వ్యక్తిత్వం ఎలా ఉంటుందో వివరంగా తెలుసుకుందాం. రోహిణి నక్షత్రంలో జన్మించిన వారిపై చంద్రుడి ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది. అందువలన వీరు చాలా ఆకర్షణీయంగా, అందంగా, భావోద్వేగ పరంగా అన్ని విధాలుగా చాలా సృజనాత్మకతను కలిగి ఉంటారు. అంతే కాకుండా వీరికి కళలు, సంగీతం, వంటి వాటిపై ఎక్కువ ఆసక్తి ఉంటుంది. వీరు వారి చుట్టూ ఉన్నవారి కంటే కాస్త భిన్నంగా కనిపించడమే కాకుండా అనర్గళంగా మాట్లాడుతారు. అందుకే 27 నక్షత్రాలలో రోహిణి నక్షత్రం చాలా ప్రత్యేకమైనది. అంతే కాకుండా పవిత్రమైనది అంటారు. అంతే కాకుండా ఈ నక్షత్రంలో జన్మించిన వారు మాట్లాడే విధానం కూడా చాలా ప్రత్యేకంగా ఉంటుందంట. మర్యాదపూర్వకంగా, మృదువుగా మాట్లాడుతుంటారు. అంతే కాకుండా వీరికి అందరినీ ఆకట్టుకునే శక్తి ఎక్కువగా ఉంటుంది. వీరి కళ్లలో ప్రత్యేకమైన మెరుపు కనిపిస్తుంది. అంతే కాకుండా వీరు మాట్లాడే విధానం కూడా అందరికంటే భిన్నంగా చాలా అందంగా ఉంటుంది. వీరు అందరిపై ఎక్కువ ప్రేమను కురిపిస్తారు. ఈ నక్షత్రంలో జన్మించిన వారు కళాత్మకమైన వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు. వీరిని ప్రతి ఒక్కరూ ఇష్టపడతారు. అంతే కాకుండా అందరి దృష్ణిని కూడా ఆకర్షిస్తారు. నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు

కొన్నిసార్లు జీవితంలో పెద్ద సమస్య ఏదీ ఉండదు. ఉద్యోగం ఉంటుంది. కుటుంబం ఉంటుంది. స్నేహితులు ఉంటారు. బాధ్యతలన్నీ సక్రమంగానే సాగుతుంటాయి. అయినా మనసులో మాత్రం ఏదో వెలితి. ‘ఇది నేను కోరుకున్న జీవితం కాదు’ అనే భావన వెంటాడుతుంది. ఇలాంటి సమయంలో వెంటనే జీవితాన్ని మార్చేయాలని నిర్ణయించుకోవాల్సిన అవసరం లేదు. ముందుగా మనల్ని మనమే కొన్ని ప్రశ్నలు వేసుకోవాలి.నిజంగా అసంతృప్తిగా ఉన్నారా?ప్రస్తుతం ఉన్న జీవితం నచ్చడం లేదా? లేక మనలో వచ్చిన మార్పులకు తగ్గట్లుగా అది లేకపోవడమా? ఒకప్పుడు ఎంతో ఇష్టంగా అనిపించిన ఉద్యోగం, లక్ష్యం, సంబంధం ఇప్పుడు సాధారణంగా అనిపించొచ్చు. ఇది తప్పు నిర్ణయం తీసుకున్నామని అర్థం కాదు. మన అవసరాలు, ప్రాధాన్యాలు మారాయని సూచన కావచ్చు.ఎవరూ అడ్డుకోకపోతే ఏం చేస్తారు?ఇతరులు ఏమనుకుంటారో ఆలోచించకుండా నిర్ణయం తీసుకునే అవకాశం వస్తే ఏం ఎంచుకుంటారు? కొత్త పని నేర్చుకోవాలనుకుంటున్నారా? ప్రశాంతమైన జీవితం కోరుకుంటున్నారా? మరో చోటుకు వెళ్లాలనుకుంటున్నారా? ఈ సమాధానం మనసులో దాగున్న అసలు కోరికను బయటపెట్టొచ్చు.మార్పు అంటే ఎందుకు భయపడుతున్నారు?మారితే డబ్బు సమస్యలు వస్తాయా? ఎవరికైనా నిరాశ కలిగిస్తామా? తీసుకున్న నిర్ణయం తప్పవుతుందా? ఇలా భయాలు మనల్ని ఒకే చోట నిలిపేస్తాయి. అయితే ‘మారితే ఏం కోల్పోతాను?’ అన్న ప్రశ్నతో పాటు ‘ఇలాగే ఉంటే ఏం కోల్పోతాను?’ అని కూడా ఆలోచించాలి.చివరిసారి మీలా ఎప్పుడు అనిపించింది?ఎలాంటి ప్రశంసలు, విజయాలు అవసరం లేకుండా మనస్ఫూర్తిగా ఆనందించిన సందర్భాన్ని గుర్తు చేసుకోవాలి. ప్రయాణం, పుస్తకం, ప్రకృతి, సృజనాత్మక పని, ఆత్మీయులతో గడిపిన సమయం.. ఏదైనా కావచ్చు. అప్పట్లో మనలో

చేతులు పరిశుభ్రంగా ఉంచుకోవాల్సిన ప్రాధాన్యం గురించి మనకు తెలిసిందే. అయినా సరే- కొంతమంది ఈ విషయంలో అశ్రద్ధ చేస్తుంటారు. బయటి నుంచి వచ్చాక, ఆహారం తీసుకునే ముందు.. ఏదో అలా పైపైన చేతులు కడుక్కుంటారు. చేతులు పరిశుభ్రంగా ఉంచుకోవాల్సిన ప్రాధాన్యం గురించి మనకు తెలిసిందే. అయినా సరే- కొంతమంది ఈ విషయంలో అశ్రద్ధ చేస్తుంటారు. బయటి నుంచి వచ్చాక, ఆహారం తీసుకునే ముందు.. ఏదో అలా పైపైన చేతులు కడుక్కుంటారు. ఫలితంగా చేతులకు అంటుకున్న క్రిములు, బ్యాక్టీరియా తీసుకునే ఆహారం ద్వారా శరీరంలోకి చేరతాయి. సమస్త ఆరోగ్య సమస్యలకు ఇక్కడే బీజం పడుతుందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ క్రమంలో చేతుల శుభ్రత విషయంలో ఏమాత్రం అజాగ్రత్త పనికి రాదని సూచిస్తున్నారు. ⚛ చేతులు శుభ్రం చేసుకోకపోతే చేతిపై ఉన్న వ్యాధికారక క్రిములన్నీ మనం తీసుకునే ఆహారం ద్వారా శరీరంలోకి వెడతాయి. ఇక అపరిశుభ్ర చేతులతో ఇతరులను తాకితే వారి చేతులకు కూడా ఆ క్రిములన్నీ అంటుకుంటాయి. ⚛ చేతులు పరిశుభ్రంగా లేకపోవడం వల్ల డయేరియా, హెపటైటిస్, జలుబు.. వంటి వివిధ రకాల అనారోగ్యాలు తలెత్తే అవకాశాలు ఎక్కువ. ఒక టాయిలెడ్ కమోడ్ పైనే లక్షల సంఖ్యలో క్రిములు దాగి ఉంటాయని పరిశోధనలు చెబుతున్నాయి. కాబట్టి తరచూ చేతులు శుభ్రం చేసుకోవడాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ నిర్లక్ష్యం చేయకూడదు అంటున్నారు నిపుణులు. ⚛ చేతులు అపరిశుభ్రంగా ఉండడం వల్ల కంటి సంబంధిత సమస్యలు కూడా తలెత్తే అవకాశం ఉందంటున్నారు నిపుణులు. కాబట్టి సబ్బు, హ్యాండ్‌వాష్, శానిటైజర్‌తో కనీసం 20 సెకన్ల పాటు చేతులు శుభ్రం చేసుకుంటే వివిధ అనారోగ్యాలకు దూరంగా ఉండచ్చని సూచిస్తున్నారు. ఈ క్రమంలో ప్రత్యేకించి పిల్లలకు కూడా చేతులు చక్కగా శుభ్రం చేసుకునేలా చిన్నప్పటి నుంచే శిక్షణ ఇవ్వాలి అని చెబుతున్నారు. గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి

బిగ్ బాస్ అగ్నిపరీక్షలో తన ప్రయాణం, అనుభవాలపై మాజీ కంటెస్టెంట్ గాయత్రి ఓ ఇంటర్వ్యూలో అనేక ఆసక్తికర విషయాలు వెల్లడించారు. అగ్నిపరీక్షలో కంటెస్టెంట్ గా పాల్గొన్న ఆమె ఊహించని విధంగా ఎలిమినేట్ అయ్యి బయటకు వచ్చేసింది. సింగిల్ పేరెంట్ పెంపకంలో పెరిగిన పిల్లల శక్తిని, వారి తల్లిదండ్రుల త్యాగాలను సమాజానికి చాటిచెప్పాలనేదే తన అసలు లక్ష్యమని గాయత్రి చెప్పుకొచ్చింది. ఈ ఇంటర్వ్యూలో ముందుగా గాయత్రి తన వ్యక్తిగత నేపథ్యాన్ని పంచుకుంటూ, ఖమ్మం స్వస్థలమని, తనకు ఒక సంవత్సరం వయసున్నప్పుడే తన తల్లిదండ్రులు విడిపోయారని తెలిపారు. తన తల్లి ఒక బ్యూటీషియన్ మరియు టైలర్‌గా పనిచేస్తూ, ఎన్నో కష్టాలను ఎదుర్కొని తనను పెంచిందని చెప్పారు. ఆమె తల్లి చేసిన త్యాగాలు, ఇచ్చిన ప్రోత్సాహం వల్లే కెనడాలో మాస్టర్స్ చదువు పూర్తి చేయగలిగానని అన్నారు. ఇండస్ట్రీలోకి రావాలనే తన నిర్ణయాన్ని తల్లి మొదట వ్యతిరేకించినా, తర్వాత అంగీకరించారని, తన ఆరోగ్య సమస్యలు, తల్లి ఒంటరితనం కారణంగా విదేశాల నుండి తిరిగి వచ్చానని తెలిపారు. నేను మాట్లాడిన మాట ప్రజల్లోకి వల్గర్‌గా వెళ్ళింది.. నా వల్ల ఆ స్టార్ డైరెక్టర్ మాటలు పడ్డారు.. బిగ్ బాస్ అగ్నిపరీక్షలో ఎదురైన సవాళ్ళను, ముఖ్యంగా క్లిప్స్ టాస్క్‌ను గాయత్రి వివరించారు. ఈ టాస్క్‌లో తన చర్మం సున్నితత్వం కారణంగా క్లిప్స్ పెట్టుకోవడం అత్యంత బాధాకరంగా మారిందని ఆమె పేర్కొన్నారు. విపరీతమైన నొప్పి, రక్త ప్రసరణ ఆగిపోవడం, వణుకు వచ్చిందని, దాదాపు ఫిట్స్ వచ్చినంత పని అయిందని తెలిపారు. ఈ క్లిప్స్ తీయడానికి తోటి కంటెస్టెంట్లు అభిజిత్, నవదీప్, శ్రీముఖి తదితరులు ముందుకు వచ్చి సహాయం చేశారని, ముఖ్యంగా అభిజిత్ తన కాళ్ళకు ఉన్న క్లిప్స్ తీయడంలో తోడ్పడ్డారని చెప్పారు. Anand Deverakonda: అసలు ఎపిక్ సినిమా అంటే అదే.. ఆ సీన్లో కన్నీళ్లు పెట్టుకున్నా: ఆనంద్ దేవరకొండ ఈ ఒక్క టాస్క్‌లో గెలవలేకపోయినా, తనను టాప్ 15లో ఎంపిక చేయడానికి కేవలం

హత్యాయత్నం కేసు నమోదు చేయడంలో జాప్యం వహించిన పోలీసులపై తూర్పు గోదావరి జిల్లా ఎస్పీ ఆగ్రహం వ్యక్తం చేశారు. వారిని వీఆర్‌కు పంపుతూ ఆదేశాలు జారీ చేశారు. రాజమండ్రి, సెప్టెంబర్ 01: విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించిన నలుగురు పోలీసులపై తూర్పు గోదావరి జిల్లా ఎస్పీ నరసింహ కిషోర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. వారిని వీఆర్‌కు పంపుతూ మంగళవారం ఆదేశాలు జారీ చేశారు. రాజమండ్రి శివారులోని కోరుకొండ పోలీస్ స్టేషన్ పరిధిలో ఇటీవల మహిళపై హత్యాయత్నం జరిగింది. ఈ ఘటనపై నాలుగు రోజులు ఆలస్యంగా పోలీసులు కేసు నమోదు చేశారు. దీనిపై విమర్శలు వెల్లువెత్తాయి. అవి జిల్లా ఎస్పీ దృష్టికి వెళ్లాయి. దాంతో ఈ కేసు నమోదు వ్యవహారంలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన నలుగురు పోలీసులపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని ఎస్పీ నరసింహ కిషోర్ నిర్ణయించారు. అందులో భాగంగా వారిని వీఆర్‌కు పంపారు. కోరుకొండ ఎస్ఐ రమేశ్, రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రి అవుట్ పోస్ట్ ఏఎస్ఐ శ్రీదేవితోపాటు హెడ్ కానిస్టేబుళ్లు లక్ష్మణ్, నాగమల్లేశ్వరరావును వీఆర్‌కు పంపుతూ తూర్పు గోదావరి జిల్లా ఎస్పీ ఆదేశాలు జారీ చేశారు. ప్రేమ పేరుతో మోసం.. బలవంతంగా పెళ్లి: కాకినాడ ఎస్పీకి మహిళ ఫిర్యాదు తిరుపతి విమానాశ్రయంలో విమాన వేళల్లో మార్పులు.. ప్రయాణికులకు బిగ్ అలర్ట్

