
Metro Rail Network | మెట్రో రైల్ నెట్‌వర్క్‌లో అమెరికాను దాటేయబోతున్న భారత్..!
Metro Rail Network | మెట్రో రైల్ నెట్‌వర్క్‌లో అమెరికాను దాటేయబోతున్న భారత్..!
© 2026 nimisham.in

Metro Rail Network | మెట్రో రైల్ నెట్‌వర్క్‌లో అమెరికాను దాటేయబోతున్న భారత్..!

Hyderabad Metro | హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. మెట్రో-ఆర్టీసీ ఉమ్మడి పాస్ త్వరలోనే!

వేగంగా ఓల్డ్‌సిటీ మెట్రో కారిడార్ పనులు మొత్తం 888 ఆస్తుల్లో ఇప్పటి వరకు 833 సేకరణ ఈ నెలాఖరులోగా పూర్తి చేసేందుకు చర్యలు మరోవైపు ముమ్మరంగా కూల్చివేతలు హైదరాబాద్ సిటీ: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న మెట్రో రెండో దశ విస్తరణలోని ఓల్డ్‌సిటీ కారిడార్ పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. నిర్మాణంలో భాగంగా కావాల్సిన భూసేకరణ ప్రక్రియ చివరి దశకు చేరింది. మరో 55 ప్రభావిత ఆస్తులను తీసుకుంటే కారిడార్ నిర్మాణానికి అడుగులు పడినట్లవుతుందని హైదరాబాద్ మెట్రో రైల్ లిమిటెడ్ (హెచ్ఎంఆర్ఎల్) అధికారులు చెబుతున్నారు. నగరంలో రెండో దశ మెట్రో విస్తరణలో భాగంగా కారిడార్-6 కింద ఎంజీబీఎస్ - చాంద్రాయణగుట్ట వరకు (7.5 కిలోమీటర్లు) నిర్మాణాన్ని చేపడుతున్న విషయం తెలిసిందే. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు జాయింట్ వెంచర్ (జేవీ) ప్రాతిపదికన రూ.2,741 కోట్లతో నిర్మాణాన్ని పూర్తి చేయనున్నాయి. అయితే నాగోల్ - శంషాబాద్ ఎయిర్‌పోర్టు (36.8 కిలోమీటర్ల) మార్గం తర్వాత పాతనగరం కారిడార్‌పైనే రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. ‘ఇది ఓల్డ్‌సిటీ కాదు.. ఒరిజినల్ సిటీ’ అని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పలు సభల్లో చెబుతూ వస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం రెండో దశ ప్రాజెక్టుకు సంబంధించిన డిటైల్ ప్రాజెక్టు రిపోర్టు (డీపీఆర్)కు అనుమతి ఇచ్చిన వెంటనే ఈ మార్గంలోని పనులను ప్రారంభించేందుకు ఎదురుచూస్తోంది. ఇదిలా ఉండగా, ఫలక్‌నుమా ఆర్టీసీ ప్రాంగణంలో 2024 మార్చి 8న శంకుస్థాపన చేశారు. పరిహారం.. వెంటనే తొలగింపు ఇప్పటివరకు సేకరించిన ఆస్తుల్లో 60 శాతం కమర్షియల్ భవనాలు, 40 శాతం నివాస గృహాలున్నాయి. అయితే సేకరించిన ఆస్తులకు సంబంధించిన యజమానులకు పరిహారం అందిస్తున్న అధికారులు వెంటవెంటనే తొలగింపు పనులు చేపడుతున్నారు. ఆయా దారుల్లో వాహనదారుల రాకపోకలకు ఇబ్బందులు కలుగకుండా చూస్తూ పొక్లెయినర్లతో తొలగిస్తూ శిథిలాలను దూర ప్రాంతాలకు తరలిస్తున్నారు. మరోవైపు విద్యుత్ స్తంభాలు, వాటర్పైపులకు ప్రమాదం వాటిల్లకుండా ముందు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. కాగా, తొలగింపు పనులను వివిధ శాఖల అధికారులు దగ్గరుండి

పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్ స్టైల్ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. Woman Seen How to kill Men book video viral: ఇటీవల కొంతమంది మహిళలు సమాజంలో నైతిక విలువలకు తూట్లు పొడుస్తున్నారు. చక్కగా పెళ్లిళ్లు చేసుకొని కాపురాలు చేయాల్సింది పోయి తమ చేజేతులా కాపురంలో నిప్పులు పోసుకుంటున్నారు. ఈ క్రమంలో ప్రస్తుతం చాలా మంది తాము కట్టుకున్న వాళ్లను వివిధ కారణాలతో కాటికి పంపుతున్నారు. కొంత మంది తమ భార్యల్ని చంపితే, మరికొంత మంది తమ భర్తల్ని చంపుతున్నారు. కానీ ఇటీవల కొంతమంది మహిళలు చాలా వైలెంట్ గా తయారయ్యారు. భర్తల్ని లేదా మగాళ్లను కాటికి పంపడమే టార్గెట్ గా పెట్టుకున్నట్లు ఉన్నారు. ఎక్కడ చూసిన వివాహేతర సంబంధాలు, ఆర్థికపరమైన సమస్యలు మొదలైన అంశాలతో వివాదాలు పెద్దది చేసుకునిమరీ తమ కాపురాల్లో నిప్పులు పోసుకుంటున్నారు. దీంతో చాలా మంది మగాళ్లు అసలు పెళ్లిళ్లు అంటేనే భయంతో జడుసుకుంటున్నారు. ఈ మధ్య పెళ్లిల్లంటేనే అమ్మాయిలు, అబ్బాయిలు చాలా టెన్షన్ కు గురౌతున్నారు. ఈ క్రమంలో ముంబైలోని మెట్రోలో ఒక జరిగిన ఒక షాకింగ్ ఘటనకు చెందిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. దీనిపై నెట్టింట దుమారం రాజుకుంది. ముంబాయిలోని ఒక మెట్రోలో యువతి జనాల మధ్య కూర్చుని ఏంచక్కా how to kill men అని రాసి ఉన్న పుస్తకంను చదువుతుంది. నార్మల్ గా జర్నీల్లో ఎవరైన బుక్ లు చదవడం మనం చూస్తుంటాం. కొంత మంది కామెడీ బుక్ లు, నవలలు చదువుంటారు. ఇదంతా మనం రోటీన్ గా చూస్తుంటాం. కానీ అసలే ప్రతిరోజు ఎక్కడో ఒక చోట ఆడవాళ్ల చేతుల్లో

తెలంగాణ ఆర్టీసీ ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు కల్పించడంపై ప్రధానంగా ఫోకస్ చేస్తుంది. ఇదే సమయంలో ఆదాయాన్ని పెంచుకునే అన్ని అవకాశాలను పరిశీలిస్తోంది. టికెట్ రహిత ఆదాయాన్ని పెంచుకునేందుకు తెలంగాణా ఆర్టీసీ మెట్రో రైలు తరహాలో కీలక నిర్ణయాన్ని తీసుకుంది. ఎలక్ట్రిక్ బస్సుల్లో డిజిటల్ స్క్రీన్స్ ను ఏర్పాటు చేస్తోంది. రూట్‌వేవ్ సంస్థతో ఒప్పందం కుదుర్చుకుని హయత్‌నగర్-2 డిపోకు చెందిన పది ఎలక్ట్రిక్ బస్సుల్లో పైలట్ ప్రాజెక్టును ప్రారంభించింది.డిజిటల్ స్క్రీన్స్ పై ఆర్టీసీ బస్సుల్లో వాణిజ్య ప్రకటనల ద్వారా ఆదాయానికి ప్లాన్ ఈ డిజిటల్ స్క్రీన్లపై వాణిజ్య ప్రకటనలతో పాటు రాబోయే బస్ స్టాప్ల వివరాలు, ఆర్టీసీ సేవలు, ప్రభుత్వ సంక్షేమ పథకాల సమాచారం ప్రదర్శించనున్నారు. ఈ డిజిటల్ స్క్రీన్స్ ఆర్టీసీ బస్సుల్లో వాణిజ్య ప్రకటనల ద్వారా ఆదాయాన్ని పెంపొందించుకునేలా ఏర్పాటు చేస్తున్నారు. అంతేకాదు మెట్రో రైలు తరహాలోనే ముందుగా స్టేజీల పేర్లు చూపించడం వల్ల నగరానికి కొత్తగా వచ్చినవారు, మార్గాలు తెలియని ప్రయాణికులు సులభంగా గమ్యస్థానం వద్ద దిగగలుగుతారు.ఒక ఆలోచనతో మూడు ప్రయోజనాలు అంతేకాదు ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రచారం చేయటం ద్వారా ప్రజలకు ప్రభుత్వం ఏం చేస్తుందో చెప్పే అవకాశం కలుగుతుంది. ఈ మూడు ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని ఆర్టీసీ ఈ నిర్ణయం తీసుకుంది. ముందు పైలట్ ప్రాజెక్టు కోసం హయత్‌నగర్-పటాన్చెరు రద్దీ మార్గాన్ని ఎంపిక చేశారు. పది బస్సుల్లో ఇప్పటికే స్క్రీన్లు అమర్చారు.హయత్ నగర్ పటాన్ చెరు రూట్ లో పైలట్ ప్రాజెక్ట్ ప్రయాణికుల స్పందన, ప్రకటనల ద్వారా వచ్చే ఆదాయం, సాంకేతిక పనితీరును పరిశీలించిన తర్వాత నగరంలోని ఇతర డిపోల ఎలక్ట్రిక్ బస్సులకు కూడా ఈ వ్యవస్థను విస్తరించే అవకాశం ఉంది. గతంలో డిజిటల్ స్క్రీన్లు ప్రధానంగా వినోదం, ప్రకటనలకే పరిమితమయ్యేవి. ఇప్పుడు ఇన్ఫోటైన్మెంట్ సదుపాయాలు జోడించి ప్రయాణికులకు ఉపయోగపడే సమాచార వేదికగా మారుస్తున్నారు.ఏపీలో పట్టణ ప్రాంతాలలో ఇల్లులేని వారికి తీపికబురు.. ఇక మొదలెట్టండి!పైలట్ ప్రాజెక్ట్ సక్సెస్ అయితే అన్ని

రేణుక గొడుగు జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా 2024 నుంచి పనిచేస్తున్నారు. హెల్త్, లైఫ్‌స్టైల్, ఆస్ట్రోలజీ, బ్రేకింగ్, వైరల్ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన 6 ఏళ్ల అనుభవం ఉంది. New ATM Rules 2026: ఏటీఎం కార్డు వినియోగదారుల విషయానికి వస్తే, ఆర్బీఐ ఆమోదంతో వినియోగదారులపై అదనపు చార్జీల భారం పడనుంది. గతంతో పోలిస్తే ఇప్పుడు ఏటీఎం ఇంటర్‌ఛేంజ్ ఛార్జీలు పెరిగే అవకాశం ఉన్నందున, వినియోగదారుల ఇబ్బందులు మరింత పెరగవచ్చు. ఉదాహరణకు, మీరు మీ సొంత బ్యాంకు ఏటీఎం కాకుండా ఇతర బ్యాంకులకు చెందిన ఏటీఎం యంత్రాల వద్ద బ్యాలెన్స్ చెక్ చేయాలన్నా లేదా నగదు విత్ డ్రా చేయాలన్నా, వారు అధిక చార్జీలను వసూలు చేస్తారు. వైట్ లేబుల్ ఏటీఎం ఆపరేటర్లు కూడా ఆర్బీఐ ఆమోదంతో ఈ అదనపు భారాన్ని వినియోగదారులపై విధించనున్నారు. మీరు ఏటీఎం కార్డును తరచూ ఎక్కువగా ఉపయోగిస్తుంటే, కచ్చితంగా అదనపు ఖర్చులు ఎదుర్కోవాల్సి వస్తుంది. గతంలో ఈ ఛార్జీలను రూ.17 నుండి రూ.19 వరకు పెంచారు. కేవలం బ్యాలెన్స్ ఎంక్వైరీ చేసినా కూడా రూ.7 వరకు వసూలు చేసే అవకాశం ఉంది. గతంలో నెలకు ఒకసారిగా లావాదేవీల ఆధారంగా ఈ చార్జీలను వసూలు చేసేవారు. సాధారణంగా మెట్రో నగరాల్లో నివసించే కస్టమర్లకు ఐదు ఉచిత లావాదేవీలు లభిస్తే, నాన్-మెట్రో లేదా గ్రామీణ ప్రాంతాల్లో నివసించే వారికి మూడు ఉచిత లావాదేవీలు మాత్రమే చేసుకునే అవకాశం ఉంది. ఎంపీసీఐ (MPCI) ఆమోదం, ప్రస్తుత పరిస్థితి.. ప్రస్తుతం ఈ అదనపు చార్జీల విషయంలో ఆర్బీఐ ఆమోదం తెలిపింది. ఈ అంశం ప్రస్తుతం ఎంపీసీ ముందుకు వెళ్ళింది. ఏటీఎం ఆపరేటర్లు తమ నిర్వహణ ఖర్చులు పెరగడం వల్ల, పాత ధరల పద్ధతిని కాకుండా కొత్తగా ధరలను పెంచాలని డిమాండ్ చేస్తున్నారు. అయితే, ఇప్పటివరకు ఆర్బీఐ మాత్రం ఎలాంటి అధికారిక

హైదరాబాద్ రియల్ ఎస్టేట్ రంగం తన జోరును కొనసాగిస్తోంది. ఒకవైపు ప్రభుత్వం నిర్వహిస్తున్న ప్రీమియం ప్లాట్ల వేలాలు, మరోవైపు కీలక మౌలిక సదుపాయాల ప్రాజెక్టులు ఈ రంగానికి కొత్త ఊపునిస్తున్నాయి. తాజాగా హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ (హెచ్ఎండీఏ) మోకిలలో నిర్వహించిన ప్లాట్ల ఈ-వేలం విజయవంతం కావడం మార్కెట్లోని సానుకూల ధోరణికి అద్దం పడుతోంది.మోకిల ఫేజ్-3లో భాగంగా 100 నివాస ప్లాట్లకు హెచ్ఎండీఏ నిర్వహించిన ఈ-వేలానికి అద్భుతమైన స్పందన లభించింది. ఈ వేలం ద్వారా ప్రభుత్వానికి ₹231.65 కోట్ల భారీ ఆదాయం సమకూరింది. గజానికి కనీస ధర ₹50,000గా నిర్ణయించగా, గరిష్ఠంగా ఒక ప్లాటు గజానికి ₹1,09,500 పలికింది. సగటున గజం ధర ₹75,640గా నమోదైంది. బంజారాహిల్స్ వంటి అత్యంత ఖరీదైన ప్రాంతాల్లోనూ ప్లాట్ల వేలానికి హెచ్ఎండీఏ నోటిఫికేషన్ జారీ చేయడం, పెట్టుబడిదారుల్లో ఉన్న బలమైన విశ్వాసాన్ని సూచిస్తోంది.మెట్రో విస్తరణపై కీలక అడుగులుఒకవైపు ప్రభుత్వం ప్రీమియం భూముల అమ్మకాల ద్వారా నిధులు సమీకరిస్తుండగా, మరోవైపు నగరంలో మౌలిక సదుపాయాల కల్పనపై ప్రత్యేక దృష్టి సారిస్తోంది. ఇందులో భాగంగా హైదరాబాద్ మెట్రో రైల్ ఫేజ్-1 టేకోవర్, ఫేజ్-2 విస్తరణపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా కీలక నిర్ణయం తీసుకున్నాయి. దీనిపై సమగ్ర అధ్యయనం చేసేందుకు ఎస్బీఐ క్యాపిటల్ మార్కెట్స్ (ఎస్బీఐ క్యాప్స్)ను కన్సల్టెంట్‌గా నియమించాయి. "ఎస్బీఐ క్యాప్స్ సంస్థ మెట్రో రైల్ ఫేజ్-1 వాల్యుయేషన్, ఫేజ్-2 విస్తరణ, ఇతర సంబంధిత అంశాలపై సమగ్ర అధ్యయనం చేస్తుంది. ఆ నివేదిక ఆధారంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తదుపరి చర్యలు తీసుకుంటాయి,"

