
8 Years In Jail Sentenced To Sukesh Chandrashekhar Who Posed As A Supreme Court Judge For Bail
Sukesh Chandrashekhar Sentenced 8 Years : సాధారణంగా బెయిల్ పొందడానికి ఏవేవో కారణాలు చెబుతుంటారు. ఎలాగోలా బయటకు వచ్చేందుకు సాధ్యమైనన్ని పనులు చేస్తుంటారు చాలా మంది. కానీ మనం ఇప్పుడు చూడబోయే ఓ వ్యక్తి మాత్రం బెయిల్ కోసం..
Sukesh Chandrashekhar Sentenced 8 Years : సాధారణంగా బెయిల్ పొందడానికి ఏవేవో కారణాలు చెబుతుంటారు. ఎలాగోలా బయటకు వచ్చేందుకు సాధ్యమైనన్ని పనులు చేస్తుంటారు చాలా మంది. కానీ మనం ఇప్పుడు చూడబోయే ఓ వ్యక్తి మాత్రం బెయిల్ కోసం.. ఏకంగా సుప్రీంకోర్టు న్యాయమూర్తి అవతారమెత్తాడు. అంతేనా ఓ ప్రత్యేక జడ్జీని బెదిరించి ఘోర మోసానికి పాల్పడ్డాడు. అయితే ఈ కేసులో నిందితుడైన సుకేష్ చంద్రశేఖర్‌కు ఢిల్లీ కోర్టు గట్టి షాక్ ఇచ్చింది. ఈ తీవ్ర నేరానికి గాను అతనికి ఎనిమిది ఏళ్ల కఠిన కారాగార శిక్ష విధిస్తూ ఢిల్లీ చీఫ్ జుడీషియల్ మెజిస్ట్రేట్ హర్షితా మిశ్రా సంచలన తీర్పును ఇచ్చారు. నిందితుడు చేసిన తప్పు.. న్యాయవ్యవస్థ స్వతంత్రతను, విచారణ ప్రక్రియను దెబ్బతీసే కుట్రగా అభివర్ణించారు.పోలీస్ కస్టడీలోనే ప్లాన్.. కానిస్టేబుల్ ఫోన్‌తో డ్రామాఅవినీతి కేసులో పోలీస్ కస్టడీలో ఉన్న సుకేష్ చంద్రశేఖర్ 2017 ఏప్రిల్ 28వ తేదీన.. కానిస్టేబుల్ మంజీత్ వద్ద ఉన్న మొబైల్ ఫోన్‌ను దక్కించుకున్నాడు. దాని ద్వారా అప్పట్లో అవినీతి నిరోధక చట్టం కేసులను విచారిస్తున్న స్పెషల్ జడ్జ్ పూనం చౌదరి ల్యాండ్‌లైన్, మొబైల్ నంబర్లకు ఫోన్ చేశాడు. మొదట సుప్రీంకోర్టు జడ్జి వద్ద పనిచేసే ప్రైవేట్ కార్యదర్శినని పరిచయం చేసుకుని, ఆ తర్వాత స్వయంగా సుప్రీం కోర్టు న్యాయమూర్తినేనని బురిడీ కొట్టించాడు. తన కేసులో వెంటనే బెయిల్ మంజూరు చేయాలని, లేకపోతే ఉద్యోగ పరంగా తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని జడ్జీని బెదిరింపులకు గురిచేశాడు.ఇదీ చూడండి: జడ్జిపై తెలుగు లాయర్ అనుచిత వ్యాఖ్యలు.. తీవ్రంగా స్పందించిన సీజేఐవిడివిడిగా శిక్షలు.. ఒకదాని తర్వాత ఒకటి అమలు!కానీ జడ్జీ మాత్రం ఈ పని చేసింది ఎవరో తెలుసుకున్నారు. ముఖ్యంగా అది కానిస్టేబుల్ నెంబర్ అని తెలుసుకుని.. నిందితుడిపై మరికొన్ని కేసులు నమోదు చేశారు. ఆపై విచారణ జరిపి.. సుకేష్ చంద్రశేఖరే నిందితుడిని గుర్తించారు. ముఖ్యంగా ఆగస్టు 20వ తేదీన సుకేష్‌ను ఐపీసీ సెక్షన్లు 170 (ప్రభుత్వ ఉద్యోగిలా నటించడం), 189 (ప్రభుత్వ ఉద్యోగిని బెదిరించడం), 507 (ఆకాశరామన్న సమాచారంతో బెదిరింపులు) కింద దోషిగా నిర్ధారించింది. ఐపీసీ 170 కింద రెండేళ్లు, 189 కింద రెండేళ్లు, 507 కింద నాలుగు ఏళ్ల జైలు శిక్షను ఖరారు చేశారు. ఈ శిక్షలన్నీ ఏకకాలంలో కాకుండా.. ఒకదాని తర్వాత ఒకటి అమలయ్యేలా ఆదేశించారు. దీంతో సుకేష్ మొత్తం 8 ఏళ్ల జైలు శిక్ష అనుభవించాల్సి ఉంటుంది.న్యాయవ్యవస్థపై దాడి.. డీప్‌ఫేక్స్ యుగంలో హెచ్చరికనేరానికి పాల్పడిన విధానం చట్టపాలనపై నేరుగా జరిపిన దాడి అని కోర్టు స్పష్టం చేసింది. ప్రస్తుత కృత్రిమ మేధ (ఏఐ), డీప్‌ఫేక్ సాంకేతిక పరిజ్ఞానం పెరుగుతున్న కాలంలో ఈ రకమైన నేరాలు న్యాయ వ్యవస్థకు సవాలుగా మారుతున్నాయని జడ్జి హెచ్చరించారు. సుకేష్ విచారణ ముగిసే సమయంలో కోర్టుపైనే నిందలు వేస్తూ విచారణను ఆలస్యం చేసేందుకు యత్నించాడని, తన చర్యల పట్ల ఎలాంటి పశ్చాత్తాపం చూపలేదని న్యాయస్థానం ఆగ్రహం వ్యక్తం చేసింది.