జీ గ్రూప్ వ్యవస్థాపకుడు సుభాష్ చంద్రకు సంబంధించిన పర్సనల్ ఇన్సాల్వెన్సీ కేసులో నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ (NCLT) ఒక సంచలన రీపేమెంట్ ప్లాన్‌కు ఆమోదం తెలిపింది. ఆయనపై నమోదైన రూ. 22,006 కోట్ల అంగీకరించిన క్లెయిమ్‌లను కేవలం రూ. 6.25 కోట్లు చెల్లించడం ద్వారా సెటిల్ చేసుకోవడానికి ట్రిబ్యునల్ అనుమతించింది. ఈ నిర్ణయం ప్రస్తుతం దేశవ్యాప్తంగా పెద్ద చర్చకు దారితీసింది. ఈ తీర్పుపై భిన్నమైన అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. రుణదాతలైన బ్యాంకులు ఈ ప్రతిపాదనను అంగీకరించలేమని, ఇది ఎంతమాత్రం సరికాదని అంటున్నాయి. మరోవైపు, మీడియాలో ప్రచారమవుతున్న 99.97 శాతం రుణ మాఫీ వార్తలు తప్పుదోవ పట్టించేలా ఉన్నాయని ప్రభుత్వ వర్గాలు పేర్కొంటున్నాయి. అసలు తనపై ఉన్న క్లెయిమ్ సైజ్ ఇంత పెద్దది కాదని సుభాష్ చంద్ర స్వయంగా వాదిస్తున్నారు. ఈ మొత్తం వ్యవహారం వెనుక ఉన్న అసలు వివరాలను ఇప్పుడు చూద్దాం. ఈ వివాదంపై ఢిల్లీలోని NCLT బెంచ్ తన నిర్ణయాన్ని వెల్లడించింది. అంతకుముందు ఇద్దరు సభ్యుల బెంచ్‌లో భిన్నాభిప్రాయాలు రావడంతో, ఈ కేసును మూడో జ్యుడీషియల్ మెంబర్ నీలేష్ శర్మకు బదిలీ చేశారు. ఆయన ఇన్సాల్వెన్సీ అండ్ బ్యాంక్రప్సీ కోడ్ (IBC) సెక్షన్ 114 కింద ఈ ప్లాన్‌ను క్లియర్ చేశారు. ఈ ప్లాన్ ప్రకారం, సుభాష్ చంద్ర తన వ్యక్తిగత పూచీకత్తు హోదాలో రూ. 6.25 కోట్లు చెల్లిస్తారు. దీనితో పాటు, రుణం తీసుకున్న ప్రధాన సంస్థలు విడిగా సుమారు రూ. 1,494 కోట్లు చెల్లించాల్సి ఉంటుందని రిపోర్టులు పేర్కొంటున్నాయి. 80.8 శాతం ఓటింగ్ షేర్ ఉన్న రుణదాతలు ఈ ప్లాన్‌కు సపోర్టు ఇచ్చారు. అయితే LIC హౌసింగ్ ఫైనాన్స్ (LICHFL), హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, కెనరా బ్యాంక్, ఆర్బిఎల్ బ్యాంక్, యూనియన్ బ్యాంక్‌లు మాత్రం ఈ రీపేమెంట్ ప్లాన్‌కు వ్యతిరేకంగా ఓటు వేశాయి. రీజల్యూషన్ ప్రొఫెషనల్ అంచనా ప్రకారం.. సుభాష్ చంద్ర వ్యక్తిగత ఆస్తుల విలువ ఈ రీపేమెంట్
Sukesh Chandrashekhar Sentenced 8 Years : సాధారణంగా బెయిల్ పొందడానికి ఏవేవో కారణాలు చెబుతుంటారు. ఎలాగోలా బయటకు వచ్చేందుకు సాధ్యమైనన్ని పనులు చేస్తుంటారు చాలా మంది. కానీ మనం ఇప్పుడు చూడబోయే ఓ వ్యక్తి మాత్రం బెయిల్ కోసం.. ఏకంగా సుప్రీంకోర్టు న్యాయమూర్తి అవతారమెత్తాడు. అంతేనా ఓ ప్రత్యేక జడ్జీని బెదిరించి ఘోర మోసానికి పాల్పడ్డాడు. అయితే ఈ కేసులో నిందితుడైన సుకేష్ చంద్రశేఖర్‌కు ఢిల్లీ కోర్టు గట్టి షాక్ ఇచ్చింది. ఈ తీవ్ర నేరానికి గాను అతనికి ఎనిమిది ఏళ్ల కఠిన కారాగార శిక్ష విధిస్తూ ఢిల్లీ చీఫ్ జుడీషియల్ మెజిస్ట్రేట్ హర్షితా మిశ్రా సంచలన తీర్పును ఇచ్చారు. నిందితుడు చేసిన తప్పు.. న్యాయవ్యవస్థ స్వతంత్రతను, విచారణ ప్రక్రియను దెబ్బతీసే కుట్రగా అభివర్ణించారు.పోలీస్ కస్టడీలోనే ప్లాన్.. కానిస్టేబుల్ ఫోన్‌తో డ్రామాఅవినీతి కేసులో పోలీస్ కస్టడీలో ఉన్న సుకేష్ చంద్రశేఖర్ 2017 ఏప్రిల్ 28వ తేదీన.. కానిస్టేబుల్ మంజీత్ వద్ద ఉన్న మొబైల్ ఫోన్‌ను దక్కించుకున్నాడు. దాని ద్వారా అప్పట్లో అవినీతి నిరోధక చట్టం కేసులను విచారిస్తున్న స్పెషల్ జడ్జ్ పూనం చౌదరి ల్యాండ్‌లైన్, మొబైల్ నంబర్లకు ఫోన్ చేశాడు. మొదట సుప్రీంకోర్టు జడ్జి వద్ద పనిచేసే ప్రైవేట్ కార్యదర్శినని పరిచయం చేసుకుని, ఆ తర్వాత స్వయంగా సుప్రీం కోర్టు న్యాయమూర్తినేనని బురిడీ కొట్టించాడు. తన కేసులో వెంటనే బెయిల్ మంజూరు చేయాలని, లేకపోతే ఉద్యోగ పరంగా తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని జడ్జీని బెదిరింపులకు గురిచేశాడు.ఇదీ చూడండి: జడ్జిపై తెలుగు లాయర్ అనుచిత వ్యాఖ్యలు.. తీవ్రంగా స్పందించిన సీజేఐవిడివిడిగా శిక్షలు.. ఒకదాని తర్వాత ఒకటి అమలు!కానీ జడ్జీ మాత్రం ఈ పని చేసింది ఎవరో తెలుసుకున్నారు. ముఖ్యంగా అది కానిస్టేబుల్ నెంబర్ అని తెలుసుకుని.. నిందితుడిపై మరికొన్ని కేసులు నమోదు చేశారు. ఆపై విచారణ జరిపి.. సుకేష్ చంద్రశేఖరే నిందితుడిని గుర్తించారు. ముఖ్యంగా ఆగస్టు 20వ తేదీన సుకేష్‌ను ఐపీసీ సెక్షన్లు

ఇది డిజిటల్ యుగం.. ఉదయం లేచింది మొదలు రాత్రి పడుకునే వరకు ప్రతి నిమిషం డిజిటల్ టెక్నాలజీతో ముడిపడి ఉంది. ఇక వాట్సాప్ వంటి మెసేంజర్లు ప్రతి ఒక్కరి జీవితంలో భాగమైపోయాయి. ఫ్రెండ్స్‌తో చాటింగ్ చేయడం, ఫొటోలు షేర్ చేసుకోవడం నుంచి మొదలుకొని.. ఆఫీస్ డాక్యుమెంట్లు పంపుకోవడం వరకు అన్నింటికీ వాట్సాపే మనకు ప్రధాన ఆధారం అయిపోయింది. అయితే, మీకొక షాకింగ్ నిజం చెప్పాలి. లోన్ అప్లై చేయాలన్నా, క్రెడిట్ కార్డ్ తీసుకోవాలన్నా, ప్రాపర్టీ కొనుగోలు చేయాలన్నా, లేదా ఏదైనా హోటల్లో రూమ్ బుక్ చేసుకోవాలన్నా.. నేడు ‘కేవైసీ’ అనేది తప్పనిసరి. ఈ క్రమంలో అవతలి వ్యక్తులు, ఏజెంట్లు లేదా సంస్థలు అడిగిన వెంటనే మనం మన పాన్ కార్డ్, ఆధార్ కార్డ్, బ్యాంక్ స్టేట్మెంట్స్ వంటి అత్యంత గోప్యమైన పత్రాలను క్షణం ఆలోచించకుండా వాట్సాప్‌లో ఫార్వర్డ్ చేసేస్తుంటాం. “ఫైల్ క్షణంలో అవతలి వాళ్లకు వెళ్లిపోతుంది కదా, పంపిస్తే తప్పేంటి?” అని మీరు తేలికగా తీసుకుంటున్నారా? అయితే మీరు రిస్క్‌లో పడినట్లే. మీ ఒక్క వాట్సాప్ మెసేజ్ మీ జీవితాన్నే తలక్రిందులు చేయగలదు. భవిష్యత్తులో మీరు ఊహించని తీవ్రమైన ఆర్థిక, చట్టపరమైన ఇబ్బందుల్లో పడే ప్రమాదం పొంచి ఉంది. చాలా మందికి ఒక భ్రమ ఉంటుంది. మనం వాట్సాప్‌లో ఒక డాక్యుమెంట్ పంపిస్తే, అవతలి వాళ్ళు చూసి డిలీట్ చేసేస్తారని అనుకుంటాం. కానీ అక్కడే అసలు ప్రమాదం పొంచి ఉంది. మనం వాట్సాప్‌లో పంపిన డాక్యుమెంట్లు కేవలం ఆ అవతలి వ్యక్తి వాట్సాప్ చాట్‌లోనే ఉండిపోవు. అవతలి వ్యక్తి ఆ ఫైల్‌ను తన ఫోన్ గ్యాలరీలోకి, లాప్‌టాప్‌లోకి లేదా కంప్యూటర్లోకి డౌన్లోడ్ చేసుకుంటాడు. అంతేకాదు, ఆ ఫోన్‌కు సంబంధించిన క్లౌడ్ బ్యాకప్ ఆటోమేటిక్‌గా ఆన్ అయి ఉంటే, మీ పత్రాల కాపీలు ఆటోమేటిక్‌గా క్లౌడ్‌లో సేవ్ అయిపోతాయి. ఒకసారి డాక్యుమెంట్ మీ ఫోన్ దాటి బయటికి వెళ్తే, దానిపై మీ నియంత్రణ పూర్తిగా కోల్పోయినట్టే!

22 ఏళ్ల క్రితం నమోదైన ఓ కేసులో టీమిండియా మాజీ క్రికెటర్ నిర్దోషిగా తేలాడు. అతడిపై వచ్చిన అభియోగాలకు సరైన ఆధారాలు లేకపోవడంతో కోర్టు అతడిని నిర్దోషిగా తేలుస్తూ తీర్పునిచ్చింది. స్పోర్ట్స్ డెస్క్: టీమిండియా మాజీ క్రికెటర్ జేకబ్ మార్టిన్‌ను 22 ఏళ్ల క్రితం నమోదైన క్రిమినల్ కేసు నుంచి పాటియాలా హౌస్ కోర్టు నిర్దోషిగా ప్రకటించింది. 2004లో నమోదైన ఎఫ్ఐఆర్ ఆధారంగా ఐపీసీ సెక్షన్లు 420, 468, 471, 120బీ, పాస్‌పోర్ట్ చట్టం సెక్షన్ 12 కింద అతడిపై అభియోగాలు మోపబడ్డాయి. అయితే యూకే ఇమ్మిగ్రేషన్ స్టాంప్ ఫోర్జరీ, ప్రయాణ ఏర్పాట్లు, ఆర్థిక లావాదేవీలకు సంబంధించి మార్టిన్‌పై వచ్చిన ఫిర్యాదులకు ఎటువంటి ఆధారాలు లేవని కోర్టు తేల్చిచెప్పింది. ఆర్థిక లావాదేవీలపై లేదా 'అజ్వా స్పోర్ట్స్ క్లబ్' యాజమాన్య నియంత్రణపై ఎటువంటి సరైన సాక్ష్యాలు లభించలేదని కోర్టు పేర్కొంది. పలువురు సాక్షులు కూడా ఈ ఆరోపణలను రుజువు చేయలేకపోవడంతో కోర్టు జేకబ్‌కు క్లీన్ చిట్ ఇచ్చింది. కోర్టు తీర్పు వెలువడిన అనంతరం జేకబ్ మార్టిన్ మీడియాతో మాట్లాడుతూ భావోద్వేగానికి గురయ్యాడు. 2004లో ఇంగ్లండ్‌లో ఆడేందుకు వెళ్లిన తన జట్టులోని ఒక ప్లేయర్ వీసా గడువు ముగిసినా యూకేలోనే ఉండిపోయాడని పేర్కొన్నాడు. తప్పుడు స్టాంపింగ్ చేయించుకుని భారత్‌కు తిరిగొచ్చే క్రమంలో ఎయిర్‌పోర్టులో పట్టుబడ్డాడని జేకబ్ వివరించాడు. అసలు ఎఫ్ఐఆర్లో తన పేరు లేకపోయినా, తానొక ఇంటర్నేషనల్ క్రికెటర్ కావడం వలనే విచారణ సమయంలో తన పేరును ఈ కేసులోకి బలవంతంగా చేర్చాని అతడు ఆవేదన వ్యక్తం చేశాడు. ఈ 22 ఏళ్ల సుదీర్ఘ కాలం తనను తీవ్రమైన మానసిక ఆందోళనకు గురిచేసిందని, చివరకు రైల్వే ఉద్యోగాన్ని కూడా కోల్పోవాల్సి వచ్చిందని జేకబ్ మార్టిన్ వాపోయాడు. తనపై ఆరోపణలు వచ్చిన సమయంలో బీసీసీఐ నుంచి కూడా ఎటువంటి స్పందన లభించలేదని తెలిపాడు. ఏదేమైనా కోర్టు ఇచ్చిన ఈ తీర్పు తన జీవితానికి ఒక పెద్ద మలుపు అని