దేశంలోని ఏడు ప్రధాన నగరాల్లో గృహ విక్రయాలు మందగించాయి. 2026 ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో అమ్మకాలు వార్షిక ప్రాతిపదికన 6 శాతం తగ్గినట్లు ప్రముఖ రియల్ ఎస్టేట్ కన్సల్టెన్సీ సంస్థ అనరాక్ రీసెర్చ్ తన నివేదికలో వెల్లడించింది. అయితే, ఇదే సమయంలో కొత్త ఇళ్ల సరఫరా మాత్రం పెరగడం గమనార్హం. ముఖ్యంగా హైదరాబాద్, ముంబై నగరాల్లో కొత్త ప్రాజెక్టులు భారీగా ప్రారంభమయ్యాయి.వివరాల్లోకి వెళ్తే, ఈ ఏడాది ఏప్రిల్-జూన్ మధ్య కాలంలో దేశంలోని ఏడు ప్రధాన నగరాల్లో కలిపి సుమారు 90,715 నివాస గృహాలు అమ్ముడయ్యాయి. గతేడాది ఇదే సమయంలో ఈ సంఖ్య 96,285గా ఉంది. మరోవైపు, కొత్త ఇళ్ల సరఫరా వార్షికంగా 7 శాతం పెరిగింది. కొత్త ప్రాజెక్టుల విషయంలో ముంబై మెట్రోపాలిటన్ రీజియన్ (MMR), హైదరాబాద్ ముందున్నాయి. హైదరాబాద్‌లో కొత్త సరఫరా ఏకంగా 53 శాతం పెరిగి రికార్డు సృష్టించింది. ఇక్కడ దాదాపు 16,970 కొత్త యూనిట్లు అందుబాటులోకి వచ్చాయి. MMRలో 34,555 యూనిట్లతో 23 శాతం వృద్ధి నమోదైంది.సరఫరా పెరిగినప్పటికీ అమ్మకాలు మాత్రం ఆశించిన స్థాయిలో లేవు. అత్యధికంగా 28,710 యూనిట్లు అమ్ముడైన MMRలో సైతం గతేడాదితో పోలిస్తే 8 శాతం క్షీణత కనిపించింది. హైదరాబాద్‌లో అమ్మకాలు కేవలం 2 శాతం మాత్రమే పెరిగాయి. అయితే, బెంగళూరు మాత్రం ఈ ట్రెండ్‌కు భిన్నంగా నిలిచింది. అక్కడ అమ్మకాలు ఒక శాతం పెరిగి 15,285 యూనిట్లుగా నమోదయ్యాయి. కోల్‌కతాలోనూ 10 శాతం వృద్ధి కనిపించింది. మరోవైపు, పూణెలో అమ్మకాలు అత్యధికంగా 15 శాతం పడిపోయాయి.పశ్చిమాసియాలో కొనసాగుతున్న సంక్షోభం

భూగర్భంలోంచి హకీంపేట మెట్రో మార్గం మదీనాగూడలో డబుల్ డెక్కర్ ఫ్లైఓవర్ రూ.38,595 కోట్లతో మెట్రో విస్తరణ Metro Phase 2: హైదరాబాద్ నగరం నలుమూలలకూ ప్రజా రవాణాను మెరుగుపరిచేందుకు సిద్ధమవుతున్న మెట్రో రైలు రెండో దశ ప్రాజెక్టు పలు ఇంజనీరింగ్ అద్భుతాలకు, సవాళ్లకు వేదిక కానుంది. మొత్తం 116.2 కిలోమీటర్ల పరిధిలో రూ.38,595 కోట్ల అంచనా వ్యయంతో రూపుదిద్దుకుంటున్న ఈ ప్రాజెక్టులో అత్యంత క్లిష్టమైన డిజైన్లను చేర్చారు. ముఖ్యంగా జేబీఎస్-శామీర్‌పేట కారిడార్‌లోని హకీంపేట విమానాశ్రయం వద్ద రన్‌వేకి ఎలాంటి ఇబ్బంది కలగకుండా 1.65 కి.మీ., అలాగే నాగోల్-శంషాబాద్ మార్గంలో ఎయిర్పోర్ట్ సమీపంలో 1.6 కి.మీ. మేర మెట్రోను భూగర్భంలో (టన్నెల్) ప్రతిపాదించడం విశేషం. NHAI: వాహనదారులకు NHAI గుడ్ న్యూస్.. అందుబాటులోకి రూ.350 లోకల్ పాస్.. ఎవరికీ వర్తిస్తుందో తెలుసా? మదీనాగూడ వద్ద డబుల్ డెక్కర్ ఫ్లైఓవర్.. రైల్వే క్రాసింగ్‌ల సవాల్: మదీనాగూడ - చందానగర్ మధ్య 1.2 కిలోమీటర్ల మేర మొదటి అంతస్తులో ఎలివేటెడ్ ఫ్లైఓవర్, దానిపై రెండో అంతస్తులో మెట్రో(Metro Phase 2) వెళ్లేలా 'డబుల్ డెక్' నమూనాను రూపొందించారు. ఈ మార్గంలో ఫలక్‌నుమా, ఆరాంఘర్, లోతుకుంట, అల్వాల్ వంటి కీలక ప్రాంతాల్లో రైల్వే ట్రాక్‌లను దాటుకుని వెళ్లాల్సి ఉంది. వీటితో పాటు నేషనల్ హైవేస్ (NH-65, NH-44) పరిధిలోని రహదారుల పైభాగంలో పిల్లర్ల నిర్మాణానికి రోడ్డు రవాణా మంత్రిత్వ శాఖ సహా పౌర విమానయాన శాఖ అనుమతులు కోరారు. కేంద్ర, రాష్ట్ర వాటాలు.. మున్సిపల్ పరిధుల్లో కనెక్టివిటీ: ఈ భారీ ప్రాజెక్టు వ్యయంలో రాష్ట్ర ప్రభుత్వం 31% అనగా రూ.11,933 కోట్లు, కేంద్రం 17% అనగా రూ.6,666 కోట్లు భరించనుండగా, మిగిలిన 52% అనగా రూ.19,996 కోట్లు రుణాలుగా సేకరించనున్నారు. ఈ రెండో దశ మార్గం జీహెచ్ఎంసీ, మల్కాజిగిరి, సైబరాబాద్ కార్పొరేషన్ పరిధుల గుండా సాగనుంది. రోజువారీగా 12.42 లక్షల మంది ప్రయాణికులకు సేవలు అందించడమే లక్ష్యంగా వేగంగా అనుమతులు

హైదరాబాద్ మెట్రో రైలు ప్రాజెక్ట్ విషయంలో కీలక ప్రణాళికలు చేస్తోంది. హైదరాబాద్ మెట్రో రైలు ప్రాజెక్ట్ రెండోదశ విస్తరణలో విమానాశ్రయాలు, రైల్వే మార్గాలు, జాతీయ రహదారులు వంటి క్లిష్ట ప్రాంతాలను దృష్టిలో పెట్టుకుని ప్రత్యేక నిర్మాణ ప్రణాళికలు రూపొందిస్తున్నారు. ముఖ్యంగా హకీంపేట, శంషాబాద్ విమానాశ్రయాల సమీపంలో భూగర్భ మెట్రో మార్గాలను ప్రతిపాదించారు. రన్‌వే కార్యకలాపాలకు ఎలాంటి అంతరాయం కలగకుండా ఈ ప్రణాళికలు రూపొందించబడ్డాయి.హకీంపేటలో సుమారు 1.65 కిలోమీటర్ల మేర అండర్‌గ్రౌండ్ మెట్రో ప్రతిపాదన జేబీఎస్-శామీర్‌పేట కారిడార్‌లో హకీంపేట విమానాశ్రయం సమీపంలో సుమారు 1.65 కిలోమీటర్ల మేర అండర్‌గ్రౌండ్ మెట్రో నిర్మించాలని నిర్ణయించారు. హెచ్ఎండీఏ ప్రతిపాదించిన హైవే టన్నెల్ వెంట ఈ మార్గాన్ని తీసుకెళ్లేలా ప్రణాళిక ఉంది. దీనివల్ల విమానాశ్రయ రన్‌వేకు సంబంధించిన పరిమితులను అధిగమించి భద్రతా ప్రమాణాలను పాటించే అవకాశం ఏర్పడుతుంది.శంషాబాద్ పరిధిలోనూ సుమారు 1.6 కిలోమీటర్ల భూగర్భ మెట్రో ప్రతిపాదన అలాగే నాగోల్-శంషాబాద్ కారిడార్‌లో విమానాశ్రయ పరిధిలో సుమారు 1.6 కిలోమీటర్ల భూగర్భ మెట్రోను ప్రతిపాదించారు. శంషాబాద్ విమానాశ్రయం వరకు మెట్రో విస్తరణలో కార్గో స్టేషన్, ఎయిర్పోర్ట్ స్టేషన్ తో పాటు విమానాశ్రయ ప్రాంగణంలోనే మెట్రో డిపో ఏర్పాటుకు కూడా ప్రతిపాదనలు ఉన్నాయి. దీనికి పౌర విమానయాన మంత్రిత్వశాఖ అనుమతి అవసరం.శామీర్‌పేట, మేడ్చల్ కారిడార్లను తక్కువ ఎత్తులో నిర్మించేలా డిజైన్బేగంపేట విమానాశ్రయం రన్‌వే కారణంగా చుట్టుపక్కల ప్రాంతాల్లో ఎత్తు పరిమితులు అమలులో ఉన్నాయి. దీన్ని దృష్టిలో పెట్టుకుని శామీర్‌పేట, మేడ్చల్ కారిడార్లను తక్కువ ఎత్తులో నిర్మించేలా డిజైన్ చేశారు. రైల్వే క్రాసింగ్‌లు కూడా కీలక సవాలుగా మారనున్నాయి. ఫలక్‌నుమా, ఆరాంఘర్, శంషాబాద్, గుండ్లపోచంపల్లి, లోతుకుంట, అల్వాల్ ప్రాంతాల్లో మెట్రో మార్గం రైల్వే ట్రాక్‌లను దాటాల్సి ఉంటుంది.ఆ జాతీయ రహదారుల వెంట మెట్రో స్తంభాల నిర్మాణానికి కేంద్ర అనుమతులుదీనికోసం దక్షిణ మధ్య రైల్వే నుంచి సూత్రప్రాయ అనుమతి లభించినట్లు అధికారులు తెలిపారు. సుచిత్ర ప్రాంతంలో మాత్రం అనుమతి ఇంకా పెండింగ్‌లో ఉంది. జాతీయ రహదారుల

విజయవాడలో మెట్రో రైల్ ప్రాజెక్టును తెరకెక్కించేందుకు కూటమి ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలపై మాజీ ఎంపీ కేశినేని నాని (Kesineni Nani) ఇవాళ మరోసారి ఫైర్ అయ్యారు. ముఖ్యంగా ఈ ప్రాజెక్టు కోసం పెట్టే భారీ ఖర్చును విమర్శిస్తూ ఆయన పోస్ట్ పెట్టారు. అలాగే ఇందులో నాలుగో వంతు పెడితే విజయవాడ ఎలా మారిపోతుందో కూడా వివరించారు. ప్రస్తుత లెక్కల బట్టి విజయవాడ మెట్రో రైల్ ప్రాజెక్ట్ ఖర్చు రూపాయలు 12వేల కోట్లు అని ప్రభుత్వం చెబుతోందని, ఇది పూర్తి అవటానికి సుమారు 10 నుంచి 15 సంవత్సరాలు పడుతుందన్నారు. అప్పటికి దాని వ్యయం కచ్చితంగా రెట్టింపై 24 వేల కోట్లకు పెరుగుతుందన్నారు.Vijayawada Railway Station: విజయవాడ రైల్వే స్టేషన్ కు షాక్..! రూటు మార్చిన కేశినేని..!విజయవాడ నగరం ఒక్క చక్కటి నివాస యోగ్యమైన నగరంగా చేయటానికి అవసరమైనటువంటి మౌలిక సదుపాయాలైనటువంటి 24/7 సురక్షితమైన తాగునీరు, నాణ్యమైన, గుంతలు లేని రహదారులు, భూగర్భ మురుగునీటి పారుదల వ్యవస్థ, వర్షపు నీటి పారుదల, వరద నివారణ, నిరంతర విద్యుత్ సరఫరా, వీధి దీపాలు, పరిశుభ్రత, చెత్త సేకరణ-శుద్ధి, సురక్షితమైన కాలిబాటలు, మెరుగైన ప్రజా రవాణా, ప్రభుత్వ ఆసుపత్రులు, అత్యవసర వైద్యసేవలు, నాణ్యమైన ప్రభుత్వ పాఠశాలలు, ఉద్యానవనాలు, ఆటస్థలాలు, ట్రాఫిక్ నిర్వహణ, వాహన నిలుపుదల సదుపాయాలు, ప్రజా మరుగుదొడ్లు, మహిళలు, వృద్ధులు, దివ్యాంగులకు అనుకూలమైన సదుపాయాలు, ప్రజా భద్రత, అగ్నిమాపక-అత్యవసర సేవలు, పచ్చదనం, కాలుష్య నియంత్రణ వంటి వాటిపై ప్రాజెక్టులో 25 శాతం ఖర్చుపెడితే సరిపోతుందన్నారు. విజయవాడకు మెట్రో రైల్ వరమా ? శాపమా ? - కేశినేని నాని ప్రశ్న..!ఇలా మెట్రో రైల్ ప్రాజెక్టుకు అయ్యే ఖర్చులో 25 శాతం వెచ్చించి అందమైన, అన్ని వర్గాల వారికి ఆమోదకరమైన నివాస యోగ్యకరమైన సుందర విజయవాడగా తయారు చేసుకోవడం సబబా లేక మెట్రో రైల్ ప్రాజెక్ట్ చేయడం సబబా అని కేశినేని నాని ప్రశ్నించారు.

ఏపీలోని రెండు ప్రధాన నగరాలు విజయవాడ, విశాఖపట్నంలో మెట్రో రైల్ ప్రాజెక్టుల్ని సాధ్యమైనంత త్వరగా పట్టాలెక్కించేందుకు ప్రభుత్వం తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. వీటికి అవసరమైన డీపీఆర్ లను తయారు చేసి ఆమోదించడంతో పాటు భూసేకరణ వరకూ వెళ్లింది. ఇలాంటి తరుణంలో విజయవాడలో మెట్రో రైల్ ప్రాజెక్టు (Vijayawada Metro Rail Project) నిర్మాణంపై మాజీ ఎంపీ కేశినేని నాని (Kesineni Nani) ఓ కీలకమైన ప్రశ్న లేవనెత్తారు.కూటమి సర్కార్ లో సూపర్ సీఎం ? ఏ మంత్రి నిర్ణయం అయినా వీటో చేసే అధికారం..!విజయవాడలో మెట్రో రైల్ ప్రాజెక్టు కోసం ప్రభుత్వం తాజాగా భూమిని సేకరించేందుకు ప్రయత్నాలు ప్రారంభించింది. ఈ ప్రాజెక్టు రాకతో నగరం రూపు రేఖలు మారిపోతాయన్న అంచనాలు ఉన్నాయి. నగరంలోని ఏలూరు, బందరు రోడ్లలో రెండు కారిడార్లుగా నిర్మిస్తున్న ఈ ప్రాజెక్టు వల్ల పాత విజయవాడ నగరం హైదరాబాద్ తరహాలో పూర్తిగా మారిపోతుందన్న ఆందోళనలు ఉన్నాయి. వీటినే ఇంకాస్త ముందుకు తీసుకెళ్తూ కేశినేని నాని.. ఇవాళ ఈ ప్రాజెక్టు నగరానికి వరమా లేక శాపమా అనే ప్రశ్న సంధించారు. ఇంత చిన్న నగరానికి మెట్రో అవసరమా అని ఇప్పటికే ప్రశ్నిస్తున్న వారి వాదనకు కేశినేని ప్రశ్న ఊతమిచ్చేలా ఉంది. Vijayawada Railway Station: విజయవాడ రైల్వే స్టేషన్ కు షాక్..! రూటు మార్చిన కేశినేని..!రెండే ప్రధాన కమర్షియల్ రోడ్లు -బందర్ రోడ్డు, ఏలూరు రోడ్డు మాత్రమే వున్న విజయవాడ నగరానికి, విజయవాడ ప్రజలకు విజయవాడ మెట్రో రైల్ వరమా లేక శాపమా ? అని మాజీ ఎంపీ కేశినేని నాని ప్రశ్నించారు. ఈ మేరకు సోషల్ మీడియాలో ఆయన ఓ పోస్టు పెట్టారు. దీనిపై భిన్న స్పందనలు వస్తున్నాయి. కొందరు ఈ ప్రాజెక్టు వరమని, ఇంకొందరు శాపమని స్పందిస్తున్నారు. విజయవాడ మెట్రో రైల్ ప్రాజెక్టుతో రాకతో నగరంలో జరిగే మార్పుల వల్ల ఎలాగో కొందరికి నష్టం తప్పదు. ఈ నేపథ్యంలో వారిని

తమిళనాడులోని మహాబలిపురంలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా అధ్యక్షతన గురువారం (ఆగస్టు 20వ తేదీ) దక్షిణ ప్రాంతీయ మండలి (Southern Zonal Council) 31వ సమావేశం జరగనుంది. చెన్నై, ఆగస్టు 19: తమిళనాడులోని మహాబలిపురంలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా అధ్యక్షతన గురువారం (ఆగస్టు 20వ తేదీ) దక్షిణ ప్రాంతీయ మండలి (Southern Zonal Council) 31వ సమావేశం జరగనుంది. ఈ సమావేశానికి దక్షిణాది రాష్ట్రాలకు చెందిన ఆరుగురు ముఖ్యమంత్రులు హాజరవుతారు. ఈ సమావేశానికి సీఎం చంద్రబాబు హాజరుకానున్నారు. ఈ సమావేశంలో ఏపీ ప్రయోజనాలకు సంబంధించిన పలు కీలక అంశాలను ఆయన ప్రస్తావించనున్నారు. ఆ క్రమంలో ఏపీ పునర్విభజన చట్టం అమలుపై కేంద్రం దృష్టికి తీసుకెళ్లనున్నారు. విభజన చట్టంలోని పెండింగ్ అంశాల పరిష్కారానికి కేంద్రం చొరవ తీసుకోవాలని కోరనున్నారు. షెడ్యూల్ 9,10 సంస్థల విభజనపై కేంద్రం దృష్టికి ఆయన తీసుకెళ్లనున్నారు. ఆస్తులు, అప్పుల పంపకం, పెండింగ్‌లోని ఆర్థిక అంశాల పరిష్కారానికి కృషి చేయాలని విజ్ఞప్తి చేయనున్నారు. అలాగే రెవెన్యూ గ్యాప్, పన్ను సంబంధిత అంశాలను కూడా ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు ప్రస్తావించనున్నారు. దుగరాజుపట్నం పోర్టు అంశాన్ని కూడా కేంద్రం దృష్టికి తీసుకెళ్లనున్నారు. విశాఖపట్నం, విజయవాడ మెట్రో ప్రాజెక్టుకు సహకరించాలని కేంద్రాన్ని ఆయన కోరనున్నారు. రైల్వే కనెక్టివిటీ, విమానాశ్రయాల అభివృద్ధిపై చర్చించనున్నారు. పారిశ్రామిక కారిడార్ల అభివృద్ధికి కేంద్ర సహకారం ఆయన కోరనున్నారు. విశాఖపట్నం కేంద్రంగా సౌత్ కోస్ట్ రైల్వే జోన్ అంశాన్ని ఈ సమావేశంలో సీఎం చంద్రబాబు ప్రస్తావించనున్నారు. ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జీవనాడి పోలవరం ప్రాజెక్టుకు అందిస్తున్న సహకారానికిగాను కేంద్రానికి సీఎం చంద్రబాబు కృతజ్ఞతలు తెలపనున్నారు. మిగిలిన మౌలిక సదుపాయాల ప్రాజెక్టులకు వేగంగా అనుమతులు మంజూరు చేయడంతోపాటు నిధులు సమకూర్చాలని కేంద్రానికి విజ్ఞప్తి చేయనున్నారు. గాలింపు చర్యల వివరాలు ఎప్పటికప్పుడు మత్స్యకారుల కుటుంబాలకు తెలపండి: సీఎం చంద్రబాబు అర్హులైన ఓటరు మిగలకూడదు.. అనర్హుడు ఓటరు జాబితాలో చేరకూడదు: సీఈవో

ఒకప్పుడు అందాల హుస్సేన్ సాగర్.. ఇప్పుడు కాలుష్య కాసారం.. హైదరాబాద్ నగరంలో హుస్సేన్‌సాగర్ కు మళ్లీ పూర్వ వైభవం తీసుకురావడానికి హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ సమగ్ర మాస్టర్ ప్లాన్ రూపొందిస్తోంది. ఒకప్పుడు నగరవాసులకు తాగునీరు అందించిన ఈ చారిత్రక జలాశయం కాలక్రమేణా కాలుష్యం, మురుగునీటి ప్రవాహం, నిర్వహణ లోపాల వల్ల సహజ సౌందర్యాన్ని కోల్పోయింది. ఈ పరిస్థితిని మార్చేందుకు HMDA ప్రత్యేక కార్యచరణ ప్రణాళికను సిద్ధం చేస్తోంది.హుస్సేన్ సాగర్ కోసం అంతర్జాతీయ స్థాయిలో టెండర్లుఈ మాస్టర్ ప్లాన్ తయారీకి అర్హత కలిగిన కన్సల్టెన్సీ సంస్థను ఎంపిక చేసేందుకు వచ్చే వారంలోపు అంతర్జాతీయ స్థాయిలో టెండర్లు పిలవనున్నారు. ప్రధాన లక్ష్యాలు కాలుష్య నివారణ, మురుగునీటి మళ్లింపు, పర్యావరణ పరిరక్షణ, లేక్ఫ్రంట్ను అంతర్జాతీయ స్థాయిలో తీర్చిదిద్దడంగా నిర్ణయించారు. కాలుష్య నియంత్రణలో భాగంగా ప్రస్తుతం ఉన్న సీవేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ల (STP) సామర్థ్యాన్ని పెంచనున్నారు.సంజీవయ్య పార్కులో ప్రత్యేక లెర్నింగ్ సెంటర్ ఏర్పాటుకొత్త మురుగు మళ్లింపు పైప్లైన్లు ఏర్పాటు చేసి సాగర్‌లోకి మురుగు చేరకుండా నిరోధిస్తారు. గ్రీన్ స్కేపింగ్, పర్యావరణ హిత అర్బన్ డిజైన్ల ద్వారా నీటిని స్వచ్ఛంగా మార్చాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. సంజీవయ్య పార్కులో ప్రత్యేక లెర్నింగ్ సెంటర్ ఏర్పాటు చేయనున్నారు. పిల్లలు, విద్యార్థులకు పర్యావరణం, ప్రకృతి, నగర చరిత్రపై అవగాహన కల్పించేలా దీన్ని రూపొందిస్తారు. పాత రోజ్ గార్డెన్ స్థానంలో కొత్త థీమ్ గార్డెన్లు, వనాలు అభివృద్ధి చేస్తారు.సాంస్కృతిక కార్యక్రమాలకు ఓపెన్ ఎయిర్ ప్లాజాలు ఏర్పాటులేక్ఫ్రంట్ పరిసరాల్లో సైక్లింగ్ ట్రాక్‌లు, వాకింగ్ పాత్‌లు, యోగా జోన్లు, డిజైనర్ ఫుడ్ కోర్టులు నిర్మిస్తారు. సాంస్కృతిక కార్యక్రమాలకు ఓపెన్ ఎయిర్ ప్లాజాలు ఏర్పాటు చేస్తారు. ట్యాంక్‌బండ్, ఎన్టీఆర్ మార్గ్, పీవీ నరసింహారావు మార్గ్, లుంబినీ పార్క్, పీపుల్స్ ప్లాజా, అంబేడ్కర్ విగ్రహం, అమరవీరుల స్మారక చిహ్నం పరిసరాలను అనుసంధానిస్తూ సుందరీకరణ పనులు చేపడతారు.ఆగస్టు23 నుండి అష్టాదశ యోగంతో ఈ రాశులవారికి అదృష్ట ద్వారాలు తెరుచుకుంటాయి!ఎన్టీఆర్ గార్డెన్స్‌ను కూడా ఆధునిక

బస్సుల్లో ప్రయాణం అంటే ఉదయాన్నే రద్దీ, కండక్టర్ చిల్లర ఇవ్వండి అనడం, ఆపై జేబుల్లో కాయిన్స్ కోసం వెతుక్కోవడం ప్రతి ఒక్కరికీ అనుభవమే. వీటితో పాటు మహాలక్ష్మీ పథకం ద్వారా మహిళలకు ఫ్రీ బస్ ప్రయాణం కూడా అమలువుతున్న నేపథ్యంలో పీక్ అవర్స్ లో ఆర్టీసీ బస్సులో విపరీతమైన రష్ ను మనం ఎదుర్కుంటున్నాం. చాలా సార్లు కండక్టర్ మన కాళ్లు తొక్కుకుంటూ టికెట్ ఇవ్వడానికి వెళ్తున్న ఇబ్బందికర పరిస్థితులను కూడా చూశాం.అయితే, ఈ రోజువారీ తిప్పలకు త్వరలోనే చెక్ పడనుంది. హైదరాబాద్ నగర రవాణాను సరికొత్త డిజిటల్ బాట పట్టించేందుకు తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ మరో అడుగు ముందుకు వేసింది. మెట్రో రైలు తరహాలోనే.. ఇప్పుడు ఆర్టీసీ బస్సు ఎక్కడానికి ముందే ప్రయాణికులు తమ మొబైల్ ఫోన్ల ద్వారా అడ్వాన్స్ టికెట్ బుక్ చేసుకునే సౌకర్యాన్ని మీ టికెట్ (Mee Ticket) యాప్ రూపంలో అందుబాటులోకి తెస్తోంది.ఈ కొత్త విధానంతో రద్దీ సమయాల్లో బస్సుల్లో నిలబడి, ఊపిరి ఆడని జనం మధ్య కండక్టర్ దగ్గరికి వెళ్లాల్సిన అవసరం ఉండదు. ప్రయాణికులు తమ మొబైల్ యాప్‌లో ఎక్కే బస్ స్టాప్, దిగే ప్రాంతాన్ని సెలెక్ట్ చేసుకుని యూపీఐ, డెబిట్ లేదా క్రెడిట్ కార్డుల ద్వారా ముందే చెల్లింపులు చేయవచ్చు. టికెట్ బుక్ అవ్వడమే కాకుండా, బస్సు ప్రస్తుతం ఎక్కడుందో లైవ్ లొకేషన్ ట్రాక్ చేస్తూ సమయానికి డిజిటల్ ప్రయాణం చేయవచ్చు. అంతేకాకుండా ఆర్టీసీ, మెట్రో, ఆటో, క్యాబ్ వంటి సేవలను ఒకే గొడుగు కిందకు తెస్తూ ప్రయాణాన్ని మరింత సులభతరం చేయడమే ఈ యాప్ ముఖ్య ఉద్దేశం.నైరుతి బైబై?.. పసిడి నేలను పలకరించకుండానే వీడ్కోలు..ఈ సదుపాయం రావడం వల్ల ప్రయాణికుల సమయం ఆదా అవ్వడమే కాకుండా, కండక్టర్లపై పనిభారం గణనీయంగా తగ్గుతుంది. ప్రతిరోజూ నగరంలో తిరిగే 3200కు పైగా బస్సుల్లో సుమారు 26 లక్షల మంది ప్రయాణిస్తుండగా, ఇప్పటికే 23 శాతం

తెలంగాణలో ప్రయాణికుల సౌకర్యార్థం టీజీఎస్ఆర్టీసీ కీలక ముందడుగు వేసింది. తమ 'మీటికెట్' యాప్‌లో సమూలంగా మార్పు చేసి, మల్టీ-మోడల్ ట్రావెల్ ప్లాట్‌ఫామ్‌గా తీర్చిదిద్దింది. ఇకపై ఆర్టీసీ బస్సులు, మెట్రో రైలుతో పాటు ఆటోలు, క్యాబ్‌లను కూడా ఒకే యాప్ ద్వారా బుక్ చేసుకునే సౌకర్యాన్ని కల్పించింది.సోమవారం టీజీఎస్ఆర్టీసీ ఈ కొత్త అప్డేట్ను ప్రకటించింది. ఈ నూతన విధానం ప్రకారం, ప్రయాణికులు ఆర్టీసీ బస్సు లేదా మెట్రో రైలులో టికెట్ బుక్ చేసుకున్న తర్వాత, తమ చివరి గమ్యస్థానానికి చేరుకోవడానికి అవసరమైన ఆటో లేదా క్యాబ్‌ను కూడా అదే యాప్‌లో ముందుగానే రిజర్వ్ చేసుకోవచ్చు. చెల్లింపుల ప్రక్రియ కూడా సులభతరం చేశారు. వినియోగదారులు చెల్లించిన ఛార్జీలు ఆటోమేటిక్‌గా సంబంధిత రవాణా భాగస్వాములకు బదిలీ అవుతాయి.అయితే, ఆర్టీసీ సొంతంగా ఆటోలు కొనుగోలు చేసి నడుపుతుందంటూ వస్తున్న వార్తలపై యాజమాన్యం స్పష్టత ఇచ్చింది. ఆర్టీసీ స్వయంగా ఆటోలను కొనుగోలు చేయడం గానీ, నిర్వహించడం గానీ చేయదని తేల్చిచెప్పింది. భవిష్యత్తులో కూడా అలాంటి ప్రతిపాదన లేదని పేర్కొంది. ఇది కేవలం ఇప్పటికే ఉన్న రవాణా వ్యవస్థలను అనుసంధానించే ప్రక్రియ మాత్రమేనని, ఆటో డ్రైవర్లు ఎలాంటి అపోహలకు గురికావద్దని కోరింది. లాస్ట్-మైల్ కనెక్టివిటీ కోసం ఈవీ ఆటోలు కొనే ప్రణాళిక లేదని రవాణా మంత్రి పొన్నం ప్రభాకర్ కూడా ఇటీవల స్పష్టం చేశారు.ప్రయాణానికి సంబంధించిన అన్ని సేవలను ఒకే డిజిటల్ గొడుగు కిందకు తీసుకురావడమే తమ లక్ష్యమని టీజీఎస్ఆర్టీసీ తెలిపింది. ఇప్పటికే మీటికెట్ యాప్‌లో ఆర్టీసీ బస్ టికెట్లు, మెట్రో, పార్కులు, దేవాలయాల టికెట్ల