Aditi Shankar: నటి అనుపమ పరమేశ్వరన్ గురించి తాజాగా మరో హీరోయిన్ అదితి శంకర్ చేసిన వ్యాఖ్యలు ఆసక్తిగా మారాయి. అనుపమ ఇటీవల తన వ్యక్తిగత జీవితంలో ఎదురైన కొన్ని ఇబ్బందుల గురించి ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన విషయం తెలిసిందే. ముఖ్యంగా ఓ గత సంబంధం కారణంగా తాను ఎదుర్కొన్న మానసిక ఒత్తిడి, బాధ గురించి ఆమె ఓపెన్‌గా చెప్పడం సోషల్ మీడియాలో చర్చకు దారితీసింది. అనుపమ తన గత సంబంధం గురించి మాట్లాడిన విధానం చాలా మందిని ఆకట్టుకుంది. తనకు ఎదురైన పరిస్థితులను దాచకుండా, వాటి గురించి ధైర్యంగా మాట్లాడటం అందరి దృష్టిని ఆకర్షించింది. ఈ విషయంపైనే తాజాగా అదితి శంకర్ స్పందించారు. అనుపమ మాట్లాడిన విధానం తనకు నచ్చిందని ఆమె చెప్పారు. అనుపమ ఇంటర్వ్యూ చూసిన తర్వాత ఆమెపై మరింత గౌరవం పెరిగిందని అదితి తెలిపారు. ప్రతి ఒక్కరి జీవితంలో కొన్ని కష్టమైన పరిస్థితులు ఉంటాయని, అయితే వాటి గురించి బయటకు చెప్పడం అంత సులభం కాదని ఆమె అభిప్రాయపడ్డారు. అలాంటి సమయంలో అనుపమ తన అనుభవాన్ని ధైర్యంగా పంచుకోవడం అభినందించాల్సిన విషయమని అన్నారు. ముఖ్యంగా తనకు జరిగిన విషయాల గురించి మాట్లాడేటప్పుడు అనుపమలో నిజాయితీ కనిపించిందని అదితి పేర్కొన్నారు. ఎదురైన సమస్యలతో కుంగిపోకుండా, వాటి నుంచి బయటకు వచ్చి తన జీవితాన్ని కొనసాగించడం గొప్ప విషయమని చెప్పారు. అనుపమ చెప్పిన విషయాలు ఇలాంటి పరిస్థితులను ఎదుర్కొంటున్న మరికొందరికి ధైర్యాన్ని ఇవ్వవచ్చని అదితి అభిప్రాయపడ్డారు. ఇదిలా ఉంటే.. అనుపమ తన మాజీ బాయ్‌ఫ్రెండ్ పేరును ఎక్కడా ప్రస్తావించకుండా గతంలో ఎదురైన అనుభవాల గురించి మాట్లాడారు. ఆ బంధం కారణంగా తాను చాలా ఇబ్బంది పడ్డానని, తనను తానే తప్పుపట్టుకునే పరిస్థితి వచ్చిందని ఆమె చెప్పినట్లు సమాచారం. సుమారు రెండేళ్ల పాటు ఆ సంబంధంలో ఎన్నో కష్టాలు ఎదుర్కొన్నానని ఆమె వెల్లడించారు. అనుపమ చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్

తెలంగాణ పోలీస్ శాఖలో పునర్వ్యవస్థీకరణ చేపట్టారు. మారుతున్న సవాళ్లకు అనుగుణంగా శాఖలో మార్పులు చేస్తున్నట్లు డీజీపీ సీవీ ఆనంద్ తెలిపారు. హైదరాబాద్: మారుతున్న సవాళ్లకు అనుగుణంగా తెలంగాణ పోలీస్ శాఖలో పునర్వ్యవస్థీకరణ చేపడుతున్నట్లు డీజీపీ సీవీ ఆనంద్ తెలిపారు. ఇందులో భాగంగా గ్రేహౌండ్స్, ఆక్టోపస్, ఎస్ఐబీ విభాగాలకు చెందిన 513 మంది సిబ్బందిని ఇతర విభాగాలకు బదిలీ చేసినట్లు వెల్లడించారు. బదిలీ అయిన 513 మందిలో 5 మంది సీఐలు, 22 మంది ఎస్ఐలు, 14 మంది ఏఎస్ఐలు ఉన్నారు. వీరితో పాటు 84 మంది హెడ్ కానిస్టేబుళ్లు, 388 మంది కానిస్టేబుళ్లకు కొత్త బాధ్యతలు అప్పగించినట్లు డీజీపీ తెలిపారు. ఈ బదిలీల్లో భాగంగా అత్యధికంగా 224 మందిని ట్రాఫిక్ మేనేజ్మెంట్, రోడ్డు భద్రత విభాగానికి కేటాయించారు. కొత్త బాధ్యతలు చేపట్టే ముందు సిబ్బందిని రెండు నెలల పాటు వివిధ విభాగాల్లో అటాచ్మెంట్ ద్వారా పనిచేయించనున్నట్లు డీజీపీ పేర్కొన్నారు. సిబ్బంది విద్యార్హతలు, అనుభవం, సామర్థ్యం ఆధారంగా తుది బాధ్యతలను నిర్ణయించనున్నట్లు డీజీపీ సీవీ ఆనంద్ స్పష్టం చేశారు. కొండా సుస్మిత వ్యవహారంపై టీపీసీసీ సీరియస్ నైట్రాజెపామ్ అక్రమ విక్రయాలు చేస్తున్న ముఠా గుట్టురట్టు.. ముగ్గురి అరెస్ట్

ఏపీలో కీలకమైన కార్పోరేషన్ మేయర్లు, మున్సిపాలిటీలు, నగర పంచాయతీల ఛైర్ పర్సన్లను ప్రత్యక్షంగా ప్రజలే ఎన్నుకునేందుకు మార్గం సుగమం అయింది. గతంలో అమల్లో ఉన్న ఈ విధానాన్ని 2005లో రద్దు చేశారు. ఇప్పుడు మళ్లీ కూటమి సర్కార్ దీన్ని అమల్లోకి తెచ్చింది. ఈ మేరకు నిన్న కేబినెట్లో ఆమోదించిన బిల్లును ఇవాళ అసెంబ్లీలో (AP Assembly)ప్రవేశపెట్టిన ప్రభుత్వం.. ఆమోద ముద్ర వేయించుకుంది. దీంతో మున్సిపల్ చట్టంలో సవరణలు రానున్నాయి.మండలిలో వైసీపీకి హ్యాట్రిక్..! కూటమి మళ్లీ చేతులెత్తేసిందా ?1986 వరకు మేయర్, మున్సిపల్ చైర్మన్ల ఎంపికకు పరోక్ష ఎన్నికలు జరిగేవని, 1986 నుంచి 2005 వరకు ప్రత్యక్ష ఎన్నికలు జరిగాయని, 2005 నుంచి ఇప్పటివరకు మళ్లీ పరోక్ష ఎన్నికల విధానం కొనసాగుతోందని మంత్రి నారాయణ ఈ బిల్లుపై మాట్లాడుతూ వెల్లడించారు. ప్రస్తుతం తీసుకొచ్చిన చట్ట సవరణతో ఇకపై మేయర్, మున్సిపల్ చైర్మన్ల ఎన్నికలు ప్రత్యక్ష విధానంలో నిర్వహించేందుకు అవకాశం కలుగుతుందన్నారు. ప్రత్యక్ష ఎన్నికల ద్వారా ప్రజలే నేరుగా మేయర్ లేదా మున్సిపల్ చైర్మన్‌ను ఎన్నుకోవడం వల్ల అనేక ప్రయోజనాలు ఉంటాయని, ప్రత్యక్ష ఎన్నికల్లో ప్రజల నుంచి ఎన్నికైన మేయర్, చైర్మన్‌కు బలమైన ప్రజామోదం ఉంటుందని ఆయన తెలిపారు. అలాగే కౌన్సిలర్లు, కార్పొరేటర్ల ద్వారా కాకుండా ప్రజలే నేరుగా ఎన్నుకోవడం వల్ల మేయర్ లేదా చైర్మన్‌పై కౌన్సిలర్లు, కార్పొరేటర్ల ప్రభావం ఉండదన్నారు. తొలి రోజే మండలి డిప్యూటీ ఛైర్మన్ కు కూటమి షాక్..! బొత్స ఫైర్..!ప్రత్యక్ష ఎన్నికల విధానంతో మేయర్, చైర్మన్లు వేగవంతమైన నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంటుందని, నగరాలు, పట్టణాల అభివృద్ధికి సంబంధించిన ప్రాజెక్టులను త్వరితగతిన అమలు చేసేందుకు ఇది పనికొస్తుందని తెలిపారు. రోడ్లు, డ్రైనేజీ, తాగునీరు, ప్రజా రవాణా, వ్యర్థాల నిర్వహణ, పట్టణ ప్రణాళిక వంటి అంశాల్లో సుదీర్ఘకాలిక అభివృద్ధి ప్రణాళికలను రూపొందించి అమలు చేసే అవకాశం ఉంటుందన్నారు. అభివృద్ధి పనుల అమలులో వివిధ ప్రభుత్వ శాఖలు, సంస్థలతో మెరుగైన సమన్వయం చేసుకుంటూ పనులను

బీజేపీకి రాజీనామా చేసిన ఆ పార్టీ మాజీ జాతీయ అధికార ప్రతినిధి షెహజాద్ పూనావాలా తన నిర్ణయానికి గల కారణాలను వెల్లడించారు. బీజేపీని వీడటం వెనుక రాజకీయ విభేదాలు లేవని, ఆర్థిక, వ్యక్తిగత పరిస్థితుల కారణంగానే పార్టీ నుంచి తప్పుకున్నానని ఆయన స్పష్టం చేశారు. ఇంటర్నెట్ డెస్క్: బీజేపీకి రాజీనామా చేసిన ఆ పార్టీ మాజీ జాతీయ అధికార ప్రతినిధి షెహజాద్ పూనావాలా తన నిర్ణయానికి గల కారణాలను వెల్లడించారు. బీజేపీని వీడటం వెనుక రాజకీయ విభేదాలు లేవని, ఆర్థిక, వ్యక్తిగత పరిస్థితుల కారణంగానే పార్టీ నుంచి తప్పుకున్నానని ఆయన స్పష్టం చేశారు. రాజీనామా అనంతరం తొలిసారి ఓ జాతీయ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన తన పరిస్థితులను వివరించారు (Shehzad Poonawalla Quits BJP). పూర్తికాలం రాజకీయాల్లో కొనసాగడం వల్ల తన వ్యక్తిగత ఖర్చులను నిర్వహించడం కష్టంగా మారిందని పూనావాలా తెలిపారు. రాజకీయ పార్టీలు తమ అధికార ప్రతినిధులకు లేదా కార్యకర్తలకు జీతాలు చెల్లించవని చెప్పారు. దీంతో ఇంటి అద్దె వంటి సాధారణ ఖర్చులను కూడా భరించడం కష్టంగా మారిందని వివరించారు. 'నేను నా ఇంటి అద్దె చెల్లించాలి. రోజువారీ ఖర్చులు చూసుకోవాలి' అని ఆయన తన పరిస్థితిని వివరించారు. పార్టీపై అసంతృప్తితో తాను ఈ నిర్ణయం తీసుకోలేదని ఆయన స్పష్టం చేశారు (BJP Spokesperson). బీజేపీని వీడాలనే ఆలోచన తనకు అకస్మాత్తుగా రాలేదని పూనావాలా తెలిపారు. పార్టీకి రాజీనామా చేసి ప్రైవేటు రంగంలోకి తిరిగి వెళ్లడం గురించి 2024 నుంచి ఆలోచిస్తున్నానని చెప్పారు (BJP Resignation Shehzad). కొన్ని వారాల క్రితం తాను మొదటిసారి రాజీనామా చేయాలనుకుంటున్నట్లు పార్టీ నాయకత్వానికి తెలియజేశానని, ఆ సమయంలో పార్టీ పెద్దలు తనతో మాట్లాడారని వెల్లడించారు. అయితే ఈసారి మాత్రం తన నిర్ణయం తుది నిర్ణయమని స్పష్టం చేస్తూ బీజేపీ ప్రాథమిక సభ్యత్వంతో పాటు పార్టీ పదవులన్నింటికీ రాజీనామా చేసినట్టు తెలిపారు. నీట్ పేపర్ లీక్‌పై

ఇంటి అద్దెను యూపీఐ లేదా ఇతర ఆన్లైన్ మార్గాల్లో చెల్లించడం వల్ల సిబిల్ స్కోర్ దెబ్బతింటుందా? క్రెడిట్ కార్డుతో అద్దె చెల్లించి.. బిల్లును ఆలస్యంగా రీపేమెంట్ చేస్తే ఏమవుతుంది? సిబిల్ స్కోర్ దెబ్బతినకుండా ఉండాలంటే ఏం చేయాలి? పూర్తి వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.. ఇంటర్నెట్ డెస్క్: దేశవ్యాప్తంగా ఇప్పుడు డిజిటల్ యుగం నడుస్తోంది. అందరూ డిజిటల్ చెల్లింపులకే అలవాటు పడ్డారు. కారు దగ్గర నుంచి కాఫీ వరకు ఏది కొనాలన్న నగదు రహిత లావాదేవీలనే ఆశ్రయిస్తున్నారు. ఇంటి అద్దెను కూడా ఆన్లైన్లో చెల్లించడానికి ఇష్టపడుతున్నారు. అయితే ఇలాంటి చెల్లింపులు క్రెడిట్ స్కోర్‌పై ప్రభావం చూపుతాయని ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు. అయితే, ఆన్లైన్లో అద్దె చెల్లించినంత మాత్రాన క్రెడిట్ స్కోరుకు వాటిల్లే ముప్పేమీ లేదని, కానీ ఈ చెల్లింపులకు సంబంధించిన ఆర్థిక ప్రవర్తన స్కోరుపై ప్రభావం చూపుతుందని రెంటన్పే సీఈఓ సారిక శెట్టి తెలిపారు. ఒకవేళ అద్దెను క్రెడిట్‌పై తీసుకుని కడితే, దాన్ని సక్రమంగా తిరిగి చెల్లించాలని సూచించారు. ఈ ప్రక్రియలో ఆలస్యం జరిగితే క్రెడిట్ స్కోరుపై దెబ్బపడుతుందని చెప్పుకోచ్చారు. కొంతమంది నెలవారీ అద్దెను క్రెడిట్ కార్డు ద్వారా చెల్లిస్తుంటారు. ఇలా చెల్లించడం వల్ల అద్దె మొత్తం కార్డు బకాయిలో చేరుతుంది. ఆ మొత్తాన్ని గడువులోగా పూర్తిగా చెల్లించకుండా వాయిదా వేస్తే వడ్డీ, ఇతర ఛార్జీలు పెరగడంతో పాటు క్రెడిట్ వినియోగం కూడా పెరగవచ్చు. అధిక క్రెడిట్ వినియోగం, రీపేమెంట్లో ఆలస్యం లేదా మిస్డ్ పేమెంట్లు సిబిల్ స్కోర్(CIBIL)పై ప్రతికూల ప్రభావం చూపే అవకాశం ఉంది. క్రెడిట్ కార్డు బిల్లులో మినిమమ్ డ్యూ అమౌంట్ మాత్రమే చెల్లించడం వల్ల ఆ నెల చెల్లింపు పూర్తయినట్టుగా భావించకూడదు. మిగిలిన బకాయిపై వడ్డీ, ఇతర ఛార్జీలు వర్తించే అవకాశం ఉంటుంది. సిబిల్(CIBIL) కూడా సకాలంలో, పూర్తి చెల్లింపులపై దృష్టి పెట్టాలని సూచిస్తోంది. అందువల్ల అద్దె కోసం క్రెడిట్ కార్డును తరచూ ఉపయోగించే వారు ప్రతి నెలా వచ్చే