సర్గం రవి కుమార్. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి రాజకీయాలు, స్పోర్ట్స్, వినోదం, క్రైమ్, జాతీయ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. RTC Mee Ticket App: ప్రయాణికులకు సులభంగా.. అత్యంత వేగంగా సేవలు అందించేందుకు తెలంగాణ ఆర్టీసీ వినూత్న కార్యక్రమాలు అమలు చేస్తోంది. సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకుని ప్రయాణికులకు ఆర్టీసీ సేవలను అత్యంత వేగంగా అందించేలా ప్రయత్నాలు చేస్తోంది. ఈ క్రమంలో మరో కొత్త నిర్ణయం తీసుకుంది. ఇకపై అన్ని రవాణా సేవలకు సంబంధించి ఒకటే యాప్‌ను తీసుకువస్తూ ఆర్టీసీ నిర్ణయం తీసుకుంది. మీసేవ ఆధ్వర్యంలో 'మీటికెట్' యాప్ రూపకల్పనకు ప్రయత్నాలు చేస్తోంది. ఒకే డిజిటల్ వేదికపైకి ప్రజారవాణా సేవలు తీసుకురావాలని ఆర్టీసీ భావిస్తోంది. సరికొత్త ఆలోచనలతో ప్రయాణికులకు సౌకర్యవంతమైన సేవలు అందించేందుకు తెలంగాణ ఆర్టీసీ కృషి చేస్తోంది. ప్రజా రవాణా వ్యవస్థను మరింత ఆధునికీకరించడమే కాకుండా ప్రయాణికులకు వేగవంతమైన.. సులువైన సేవలు అందించేందుకు మీసేవ ద్వారా వినూత్నంగా ‘మీ టికెట్’ యాప్‌ను అభివృద్ధి చేస్తోంది. ప్రయాణ రంగానికి సంబంధించిన అన్ని రకాల సేవలను ఒకే డిజిటల్ గొడుగు కిందికి తీసుకురావడమే లక్ష్యంగా ఆర్టీసీ సంస్థ ఈ యాప్‌ను రూపొందిస్తోంది. 'మీటికెట్' యాప్ విశేషాలు ఆర్టీసీ కొత్తగా తీసుకురాబోతున్న మీ టికెట్ యాప్‌తో అన్ని రవాణా వ్యవస్థలు ఒకటే వేదికపై రానున్నాయి. ఆర్టీసీ, మెట్రో రైలు, ఆటోలు, క్యాబ్స్ వంటి అన్ని ప్రధాన రవాణా వ్యవస్థలు ఈ యాప్‌లో అనుసంధానం చేయాలని ఆర్టీసీ నిర్ణయించింది. ప్రయాణికుడు ఒకే చోట ఆర్టీసీ లేదా మెట్రో టికెట్‌తో పాటు తన గమ్యస్థానానికి తగినట్లుగా ఆటో లేదా క్యాబ్‌ను కూడా ముందస్తుగా బుక్ చేసుకునే సౌలభ్యం కొత్తగా తీసుకురాబోతున్న మీ టికెట్ యాప్‌తో సాధ్యం కానుంది. మీ టికెట్ యాప్‌తో ప్రయాణికులు చెల్లించిన రుసుమును

అంతర్జాతీయంగా నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు, మార్కెట్ తీవ్ర హెచ్చుతగ్గుల మధ్య బంగారం ధరలు మళ్లీ ఆకాశమే హద్దుగా పెరుగుతున్నాయి. గ్లోబల్ మార్కెట్లో భౌగోళిక రాజకీయ ఒత్తిళ్లు, బాండ్ ఈల్డ్స్‌లో మార్పులు రావడం వల్ల ఇన్వెస్టర్లు సురక్షితమైన పెట్టుబడి మార్గంగా భావించి పసిడి వైపు మొగ్గు చూపుతున్నారు. దీనికి తోడు డాలర్ మారకం విలువలో కదలికలు కూడా బంగారం పెరుగుదలకు ప్రధాన కారణమయ్యాయి. రానున్న రోజుల్లో వివాహాల సీజన్ కూడా ప్రారంభం కానుండటంతో ధరలు మరింత భేతాళుడిలా పైకి లేచే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.పెరిగిన రేట్లు.. తులం ఎంత ఉందంటే?ఆగస్టు 17 సోమవారం నాటి రేట్లను పరిశీలిస్తే.. దేశీయంగా బంగారం ధరలు మళ్లీ పెరిగాయి. 24 క్యారట్ల మేలిమి బంగారం గ్రాముపై రూ.53 పెరిగి రూ.15,566 వద్దకు చేరింది. సాధారణంగా ఎక్కువగా కొనుగోలు చేసే 22 క్యారట్ల ఆభరణాల బంగారం గ్రాముకు రూ.50 పెరిగి రూ.14,270 వద్ద నమోదుకాగా, 18 క్యారట్ల బంగారం గ్రాముకు రూ.41 పెరిగి రూ.11,676 గా ఉంది. దీని ప్రకారం 100 గ్రాముల 24 క్యారట్ల బంగారంపై ఏకంగా రూ.5,300 పెరిగి రూ.15,56,600 టచ్ చేసింది. ఇక వెండి ధర కూడా భారీగా పెరిగింది. గ్రాముపై రూ.255 పెరగుదల నమోదవ్వగా.. ప్రస్తుతం కిలో రూ.2,55,000 గా ఉంది. వెండి వెలిగిపోతుంది. రూల్స్ మార్చినా సేల్స్ తగ్గేదేలే తెలుగు రాష్ట్రాల నగరాల్లో నేటి ధరలు!మన తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నంలలో బంగారం ధరలు ఒకే రీతిగా నమోదయ్యాయి.24 క్యారట్ల పసిడి (10 గ్రాములు): రూ.530 పెరిగి రూ.1,55,660 వద్ద ట్రేడ్ అవుతోంది.22 క్యారట్ల పసిడి (10 గ్రాములు): రూ.500 పెరిగి రూ.1,42,700 నమోదు కాగా..18 క్యారట్ల పసిడి (10 గ్రాములు): రూ.410 పెరిగి రూ.1,16,760 వద్దకు చేరింది.18 ఏళ్ల కుర్రాడికి దొరికిన రూ.98 కోట్ల లంకె బిందెలు!దేశంలోని ఇతర ప్రధాన నగరాల్లో ఇలా..ఇక దేశవ్యాప్తంగా ప్రధాన మెట్రో

ఓ మహిళకు తెలియకుండా కేంద్ర పారిశ్రామిక భద్రతా దళానికి చెందిన జవాన్ ఫొటోలు తీయడం కలకలం రేపింది. మహిళ సహా తోటి ప్రయాణికులు ఆ జవానును ప్రశ్నించడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. న్యూఢిల్లీ: ఓ మహిళకు తెలియకుండా కేంద్ర పారిశ్రామిక భద్రతా దళం(CISF)కి చెందిన జవాన్ ఫొటోలు తీయడం కలకలం రేపింది. మహిళ సహా తోటి ప్రయాణికులు ఆ జవానును ప్రశ్నించడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. వారి మధ్య వాగ్వాదం కాస్తా తోపులాట, ఘర్షణకు దారి తీసింది. ఈ ఘటన ఢిల్లీ మెట్రో రైలులో జరగ్గా.. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. శనివారం అర్ధరాత్రి ఢిల్లీ మెట్రోలో ఓ మహిళ ప్రయాణిస్తోంది. సీఐఎస్ఎఫ్ జవాన్ కూడా అదే రైలులో ఉన్నాడు. అయితే, మహిళకు తెలియకుండా ఆమె ఫొటోలను అతను తీశాడు. ఇది గమనించిన ప్రయాణికురాలు.. జవాన్ వద్దకు వెళ్లి నిలదీసింది. తన ఫొటోలు ఎందుకు తీస్తున్నావని ప్రశ్నించింది. మహిళతో పాటు తోటి ప్రయాణికులూ సదరు వ్యక్తిని నిలదీశారు. తాను ఫొటోలు తీయలేదని జవాన్ గట్టిగా వాదించాడు. అయితే ఫోన్లోని ఫొటో గ్యాలరీని చూపించాలని వారంతా డిమాండ్ చేశారు. ఇందుకు తొలుత అతను ఒప్పుకోకపోవడంతో.. తర్వాత చూపించక తప్పని పరిస్థితి ఎదురైంది. మహిళకు సంబంధించిన చిత్రాలు ఫోన్లో కనిపించడంతో పరిస్థితి ఒక్కసారిగా ఉద్రిక్తంగా మారింది. మహిళ తన ఫొటోలను తొలగించాలని డిమాండ్ చేయగా.. కొంతమంది ప్రయాణికులు అతని చేతిలోని ఫోన్‌ను తీసుకునేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో ఇరువర్గాల మధ్య తోపులాట, ఘర్షణ చోటుచేసుకుంది. దీనికి సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఈ ఘటనపై సీఐఎస్ఎఫ్ ఉన్నతాధికారులు తీవ్రంగా స్పందించారు. ఆరోపణలు ఎదుర్కొంటున్న జవానును వెంటనే సస్పెండ్ చేశారు. ఘటనపై సమగ్ర విచారణకు ఆదేశించారు. ఫొటోలు తీసినట్లు తేలితే తగిన చర్యలు ఉంటాయని పేర్కొన్నారు. కాగా, ఈ విషయంపై పోలీసులకు సమాచారం అందినప్పటికీ.. బాధితురాలు అధికారికంగా ఫిర్యాదు చేయలేదు. ఎలుగుబంటికి

హైదరాబాద్ మెట్రో రైల్వే వ్యవస్థలో మొదటి దశ మరియు రెండవ దశల మధ్య అనుసంధాన ప్రక్రియ పైన తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి సారిస్తోంది. పాత, కొత్త సాంకేతిక వ్యవస్థల మధ్య ఎటువంటి సమస్యలు తలెత్తకుండా ముందస్తుగానే చర్యలు చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలోనే ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ అనుభవాన్ని ఈ రెండు దశల అనుసంధాన ప్రక్రియకు ఉపయోగించుకోవాలని ప్రభుత్వం భావిస్తోంది.మొదటి రెండో దశ మెట్రో అనుసంధానంపై ఢిల్లీ మెట్రోరైల్ కార్పోరేషన్ తో సంప్రదింపులుదీనిపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచనతో హైదరాబాద్ మెట్రో రైల్ లిమిటెడ్ ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ తో ఇప్పటికే సంప్రదింపులు ప్రారంభించింది. 2010లో మెట్రో మొదటి దశ ప్రణాళిక రూపొందించగా అప్పటి సాంకేతిక పరిజ్ఞానానికి, ప్రస్తుత సాంకేతిక పరిజ్ఞానానికి చాలా వ్యత్యాసం వచ్చింది. మొదటిదశలో అప్పటి సాంకేతిక పరిజ్ఞానంతో పాటు భవిష్యత్తు అవసరాలను దృష్టిలో పెట్టుకుని అధునాతన వ్యవస్థలను ఏర్పాటు చేశారు అయితే అప్పుడు ఎక్కువగా విదేశీ సాంకేతికతపైన ఆధారపడ్డారు.ఏడు కారిడార్లలో నాలుగు మార్గాలు నేరుగా మొదటి దశకు కొనసాగింపుకానీ ఇప్పుడు స్వదేశంలోనే మెట్రోకి సంబంధించిన అన్ని వ్యవస్థలు తయారవుతున్న క్రమంలో, స్వదేశీ ఉత్పత్తులు, సాంకేతిక పరిజ్ఞానానికి ప్రధాన్యం ఇవ్వాల్సిన అవసరం వచ్చింది. దీంతో ఇప్పటికే సేవలందిస్తున్న మొదటి దశ వ్యవస్థలతో సమర్థవంతంగా దీనిని అనుసంధానం చేయడం అత్యంత ముఖ్యమైన భాగంగా మారింది. మరీ ముఖ్యంగా హైదరాబాద్ మెట్రోలో ఉండవలసిన ప్రతిపాదించిన ఏడు కారిడార్లలో నాలుగు మార్గాలు నేరుగా మొదటి దశకు కొనసాగింపుగా ఉంటాయి.పాత కొత్తలను కలిపి చేసే కొనసాగింపులో అనుసంధానం కీలకంఎంజీబీఎస్, చంద్రాయణ గుట్ట, ఎల్బీనగర్ - హయత్ నగర్, మియాపూర్- పటాన్చెరు, రాయదుర్గం - కోకాపేట నియో పోలీస్ మార్గాలు ఇప్పటికే ఉన్న మెట్రో నెట్వర్క్ తో కలవాల్సి ఉంది. దీనివల్ల ప్రయాణికులు కూడా ఒక దశ నుంచి మరొక దశకు మారే సమయంలో రైలు కార్యకలాపాలు, సిగ్నలింగ్ ,విద్యుత్, కమ్యూనికేషన్

హైదరాబాద్ మెట్రో రైలులో రోజురోజుకూ పెరుగుతున్న ప్రయాణికుల రద్దీని తగ్గించేందుకు తెలంగాణ ప్రభుత్వం కీలక చర్యలకు సిద్ధమవుతోంది. హైదరాబాద్ మెట్రోకు అదనపు కోచ్‌లు సమకూర్చే ప్రక్రియను వేగవంతం చేయాలని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. మంగళవారం హైదరాబాద్ మెట్రో రైల్ లిమిటెడ్ అధికారులతో నిర్వహించిన సమీక్షలో ప్రయాణికుల రద్దీ ప్రధానంగా చర్చకు వచ్చింది. ముఖ్యంగా పీక్ అవర్స్‌లో ఎదురవుతున్న సమస్యలను తగ్గించేలా కొత్త కోచ్‌ల కొనుగోలుపై ముందుకెళ్లాలని సీఎం స్పష్టం చేశారు. ప్రస్తుతం హైదరాబాద్ మెట్రో మూడు కారిడార్లలో 56 ట్రైన్ సెట్లు నడుపుతోంది. ప్రతి ట్రైన్ మూడు కోచ్‌లతోనే సేవలు అందిస్తుండగా, రోజువారీ ప్రయాణికుల సంఖ్య 4.5 లక్షల నుంచి 5 లక్షల మధ్య ఉంటోంది. ఉదయం, సాయంత్రం పీక్ అవర్స్‌లో ప్రయాణికుల సంఖ్య భారీగా పెరగడంతో కొన్ని రూట్లలో ట్రైన్లు పూర్తిగా నిండిపోతున్నాయి. కొన్ని స్టేషన్లలో ట్రైన్ ఎక్కడం కూడా ప్రయాణికులకు కష్టంగా మారుతోంది. ఈ పరిస్థితుల నేపథ్యంలో అదనపు కోచ్‌ల అవసరం మరింత పెరిగింది. హైదరాబాద్ మెట్రో రైల్ లిమిటెడ్ ఇప్పటికే ప్రయాణికుల సంఖ్య, స్టేషన్ల వారీ రద్దీ, రూట్ల వారీ డిమాండ్‌పై వివరమైన అధ్యయనం చేసింది. దీంతో 40 నుంచి 60 అదనపు కోచ్‌లు కొనుగోలు చేసే ప్రతిపాదనను సిద్ధం చేసింది. ఇదిలా ఉండగా, కొత్త కోచ్‌లను ప్రస్తుతం ఉన్న మూడు కోచ్‌ల ట్రైన్లకు నేరుగా జోడించడం మాత్రమే ప్రణాళిక కాదని అధికారులు భావిస్తున్నారు. డిమాండ్‌కు అనుగుణంగా నాలుగు లేదా ఆరు కోచ్‌ల ట్రైన్లు, మిశ్రమ విధానంలో సేవలు నడిపే అవకాశాలను పరిశీలిస్తున్నారు. ఈ మార్పులతో హైదరాబాద్ మెట్రో సేవల సామర్థ్యాన్ని మరింత పెంచాలని భావిస్తున్నారు. కొత్త కోచ్‌లు అందుబాటులోకి వస్తే రద్దీ ఎక్కువగా ఉండే సమయాల్లో ప్రయాణికులకు గణనీయమైన ఊరట లభించే అవకాశం ఉంది. ఫలితంగా ప్రస్తుతం ఎదురవుతున్న బోర్డింగ్ సమస్యలను తగ్గించడంతో పాటు మెట్రో ప్రయాణాన్ని మరింత సౌకర్యవంతంగా మార్చవచ్చు. ఈ నేపథ్యంలో

వీలైనంత త్వరగా టెండర్ ప్రక్రియ ప్రారంభించాలి మెట్రో రద్దీకి అనుగుణంగా కొత్త కోచ్ లు కొనుగోలు చేయాలి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హైదరాబాద్ మెట్రోరైలు రెండో దశలో భాగంగా పాతబస్తీ మెట్రో పనుల్లో వేగం పెంచాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. మంగళవారం హైదరాబాద్ మెట్రో రైల్ లిమిటెడ్ (HMRL)పై సీఎం ఉన్నతాధికారులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా పాతబస్తీ మెట్రో పనులపై అధికారులకు పలు కీలక సూచనలు చేశారు. ఎంజీబీఎస్ నుంచి చాంద్రాయణగుట్ట వరకు 7.5 కి.మీ పొడవునా రోడ్డు విస్తరణ పనులను వీలైనంత త్వరగా పూర్తి చేయాలని సీఎం అధికారులను ఆదేశించారు. ఈ కారిడార్ లో మెట్రో పనులకు సంబంధించి టెండర్ ప్రక్రియను మొదలు పెట్టాలని తెలిపారు. మెట్రో విస్తరణకు సంబంధించి పెండింగ్ లో ఉన్న భూ సేకరణ పనులను వీలైనంత త్వరగా పూర్తి చేయాలని సూచించారు. హైదరాబాద్ మెట్రోకు రోజురోజుకు రద్దీ పెరుగుతున్న నేపథ్యంలో రద్దీకి అనుగుణంగా అవసరమైన చర్యలు తీసుకోవాలన్నారు. ప్రయాణీకుల రద్దీకి తగినట్టుగా మెట్రో రైల్ కు అదనపు బోగీలను జత చేయాలని సూచించారు. ఇందుకు సంబంధించి మెట్రో రైల్ కోచెస్ ను కొనుగోలు చేసేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. మెట్రో ఫేజ్-2 లో భాగంగా ఎంజీబీఎస్ నుంచి చాంద్రాయణగుట్ట వరకు 7.5 కి.మీ కారిడార్ కోసం ప్రస్తుత టెక్నాలజీపై ఢిల్లీ మెట్రోను సంప్రదించి అవసరమైన సలహాలు తీసుకోవాలని అధికారులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచించారు. డిసెంబర్ లో ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్ డిసెంబర్ లో నిర్వహించ తలపెట్టిన ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్ కు సంబంధించి ముందస్తు ఏర్పాట్లపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులకు పలు సూచనలు చేశారు. సమ్మిట్ నిర్వహణకు ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించి ఏర్పాట్లకు అవసరమైన చర్యలు తీసుకోవాలన్నారు. వ్యాపార రంగంలో వివిధ సెక్టార్లలో గుర్తింపు పొందిన ప్రముఖులను సమ్మిట్ లో సన్మానించేలా కార్యాచరణ రూపొందించాలని సూచించారు. ముఖ్యంగా తెలంగాణలో పెట్టుబడులను ఆకర్షించేలా

హైదరాబాద్ మెట్రోను పురోగతి మార్గంలో నడపాలని, మెట్రో సేవలతో ప్రజల రవాణా అవసరాలను తీర్చాలని, తద్వారా రాష్ట్ర ప్రగతికి బాటలు వెయ్యాలని తెలంగాణా ప్రభుత్వం సంకల్పిస్తున్న విషయం తెలిసిందే. ఈక్రమంలో తాజాగా హైదరాబాద్ మెట్రో విస్తరణలో ముఖ్యమైన అడుగు వేసింది తెలంగాణా సర్కార్.పాతబస్తీ మెట్రో కారిడార్ పనులను వేగవంతం చేయాలని ఆదేశం హైదరాబాద్ మెట్రో ఫేజ్-2లో భాగంగా ఎంజీబీఎస్ నుంచి చాంద్రాయణగుట్ట వరకు 7.5 కిలోమీటర్ల పాతబస్తీ మెట్రో కారిడార్ పనులను వేగవంతం చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. నేడు హైదరాబాద్ మెట్రో రైల్ లిమిటెడ్ ఉన్నతాధికారులతో నిర్వహించిన సమీక్షలో ఈ మేరకు ఆయన కీలక సూచనలు చేశారు. ఈ మార్గానికి సంబంధించిన టెండర్ ప్రక్రియను వెంటనే ప్రారంభించాలని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.పెండింగ్‌లో ఉన్న భూసేకరణ, రోడ్డు విస్తరణ పనులపై దిశా నిర్దేశం పెండింగ్‌లో ఉన్న భూసేకరణ, రోడ్డు విస్తరణ పనులను కూడా త్వరితగతిన పూర్తి చేయాలని సూచించారు. రోడ్డు విస్తరణ, భూసేకరణ, టెండర్ల ప్రక్రియలను సమన్వయం చేసుకుంటూ ఎలాంటి జాప్యం లేకుండా ముందుకు వెళ్లాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. పాతబస్తీ ప్రాంతానికి మెట్రో సేవలు అందుబాటులోకి వస్తే అక్కడి ప్రజలకు ట్రాఫిక్ రద్దీ తగ్గుతుందని సీఎం పేర్కొన్నారు.మెట్రో రైళ్లకు కొత్త కోచ్‌లు జత చేయాలన్న సీఎం రేవంత్ రెడ్డి నిర్మాణంలో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించాలని, ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ అధికారులను సంప్రదించి అవసరమైన సాంకేతిక సలహాలు తీసుకోవాలని ఆదేశించారు. నిర్మాణం, నిర్వహణ, ప్రయాణికుల సౌకర్యాలకు అనుగుణంగా ప్రణాళికలు రూపొందించాలని సూచించారు. మరోవైపు ప్రయాణికుల రద్దీ పెరుగుతున్న నేపథ్యంలో మెట్రో రైళ్లకు కొత్త కోచ్‌లు జత చేయాలని కూడా సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. ప్రస్తుత సామర్థ్యానికి అదనంగా కొత్త కోచ్‌లను కొనుగోలు చేసి రైళ్లకు జోడించాలని అధికారులను ఆదేశించారు.200 కోట్ల రూపాయలతో రైతుల కోసం .. అత్యాధునిక పూల, కూరగాయల మార్కెట్.. ఎక్కడంటేమెట్రో సేవల
హైదరాబాద్ మెట్రో విస్తరణలో కీలకమైన పాతబస్తీ కారిడార్ పనుల్లో కదలిక వచ్చింది. హైదరాబాద్ మెట్రో ఫేజ్-2లో భాగంగా ఎంజీబీఎస్ నుంచి చాంద్రాయణగుట్ట వరకు ప్రతిపాదించిన 7.5 కిలోమీటర్ల మెట్రో మార్గం పనులను వేగవంతం చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.. సంబంధిత అధికారులకు ఆదేశించారు. హైదరాబాద్ మెట్రో రైల్ లిమిటెడ్ ఉన్నతాధికారులతో మంగళవారం నిర్వహించిన సమీక్షలో పాతబస్తీ మెట్రోతో పాటు ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా తీసుకోవాల్సిన చర్యలపై సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు జారీ చేశారు.ఎంజీబీఎస్ నుంచి చాంద్రాయణగుట్ట వరకు 7.5 కిలోమీటర్ల మేర నిర్మించనున్న మెట్రో కారిడార్‌కు సంబంధించిన పనులను త్వరితగతిన ముందుకు తీసుకెళ్లాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులకు సూచించారు. ఈ మార్గంలో పెండింగ్‌లో ఉన్న భూసేకరణ ప్రక్రియను వీలైనంత త్వరగా పూర్తి చేయడంతో పాటు మెట్రో నిర్మాణ పనులకు సంబంధించిన టెండర్ ప్రక్రియను త్వరగా ప్రారంభించాలని అధికారులను ఆదేశించారు. రోడ్డు విస్తరణ, భూసేకరణ, టెండర్ల ప్రక్రియలను సమన్వయం చేసుకుంటూ పనుల్లో ఎలాంటి జాప్యం లేకుండా ముందుకు వెళ్లాలని అధికారులకు సీఎం దిశానిర్దేశం చేశారు.పాతబస్తీ ప్రాంతానికి మెట్రో సేవలు అందుబాటులోకి వస్తే అక్కడి ప్రజలకు ప్రజా రవాణా మరింత సులభతరం కావడంతో పాటు నగరంలోని ట్రాఫిక్ రద్దీని తగ్గించేందుకు కూడా ఉపయోగపడే అవకాశం ఉందని పేర్కొన్నారు. పాతబస్తీ కారిడార్ నిర్మాణంలో ప్రస్తుత సాంకేతిక పరిజ్ఞానాన్ని సమర్థంగా వినియోగించాలని సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. ఇందుకోసం ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ అధికారులను సంప్రదించి అవసరమైన సాంకేతిక సలహాలు, సూచనలు తీసుకోవాలని ఆదేశించారు. ఆధునిక టెక్నాలజీని ఉపయోగించడంతో పాటు నిర్మాణం, నిర్వహణ, ప్రయాణికుల సౌకర్యాలకు అనుగుణంగా ప్రణాళికలు రూపొందించాలని సూచించారు.మరోవైపు.. హైదరాబాద్ మెట్రో రైళ్లలో రోజురోజుకూ పెరుగుతున్న ప్రయాణికుల రద్దీపై కూడా సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేకంగా దృష్టి సారించారు. ప్రస్తుతం ఉన్న రైళ్ల సామర్థ్యానికి అదనంగా కొత్త కోచ్‌లను కొనుగోలు చేసి.. వాటిని మెట్రో రైళ్లకు జత చేయాలని అధికారులను ఆదేశించారు

తెలంగాణకు భారీ పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా డిసెంబరులో ‘ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్’ నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతోంది. సదస్సును అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్వహించాలని సీఎం రేవంత్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. గత ఏడాది సదస్సు ద్వారా వచ్చిన పెట్టుబడులు, సాధించిన పురోగతిపై సమగ్ర నివేదిక సమర్పించాలని సూచించారు.గ్లోబల్ సమ్మిట్ ఏర్పాట్లపై సీఎం ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. సదస్సు ద్వారా ప్రపంచస్థాయి పెట్టుబడులను తెలంగాణకు తీసుకురావడంపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు. వివిధ వ్యాపార రంగాలకు చెందిన ప్రముఖులను సదస్సులో సత్కరించేలా ప్రణాళిక రూపొందించాలని ఆదేశించారు. సంస్థాగత ఏర్పాట్లను ముందుగానే పూర్తి చేయాలని సూచించారు.గత ఏడాది సదస్సు తర్వాత తెలంగాణకు వచ్చిన పెట్టుబడులు, వాటి పురోగతిపై వివరాలతో నివేదిక సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. గత అనుభవాలను పరిగణనలోకి తీసుకుని మరిన్ని పెట్టుబడులు సాధించేలా కార్యాచరణ రూపొందించాలని సూచించారు.ఇదే సమావేశంలో హైదరాబాద్ మెట్రో రైలు ఫేజ్-2 పనులపైనా సీఎం సమీక్షించారు. పాతబస్తీలో ఎంజీబీఎస్ నుంచి చాంద్రాయణగుట్ట వరకు 7.5 కిలోమీటర్ల మార్గంలో రోడ్డు విస్తరణ పనులను వేగంగా పూర్తి చేయాలని ఆదేశించారు. మెట్రో పనులకు టెండర్ల ప్రక్రియ ప్రారంభించాలని సూచించారు. పెండింగ్ భూసేకరణను పూర్తి చేసి విస్తరణ ప్రణాళికలను ఖరారు చేయాలని చెప్పారు.హైదరాబాద్ మెట్రోలో పెరుగుతున్న ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా అదనపు కోచ్‌లు సమకూర్చుకోవాలని అధికారులను ఆదేశించారు. పాతబస్తీ మెట్రో మార్గంలో అనుసరించాల్సిన సాంకేతికతపై ఢిల్లీ మెట్రో అధికారులతో సంప్రదించాలని సూచించారు

మెట్రో ప్రాజెక్టులకు కేంద్రం గ్రీన్‌సిగ్నల్ రూ. 21,616 కోట్ల నిధులు విజయవాడలో భూసేకరణ సర్వే ప్రారంభం Ap Metro Rail: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధిలో మైలురాయిగా నిలవనున్న విశాఖపట్నం, విజయవాడ మెట్రో రైలు ప్రాజెక్టులు ఎట్టకేలకు కీలక దశకు చేరుకున్నాయి. అమరావతి కేంద్రంగా నవ్యాంధ్ర శరవేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో, ఈ రెండు ప్రధాన నగరాల్లో సురక్షితమైన, వేగవంతమైన ప్రజా రవాణా వ్యవస్థ అత్యంత ఆవశ్యకముగా మారింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అత్యంత ప్రాధాన్యత ఇస్తూ కేంద్రానికి పంపిన సమగ్ర ప్రాజెక్టు నివేదికలకు (DPR) కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. ఈ ప్రక్రియ ఆర్థిక మదింపు దశకు చేరుకోవడంతో ఈ భారీ ప్రాజెక్టులకు మార్గం సుగమమైంది. Hash Oil Seized: హైదరాబాద్ లో డ్రగ్స్ కలకలం.. ‘స్నాప్‌చాట్ యాప్’లో పెద్దఎత్తున.. వెలుగులోకి విస్తుపోయే నిజాలు నిధుల సమీకరణ, ప్రాజెక్టు అంచనాలు: మొత్తం రూ. 21,616 కోట్ల భారీ వ్యయంతో 84.63 కిలోమీటర్ల మేర తొలిదశ మెట్రో (Ap Metro Rail)నెట్‌వర్క్‌ను నిర్మించాలని ప్రతిపాదించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్త భాగస్వామ్య విధానంలో చెరో 20 శాతం నిధులు సమకూర్చనుండగా, మిగిలిన 60 శాతం నిధులను ఆర్థిక సంస్థలు, విదేశీ బ్యాంకుల రుణాల ద్వారా సేకరించనున్నారు. విశాఖలోని స్టీల్ ప్లాంట్ నుండి నగర పరిసర ప్రాంతాలకు, అలాగే విజయవాడలోని గన్నవరం విమానాశ్రయాన్ని అనుసంధానిస్తూ ఈ కారిడార్లు ఏర్పాటు కానున్నాయి. పనుల పురోగతి, భూసేకరణ: విజయవాడలో మెట్రో స్టేషన్లు, కోచ్ డిపోల కోసం 80 ఎకరాల భూమి అవసరమని గుర్తించిన అధికారులు, 'సోషల్ ఇంపాక్ట్ అసెస్మెంట్' సర్వేను ఇప్పటికే ప్రారంభించారు. బందరు, ఏలూరు రోడ్లు సహా గన్నవరం పరిసరాల్లో ఈ ప్రక్రియ ముమ్మరంగా సాగుతోంది. ఆర్థిక మదింపు పూర్తి కావడమే కాకుండా, టెండరింగ్ ప్రక్రియ ప్రారంభించేందుకు ప్రభుత్వం ముందస్తు అనుమతులు ఇవ్వడంతో త్వరలోనే మెట్రో పనులకు పునాది పడనుంది