ఫ్లోటింగ్ వడ్డీ రేట్లతో గృహ, ఇతర రుణాలు తీసుకున్న వారికి 'రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా' (ఆర్బీఐ) కీలకమైన మార్పులను ప్రతిపాదించింది. వడ్డీ రేట్ల మార్పులను మరింత వేగంగా రుణగ్రహీతలకు వర్తింపజేసేందుకు కొత్త నిబంధనల ముసాయిదాను విడుదల చేసింది. అయితే, ఈ ప్రతిపాదనల వల్ల మీ నెలవారీ ఈఎంఐపై తక్షణమే ఎలాంటి ప్రభావం ఉండదని గమనించాలి. ప్రస్తుతం ఇది కేవలం ముసాయిదా దశలోనే ఉంది.ఈ ముసాయిదాపై అభిప్రాయాలు తెలిపేందుకు 2026 సెప్టెంబర్ 11 వరకు గడువు విధించారు. ఒకవేళ ఈ ప్రతిపాదనలకు ఆమోదం లభిస్తే, 2027 ఏప్రిల్ 1 నుంచి కొత్త నిబంధనలు అమల్లోకి వస్తాయి. దీనివల్ల వడ్డీ రేట్ల కోత లేదా పెంపు ప్రభావం రుణగ్రహీతలపై చాలా వేగంగా పడనుంది.ప్రతి 3 నెలలకు వడ్డీ రేట్ల సవరణప్రస్తుతం చాలా బ్యాంకులు, ఆర్థిక సంస్థలు ఫ్లోటింగ్ రేట్ రుణాలపై వడ్డీ రేట్లను సంవత్సరానికి ఒకసారి మాత్రమే సవరిస్తున్నాయి. దీనివల్ల ఆర్బీఐ రెపో రేటు తగ్గించినా, దాని ప్రయోజనం వినియోగదారులకు చేరడానికి కొన్ని నెలల సమయం పడుతోంది. ఈ జాప్యాన్ని నివారించేందుకు, ఆర్బీఐ కొత్త ప్రతిపాదనలు తీసుకొచ్చింది. దీని ప్రకారం.. ఫ్లోటింగ్ రేట్ రుణాలపై వడ్డీ రేట్లను గరిష్ఠంగా మూడు నెలలకు ఒకసారి తప్పనిసరిగా సవరించాల్సి ఉంటుంది. అంటే.. రెపో రేటు తగ్గితే ఆ ప్రయోజనం త్వరగా అందుతుంది, అదే సమయంలో రేటు పెరిగితే ఆ భారం కూడా అంతే వేగంగా పడుతుంది.ఛాయిస్ ఫిన్సర్వ్ ప్రైవేట్ లిమిటెడ్ సీఈఓ విజేంద్ర సింగ్ షెకావత్ మాట్లాడుతూ.. "తక్షణమే వడ్డీ రేటు

ఏపీ గ్రీనింగ్, రీఫారెస్టేషన్ కార్యక్రమాల నిర్వహణపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఏపీ గ్రీన్ ఎగ్జిక్యూటివ్ కమిటీ చైర్‌పర్సన్‌గా ఎమ్మెల్సీ కొణిదెల నాగేంద్రబాబును ప్రభుత్వం నియమించింది. ఈ మేరకు పర్యావరణ, అటవీ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. అమరావతి, ఆగస్టు 17 (ఆంధ్రజ్యోతి): ఏపీ గ్రీనింగ్, 'రీఫారెస్టేషన్' (పునరటవీకరణ) కార్యక్రమాల నిర్వహణపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం (Andhra Pradesh Government) కీలక నిర్ణయం తీసుకుంది. ఏపీ గ్రీన్ (AP-GREEN) ఎగ్జిక్యూటివ్ కమిటీ చైర్‌పర్సన్‌గా ఎమ్మెల్సీ కొణిదెల నాగేంద్రబాబును (నాగేంద్రరావు) ( MLC Konidela Nagendra Babu) ప్రభుత్వం నియమించింది. ఈ మేరకు పర్యావరణ, అటవీ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. జీవో ఆర్టీ నంబర్ -93 ద్వారా ఈ నియామక ఉత్తర్వులు జారీ చేసింది. ఏపీ గ్రీన్ ద్వారా రాష్ట్రవ్యాప్తంగా పచ్చదనం, అడవుల విస్తరణకు చర్యలు చేపడుతున్నట్లు ఏపీ ప్రభుత్వం తెలిపింది. జిల్లా స్థాయిలో డిస్ట్రిక్ట్ గ్రీన్ డెవలప్మెంట్ ఏజెన్సీల ద్వారా ఆయా కార్యక్రమాలను అమలు చేయనుంది. ఆంధ్రప్రదేశ్ భౌగోళిక విస్తీర్ణంలో ఫారెస్ట్, ట్రీ కవర్‌ను 2047 నాటికి 50 శాతానికి పెంచడమే లక్ష్యంగా ఏపీ సర్కార్ చర్యలు చేపడుతోంది. ఏపీ గ్రీన్ గవర్నింగ్ బోర్డు, ఎగ్జిక్యూటివ్ కమిటీ, జిల్లా గ్రీన్ డెవలప్మెంట్ ఏజెన్సీల పాలక మండళ్లను ఏర్పాటు చేసింది. రాష్ట్ర గ్రీన్ లక్ష్యాల అమలు, సమన్వయం, పర్యవేక్షణలో ఏపీ గ్రీన్ ఎగ్జిక్యూటివ్ కమిటీ చైర్పర్సన్ కీలక పాత్ర పోషించనున్నారు. ఈ ఎగ్జిక్యూటివ్ కమిటీ చైర్‌పర్సన్‌గా కొణిదెల నాగేంద్రబాబును నియమించిన ఏపీ సర్కార్.. ఆయనకు కేబినెట్ హోదా కల్పించింది. ఈ నిబంధనలకు లోబడి కేబినెట్ ర్యాంక్ హోదా కల్పిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఏపీ గ్రీన్, జిల్లా గ్రీన్ డెవలప్మెంట్ ఏజెన్సీల కార్యకలాపాల సమర్థవంతంగా అమలు చేయాలని ఈ ఎగ్జిక్యూటివ్ కమిటీ చైర్‌పర్సన్‌ను ఏపీ ప్రభుత్వం ఆదేశించింది. ఏనుగుల సంచారం.. ప్రజలను అప్రమత్తం చేయండి: పవన్ కల్యాణ్ నిర్మాత బండ్ల గణేష్ కుమార్తె
తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. పిఠాపురానికి చెందిన పంచాయతీ రాజ్ ఏఈ కుటుంబం గోదావరిలో దూకి ఆత్మహత్యా యత్నానికి పాల్పడింది. అయితే, ఈ ప్రమాదంలో కుటుంబంలోని నలుగురు గోదావరిలో దూకగా.. స్థానికంగా ఉండే మత్స్యకారులు ఒక్కర్ని మాత్రమే కాపడగా, మిగతా ముగ్గురు గల్లంతయ్యారు. గల్లంతైన వారి ఆచూకీ కోసం తీవ్రంగా గాలిస్తున్నారు. పిఠాపురానికి చెందిన పంచాయతీ రాజ్ ఏఈ నూకరాజు కుటుంబ సభ్యులు రాజమండ్రి రోడ్ కమ్ రైల్వే బ్రిడ్జిపై నుంచి గోదావరిలోకి దూకారు. నూకరాలు, ఆయన భార్య మీనా, కుమార్తె సౌజన్య, మనవడు కలిసి గోదావరిలో దూకినట్లు తెలుస్తోంది. అయితే, ఈ ఘటనలో 60 ఏళ్ల నూకరాజు, 58 సంవత్సరాల ఆయన భార్య మీనా, 34 సంవత్సరాల కుమార్తె సౌజన్య గోదావరిలో గల్లంతయ్యారు. నూకరాజు మనవడిని స్థానికంగా ఉండే మత్స్యకారులు గుర్తించి ప్రాణాలతో కాపాడారు.READ ALSO టాస్క్‌లు పూర్తి చేసి రోజుకు రూ.వేలల్లో సంపాదిస్తున్నారా? అయితే మీరు సైబర్ స్కామ్‌లో చిక్కుకున్నట్లే! బీ అలెర్ట్.. అస్సలు నమ్మొద్దురిటైర్మెంట్కు దగ్గరగా ఉన్న పంచాయతీ రాజ్ ఏఈ నూకరాజు 60 సంవత్సరాల వయస్సులో కుటుంబంతో సహా ఇలా చేయడం అందర్నీ ఆశ్చర్యానికి గురి చేసింది. అసలు ఈ ఘటన జరగడానికి కారణాలు ఏంటి అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ప్రస్తుతం గల్లంతయిన ఈ ముగ్గురి కోసం గోదావరిలో గాలింపు చర్యలు చేపట్టారు. పెళ్లికి వెళ్లొస్తూ నలుగురు ఇంజినీరింగ్ విద్యార్థులు..పెళ్లి వేడుకకు వెళ్లిన ఇంజినీరింగ్ విద్యార్థులు తిరుగు ప్రయాణంలో గోదావరిలో గల్లంతయ్యారు. ఆచంట మండలం వల్లూరుతోటకు చెందిన మట్టా సంతోష్, అంబేడ్కర్ కోనసీమ జిల్లా సఖినేటిపల్లి మండలం మోరి, మోరిపోడు, శృంగవరప్పాడుకు చెందిన పోతుల లక్ష్మీభాను వికాస్ (18), నాగిరెడ్డి దుస్వంత్ సాయి (18), నాగబత్తుల తేజసాయి సూర్య (19), చెరుకూరి రాజా రాంచరణ్ (16), వీరమల్లు సాయి వెంకట కిరణ్ (18), మట్టా సంతోష్ శనివారం రాత్రి పెరవలిలో జరిగిన స్నేహితుడి

తెలివి ఎంత ఉన్నా.. ఈ తప్పులు చేస్తే జీవితంలో కష్టాలు తప్పవుతెలివి ఎంత ఉన్నా.. ఈ తప్పులు చేస్తే జీవితంలో కష్టాలు తప్పవు Prasanna Yadla 16 August 2026 Pic credit - Pinterest చాణక్య నీతి గురించి నేటి యువతకి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. నైపుణ్యం కలిగిన ఒక గొప్ప వ్యక్తి . చాణక్య నీతి చిన్న పిల్లల నుంచి పెద్ద వాళ్ళ వరకు ఆయన చెప్పిన విషయాల గురించి తెలుసుకోవడానికి ఎంతో మంది ఆసక్తి చూపుతున్నారు. ఎంతో మంది ఆసక్తి మంచి చెడులను అర్థం చేసుకోలేని వాళ్ళకి సలహా ఇచ్చినా కూడా ఎలాంటి ప్రయోజనం ఉండదు. అర్థం చేసుకోలేని వాళ్ళకి ఇలాంటి వాళ్ళ మీ మాటలను అసలు పట్టించుకోకపోవచ్చు ఇదే మిమ్మల్ని మరి ఇబ్బంది పెడుతుంది అసలు పట్టించుకోకపోవచ్చు తప్పుగా అర్థం చేసుకున్న వాళ్ళకి కూడా ఏం చెప్పకండి. ఇంకా మీకు ఇబ్బందులు కూడా రావొచ్చు. మీకు ఇబ్బందులు కూడా మూర్ఖులకు సలహాలు ఇవ్వడం వలన సమయం వృథా అవుతుందని చాణక్యుడు చెబుతున్నాడు మూర్ఖులకు సలహాలు జీవిత భాగస్వామి చేసే తప్పు చేస్తే అది తన మీద కూడా పడుతుంది. జీవిత భాగస్వామి నోట్: ఇక్కడ అందించిన సమాచారం సాధారణ నమ్మకాల ఆధారంగా మాత్రమే అందించబడింది. ఈ సమాచారం ఖచ్చితంగా నిజం లేదా శాస్త్రీయంగా నిర్ధారితమైన సమాచారం అని భావించకండి. నోట్ మరిన్ని వెబ్ స్టోరీస్ జొన్న రొట్టెల్లోకి ఈ నువ్వుల చట్నీ చేస్తే గిన్నె ఖాళీ అవ్వడం పక్కా మిల్లెట్ రోటి.. హెల్త్‌కి సూపర్ ఫుడ్.. తింటే ఆ రోగాలన్ని మాయం హెల్తీ జొన్న లడ్డూలు.. ఇలా చేస్తే నోట్లో వేసుకుంటే కరిగిపోతాయి

తిరుమలలో రద్దీ కొనసాగుతోంది. వరుస సెలవుల వేళ భక్తుల సంఖ్య మరింతగా పెరిగింది. ఈ సమయంలోనే భక్తులు తిరుమల రద్దీని దృష్టిలో ఉంచుకుని తమ యాత్రను ముందుగా ప్రణాళిక చేసుకోవాలని టీటీడీ ఛైర్మన్ సూచించారు. కాగా.. తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్లే అలిపిరి నడకమార్గంలో ఓ వ్యక్తి పొగతాగడం తీవ్ర వివాదానికి దారితీసింది. ఈ వ్యవహారంలో టీటీడీ కఠిన చర్యలకు ఉపక్రమించింది. ఎవరైనా భక్తుల మనోభావాలను దెబ్బతీసే విధంగా వ్యవహరిస్తే చర్యలు తప్పవని హెచ్చరించింది.తిరుమలలో భక్తుల రద్దీ పెరుగుతోంది. రద్దీ వేళ భక్తులు టీటీడీ తీసుకుంటున్న నిర్ణయాలకు సహకరించాలని అధికారులు కోరుతున్నారు. కాగా.. తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్లే అలిపిరి నడకమార్గంలో ఓ వ్యక్తి పొగతాగడం తీవ్ర వివాదానికి దారితీసింది. భక్తుల మనోభావాలను దెబ్బతీసే ఈ చర్యను తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) తీవ్రంగా పరిగణించింది. నిబంధనలను ఉల్లంఘించిన సదరు వ్యక్తిపై పోలీసులకు ఫిర్యాదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకోనున్నట్లు స్పష్టం చేసింది. అదే సమయంలో, తనిఖీల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించిన సెక్యూరిటీ సిబ్బందిపై కూడా క్రమశిక్షణా చర్యలు చేపట్టనున్నట్లు ప్రకటించింది. నడక మార్గంలో ఒక వ్యక్తి ధూమపానం చేస్తున్న విషయాన్ని భక్తులు టీటీడీకి ఫిర్యాదు చేసారు. దీంతో, దీని పైన అధికారులు విచారణ చేసారు.తిరుమల భక్తులకు బిగ్ అలర్ట్ - దర్శనం టికెట్ల జారీలో కీలక మార్పులు, ఇక నుంచి..!!టీటీడీ కీలక సూచనలుతిరుమల క్షేత్ర పవిత్రతను కాపాడేందుకు ఇక్కడ మద్యపానం, ధూమపానం, మాంసాహారం, మత్తుపదార్థాల వినియోగంపై పూర్తి నిషేధం అమలులో ఉందని అధికారులు స్పష్టం చేసారు. ఈ నిబంధనలు అలిపిరి, శ్రీవారి మెట్టు మార్గాలతో పాటు టీటీడీ పరిధిలోని అన్ని ప్రాంతాలకు వర్తిస్తాయని తేల్చి చెప్పారు. ఈ విషయం తెలిసినప్పటికీ, సదరు వ్యక్తి నిబంధనలను అతిక్రమించి పవిత్రమైన నడకమార్గంలో ధూమపానం చేయడం పైన కఠిన చర్యలు ఉంటాయని టీటీడీ స్పష్టం చేసింది. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కఠినంగా వ్యవహరిస్తామని టీటీడీ హెచ్చరించింది

ప్రస్తుతం తమిళ స్టార్ హీరో, సీఎం విజయ్ తో త్రిష పేరు బాగా వినిపిస్తోంది. ఈ విషయంపై చాలా కథనాలు వైరల్ అవుతున్నాయి. కొందరు నేతలు, నటులు ఈ విషయాన్ని రాజకీయంగా వాడుకుంటున్నారు. కావాలనే త్రిష పేరును వివాదాల్లోకి లాగుతున్నారు. కానీ ఈ వ్యాఖ్యలపై త్రిష స్పందించకుండా, తనదైన శైలిలో కౌంటర్ ఇస్తూ తన సినీ ప్రయాణాన్ని కొనసాగిస్తున్నారు

విష్ణు ప్రియ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సీనియర్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. సినిమాల మీద ఆసక్తితో ఎక్కువగా వినోదం కేటగిరిలో వార్తలు రాస్తున్నారు. అదేవిధంగా హెల్త్, లైఫ్ స్టైల్, క్రైమ్ కేటగిరీలకు సంబంధించిన వార్తలు కూడా రాస్తూ ఉంటారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆమెకు జర్నలిజంలో పదేళ్లకు పైగా అనుభవం ఉంది. Samantha: తొలి బిడ్డకు స్వాగతం పలికేందుకు సిద్ధమవుతున్న సమంత ప్రస్తుతం తన ప్రెగ్నెన్సీ జర్నీని ఆస్వాదిస్తున్నారు. ఈ ప్రత్యేక సమయంలో తన రోజువారీ అనుభవాలు, సరదా సంఘటనలను ప్రెగ్నెన్సీ డైరీస్ పేరుతో సోషల్ మీడియాలో అభిమానులతో పంచుకుంటున్నారు. తాజాగా ఆమె ఎదుర్కొన్న ఓ చిన్న సమస్య నెటిజన్ల దృష్టిని ఆకర్షించింది. గర్భధారణ సమయంలో మహిళల శరీరంలో అనేక మార్పులు చోటుచేసుకుంటాయి. ముఖ్యంగా శరీర ఆకృతిలో మార్పుల కారణంగా గతంలో వేసుకున్న దుస్తులు సౌకర్యంగా ఉండకపోవచ్చు. సమంతకు కూడా ఇలాంటి అనుభవమే ఎదురైంది. వెకేషన్‌కు వెళ్లేందుకు సిద్ధమవుతున్న సమయంలో తన వార్డ్‌రోబ్‌లోని చాలా దుస్తులు ప్రస్తుతం తనకు సరిపోవడం లేదని ఆమె గుర్తించారు. ఈ విషయాన్ని సరదాగా తీసుకున్న సమంత.. అద్దం ముందు తీసుకున్న మిర్రర్ సెల్ఫీని సోషల్ మీడియాలో షేర్ చేశారు. తనకు ఇష్టమైన చాలా దుస్తులు ఇప్పుడు వేసుకోలేకపోవడంతో మొదట కాస్త బాధగా అనిపించిందని తెలిపారు. కొద్దిసేపు ఆందోళనకు గురైనప్పటికీ వెంటనే ఆ భావన నుంచి బయటపడి, ప్రస్తుతం సౌకర్యంగా ఉన్న రెండు జతల దుస్తులతోనే వెకేషన్‌ను ఎంజాయ్ చేయాలని నిర్ణయించుకున్నట్లు చెప్పారు. ప్రెగ్నెన్సీ సమయంలో ఎదురయ్యే ఇలాంటి చిన్న చిన్న మార్పులను కూడా సమంత అభిమానులతో ఓపెన్‌గా పంచుకుంటున్నారు. దీంతో ఆమె పోస్ట్‌కు నెటిజన్ల నుంచి స్పందన వస్తోంది. ముఖ్యంగా తల్లికాబోతున్న మహిళలు సమంత అనుభవాన్ని తమ అనుభవాలతో పోల్చుకుంటూ కామెంట్లు చేస్తున్నారు. తన మాతృత్వ ప్రయాణానికి మానసికంగా సిద్ధమవుతున్న సమంత.. ప్రసవం, మాతృత్వానికి సంబంధించిన విషయాలను తెలుసుకునేందుకు

Chevella: మున్సిపాలిటీలో స్వాతంత్య్ర వేడుకలు జెండా ఎగురవేసిన చైర్పర్సన్! Chevella: చేవెళ్ల మున్సిపల్ కార్యాలయంలో ఘనంగా 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు చేవెళ్ల మున్సిపల్ కార్యాలయంలో 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను మున్సిపల్ చైర్మన్ దేవర సమత వెంకట్ రెడ్డి ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా జాతీయ జెండాను ఆవిష్కరించి, దేశభక్తి, స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలను స్మరించుకుంటూ. మున్సిపల్ చైర్ పర్సన్ దేవర సమత వెంకట్ రెడ్డి మాట్లాడుతూ..మన దేశానికి స్వాతంత్ర్యం ఎంతోమంది మహనీయుల త్యాగాలు, పోరాటాల ఫలితం. వారి త్యాగాలను మనం ఎప్పటికీ మరువకూడదు. యువత దేశానికి వెన్నెముక. విద్యతో పాటు క్రమశిక్షణ, దేశభక్తి, సేవా భావాన్ని అలవర్చుకొని సమాజ అభివృద్ధిలో భాగస్వాములు రావాలని చేవెళ్ల పట్టణ అభివృద్ధికి ప్రతి ఒక్కరూ తమ వంతు సహకారం అందించాలని, మన పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుతూ, పర్యావరణాన్ని కాపాడుతూ, ప్రజా సమస్యల పరిష్కారానికి కలిసికట్టుగా ముందుకు సాగాలని యువత మంచి లక్ష్యాలను ఏర్పరచుకొని, నూతన ఆలోచనలతో దేశ ప్రగతికి బాటలు వేయాలి,స్వాతంత్ర్య సమరయోధులు కలలుగన్న బలమైన, అభివృద్ధి చెందిన భారతదేశాన్ని నిర్మించేందుకు మనందరం ఐక్యంగా కృషి చేద్దాం అని తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు, వైస్ చైర్మన్, కౌన్సిలర్లు, కో ఆప్షన్ మెంబర్స్, మాజీ సర్పంచులు, ఉప సర్పంచులు, నాయకులు,వార్డు సభ్యులు, మున్సిపల్ సిబ్బంది, గ్రామ ప్రజలు పాల్గొన్నారు

మనుషుల నుండి ప్రాణం ఉన్న ప్రతి జీవి ఆహారం తీసుకోవడం పరిపాటి. తీసుకునే ఆహారం నుండి లభించే శక్తితోనే శరీరం నిలబడుతుంది. ఇక అన్ని ప్రాణులలోకి మనిషి చాలా విభిన్నమైన వాడు. మనుషుల్లో ఒక్కొక్కరికి ఒక్కో విధమైన అలవాట్లు ఉంటాయి. అంతేకాదు.. ఆహారం తినే విధానంలో కూడా చాలా ప్రత్యేకత ఉంటుంది. కొందరు నిదానంగా తింటారు. మరికొందరు చాలా వేగంగా తింటారు. అయితే.. వేగంగా తినే వ్యక్తుల వ్యక్తిత్వం గురించి వ్యక్తిత్వ విశ్లేషణ నిపుణులు చాలా ఆసక్తికరమైన విషయాలు చెబుతున్నారు. వేగంగా ఆహారం తినే వ్యక్తుల వ్యక్తిత్వం ఎలా ఉంటుంది? దీని గురించి వివరంగా తెలుసుకుంటే.. వేగంగా తినడం... మన చుట్టూ చాలామంది ఉంటారు. కుటుంబ సభ్యులు అయినా, స్నేహితులు అయినా.. తెలిసిన వారు అయినా.. కలిసి భోజనం చేసేటప్పుడు లేదా ఏదైనా ఆహారం తినేటప్పుడు.. అందరూ కలిసి మొదలు పెడితే.. పక్క వాళ్లు ఇంకా సగం కూడా తినకుండానే మధ్యలోనే తమ ఆహారం పూర్తీ చేసే వారు కొందరు ఉంటారు. వారు చాలా బిజీ లైఫ్ స్టైల్ కు అలవాటు వడటం వల్ల అలా వేగంగా తినడం అలవాటు అయి ఉంటుందని అందరూ అనుకుంటారు. ఇది నిజమే అయినా ఇలా వేగంగా తినే వారి స్వభావం విభిన్నంగా ఉంటుందని వ్యక్తిత్వ విశ్లేషణ నిపుణులు చెబుతున్నారు. వేగంగా తినే వారిలో ఉండే వ్యక్తిత్వ లక్షణాలు.. వేగంగా తినే వ్యక్తులు ఎక్కువగా ఫినిష్ లైన్ ను చేరుకోవడంపై దృష్టి పెడతారు. అదే మనస్తత్వం జీవితంలోని ఇతర రంగాలలో కనిపిస్తుందట. వారు చేయవలసిన పనుల లిస్ట్ నుండి పనులను మార్క్ చేయడం, సమర్థవంతంగా పనిచేయడం , ఒక పనిలో ఆలస్యం కాకుండా ఆ తరువాత సవాలును స్వీకరించడం వంటివి వీరిలో ఉంటాయట. స్ట్రాంగ్ ప్రాక్టీస్ ఉన్నవారు తరచుగా భోజనంతో సహా రోజువారీ దినచర్యలో వేగాన్ని , సామర్థ్యాన్ని ఇష్టపడతారని మనస్తత్వవేత్తలు చెబుతున్నారు. తినడాన్ని ఆస్వాదించడం, అనుభూతి చెందడం

ఆగస్టు 13న అంతర్జాతీయ ఎడమచేతి వాటం వారి దినోత్సవాన్ని నిర్వహిస్తారు. ఈ సందర్భంగా ఎడమచేతితో పనులు చేసే వారి ప్రత్యేకతలు, అలవాట్లు, ఆసక్తికరమైన విషయాల గురించి తెలుసుకుందాం.. ఇంటర్నెట్ డెస్క్: ప్రతి ఏడాది ఆగస్టు 13న అంతర్జాతీయ ఎడమచేతి వాటం వారి దినోత్సవాన్ని నిర్వహిస్తారు. ఎడమ చేతితో రాయడం, తినడం, ఇతర పనులు చేయడం అలవాటుగా ఉన్నవారు ప్రపంచ జనాభాలో సుమారు 10 శాతం మంది ఉన్నట్లు అంచనాలు చెబుతున్నాయి. ఈ రోజును ఎడమచేతి వాటం వారు ఎదుర్కొనే ఇబ్బందులు, వారి ప్రత్యేకతలపై అవగాహన కల్పించేందుకు నిర్వహిస్తారు. ప్రపంచంలోని చాలా వస్తువులు, పనిముట్లు కుడిచేతి వాటం వారికి అనుకూలంగా రూపొందించబడి ఉంటాయి. దీంతో ఎడమచేతి వాటం వారు కొన్ని సందర్భాల్లో ఇబ్బందులు ఎదుర్కొంటారు. అయినప్పటికీ వారు తమకు అనుకూలమైన విధంగా వాటిని ఉపయోగిస్తూ పనులను పూర్తి చేస్తారు. లెఫ్ట్-హ్యాండర్స్ క్లబ్ వ్యవస్థాపకుడు డీన్ ఆర్. క్యాంప్‌బెల్ 1976లో ఈ దినోత్సవాన్ని ప్రారంభించారు. కొన్ని అధ్యయనాల ప్రకారం.. ఎడమచేతి వాటం వారి ఆలోచనా విధానం, సృజనాత్మకతలో కొన్ని ప్రత్యేకతలు కనిపిస్తాయి. అయితే ఎడమచేతి వాటం ఉన్న ప్రతి ఒక్కరూ ఎక్కువ తెలివితేటలు లేదా అధిక ఐక్యూ కలిగి ఉంటారని చెప్పడానికి తగిన ఆధారాలు లేవు. వారిలో సృజనాత్మకత, సమస్యలను విభిన్నంగా పరిష్కరించే సామర్థ్యం, పరిస్థితులకు అనుగుణంగా మారే లక్షణాలు కనిపించవచ్చని కొన్ని పరిశోధనలు సూచిస్తున్నాయి. క్రికెట్, టెన్నిస్, బాక్సింగ్ వంటి క్రీడల్లో ఎడమచేతి వాటం ఆటగాళ్లు ప్రత్యర్థులకు భిన్నమైన సవాలుగా నిలుస్తారు. రఫెల్ నాదల్, డియెగో మారడోనా, బ్రియాన్ లారా, పీలే వంటి ప్రముఖ క్రీడాకారులు ఎడమచేతి వాటం వారిగా గుర్తింపు పొందారు. మొత్తంగా చూస్తే, ఎడమచేతి వాటం అనేది లోపం కాదు.. ఒక సహజమైన భిన్నత్వం. తమకు అనుకూలంగా లేని పరిస్థితులను అధిగమిస్తూ ప్రత్యేక గుర్తింపు సాధిస్తున్న ఎడమచేతి వాటం వారిని గౌరవించడమే ఈ దినోత్సవం ముఖ్య ఉద్దేశం. Note: ఇందులోని సమాచారం ఇంటర్నెట్లో