న్యూఢిల్లీ: మెట్రోలో ప్రయాణిస్తున్న పలువురు అమ్మాయిలకు ఓ మధ్య వయస్కుడైన వ్యక్తి చేతిలో భయానక అనుభవం ఎదురైంది. తమను ఆ వ్యక్తి రహస్యంగా వీడియో తీస్తున్నాడని ఇద్దరు యువతులు గుర్తించారు. లోక్ నాయక్ భవన్ మెట్రో స్టేషన్ వద్ద, గ్రీన్ పార్క్ వైపు ప్రయాణిస్తున్నప్పుడు ఈ ఘటన జరిగినట్టు సమాచారం. యువతుల్లో ఒకరు తెలిపిన వివరాల ప్రకారం.. తమ సమీపంలో కూర్చున్న ఆ వ్యక్తి తమకు తెలియకుండా ఫొటోలు తీస్తున్నాడనే అనుమానం వచ్చింది. తాము గమనించామని అతనికి తెలిసిన తర్వాత కూడా తమ వైపే చూస్తూ ఉండటంతో పరిస్థితి మరింత అసౌకర్యంగా మారిందని ఆమె ఆరోపించారు. దీంతో మహిళలు అతడిని నిలదీసి, ఫోన్ చూపించాలని కోరారు. తమ ఫొటోలు తీయలేదని అతడు చెప్పాడు. అయితే వారు చూస్తుండగానే తన ఫోన్లోని చిత్రాలు, వీడియోలను తొలగిస్తున్నట్టు కనిపించాడు. ఆ తర్వాత ఫొటోలు తొలగిపోయాయని భావించి వారికి ఫోన్ చూపించాడు. అయితే మహిళలు తర్వాత ఫోన్లోని రీసైకిల్ బిన్ను పరిశీలించగా, అందులో వీడియో కనిపించింది. అనుమతి లేకుండా ఎవరి ఫొటోలు లేదా వీడియోలు తీయడం సరికాదని ఆ యువతులు అతడికి చెప్పారు. ఈ వాగ్వాదానికి సంబంధించిన వీడియోను తర్వాత ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేయగా, అది విస్తృతంగా దృష్టిని ఆకర్షించింది. “మహిళలు నిజంగా సురక్షితమేనా?” అనే శీర్షికతో ఆ వీడియోను పోస్ట్ చేశారు. అనేక మంది సామాజిక మాధ్యమ యూజర్లు ఆ వ్యక్తి ప్రవర్తనపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రోజువారీ ప్రయాణాల్లో మహిళలు ఇలాంటి అసౌకర్యకర పరిస్థితులను ఎందుకు ఎదుర్కోవాల్సి వస్తోందని ప్రశ్నించారు. అనుమతి లేకుండా అపరిచితుల ఫొటోలు తీసే లేదా వీడియోలు రికార్డు చేసే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని మరికొందరు కోరారు. Best Photos Of The Week : ఈ వారం ఉత్తమ చిత్రాలు (ఆగస్టు 09- 16) గచ్చిబౌలి స్టేడియంలో ఘనంగా 'రన్ ఫర్ SMA 2026' (ఫొటోలు) టాలీవుడ్ రాజకుమారుడు.. మహేశ్

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రతిపక్షాల విమర్శలకు బలమైన కౌంటర్ ఇచ్చారు. తనను గుంపు మేస్త్రీ అంటూ బీఆర్ఎస్ నేతలు మరియు ఇతర వ్యతిరేక పక్షాలు చేస్తున్న వ్యాఖ్యలపై స్పందిస్తూ, తాను గుంపు మేస్త్రీనే అని గర్వంగా ప్రకటించారు. తన గుంపు తనకు బలమని, ఆ బలమే తన ప్రతిష్ఠ అని తేల్చి చెప్పారు. ఈ వ్యాఖ్యలు హైదరాబాద్‌లోని ఒక కార్యక్రమంలో చేశారు.తన గుంపులో వాళ్ళంతా కష్టపడి పనిచేస్తున్నారు: సీఎం రేవంత్ ప్రతిపక్షాలు తనపై అవహేళన చేస్తున్నా తాను పట్టించుకోవడం లేదని, దానిని ఎప్పటికప్పుడు స్వీకరించి ముందుకు సాగుతున్నానని సీఎం స్పష్టం చేశారు. తన గుంపులో ఉన్న మంత్రులు, ఎమ్మెల్యేలు, నేతలు, కార్యకర్తలు అందరూ కష్టపడి పని చేస్తున్నారని ప్రశంసించారు. ప్రజలంతా తన గుంపులో భాగమే అని ఆయన తన వ్యాఖ్యల ద్వారా స్పష్టం చేశారు.సార్ అని పిలవడం కంటే రేవంతన్న అని పిలిస్తేనే ఇష్టంకొందరు తాము దొరలమని గొప్పలు చెప్పుకుంటారు. నాకు అలాంటి భావన లేదు. నాకు సార్ అని పిలవడం కంటే రేవంతన్న అని పిలిస్తేనే ఇష్టం అని రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. ప్రజల్లో ఇష్టం, ప్రేమ ఉంటేనే సీఎంను కూడా అన్నా అని పిలుస్తారని ఆయన అన్నారు. మూసీ నది ప్రక్షాళన పనులు చేపడుతుంటే తన కాళ్లలో కట్టెలు పెడుతున్నారని ప్రతిపక్షాలపై మండిపడ్డారు.మెట్రో విస్తరణకు ప్రయత్నాలు చేస్తుంటే అడ్డుకుంటున్నారుహైదరాబాద్ మెట్రోను విస్తరించాలని ప్రయత్నాలు చేస్తుంటే అడ్డుకుంటున్నారని ఆరోపించారు. ఈ పనులు పేద ప్రజలకు ఎంతో ఉపయోగపడతాయని, ఫాంహౌస్‌లలో ఉంటున్న వారికి ఇవి అవసరం లేకపోవచ్చని, కానీ సామాన్యుల జీవనం మెరుగుపరచడానికి ఇవి చాలా ముఖ్యమని రేవంత్ రెడ్డి వివరించారు.గతంలో బీఆర్ఎస్ పాలనలో తెలంగాణ విధ్వంసం అయిందని, ఆ పార్టీకి గోరీ కట్టే మేస్త్రీగా తాను పని చేస్తున్నానని ఇంతకుముందు కూడా ఆయన వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే.హైదరాబాద్ మెట్రోపై కేంద్రం సూచన.. త్వరలోనే ఆ పనులు షురూ!రేవంత్ గుంపు మేస్త్రి వ్యాఖ్యలు

హైదరాబాద్ శివార్లలోని మీర్‌పేట లో బుధవారం (జులై 15) ఉదయం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. నిత్యం రద్దీగా ఉండే.. నందనవనం మెట్రో బార్ సమీపంలోని ఒ ప్లాస్టిక్ గోడౌన్ లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఆ మంటలు వేగంగా వ్యాపించి చూస్తుండగానే ప్లాస్టిక్ మొత్తం కాలి బూడిదైంది. నివాస ప్రాంతాలకు సమీపంలోనే ఈ ప్రమాదం జరగడంతో ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. గోడౌన్ తోపాటు పక్కనే ఉన్న మరో గోడౌన్, సమీపంలోని నివాస భవనాలకు కూడా మంటలు వ్యాపించాయి. సమాచారం అందుకుని ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది గంటల తరబడి శ్రమించి మంటలను అదుపు చేశారు. మీర్‌పేట పోలీసులు ప్రమాద స్థలంలో ప్రజలు గుమిగూడకుండా అడ్డుకుంటూ, సహాయక చర్యలు పర్యవేక్షించారు.ఈ ప్రమాదంలో గో ఎలాంటి ప్రాణనష్టం సంభవించలేదు. ప్రాథమిక అంచనాల ప్రకారం ఈ అగ్నిప్రమాదం కారణంగా భారీ నష్టం వాటిల్లిందని అంచనా వేస్తున్నారు. షార్ట్ సర్క్యాూట్ ప్రమాదానికి కారణమై ఉండొచ్చని ప్రాథమికంగా అంచనాకు వచ్చారు. మంగళగిరి రైల్వే స్టేషన్.. 17న ప్రారంభించనున్న ప్రధాని మోడీ.!

రంగారెడ్డి జిల్లా మీర్‌పేటలో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. నందనవనం మెట్రో బార్ సమీపంలోని ఒక ప్లాస్టిక్ వేర్‌హౌస్‌లో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. క్షణాల్లోనే మంటలు భారీగా ఎగిసిపడటంతో గోడౌన్ పూర్తిగా దగ్ధమైంది.సమాచారం అందుకున్న వెంటనే మూడు అగ్నిమాపక యంత్రాలు ఘటనాస్థలానికి చేరుకున్నాయి. గోడౌన్లో భారీగా ప్లాస్టిక్ సామగ్రి నిల్వ ఉండటంతో మంటలు తీవ్రరూపం దాల్చి, పక్కనే ఉన్న మరో గోడౌన్‌తో పాటు సమీప భవనాలకు కూడా వ్యాపించాయి. అగ్నిమాపక సిబ్బంది గంటల తరబడి శ్రమించి మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. మీర్‌పేట పోలీసులు సైతం ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యల్లో పాల్గొన్నారు.ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం సంభవించలేదని అధికారులు ధ్రువీకరించడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. అయితే, ఈ ప్రమాదం వల్ల భారీగా ఆస్తి నష్టం జరిగినట్లు ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. ఈ ఘటనతో స్థానిక ప్రజలు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని, అగ్నిప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు చేపట్టారు

దార్ల హరీశ్.. జీ తెలుగు న్యూస్‌లో సీనియర్ కంటెంట్ ఎడిటర్‌గా పనిచేస్తున్నాను. నా 8 ఏళ్ల అనుభవంలో ఈనాడు వంటి ప్రముఖ దినపత్రికతో పాటు ఈటీవీ భారత్‌లో పనిచేశాను. 2025 నుంచి ఎంటర్టైన్మెంట్, బిజినెస్, టెక్నాలజీ, హెల్త్, క్రీడలు, రాజకీయాలు వంటి వాటికి సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పనిచేసిన అనుభవం కలదు. Namma Metro Lovers Kissing: ఇంతకాలం ఢిల్లీ మెట్రోలో యువతీ యువకుల ప్రేమాయణాలు, రీల్స్ హంగామా, వెర్రి చేష్టలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తరచూ వైరల్ అవ్వడం అడపాదడపా చూసే ఉంటారు. అయితే, ఇప్పుడు ఐటీ హబ్ బెంగళూరులోని 'నమ్మ మెట్రో' లోనూ అలాంటి ఘటనే వెలుగుచూసింది. మెట్రో రైలులో ఒక యువ జంట బహిరంగంగా ముద్దు పెట్టుకుంటూ అసభ్యంగా ప్రవర్తించిన వీడియో ప్రస్తుతం నెటిజన్లలో తీవ్ర ఆగ్రహాన్ని రేకెత్తిస్తోంది. సిలికాన్ సిటీ బెంగళూరులోని కేఆర్ పురం మెట్రో స్టేషన్‌కు వస్తున్న రైలులో ఈ ఘటన చోటుచేసుకుంది. రైలు ప్రయాణికులతో ఉండగానే, ఒక యువకుడు, యువతి చుట్టుపక్కల వారిని పట్టించుకోకుండా ఒకరినొకరు ముద్దు పెట్టుకుంటూ కనిపించారు. అదే కంపార్ట్మెంట్లో ప్రయాణిస్తున్న మరో ప్రయాణికుడు వీరి ప్రవర్తనను తన మొబైల్ ఫోన్లో రికార్డ్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. నిబంధనలు బేఖాతర్.. మెట్రోలో ప్రయాణికుల భద్రత, క్రమశిక్షణ కోసం బెంగళూరు మెట్రో రైల్ కార్పొరేషన్ లిమిటెడ్ (BMRCL) అనేక కఠినమైన నిబంధనలను అమలు చేస్తోంది. అయినప్పటికీ, కొందరు యువతీ యువకులు వాటిని బేఖాతర్ చేస్తూ బహిరంగ ప్రదేశాలను పార్కులుగా భావిస్తున్నారని నెటిజన్లు మండిపడుతున్నారు. ప్రజా రవాణా వ్యవస్థలో ఇలాంటి నీచమైన పనులకు పాల్పడటంపై ప్రయాణికులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. కొంతకాలం క్రితం కూడా బెంగళూరు మెట్రోలో ఒక జంట కౌగిలించుకుని, ముద్దు పెట్టుకున్న వీడియో హల్చల్ చేసింది. ఇప్పుడు మళ్లీ అలాంటి ఘటనే పునరావృతం కావడంపై ఆందోళన

హైదరాబాద్‌లో మరోసారి ఏసీబీ సోదాల కలకలం రేగింది. హెచ్ఎండీఏ చీఫ్ ఇంజినీర్ బచ్చు రవీందర్ ఇల్లు, కార్యాలయాల్లో ఏసీబీ అధికారులు తనిఖీలు నిర్వహించారు. హైదరాబాద్, జులై 14: నగరంలో మరోసారి ఏసీబీ సోదాల కలకలం రేగింది. హెచ్ఎండీఏ చీఫ్ ఇంజినీర్ బచ్చు రవీందర్ ఇల్లు, కార్యాలయాల్లో ఏసీబీ అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఈరోజు(మంగళవారం) ఉదయం నుంచి సోదాలు కొనసాగుతున్నాయి. బచ్చు రవీందర్‌పై ఆదాయానికి మించిన ఆస్తుల కేసు నమోదు అయిన నేపథ్యంలో ఏసీబీ దాడులు నిర్వహిస్తోంది. అక్రమంగా ఆస్తులను కూడబెట్టినట్టు చీఫ్ ఇంజినీర్‌పై ఆరోపణలు ఉన్నాయి. దీంతో ఏకకాలంలో 12 ప్రాంతాల్లో ఏసీబీ అధికారులు సోదాలకు దిగారు. ఏసీబీ డీఎస్పీ మాజిద్ అలీ ఖాన్ ఆధ్వర్యంలో సోదాలు కొనసాగుతున్నాయి. ఇప్పటికే రవీందర్ నివాసంలో పలు కీలక డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. ఆస్తుల పత్రాలతోపాటు, వివిధ ప్రాంతాల్లో ఇళ్ల స్థలాలను అధికారులు గుర్తించారు. రవీందర్ నివాసంలో బ్యాంకు లాకర్లను గుర్తించినట్లు సమాచారం. ఈరోజు సాయంత్రం వరకు సోదాలు కొనసాగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. కల్యాణదుర్గం ఎమ్మెల్యేకు ప్రశ్న రావణ్ వేధింపులు.. హత్య కేసు నుంచి తప్పించుకునేందుకు బాబా అవతారం.. పోలీసులకు పట్టుబడ్డ రౌడీషీటర్

తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి కేంద్రం నుంచి ప్రాజెక్టులు మరియు మౌలిక వసతుల అనుమతుల సాధనపై ప్రత్యేక దృష్టి పెట్టాలని వీటిపై ప్రధానమంత్రికి, కేంద్ర మంత్రులకు విజ్ఞప్తులు చేయాలని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్ని పార్టీల ఎంపీలతో నిర్వహించిన కీలక సమావేశంలో రాజకీయాలకు అతీతంగా పనిచేయాలన్నారు.రాష్ట్ర ప్రయోజనాల కోసం కలిసి సాగుదాం అన్న సీఎం రేవంత్ రెడ్డిరాష్ట్ర విశాల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని అందరూ కలిసి ముందుకు సాగాలని ఆయన ఈ సందర్భంగా విజ్ఞప్తి చేశారు. ప్రజా భవన్ లో జరిగిన సమావేశంలో ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ప్రభుత్వ సలహాదారు జితేందర్ రెడ్డి, ఎంపీలు మల్లురవి, ఈటెల రాజేందర్, కొండా విశ్వేశ్వర్ రెడ్డి, అనిల్ కుమార్‌యాదవ్, రామసహాయం రఘురామిరెడ్డి, రఘువీర్ రెడ్డి, కడియం కావ్య తదితరులతో నిర్వహించిన సమావేశంలో కీలకవ్యాఖ్యలు చేశారు.హైదరాబాద్‌లో ఐఐఎం ఏర్పాటు కోసం కేంద్రానికి విన్నపంనీటిపారుదల ప్రాజెక్టులు మౌలిక సదుపాయాల అభివృద్ధికి కేంద్రం నుంచి అనుమతులు నిధులు సాధించడం పైన ప్రతి ఒక్కరూ ప్రత్యేకమైన దృష్టి పెట్టాలన్నారు. హైదరాబాద్‌లో ఐఐఎం ఏర్పాటు కోసం కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మల సీతారామన్ ను కలవాల,ని మూసీ నదిపునరుజ్జీవనం ఫేస్ వన్ పనులకు అర్బన్ చాలెంజ్ ఫండ్ కింద అనుమతులు పొందాలని సూచించారు.ప్రధానంగా ఇరిగేషన్, వ్మానాశ్రయాలు, బుల్లెట్ రైలు ప్రాజెక్ట్ లపై చర్యలుఅలాగే తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న మెట్రో ఫేజ్ 2 విస్తరణపైన, ఆర్ఆర్ఆర్ భూసేకరణ పనుల పైన అందరూ వేగంగా పని చేయాలన్నారు. వరంగల్ ఆదిలాబాద్ విమానాశ్రయం అభివృద్ధి, బుల్లెట్ రైలు ప్రాజెక్టులపైన చర్యలు తీసుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. తుంగభద్ర, గోదావరి నీటిపంపకాలు, గోదావరి కావేరి అనుసంధానం, తుమ్మిడిహెట్టి ప్రాజెక్ట్ వంటి కీలక అంశాలపైన, ఏపీ, కర్ణాటక, మహారాష్ట్ర సీఎంలతో జరిగిన చర్చల వివరాలను ఎంపీలకు తెలియజేశారు.శంషాబాద్ ఎయిర్ పోర్ట్ కు అరుదైన గౌరవం

ఇండియా సిలికాన్ వ్యాలీగా పిలవబడే బెంగళూరు నగరంలో మంగళవారం సాయంత్రం భారీ గందరగోళం నెలకొంది. బెంగళూరు మెట్రో పర్పుల్ లైన్లో తలెత్తిన టెక్నికల్ సమస్య కారణంగా వేలాది మంది ప్రయాణీకులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఆఫీసుల నుంచి ఇళ్లకు తిరిగి వెళ్లే పీక్ అవర్స్‌లో ఈ సంఘటన జరగడంతో పలు మెట్రో స్టేషన్లలో ప్రయాణీకులు భారీ క్యూలలో గంటల తరబడి నిలబడాల్సి వచ్చింది. ఇళ్లకు చేరుకోవడానికి వేరే దారి లేక టెక్కీలు, సాధారణ ప్రయాణీకులు రోడ్లపై వెళ్తున్న లారీలు, ట్రక్కులను ఆశ్రయించి ప్రయాణించిన వీడియోలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయ్యాయి.రోడ్లపై ట్రాఫిక్ జామ్.. స్తంభించిన రవాణా వ్యవస్థ మెట్రోలో సాంకేతిక లోపం తలెత్తడంతో రైళ్లలోని ప్రయాణీకులను కిందకు దిగిపోవాలని అధికారులు కోరారు. దీనితో ఒక్కసారిగా వేలాది మంది ప్రయాణీకులు ప్రత్యామ్నాయ రవాణా మార్గాల కోసం రోడ్లపైకి రావడతో బెంగళూరు వీధులన్నీ కిక్కిరిసిపోయాయి. మెట్రో నిలిచిపోవడంతో క్యాబ్‌లు, ఆటోలకు విపరీతమైన డిమాండ్ పెరిగింది. అయితే అవి కూడా దొరక్కపోవడం లేదా ఆటో డ్రైవర్లు రావడానికి నిరాకరించడంతో ప్రయాణీకుల కష్టాలు వర్ణనాతీతంగా మారిపోయాయి. ఈ క్రమంలోనే విసిగిపోయిన ఐటీ నిపుణులు, ఉద్యోగులు గమ్యస్థానాలకు చేరడానికి లారీల వెనుక భాగంలోకి ఎక్కి ప్రయాణించాల్సి వచ్చింది.ఫస్ట్ వరల్డ్ టాలెంట్.. ధర్డ్ వరల్డ్ గవర్నెన్స్ బెంగళూరు నగరంలో తలెత్తిన ఈ దుస్థితిపై ప్రతిపక్ష నేతలు, పౌరుల నుంచి తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ ఘటనపై బెంగళూరు సౌత్ ఎంపీ తేజస్వి సూర్య సోషల్ మీడియా వేదికగా రాష్ట్ర ప్రభుత్వంపై ఘాటుగా స్పందించారు. ఫస్ట్ వరల్డ్ టెక్ టాలెంట్.. థర్డ్ వరల్డ్ గవర్నెన్స్ (అంతర్జాతీయ స్థాయి సాంకేతిక ప్రతిభ.. మూడో ప్రపంచ దేశాల స్థాయి పాలన). ఇదే బెంగళూరు ప్రస్తుత కథ అంటూ ఆయన ట్వీట్ చేశారు. బెంగళూరులో మెట్రో అంతరాయాలు ఈ మధ్య కాలంలో తరచూ జరుగుతున్నాయని, మెట్రో ఆగిపోయిన ప్రతిసారీ నగరం మొత్తం గందరగోళంలో పడిపోతోందని ఆయన మండిపడ్డారు

హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ సమస్యను తగ్గించి, ప్రయాణాన్ని సులభతరం చేసేందుకు మెట్రో రెండో దశ నిర్మాణం జరగనుంది. ఈ విస్తరణతో నగరం చుట్టూ ఉన్న అనేక శివారు ప్రాంతాలకు మెట్రో కనెక్టివిటీ లభించనుంది. మియాపూర్ నుండి పటాన్చెరు, రాయదుర్గం నుండి శంషాబాద్ విమానాశ్రయం వంటి కీలక మార్గాలను ఈ దశలో అభివృద్ధి చేయనున్నారు. కొత్త మార్గాల రాకతో సుదూర ప్రాంతాల ప్రజలు సులభంగా నగరంలోకి ప్రయాణించగలుగుతారు. ఇది దైనందిన జీవితంలో గణనీయమైన మార్పు తీసుకువస్తుంది. ముఖ్యంగా శివారుప్రాంతాల్లో రియల్ బూమ్ మరింత పెరగనంది. కాబట్టి మెట్రో విస్తరణ కంటే ముందే శివారుప్రాంతాల్లో పెట్టుబడులు పెడితే మంచి లాభాలు పొందవచ్చు. హైదరాబాద్ మెట్రో రెండో దశ విస్తరణతో శివారు ప్రాంతాల్లో భూముల ధరలు భారీగా పెరిగే అవకాశం ఉంది. మెట్రో కనెక్టివిటీ ఉన్న ప్రాంతాల్లో భూమికి డిమాండ్ పెరుగుతుంది. ప్రస్తుతం తక్కువ ధరలకు లభిస్తున్న ప్లాట్లు, నివాస గృహాల విలువ రాబోయే కొన్నేళ్లలో కనీసం 20-30 శాతం పెరగవచ్చు. రియల్ ఎస్టేట్ రంగంలో ఇది ఒక సువర్ణావకాశం. మెట్రో మార్గానికి దగ్గరగా ఉన్న గ్రామాలు, చిన్న పట్టణాలు కూడా వేగంగా అభివృద్ధి చెందుతాయి. పెట్టుబడిదారులు దీర్ఘకాలిక లాభాల కోసం ఇప్పుడు పెట్టుబడి పెట్టవచ్చు. ఐటీ కారిడార్ కు దగ్గరగా ఉండటంతో ఇప్పటికే కూకట్ పల్లి, మియాపూర్ వంటి ప్రాంతాల్లో ఇంటి స్థలాలు, ఇండిపెండెంట్ ఇళ్లు, అపార్ట్ మెంట్ ప్లాట్స్ కి మంచి డిమాండ్ ఉంది. మెట్రో సదుపాయం కూడా ఉండటం ఈ ప్రాంతాలకు మరింత ప్లస్ అయ్యింది. ఇక మెట్రో రెండో దశతో లింగంపల్లి, బీరంగూడ, రామచంద్రాపురం, పటాన్ చెరు ప్రాంతాల రూపురేఖలు మారిపోనున్నాయి. ప్రస్తుతం పటాన్ చెరుకు ఔటర్ రింగ్ రోడ్డు అందుబాటులో ఉంది... అయినా ఈ ప్రాంతం ఆశించిన స్థాయిలో డెవలప్ కాలేదు. ఈ పటాన్ చెరు, ఇస్నాపూర్ ప్రాంతాలు అడ్డా కూలీలు, నిర్మాణ కార్మికులు, చిన్నచిన్న పనివారికి నిలయాలుగా మారాయి... ఐటీ

కెనడా పర్యటనకు సీఎం నేతృత్వంలోని బృందానికి ఆహ్వానం కెనడా కంపెనీలు, పెట్టుబడిదారులను తెలంగాణ గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ సమ్మిట్‌కు ఆహ్వానించిన సీఎం రాష్ట్ర ప్రగతి దిశ, ఉద్యోగ కల్పనపై ప్రశంసలు కురిపించిన కెనడా హైకమిషనర్ హైదరాబాద్: కెనడా హైకమిషనర్ టు ఇండియా క్రిస్ కూటర్ బుధవారం ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డిని మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా కెనడా-తెలంగాణ మధ్య వ్యాపారం, వాణిజ్యం, పెట్టుబడులు, ఆవిష్కరణల రంగాల్లో భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసే అంశాలపై ఇరువురు విస్తృతంగా చర్చించారు. అదే సమయంలో ముఖ్యమంత్రి నేతృత్వంలోని తెలంగాణ ప్రతినిధి బృందాన్ని కెనడా పర్యటనకు రావాలని హైకమిషనర్ క్రిస్ కూటర్ ఆహ్వానించారు. ఈ సమావేశంలో తెలంగాణలో చేపడుతున్న భారీ మౌలిక వసతుల ప్రాజెక్టులు, పట్టణాభివృద్ధి కార్యక్రమాలపై ప్రత్యేకంగా చర్చ జరిగింది. ముఖ్యంగా మూసీ నది పునరుజ్జీవన ప్రాజెక్టు, హైదరాబాద్ మెట్రో రైలు విస్తరణ, ప్రతిష్ఠాత్మకంగా ప్రతిపాదించిన ఫ్యూచర్ సిటీ వంటి ప్రాజెక్టుల్లో కెనడా భాగస్వామ్యానికి ఉన్న అవకాశాలను ఇరువురు చర్చలు జరిపారు. తెలంగాణ-కెనడా మధ్య పెరుగుతున్న పారిశ్రామిక, ఆర్థిక సంబంధాలను ప్రస్తావించిన క్రిస్ కూటర్, ఇటీవల కెనడాకు చెందిన ప్రముఖ సంస్థలు తెలంగాణలో పెట్టుబడులు పెట్టడం సంతోషకరమని పేర్కొన్నారు. ఫిరాన్ టెక్నాలజీ గ్రూప్, హైదరాబాద్‌లో తయారీ యూనిట్ ఏర్పాటు చేయాలని నిర్ణయించడం, సీఐబీసీ (సీఐబీసీ) హైదరాబాద్‌లో తన గ్లోబల్ కెపాబిలిటీ సెంటర్ (జీసీసీ)ను ప్రారంభించడం వంటి పరిణామాలు తెలంగాణపై కెనడా కంపెనీల నమ్మకం, విశ్వాసానికి నిలువెత్తు నిదర్శనమని అన్నారు. దాంతోపాటు, ప్రపంచ ప్రసిద్ధి చెందిన క్యాపిటల్ సంస్థ సీపీపీ ఇన్వెస్ట్మెంట్స్ హైదరాబాద్‌కు చెందిన సీటీఆర్ ఎల్ఎస్(CtrlS) డేటా సెంటర్స్ తో వ్యూహాత్మక భాగస్వామ్యం కుదుర్చుకుని ఒక బిలియన్ కెనడియన్ డాలర్ల వరకు పెట్టుబడి పెట్టేందుకు ముందుకు రావడం తెలంగాణ పెట్టుబడి సామర్థ్యాన్ని మరింత బలపరిచిందని ఆయన చెప్పారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలంగాణ ఐటీ, లైఫ్ సైన్సెస్, రక్షణ, ఏరోస్పేస్ రంగాల్లో సాధించిన పురోగతిని

హైదరాబాద్ మెట్రో రైలు అంశంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కలిసి రాజకీయ డ్రామాలకు తెరలేపారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు. శేరిలింగంపల్లిలో నిర్వహించిన పార్టీ శ్రేణుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రేవంత్ రెడ్డి కేంద్రాన్ని ఏదో అడిగినట్లు, కిషన్ రెడ్డి కేంద్రం నుంచి ఏదో సాధించినట్లు చూపిస్తూ ఢిల్లీలో కొత్త నాటకానికి శ్రీకారం చుట్టారని విమర్శించారు. హైదరాబాద్‌లో పరస్పరం విమర్శలు చేసుకుంటూ, ఢిల్లీలో మాత్రం కలిసి కనిపించడం ప్రజలను మభ్యపెట్టడానికేనని అన్నారు. హైదరాబాద్ మెట్రో పరిధిలోని సుమారు 250 ఎకరాల భూములపై రాష్ట్ర ప్రభుత్వం కన్నేసిందని కేటీఆర్ ఆరోపించారు. దాదాపు రూ.30 వేల కోట్ల విలువైన ఆస్తులను కుటుంబ సభ్యులు, అనుచరులకు అప్పగించే భారీ కుంభకోణానికి ప్రణాళికలు సిద్ధమవుతున్నాయని అన్నారు. ఈ ఉద్దేశంతోనే మెట్రో సంస్థ ఎల్అండ్టిని బ్లాక్మెయిల్ చేసి రాష్ట్రం నుంచి వెళ్లగొట్టారని ఆరోపించారు. ప్రైవేట్ సంస్థ అయిన ఎల్‌అండ్‌టి తీసుకున్న రూ.14 వేల కోట్ల అప్పును రాష్ట్ర ప్రజలపై మోపేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోందని కేటీఆర్ విమర్శించారు. మెట్రోపై ప్రేమ ఉన్నట్లు చూపిస్తున్న రేవంత్ రెడ్డి చర్యల వెనుక భారీ ఆర్థిక ప్రయోజనాలు ఉన్నాయని ఆరోపించారు. మెట్రో విస్తరణ విషయంలో కేంద్రం చిత్తశుద్ధితో వ్యవహరించి ఉంటే, గత బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రతిపాదించిన లక్డీకాపూల్–పటాన్చెరు మెట్రో కారిడార్‌కు ఎందుకు ఆమోదం తెలపలేదని ప్రశ్నించారు. ఇతర రాష్ట్రాల్లో చిన్న నగరాలకు కూడా మెట్రో ప్రాజెక్టులు మంజూరు చేసిన కేంద్రం తెలంగాణ విషయంలో వివక్ష చూపిందని ఆరోపించారు. ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ నుంచి విమానాశ్రయం వరకు భూసేకరణ అవసరం లేకుండా చేపట్టిన ఎయిర్పోర్ట్ మెట్రో ఎక్స్‌ప్రెస్ ప్రాజెక్టును రేవంత్ రెడ్డి ప్రభుత్వం రద్దు చేసిందని కేటీఆర్ అన్నారు. ఆ ప్రాజెక్టు కొనసాగి ఉంటే ఇప్పటికి పూర్తై లక్షలాది మంది ప్రయాణికులకు ట్రాఫిక్ సమస్యల నుంచి ఉపశమనం లభించేదని పేర్కొన్నారు. హైదరాబాద్ మెట్రో రైలు ప్రాజెక్టును కాంగ్రెస్ ప్రభుత్వం ప్రారంభించినప్పటికీ, దాన్ని 70