మనం ప్రతిరోజూ మూడు పూటలా ఆహారం తింటాడు. ఒక్క పూట భోజనం ఆలస్యమైతేనే నీరసంగా అనిపిస్తుంది. కొందరు వ్యక్తులు ఉపవాసాలు ఉంటారు. అయితే ఎప్పుడైనా ఆలోచించారా? ఆహారం లభించని పరిస్థితులు వస్తే ఎన్ని రోజులు ఒక వ్యక్తి బతకగలడు? ఆ సమయంలో మానవ శరీరంలోని అవయవాలు శక్తిని ఎలా ఉత్పత్తి చేసుకుంటాయి? ఈ ప్రశ్నలకు వైద్యులు ఆసక్తికరమైన శాస్త్రీయ సమాధానాలను వెల్లడించారు. మానవ శరీరం ఒక అద్భుతమైన యంత్రంలా పనిచేస్తుంది. ఆహారం అందనప్పుడు అది ప్రత్యేక ఎమర్జెన్సీ మోడ్‌లోకి వెళ్లి శరీరానికి శక్తి ఇచ్చేందుకు ప్రయత్నిస్తుంది. ఆహారం అందడం ఆగిపోయిన మొదటి కొన్ని గంటల నుంచి కొద్ది రోజుల వరకు శరీరం శక్తిని పొందే ప్రక్రియ మొదలవుతుంది. సాధారణ రోజుల్లో మనం తినే ఆహారం ద్వారా లభించే 'గ్లూకోజ్' మనకు తక్షణ శక్తిని ఇస్తుంది. అయితే ఆహారం తీసుకోవడం ఆపేసిన మొదటి 12 నుంచి 24 గంటల్లో, కాలేయం, కండరాలలో ముందుగానే దాచిపెట్టిన 'గ్లైకోజెన్' నిల్వలను శరీరం విచ్ఛిన్నం చేయడం ప్రారంభిస్తుంది. ఈ గ్లైకోజెన్‌ను గ్లూకోజ్‌గా మార్చి మెదడుకు, ఇతర అవయవాలకు శక్తిని సరఫరా చేస్తుంది. కానీ, ఈ గ్లైకోజెన్ నిల్వలు కేవలం ఒక రోజు లేదా రెండు రోజులకు మాత్రమే సరిపోతాయి. రెండవ రోజు దాటిన తర్వాత శరీరంలో గ్లైకోజెన్ నిల్వలు ఖాళీ అయిపోతాయి. తరువాత శరీరం తన కణజాలాల్లోని కొవ్వు నిల్వలపై ఆధారపడుతుంది. ఈ దశను వైద్య పరిభాషలో 'కీటోసిస్' అంటారు. కాలేయం ఈ కొవ్వులను కరిగించి 'కీటోన్లు'గా మారుస్తుంది. ఈ కీటోన్లు రక్తం ద్వారా ప్రయాణించి మెదడుకు, గుండెకు గ్లూకోజ్‌కు ప్రత్యామ్నాయంగా శక్తిని అందిస్తాయి. శరీరంలో ఉన్న కొవ్వు నిల్వలను బట్టి ఒక మనిషి ఆహారం లేకుండా వారాల పాటూ జీవించగలడు. అయితే ఆహారం లేకుండా కొద్ది రోజులు బతగవచ్చు కానీ...'నీరు' లేకుండా మాత్రం 3 నుంచి 5 రోజుల కంటే ఎక్కువ కాలం బతకడం చాలా కష్టం

స్టార్ హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ తన వ్యక్తిగత జీవితంపై తొలిసారి బహిరంగంగా స్పందించారు. గత రెండేళ్లుగా తాను తీవ్ర మానసిక, భావోద్వేగ ఒత్తిడిని ఎదుర్కొన్నట్లు వెల్లడించారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె తన బ్రేకప్‌తో పాటు ఆ సమయంలో ఎదుర్కొన్న చేదు అనుభవాలను పంచుకున్నారు. మార్పును ముందే గమనించారు.. ‘ఆ ఇన్స్టాగ్రామ్ పోస్టు వెనుక ఎంతో బాధ ఉంది. గత రెండేళ్లుగా శారీరకంగా, మానసికంగా తీవ్రంగా కుంగిపోయాను. ఆ సమయంలో నార్సిసిస్టిక్ అబ్యూజ్‌ను ( ఒక వ్యక్తి తన భాగస్వామిని మానసికంగా భావోద్వేగపరంగా వేధించడం) ఎదుర్కొన్నాను’ అని అనుపమ తెలిపారు. నాలో వచ్చిన మార్పుని కుటుంబ సభ్యులు, స్నేహితులు ముందుగానే గుర్తించారు. బ్రేకప్ విషయం బయటకు తెలిసి నెల రోజులే అయినప్పటికీ, తనకు దగ్గరగా ఉన్నవారికి ఈ విషయం ముందే అర్థమైంది’ అని అన్నారు. ‘సోషల్‌మీడియాలో పసుపు రంగు డ్రస్‌లో ఉన్న ఫొటోను పోస్ట్ చేసి ‘అనుపమ ఆత్మహత్య చేసుకుంది’ అని రాసి ఉంటే నాకు మరింత ప్రేమ దక్కేదేమో’ అని భావోద్వేగంగా మాట్లాడారు. ఈ రిలేషన్షిప్ సరైనది కాదని, తాను అందరికీ దూరమవుతున్నానని వారంతా గమనించారని చెప్పారు. నిశ్చితార్థం కోసం.. రిలేషన్ ప్రారంభమైన కొద్ది రోజులకే తనను మాజీ ప్రియుడు తన కుటుంబ సభ్యులకు పరిచయం చేశాడని తెలిపారు. మూడు నెలల్లోనే నిశ్చితార్థం గురించి చర్చలు కూడా జరిగాయని చెప్పారు. అయితే, తనకు మరికొంత సమయం కావాలని చెప్పినట్లు వెల్లడించారు.‘నేను నిశ్చితార్థానికి అంగీకరించి ఉంటే ఆ వివాహం చివరకు విడాకుల వరకు వెళ్లేదేమో. ఆ నిర్ణయం తీసుకున్నది కూడా నేనే’ అని స్పష్టం చేశారు. నార్సిసిస్టిక్ అబ్యూజ్ గురించి మాట్లాడుతూ.. ‘చాలామంది నార్సిసిస్టిక్ వ్యక్తులు తమను తాము ఎక్కువగా ప్రేమిస్తారని అనుకుంటారు. కానీ వాస్తవానికి వారిపై వారికి నమ్మకం ఉండదు. వారి జీవితంలోకి ఎవరినీ రానివ్వాలనుకోరు. ఎప్పుడూ గుర్తింపు కోరుకుంటూ ఉంటారు’ అని వివరించారు. కెరీర్‌పై ప్రభావం.. తన వ్యక్తిగత జీవితం

రాజ్యసభ సభ్యులు చింతకాయల విజయ్ గొప్ప మనసును చాటుకుని అందరికీ ఆదర్శంగా నిలిచారు. అమరులైన ఆర్మీ జవాన్ల కుటుంబాలకు ఎంపీ అండగా నిలిచారు. న్యూఢిల్లీ, ఆగస్టు 13: రాజ్యసభ సభ్యులు చింతకాయల విజయ్ గొప్ప మనసును చాటుకుని అందరికీ ఆదర్శంగా నిలిచారు. అమరులైన ఆర్మీ జవాన్ల కుటుంబాలకు ఎంపీ అండగా నిలిచారు. ఎంపీగా తనకొచ్చిన మొదటి నెల జీతం మూడు లక్షల రూపాయలను దేశ రక్షణ కోసం ప్రాణాలర్పించిన అమరవీరులైన ఆర్మీ జవాన్ల కుటుంబాల సంక్షేమం కోసం విరాళంగా అందించారు. ఈ విరాళం చెక్కును భారత కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌కు విజయ్ స్వయంగా అందజేశారు. దేశం కోసం అహర్నిశలు శ్రమిస్తూ, ప్రాణత్యాగాలు చేసిన సైనికుల కుటుంబాలకు అండగా నిలవడం ప్రతి ఒక్కరి బాధ్యత అని.. అందులో భాగంగానే ఈ చిరు సాయం చేసినట్లు విజయ్ స్పష్టం చేశారు. పదవి చేపట్టిన వెంటనే తొలి వేతనాన్ని సైనికుల కుటుంబాల కోసం వెచ్చించడం పట్ల విజయ్ను పలువురు ప్రశంసిస్తున్నారు. కారులో 25.970 కేజీల గంజాయి తరలింపు.. ఇద్దరి అరెస్ట్ విజయవాడలో వెయ్యి మంది విద్యార్థులతో తిరంగా ర్యాలీ
Jammu Kashmir Revised Ex-Gratia Norms : ఉగ్రవాద వ్యతిరేక పోరులో భాగంగా పోరాడుతూ.. దేశం కోసం తమ ప్రాణాలను సైతం తృణప్రాయంగా వదులుకున్న భద్రతా బలగాల సిబ్బంది కుటుంబాలకు బిగ్ రిలీఫ్ కల్పించింది జమ్మూ కాశ్మీర్ ప్రభుత్వం. వీరికి మాత్రమే కాకుండా ఉగ్ర ఘటనల వల్ల ప్రభావితమైన సామాన్య పౌరులకు మరింత అండగా నిలిచేందుకు కూడా సిద్ధమైంది. ముఖ్యంగా భద్రతా సంబంధిత వ్యయం కింద అందించే ఎక్స్‌గ్రేషియా, నష్టపరిహార నిబంధనలను సమూలంగా సవరిస్తూ రాష్ట్ర ప్రభుత్వం నూతన మార్గదర్శకాలను అధికారికంగా నోటిఫై చేసింది. దీని ప్రకారం.. వీరమరణం పొందిన డిఫెన్స్, పారామిలటరీ జవాన్లకు రూ.25 లక్షలు, అమరులుగా మారిన పోలీసులకు రూ.12 లక్షల నష్టపరిహారాన్ని అందించనున్నారు. ఆ పూర్తి వివరాలు మీకోసం.సైనికులు, పారామిలటరీ బలగాలకు రూ.25 లక్షలుసరిహద్దుల్లో లేదా ఉగ్రవాద నిర్మూలన ఆపరేషన్లలో అసువులు బాసిన జవాన్ల కుటుంబాలకు అందించే నష్టపరిహారం విషయంలో ప్రభుత్వం కీలక సవరణలు చేసింది. జమ్మూ కాశ్మీర్ స్థానికులైన డిఫెన్స్ లేదా సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్స్ (సీఏపీఎఫ్) సిబ్బంది ఉగ్రవాద సంబంధిత ఘటనల్లో వీరమరణం పొందితే.. ఆ ఘటన రాష్ట్రం లోపల జరిగినా లేదా వెలుపల జరిగినా.. వారి కుటుంబాలకు రూ.25 లక్షల ఆర్థిక సాయం అందించనున్నారు. ఒకవేళ స్థానికేతరులైన జవాన్లు జమ్మూ కాశ్మీర్ భౌగోళిక సరిహద్దుల్లో జరిగిన ఉగ్ర ఘటనల్లో ప్రాణాలు కోల్పోతే వారి కుటుంబాలకు రూ.5 లక్షల పరిహారం అందుతుంది.పోలీసు అమరవీరులకు ఆర్థిక భరోసారాష్ట్ర పోలీసు శాఖలో పనిచేస్తూ.. సిబ్బంది వీరమరణం పొందితే వారి కుటుంబాలకు మొత్తం రూ.12 లక్షలు ఎక్స్‌గ్రేషియాగా చెల్లిస్తారు. ఇందులో రూ.7 లక్షలు పోలీసు వెల్ఫేర్ ఫండ్ నుంచి మంజూరు చేయగా.. మిగతా రూ.5 లక్షలను జమ్మూ కాశ్మీర్ రాష్ట్ర ప్రభుత్వ బడ్జెట్ నుంచి అందజేస్తారు. అలాగే యాక్షన్‌లో ప్రాణాలు కోల్పోయే ప్రత్యేక పోలీసు అధికారులకు అందించే నష్టపరిహారాన్ని రూ.5 లక్షలుగా నిర్ణయించారు. ఉగ్ర దాడుల్లో తీవ్ర గాయాలపాలై శాశ్వత

బాలీవుడ్ నటి, శ్రీదేవి తనయ జాన్వీ కపూర్ తన పేరు, ఇమేజ్, వ్యక్తిగత గుర్తింపును ఆన్లైన్లో దుర్వినియోగం చేయకుండా రక్షణ కల్పించాలని కోరుతూ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. బాలీవుడ్ నటి, శ్రీదేవి తనయ జాన్వీ కపూర్ (Janhvi Kapoor) తన పేరు, ఇమేజ్, వ్యక్తిగత గుర్తింపును ఆన్లైన్లో దుర్వినియోగం చేయకుండా రక్షణ కల్పించాలని కోరుతూ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. తన గుర్తింపును ఉపయోగిస్తూ సృష్టించిన అశ్లీల కంటెంట్, ఏఐ ద్వారా రూపొందించిన ఫోటోలు, వీడియోలు, నకిలీ ఖాతాలు, ఇంకా అనుమతి లేని ఇతర వినియోగాలపై నిషేధం విధించాలని ఆమె తన పిటిషన్లో పేర్కన్నారు. అయితే ఈ కేసు విచారణ సందర్భంగా ఢిల్లీ హైకోర్టు (Delhi High Court) జాన్వీ కపూర్ కోరిన ఈ ఆంక్షలపై, ముఖ్యంగా ఫ్యాన్ పేజీలకు సంబంధించి పలు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసింది. ఈ కేసు విచారణ సమయంలో జస్టిస్ అనూప్ జైరామ్ భంబానీ (Justice Anup Jairam Bhambhani) స్పందిస్తూ... “మీకు అభిమానులు వద్దు అనుకుంటున్నారా? అలా అయితే మీరు ఇక ఇంటికే పరిమితం అవ్వాల్సి వస్తుంది” అంటూ వ్యాఖ్యానించారు. ఫ్యాన్ పేజీలను కేవలం అక్రమమైనవిగా లేదా చట్టవిరుద్ధమైనవిగా పరిగణించలేమని న్యాయస్థానం స్పష్టం చేసింది. అభిమానులు నటీనటుల పనిని అభినందించడానికి, వారి చిత్రాలను పంచుకోవడానికి, చివరికి వారిని విమర్శించడానికి కూడా ఫ్యాన్ పేజీలను నిర్వహిస్తుంటారని పేర్కొంది. అయితే, జాన్వీ కపూర్ ఇమేజ్ను దుర్వినియోగం చేస్తూ తయారు చేసిన అశ్లీల కంటెంట్‌పై మాత్రం కఠిన చర్యలు తీసుకుంటామని కోర్టు తెలిపింది. జాన్వీ కపూర్ వేసిన ఈ పిటిషన్లో దాదాపు 5,000 కంటే ఎక్కువ వెబ్ పేజీలు, సోషల్ మీడియా పోస్ట్‌లకు సంబంధించిన వివరాలను పొందుపరిచారు. వీటిలో ఏఐ-జెనరేటెడ్ అశ్లీల కంటెంట్, నకిలీ ప్రొఫైళ్లు ప్రధానంగా ఉన్నాయి. సెలబ్రిటీల పర్సనాలిటీ రైట్స్ పేరుతో సాధారణ ఫ్యాన్ యాక్టివిటీని, ప్రజల భావప్రకటనా స్వేచ్ఛను పూర్తిగా నియంత్రించలేమని ఈ విచారణ ద్వారా కోర్టు స్పష్టమైన సందేశాన్ని

బాలీవుడ్ నటి జాన్వీ కపూర్ వ్యక్తిగత హక్కుల పరిరక్షణ కోరుతూ దాఖలు చేసిన పిటిషన్‌పై ఢిల్లీ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. సోషల్ మీడియాలో తన పేరు, ఫోటోలు, వీడియోలను దుర్వినియోగం చేస్తూ రూపొందిస్తున్న అశ్లీల కంటెంట్, డీప్‌ఫేక్ వీడియోలను వెంటనే తొలగించాలని న్యాయస్థానం స్పష్టం చేసింది. తన పర్సనాలిటీ రైట్స్ కాపాడాలని కోరుతూ ఆమె న్యాయస్థానాన్ని ఆశ్రయించగా, ఈ మేరకు న్యాయమూర్తి అనూప్ జైరాం భంభానీ ఉత్తర్వులు జారీ చేశారు. ప్రస్తుతం సెలబ్రిటీల పట్ల సోషల్ మీడియాలో జరుగుతున్న దుష్ప్రచారంపై ఈ తీర్పు ప్రాధాన్యత సంతరించుకుంది. గతంలోనూ పలువురు క్రీడాకారులు, రాజకీయ నాయకులు తమ వ్యక్తిగత హక్కుల కోసం ఇదే తరహాలో ఢిల్లీ హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. జాన్వీ కపూర్ తరపున వాదించిన న్యాయవాదులు, ఆమె ప్రతిష్టను దిగజార్చేలా జరుగుతున్న ఈ అక్రమ కార్యకలాపాలపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. దీంతో మెటా సంస్థ న్యాయస్థానానికి వివరణ ఇస్తూ, ఇప్పటికే పిటిషనర్ 4,000కు పైగా యూఆర్ఎల్స్ను సమర్పించారని వెల్లడించింది. అయితే, అందులో ఉన్న ప్రతి కంటెంట్ అభ్యంతరకరంగా లేదని మెటా తరపు లాయర్లు కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ఇదిలా ఉండగా, పిటిషన్లలో పేర్కొన్న కంటెంట్‌ను స్పష్టంగా వర్గీకరించి సమర్పించాలని కోర్టు పిటిషనర్ వైపు ఉన్న వారికి సూచించింది. మరోవైపు ఫ్యాన్ పేజీల విషయంలో కోర్టు ఒక సమతుల్య వైఖరిని ప్రదర్శించింది. ప్రతి ఫ్యాన్ పేజీని క్రిమినల్‌గా పరిగణించలేమని, కొన్ని పోస్ట్‌లు వ్యంగ్యంగా లేదా విమర్శనాత్మకంగా ఉండే అవకాశం ఉందని న్యాయమూర్తి అభిప్రాయపడ్డారు. ఫలితంగా అన్ని ఫ్యాన్ పేజీలపై ఒకేసారి నిషేధం విధించడం సాధ్యం కాదని కోర్టు స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో, కేవలం ఆర్థిక ప్రయోజనాల కోసం లేదా వాణిజ్యపరంగా ఆమె పేరును వాడుకునే పేజీలపై మాత్రమే కఠిన చర్యలు ఉంటాయని కోర్టు తేల్చి చెప్పింది. ముగింపుగా, అశ్లీల కంటెంట్‌ను తొలగించేలా కోర్టు ఇచ్చిన ఆదేశాలు జాన్వీ కపూర్‌కు భారీ

నేను సాఫ్ట్వేర్ ఉద్యోగిని. బ్యాంకులు, ఎన్‌బీఎఫ్‌సిల నుంచి దాదాపు 80 లక్షల వ్యక్తిగత, పూచీకత్తులేని రుణాలు తీసుకుని, గత మూడు సంవత్సరాల్లో స్టాక్ మార్కెట్, చిన్న స్టార్టప్ కంపెనీలో పెట్టుబడులు పెట్టి నష్టపోయాను. ప్రస్తుతం నా నెలవారీ ఈఎంఐలు నా జీతం కంటే రెండింతలు ఎక్కువగా ఉన్నాయి. నాకు ఎలాంటి ఆస్తులు లేవు. కుటుంబ సభ్యులు, స్నేహితుల నుంచి కూడా ఆర్థిక సహాయం పొందే పరిస్థితి లేదు. వచ్చే నెల నుంచి ఈఎంఐలు కట్టే పరిస్థితి కూడా లేదు కాబట్టి బ్యాంకు వారు వేధిస్తారని అనుకుంటున్నాను. భవిష్యత్తులో ఇలాంటి చట్టపరమైన ఇబ్బందులు తగ్గించుకోవడానికి ఇప్పుడు నేను తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటో తెలుపగలరు? – నరేష్, హైదరాబాదు రుణం చెల్లించలేకపోవడం వల్ల సాధారణంగా సివిల్ రికవరీ ప్రక్రియ ప్రారంభమవుతుంది. మీరు లోను కట్టని పక్షంలో రుణదాత/బ్యాంకు ముందుగా డిమాండ్ నోటీసు పంపవచ్చు. అలాంటి నోటీసు వచ్చినప్పుడు, మీ నిజమైన ఆర్థిక పరిస్థితిని వివరించి, చెల్లింపు కోసం సహేతుకమైన గడువు లేదా రాజీ కోరుతూ సమాధానం ఇవ్వండి. నిజానికి అంతవరకూ వేచి చూడకుండా మీరే ముందుగా బ్యాంకు వారితో, ఎన్బీఎఫ్సిలతో పారదర్శకంగా వ్యవహరించడం మంచిది. సమస్యను దాచిపెట్టకుండా, మీ ఆర్థిక పరిస్థితిని లిఖితపూర్వకంగా తెలియజేయడం ఉత్తమ మార్గం. మీ ఆదాయం, నెలవారీ ఖర్చులు, స్టాక్ ట్రేడింగ్‌లో జరిగిన నష్టాలను వివరించి, ఈఎంఐల పునర్వ్యవస్థీకరణ, వాయిదాల పునర్నిర్ణయం లేదా ఒకేసారి రాజీ వంటి అవకాశాలను పరిశీలించాలని అభ్యర్థించండి. బ్యాంకులు ప్రతి కేసును దాని పరిస్థితుల ఆధారంగా పరిశీలిస్తాయి. మీకు కావాల్సిన విధంగా ఇవ్వాలి అనే రూల్ లేదు. రుణం చెల్లించలేకపోవడం వల్ల సాధారణంగా సివిల్ రికవరీ ప్రక్రియ ప్రారంభమవుతుంది. అదలా ఉంటే, బ్యాంకువారు వసూళ్లకు ఇబ్బంది పెడతారు అని మీరు భయపడాల్సిన అవసరం లేదు. ఆర్బీఐ జారీ చేసిన ఫెయిర్ ప్రాక్టీసెస్ కోడ్, రికవరీ ఏజెంట్ల ప్రవర్తనా మార్గదర్శకాల ప్రకారం, రుణగ్రహీతను బెదిరించడం, అవమానించడం, బలవంతంగా వసూలు చేయడం

Khajapur: ఖాజాపూర్‌లో చిన్నారులకు పరిశుభ్రత, పోషకాహార అవగాహన ఖాజాపూర్: సాలుర మండలం ఖాజా పూర్ అంగన్వాడీ కేంద్రంలో బి.ఎస్సీ అగ్రికల్చర్ జగిత్యాల విద్యార్థుల ఆధ్వర్యంలో పరిశుభ్రత, పోషకాహార అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్బంగా చిన్నారులకుపరిసరాలపరిశుభ్రత పై అవగాహన కల్పించారు. భోజనానికి ముందు చేతులు సబ్బుతో కడుక్కోవడం, గోళ్లు శుభ్రంగా ఉంచుకోవడం, రోజూ స్నానం చేయడం, జుట్టు సరిగా దువ్వుకోవడం వంటి వ్యక్తిగత పరిశుభ్రత అలవాట్ల ప్రాముఖ్యతను వివరించారు. పిల్లల ఆరోగ్యకర ఎదుగుదలకు సమతుల్య ఆహారం, పండ్లు, కూరగాయలు, ఆకుకూరలు, పప్పులు, పాలు ప్రాముఖ్యతను తెలియజేశారు.ప్రదర్శన ద్వారా అవగాహన కల్పించారు.బి.ఎస్సీ అగ్రికల్చర్ జగిత్యాల విద్యార్థులు, అంగన్వాడీ టీచర్, తల్లిదండ్రులు, చిన్నారులు, గ్రామస్థులు పాల్గొన్నారు

మహిళలు ధరించే దుస్తులు వారి వ్యక్తిగత స్వేచ్ఛకు సంబంధించిన అంశమని, వాటిని సాకుగా చూపి లైంగిక వేధింపులకు పాల్పడటాన్ని ఏమాత్రం సహించలేమని ఢిల్లీ హైకోర్టు సోమవారం కీలక తీర్పు వెలువరించింది. ఒక యువతిని లైంగికంగా వేధించిన కేసులో ట్రయల్ కోర్టు ఇచ్చిన తీర్పును కొట్టివేస్తూ, నిందితుడిని దోషిగా నిర్ధారించింది.సాజిద్ అలీ అనే వ్యక్తి ఒక యువతిని కొంతకాలంగా వెంబడించడం, అసభ్యకరంగా మాట్లాడటంతో పాటు ఆమెను భౌతికంగా తాకుతూ వేధింపులకు పాల్పడ్డాడు. ఈ కేసును విచారించిన ట్రయల్ కోర్టు నిందితుడిని నిర్దోషిగా విడుదల చేసింది. అయితే, ఆ తీర్పును సవాలు చేస్తూ బాధితురాలు హైకోర్టును ఆశ్రయించింది.ఈ అప్పీల్‌పై విచారణ చేపట్టిన జస్టిస్ చంద్రశేఖరన్ సుధ నేతృత్వంలోని ఏకసభ్య ధర్మాసనం, నిందితుడిని దోషిగా ఖరారు చేసింది. బాధితురాలు జీన్స్ ధరించడంపై నిందితుడి తరఫు న్యాయవాది అడిగిన ప్రశ్నలను విచారణ సందర్భంగా కోర్టు తీవ్రంగా తప్పుపట్టింది. "ఒక మహిళ ఎలాంటి దుస్తులు ధరించాలనేది పూర్తిగా ఆమె వ్యక్తిగత స్వేచ్ఛకు సంబంధించిన విషయం. సమాజం, ఇరుగుపొరుగు వారు, నిందితుడు లేదా కోర్టులోని న్యాయవాది కూడా ఆమె దుస్తుల గురించి నిర్దేశించే హక్కు లేదు. అది వారి పరిధిలోని అంశం కాదు" అని జస్టిస్ సుధ ఘాటుగా వ్యాఖ్యానించారు.బాధితురాలిని మానసికంగా కృంగదీయడానికి, నైతికంగా కించపరచడానికే దుస్తుల గురించి అసంబద్ధమైన ప్రశ్నలు వేశారని కోర్టు అభిప్రాయపడింది. స్థానిక సంప్రదాయాలు లేదా మతం పేరుతో మహిళల వ్యక్తిగత స్వేచ్ఛపై ఆంక్షలు విధించడాన్ని అంగీకరించబోమని స్పష్టం చేసింది. ఈ తీర్పు ప్రతులను ఢిల్లీలోని అన్ని జిల్లా కోర్టులకు, జ్యుడీషియల్
Elon Musk: ప్రపంచ కుబేరుడు, టెస్లా, స్పేస్ ఎక్స్ అధినేత ఎలాన్ మస్క్ ఆస్తుల విలువలో హెచ్చుతగ్గులు మరోసారి వార్తల్లో నిలిచాయి. ఈ ఏడాది 2026, జూన్ నెలలో స్పేస్ ఎక్స్ స్టాక్ మార్కెట్లోకి ఎంట్రీ ఇచ్చిన సమయంలోప్రపంచంలోనే తొలి ట్రిలియనీర్ (Trillionaire) గా అవతరించి రికార్డ్ సృష్టించిన మస్క్, ఆ తర్వాతి కాలంలో షేర్ల విలువ పడిపోయి ఆ హోదాను కోల్పోయారు. అయినప్పటికీ గడిచిన ఏడాది కాలంలో భారీగా సంపద పెంచుకున్నారు. గత ఏడాది 2025 జులై నుంచి ప్రతి రోజూ సగటున దాదాపు రూ.8300 కోట్ల చొప్పున సంపాదిస్తూనే ఉన్నారు.2025 జులై నుంచి 2026 జులై మధ్య కాలంలో ఎలాన్ మస్క్ సంపద 320 బిలియన్ డాలర్లుఅంటే భారత కరెన్సీలో దాదాపు రూ.30 లక్షల కోట్లు పెరిగింది. 2026, జూన్ 12వ తేదీన స్పేస్ ఎక్స్ మార్కెట్లోకి అడుగు పెట్టిన సమయంలో మస్క్ ప్రపంచానికి తొలి ట్రిలియనీర్ (లక్ష కోట్ల డాలర్లు) అంటే భారత కరెన్సీలో దాదాపురూ.95 లక్షల కోట్లకు పైగా సంపద కలిగి ఉన్నారు. అయితే, గత నెలలో స్పేస్ ఎక్స్ షేర్లు భారీగా పడిపోవడంతో ఆ స్థానాన్ని కోల్పోయారు. అయినా ప్రపంచ కుబేరుల్లో కొనసాగుతున్నారు.గత ఏడాది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI), టెక్నాలజీలో వేగవంతమైన వృద్ధి కనిపించింది. ఈ కారణంగా ఎలాన్ మస్క్ సహా మైఖేల్ డేల్, లారీ పేజ్, సెర్గీ బ్రిన్ గియాన్ కార్లో వంటి పారిశ్రామికవేత్తల సంపద ఊహించని విధంగా పెరిగింది. మస్క్ తర్వాత భారీగా సంపద పెరిగిన వారిలో డెల్ టెక్నాలజీస్ వ్యవస్థాపకుడు, సీఈఓ మైఖేల్ డెల్ ఉన్నారు. 2025 జులై నుంచి 2026 జులై మధ్య ఆయన సంపద 107.6 బిలియన్ డాలర్లు పెరిగింది. ఇక డీప్ సీక్ వ్యవస్థాపకుడు లియాంగ్ వెన్ఫెంగ్ సంపద 39.5 బిలియన్ డాలర్ల మేర పెరిగింది. దాంతో టాప్ 50 అత్యంత ధనవంతుల్లో ఒకరిగా నిలిచారు.మస్క్ ప్రస్తుత ఆస్తి

గ్రామీణ పేదలకు కొండంత అండగా ఉండే ఉపాధి హామీ పథకంలో తీసుకొచ్చిన కొత్త మార్పులు క్షేత్రస్థాయిలో తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. దశాబ్దాలుగా అమలులో ఉన్న పాత పథకం స్థానంలో ప్రభుత్వం ఇటీవలే కొత్త పేరు, కొత్త నిబంధనలతో వికసిత్ భారత్ - జీ రామ్ జీ పథకాన్ని పట్టాలెక్కించింది. అయితే ఇది అమల్లోకి వచ్చిన మొదటి నెలలోనే ఉపాధి కూలీలకు గట్టి షాక్ తగిలింది. పల్లెల్లో ఉపాధి అవకాశాలు ఏకంగా సగానికి సగం తగ్గిపోయినట్లు అధికారిక లెక్కలే స్పష్టం చేస్తున్నాయి.గత జులై 1వ తేదీ నుంచి కేంద్ర ప్రభుత్వం ఈ నూతన ఉపాధి పథకాన్ని అమల్లోకి తెచ్చింది. జులై నెల గణాంకాలను పరిశీలిస్తే, కూలీలకు కల్పించిన పని దినాల్లో ఏకంగా 49.94 శాతానికి పైగా కోత పడింది. గతేడాది జులైలో పాత పథకం కింద 15.33 కోట్ల పని దినాలు నమోదు కాగా, ఈ జులైలో కొత్త పథకం కింద అవి కేవలం 7.67 కోట్లకు మాత్రమే పరిమితమయ్యాయి. చివరికి ఐదేళ్ల సగటుతో పోల్చి చూసినా ఇవి అత్యంత కనిష్ట స్థాయికి చేరుకోవడం గమనార్హం.లక్షలాది కుటుంబాలకు దూరమైన పనిపని దినాలే కాకుండా, పథకం ద్వారా లబ్ధి పొందిన గ్రామీణ కుటుంబాల సంఖ్య కూడా గణనీయంగా పడిపోయింది. గతేడాది జులైలో దాదాపు 1.42 కోట్ల కుటుంబాలు ఉపాధి పనులు పొందగా, ఈసారి ఆ సంఖ్య కేవలం 68.94 లక్షలకు పడిపోయింది. అంటే ఏకంగా 51 శాతానికి పైగా పేద కుటుంబాలకు పని దొరకలేదని స్పష్టమవుతోంది. ఇది గత నాలుగేళ్ల సగటు పని పొందిన కుటుంబాల సంఖ్యలో 40 శాతం కంటే తక్కువ కావడం గమనార్హం.Video: ఉపాధి హామీ కూలీల మైండ్ బ్లోయింగ్ డాన్స్. ఆనందం అంటే ఇదే! వర్షాభావ వేళ రెట్టింపైన గ్రామీణ కష్టాలుఒకవైపు దేశవ్యాప్తంగా వర్షాలు సరిగ్గా పడక వ్యవసాయ పనులు మందగించాయి. దాదాపు సగానికి పైగా జిల్లాల్లో వర్షాభావ పరిస్థితులు నెలకొనడంతో ఖరీఫ్

ప్రపంచంలోనే అత్యంత సంపన్న వ్యక్తిగా కొనసాగుతున్న ఎలాన్ మస్క్ సంపద గత ఏడాది కాలంలో అసాధారణంగా పెరిగింది. 2025 జులై నుంచి 2026 జులై మధ్య ఆయన సంపద ఏకంగా 319.5 బిలియన్ డాలర్లు పెరిగిందని ఒక నివేదిక వెల్లడించింది. ఇంటర్నెట్ డెస్క్: ప్రపంచంలోనే అత్యంత సంపన్న వ్యక్తిగా కొనసాగుతున్న ఎలాన్ మస్క్ సంపద గత ఏడాది కాలంలో అసాధారణంగా పెరిగింది. 2025 జులై నుంచి 2026 జులై మధ్య ఆయన సంపద ఏకంగా 319.5 బిలియన్ డాలర్లు పెరిగిందని ఒక నివేదిక వెల్లడించింది. అంటే సగటున రోజుకు సుమారు 875 మిలియన్ డాలర్ల (దాదాపు రూ.8300 కోట్లు) చొప్పున సంపద పెరిగినట్టు గణాంకాలు వెల్లడిస్తున్నాయి (Elon Musk net worth). ఎలాన్ మస్క్ సంపద ప్రధానంగా టెస్లా, స్పేస్ఎక్స్ వంటి సంస్థల్లో ఆయనకు ఉన్న వాటాల విలువతో ముడిపడి ఉంటుంది. గతేడాది కాలంలో ఈ కంపెనీల మార్కెట్ విలువల్లో భారీ పెరుగుదల చోటుచేసుకోవడంతో మస్క్ నికర సంపద కూడా వేగంగా పెరిగింది. ముఖ్యంగా స్పేస్ఎక్స్ ఐపీవో మస్క్ సంపదను సరికొత్త స్థాయికి తీసుకెళ్లింది (Elon Musk $875 million per day). స్పేస్ ఎక్స్ ఓపీవోకు అంచనాలకు మించిన డిమాండ్ రావడంతో మస్క్ సంపద ట్రిలియన్ డాలర్లను దాటింది (Elon Musk fortune). అయితే ఆ తర్వాత ఆ షేర్లపై అమ్మకాల ఒత్తిడి కారణంగా మస్క్ సంపద కూడా భారీగా తగ్గింది. మస్క్ తర్వాత, డెల్ టెక్నాలజీస్ వ్యవస్థాపకుడు, సీఈఓ మైఖేల్ డెల్ అతి ఎక్కువ సంపదను పోగేసిన వ్యక్తిగా నిలిచారు. 2025 జులై నుంచి 2026 జులై మధ్య డెల్ తన సంపదకు 107.6 బిలియన్ డాలర్లను జోడించారు. తమిళ్ తాయ్ వాజ్తుతోనే ప్రారంభం.. తమిళనాడు అసెంబ్లీలో ఏకగ్రీవ తీర్మానం.. సీటు బెల్ట్ పెట్టుకోని చిన్నారి.. సర్వీస్‌ను రద్దు చేసిన విమానయాన సంస్థ

క్రమం తప్పకుండా పొదుపు చేయడం, పెట్టుబడులు పెట్టడం మంచి అలవాటే. కానీ, ఎంత క్రమశిక్షణతో ఉన్నప్పటికీ కొన్ని సాధారణ పొరపాట్ల వల్ల ఆర్థిక ప్రగతికి ఆటంకం కలుగుతుంది. పొదుపు, పెట్టుబడుల విషయంలో మంచి అవగాహన ఉన్నవారు సైతం కొన్నిసార్లు తెలియకుండానే తప్పులు చేస్తుంటారు. అలాంటి కొన్ని కీలకమైన పొరపాట్ల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.వీటిలో మొదటిది, అత్యంత ముఖ్యమైనది 'అత్యవసర నిధి' (ఎమర్జెన్సీ ఫండ్) లేకపోవడం. అనుకోని వైద్య ఖర్చులు, ఉద్యోగం కోల్పోవడం లేదా వాహనం, ఇంటి మరమ్మతులు వంటివి ఎదురైనప్పుడు చేతిలో సిద్ధంగా డబ్బు లేకపోతే ఇబ్బందులు తప్పవు. అలాంటి పరిస్థితుల్లో పెట్టిన పెట్టుబడులను నష్టానికి అమ్ముకోవడమో లేదా అధిక వడ్డీకి అప్పులు చేయడమో చేయాల్సి వస్తుంది. ఇది ఆర్థిక ప్రణాళికను దెబ్బతీస్తుంది.రెండో సాధారణ పొరపాటు, పెట్టుబడుల పోర్ట్‌ఫోలియోను క్రమం తప్పకుండా సమీక్షించకపోవడం. ఒకసారి పెట్టుబడులు పెట్టి వదిలేస్తే సరిపోదు. మార్కెట్ పరిస్థితులు, మన ఆర్థిక లక్ష్యాలు, రిస్క్ తీసుకునే సామర్థ్యం కాలానుగుణంగా మారుతుంటాయి. అందుకే, కనీసం సంవత్సరానికి ఒకసారైనా పోర్ట్‌ఫోలియోను సమీక్షించి, అవసరమైన మార్పులు చేసుకోవాలి. లేదంటే పెట్టిన పెట్టుబడి లక్ష్యం నెరవేరకపోవచ్చు.ఆదాయం పెరిగినప్పుడు పొదుపు కూడా పెంచాలి. కానీ చాలామంది ఆదాయంతో పాటు ఖర్చులు కూడా పెంచేస్తుంటారు. దీనిని ‘లైఫ్‌స్టైల్ క్రీప్’ అంటారు. అవసరం లేకపోయినా ఖరీదైన వస్తువులు కొనడం, విలాసాలకు ఎక్కువ ఖర్చు చేయడం వల్ల పొదుపు తగ్గిపోయి, సంపద వృద్ధి మందగిస్తుంది. అలాగే, మార్కెట్ హెచ్చుతగ్గులను అంచనా వేసి, తరచూ షేర్లను అమ్మడం, కొనడం (మార్కెట్ టైమింగ్) కూడా నష్టదాయకమే. దీనివల్ల లావాదేవీల

భారత అమ్ములపొదిలోని బ్రహ్మోస్ సూపర్ సోనిక్ క్రూయిజ్ క్షిపణికి అంతర్జాతీయంగా గిరాకీ అమాంతం పెరిగింది. ముఖ్యంగా, 'ఆపరేషన్ సిందూర్' సమయంలో ఈ క్షిపణి చూపిన అద్భుతమైన పనితీరు, దాని కచ్చితత్వం, విధ్వంసక శక్తి ప్రపంచ దేశాల దృష్టిని ఆకర్షించాయి. ఈ ఆపరేషన్ తర్వాత బ్రహ్మోస్ కొనుగోలుకు పలు దేశాలు తీవ్ర ఆసక్తి చూపుతుండగా, ఇప్పటికే కొన్ని దేశాలతో భారీ ఒప్పందాలు కూడా ఖరారయ్యాయి. ‘ది వీక్’ పత్రిక ప్రచురించిన ఒక నివేదిక ప్రకారం, ఈ క్షిపణి కొనుగోలుకు చర్చలు వేగవంతమయ్యాయి.2022 జనవరిలో ఫిలిప్పీన్స్‌తో 375 మిలియన్ డాలర్ల ఒప్పందం కుదుర్చుకున్న భారత్, ఆపరేషన్ సిందూర్ తర్వాత మరిన్ని విజయాలు సాధించింది. వియత్నాం సుమారు 629 మిలియన్ డాలర్ల ఒప్పందాన్ని ఖరారు చేయగా, ఇండోనేషియా కూడా 200 నుంచి 300 మిలియన్ డాలర్ల మధ్య విలువైన ఒప్పందాన్ని ఖరారు చేసుకుంది. యూరప్, పశ్చిమాసియా, లాటిన్ అమెరికా, ఆఫ్రికాకు చెందిన డజనుకు పైగా దేశాలు కూడా బ్రహ్మోస్ కొనుగోలుపై ఆసక్తి వ్యక్తం చేస్తున్నాయి.ఆపరేషన్ సిందూర్‌తో పెరిగిన ప్రతిష్ఠపహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా పాక్ ఆక్రమిత కశ్మీర్ (పీవోకే), పాకిస్థాన్‌లోని కీలక ఉగ్ర స్థావరాలపై భారత సైన్యం 'ఆపరేషన్ సిందూర్' నిర్వహించింది. ఈ ఆపరేషన్‌లో భాగంగా, భారత వాయుసేన విమానాలు అంతర్జాతీయ సరిహద్దు దాటకుండానే సుమారు 15 బ్రహ్మోస్ క్షిపణులను పాక్ సైనిక స్థావరాలపై ప్రయోగించాయి. ఈ దాడుల కచ్చితత్వం, తీవ్రత పాకిస్థాన్‌ను తీవ్రంగా దెబ్బతీశాయి. ముఖ్యంగా, పాకిస్థాన్ మోహరించిన చైనా నిర్మిత ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలను బ్రహ్మోస్ విజయవంతంగా ఛేదించడం ఒక