కెనడా హైకమిషనర్ క్రిస్ కూటర్‌తో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి బుధవారం సమావేశం అయ్యారు. ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించారు. హైదరాబాద్, జులై 8 (ఆంధ్రజ్యోతి): కెనడా హైకమిషనర్ క్రిస్ కూటర్‌తో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి (Telangana CM Revanth Reddy) ఈరోజు (బుధవారం) సమావేశం అయ్యారు. ఈ భేటీలో పలు కీలక అంశాలపై చర్చించారు. సీఎం నేతృత్వంలోని తెలంగాణ బృందం కెనడాలో పర్యటించాలని ప్రతినిధులు ఆహ్వానం పలికారు. తెలంగాణ గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ సమ్మిట్‌కు కెనడా కంపెనీలకు సీఎం ఆహ్వానం పలికారు. తెలంగాణలో పెట్టుబడులు పెంచేందుకు కెనడా ప్రతినిధులు ఆసక్తి చూపించారు. మూసీ రివర్‌ఫ్రంట్, మెట్రో విస్తరణ, ఫ్యూచర్ సిటీపై కెనడా ప్రతినిధులతో సీఎం కీలక చర్చలు జరిపారు. హరిత ఆర్థిక వ్యవస్థ, సౌర విద్యుత్ రంగాల్లో కెనడా సహకారం కోరారు సీఎం. హైదరాబాద్‌లో కెనడా యూనివర్సిటీల మల్టీ-క్యాంపస్ ఏర్పాటు ప్రతిపాదన చేశారు. ఐటీ, లైఫ్ సైన్సెస్, డిఫెన్స్, ఏరోస్పేస్లో తెలంగాణ పురోగతిని ముఖ్యమంత్రి వివరించారు. తెలంగాణపై కెనడా కంపెనీల విశ్వాసం పెరుగుతోందని సీఎం రేవంత్, క్రిస్ కూటర్ తెలిపారు. ఉద్యోగాల కల్పన, పెట్టుబడుల ఆకర్షణలో తెలంగాణను హైకమిషనర్ ప్రశంసించారు. ఇంధనం, పట్టణాభివృద్ధి, డిఫెన్స్ రంగాల్లో కెనడా ట్రేడ్ డెలిగేషన్ త్వరలో తెలంగాణకు రానుందని వివరించారు. తెలంగాణ అభివృద్ధికి అన్నివిధాలా సహకరిస్తామని కెనడా ప్రతినిధులు హామీ ఇచ్చారు. సీఎం రేవంత్‌రెడ్డిని కలిసిన అంతర్జాతీయ ప్రతినిధులు సీఎం రేవంత్‌రెడ్డిని అంతర్జాతీయ ప్రతినిధులు కలిశారు. నిలి గిల్బర్ట్ (USA): బ్రూక్‌ఫీల్డ్ అసెట్ మేనేజ్మెంట్ కంపెనీ బోర్డు సలహాదారు, మహేశ్ కొండూరు (USA): అమెరికా ప్రభుత్వ సలహాదారు (critical minerals) మొమెంటం టెక్నాలజీస్ సీఈఓ, అమిత్ మెహ్రా (UK): ఆక్సన్ టెక్నాలజీస్ సీఈఓ, దిలెక్ , నార్వే మాజీ స్టేట్ సెక్రటరీ, థామస్ ఫ్రోలిక్, దక్షిణాఫ్రికా పార్లమెంట్ సభ్యుడు, సెంథిల్ తొండమాన్, సిలోన్ వర్కర్స్ కాంగ్రెస్ (CWC) అధ్యక్షుడు( శ్రీలంక) సీఎంని కలిసిన వారిలో ఉన్నారు. డిజిటల్

ఇబ్బందులు పడుతున్న ప్రయాణికులు.. వృద్ధులు, మహిళలకు కొత్త సమస్యలు హైదరాబాద్ సిటీ: ఆధునిక ప్రజా రవాణా వ్యవస్థగా పేరొందిన మెట్రోరైలు రోజూ లక్షలాది మంది ప్రయాణికులకు సేవలందిస్తోంది. అయితే టికెట్ల జారీ ప్రక్రియను పూర్తిగా డిజిటలైజేషన్ చేయడం వల్ల ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పలు మెట్రో స్టేషన్లలో టికెట్ కౌంటర్లు మూసివేసి, టికెట్ వెండింగ్ మెషీన్లు (టీవీఎంలు) ద్వారానే తీసుకోవాలని సిబ్బంది చెబుతున్నారని ప్రయాణికులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. కీలకమైన అమీర్‌పేట్ మెట్రో స్టేషన్లో కూడా ఇదే పరిస్థితి కనిపిస్తోంది. టికెట్ కొనుగోలు చేసేందుకు వచ్చిన ఓ ప్రయాణికుడు కౌంటర్ మూసి ఉండటంతో అక్కడి సిబ్బందిని సంప్రదించగా, పక్కనే ఉన్న డిజిటల్ యంత్రంలో తీసుకోవాలని చెప్పారు. అయితే ఆ యంత్రం వినియోగంపై అవగాహన లేకపోవడంతో ప్రయాణి కుడు కొంతసేపు అక్కడే ఇబ్బంది పడ్డారు. అవగాహన లేకపోతే.. నగదు రహిత లావాదేవీలు, డిజిటల్ చెల్లింపులను ప్రోత్సహిస్తూ టికెట్ జారీ వ్యవస్థను ఆధునీకరిస్తున్నామని అధికారులు చెబుతున్నారు. అయితే అందరికీ అవగాహన ఉండదని ప్రయాణికులు వాదిస్తున్నారు. వృద్ధులు, గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చే వారు, స్మార్ట్‌ఫోన్ లేదా డిజిటల్ చెల్లింపులపై అవగాహన లేని వారు టికెట్ కొనుగోలు చేసేందుకు ఇబ్బంది పడుతున్నారు. కౌంటర్లు కొనసాగించాలని డిమాండ్ చేస్తున్నారు. ముఖ్యంగా అమీర్‌పేట్, మియాపూర్, ఎంజీబీఎస్, సికింద్రాబాద్, రాయదుర్గం వంటి రద్దీ స్టేషన్లలో కౌంటర్లు కొనసాగించడం అవసరమని సూచిస్తున్నారు. డిజిటలైజేషన్ అవసరమే కానీ.. ప్రజా రవాణా వ్యవస్థలో డిజిటలైజేషన్ అవసరమే అయినప్పటికీ, ప్రజలందరికీ సౌకర్యంగా ఉండేలా అమలు చేయాలని పట్టణ రవాణా నిపుణులు సూచిస్తున్నారు. మానవ సహాయం అందుబాటులో ఉండే హైబ్రిడ్ మోడల్ ఉత్తమ పరిష్కారమని రవాణా రంగ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఈ వార్తలు కూడా చదవండి: నేను రాకముందు పోర్చుగల్‌కు ఒక్క టైటిల్ కూడా లేదు నేను రాకముందు పోర్చుగల్‌కు ఒక్క టైటిల్ కూడా లేదు Read Latest AP News And Telangana News And International News

కిషన్‌రెడ్డి గారూ... మెట్రోపై వ్యక్తిగతంగా జోక్యం చేసుకోండి ఫేజ్-2కు వెంటనే ఆమోదం ఇవ్వాడానికి సహకరించండి ఫేజ్-1ను తెలంగాణకు అప్పగించే ప్రక్రియ వేగవంతానికి కృషి చేయండి ఆలస్యమైతే వేల కోట్ల అదనపు భారం పడే ప్రమాదమని ఆందోళన హైదరాబాద్, జూలై 5: హైదరాబాద్ మెట్రో రైలు విస్తరణ విషయంలో కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి. కిషన్‌రెడ్డి వ్యక్తిగతంగా ప్రత్యేక చొరవ తీసుకోవాలని ముఖ్యమంత్రి ఎ. రేవంత్‌రెడ్డి కోరారు. రాష్ట్ర భవిష్యత్ అభివృద్ధికి అత్యంత కీలకమైన హైదరాబాద్ మెట్రో ఫేజ్-2 ప్రాజెక్టు ఇకపై మరింత ఆలస్యం కాకుండా చూడాలని, కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ, రైల్వే శాఖలతో స్వయంగా మాట్లాడి, పెండింగ్‌లో ఉన్న అంశాలను వెంటనే పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు. ఇదే విషయంపై శనివారం కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డికి సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేకంగా లేఖ రాశారు. హైదరాబాద్ వేగంగా విస్తరిస్తున్న అంతర్జాతీయ నగరమని, పెరుగుతున్న జనాభా, ట్రాఫిక్ సమస్యలు, భవిష్యత్ రవాణా అవసరాలను దృష్టిలో పెట్టుకుంటే మెట్రో ఫేజ్-2 విస్తరణ అత్యవసరమని లేఖలో స్పష్టం చేశారు సీఎం రేవంత్. ఈ ప్రాజెక్టుకు కేంద్ర ప్రభుత్వం తక్షణమే పరిపాలనా, ఆర్థిక ఆమోదం ఇవ్వాలని కోరారు. అలాగే ప్రస్తుతం అమలులో ఉన్న మెట్రో ఫేజ్-1ను తెలంగాణ ప్రభుత్వానికి అప్పగించే ప్రక్రియను కూడా వేగవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ రెండు అంశాలు ఒకదానితో ఒకటి ముడిపడి ఉన్నందున కేంద్ర ప్రభుత్వం మరింత ఆలస్యం చేయకుండా వెంటనే ఆమోదించి, నిర్ణయాలు తీసుకోవాలని కోరారు. మెట్రో ఫేజ్-2 ప్రాజెక్టు అమలుకు సంబంధించి కేంద్రంలోని వివిధ శాఖల మధ్య సమన్వయం అవసరమని లేఖలో గుర్తు చేసిన సీఎం రేవంత్‌రెడ్డి... ఈ విషయంలో కిషన్‌రెడ్డి స్వయంగా ముందుండి ప్రత్యేక చొరవ తీసుకోవాలని కోరారు. కేంద్ర పట్టణాభివృద్ధి, రైల్వే శాఖలతో నేరుగా చర్చించి, పెండింగ్‌లో ఉన్న ఫైళ్లను ముందుకు తీసుకెళ్లాలని, హైదరాబాద్ అభివృద్ధికి అవసరమైన ఈ ప్రాజెక్టును త్వరగా ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి

భోగాపురం ఎయిర్‌పోర్టుకు మెట్రో అనుసంధానం అత్యవసరమన్న నీతిఆయోగ్ 2030 నాటికి 77 కిలోమీటర్ల లైన్ పూర్తి కావాలని స్పష్టీకరణ గ్లోబల్ బెంచ్‌మార్క్ ప్రకారం విశాఖకు 150 కిలోమీటర్ల నెట్వర్క్ అవసరం ముందుచూపు లేనివాడికి ముంగిట్లోనే ముప్పు అన్నట్లుంది విశాఖ మెట్రో నిర్లక్ష్యం. ఒకవైపు అంతర్జాతీయ విమానాశ్రయం రన్‌వే సిద్ధమవుతుంటే.. అక్కడికి వెళ్లే శాశ్వత రవాణా మార్గం మాత్రం పడకేసింది. భోగాపురానికి ‘వైజాగ్ మెట్రో’ అనుసంధానం అత్యవసరమని సాక్షాత్తూ ‘నీతిఆయోగ్’ మాస్టర్‌ప్లాన్ హెచ్చరిస్తున్నా.. కూటమి సర్కారు మాత్రం డీపీఆర్‌లను కాగితాలు దాటించడం లేదు. మెట్రో పట్టాలెక్కకపోతే.. భోగాపురం ప్రయాణం భవిష్యత్తులో నరకప్రాయమైన ‘ట్రాఫిక్ పద్మవ్యూహం’ కావడం ఖాయమని నిపుణులు హెచ్చరిస్తున్నారు. సాక్షి, విశాఖపట్నం: ఉత్తరాంధ్ర ప్రజల ఎన్నో ఏళ్ల కలగా రూపుదిద్దుకున్న భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం అందుబాటులోకి వచ్చే వేళ.. దానికి నగరం నుంచి సమర్థవంతమైన ప్రజారవాణా అనుసంధానం లేకపోవడం ప్రధాన ఆందోళనగా మారింది. వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో శంకుస్థాపన జరిగి వేగంగా నిర్మాణం పూర్తిచేసుకున్న ఈ విమానాశ్రయం ప్రాంతీయ అభివృద్ధికి కీలక మైలురాయిగా నిలవనుంది. అయితే విమానాశ్రయానికి వేలాది మంది ప్రయాణికులు సులభంగా చేరుకునేలా వైజాగ్ మెట్రోను పూర్తి చేయాల్సిన అవసరాన్ని కేంద్ర ప్రభుత్వ సంస్థ అయిన నీతిఆయోగ్ సైతం స్పష్టంగా ప్రస్తావించినా.. రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ఇప్పటికీ కార్యాచరణలో వేగం చూపడం లేదన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. 2030 లక్ష్యం.. ప్రస్తుతం సున్నా.. ఇటీవల విడుదలైన ’విశాఖపట్నం ఎకనమిక్ రీజియన్ గ్రోత్ హబ్ మాస్టర్‌ప్లాన్’లో నీతిఆయోగ్ విశాఖ నగర భవిష్యత్ రవాణా అవసరాలపై స్పష్టమైన దిశానిర్దేశం చేసింది. 2028–2030 మధ్యకాలంలో కనీసం 77 కి.మీ మెట్రో నెట్‌వర్క్‌ను పూర్తి చేయాలని సూచించింది. అయితే ప్రస్తుతం నగరంలో ఒక్క కిలోమీటరు మెట్రో మార్గం కూడా అందుబాటులో లేకపోవడాన్ని నివేదిక ప్రస్తావించింది. అంతేకాదు.. ప్రపంచ స్థాయి ప్రమాణాలను పరిశీలిస్తే విశాఖ పరిమాణంలోని నగరానికి 100 నుంచి 150 కిలోమీటర్లకు పైగా మెట్రో నెట్వర్క్ అవసరమని పేర్కొంది. భవిష్యత్

సర్గం రవి కుమార్. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి రాజకీయాలు, స్పోర్ట్స్, వినోదం, క్రైమ్, జాతీయ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. Revanth Reddy Letter: హైదరాబాద్ మెట్రో రైలుపై కేంద్ర ప్రభుత్వం స్పందించకపోవడంతో తెలంగాణ ముఖ్యమంత్రి అసహనం వ్యక్తం చేశారు. మెట్రో రైలు ఫేజ్-2 నిర్మాణంపై ఢిల్లీ వెళ్లి విజ్ఞప్తులు చేసినా కూడా స్పందన రాకపోవడంతో రేవంత్ రెడ్డి కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాశారు. మెట్రో ఫేజ్-2కు వెంటనే ఆమోదం ఇవ్వాలని కోరుతూ కేంద్ర పట్టణ అభివృద్ధి శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్‌కు లేఖ రాసి విజ్ఞప్తి చేశారు. వెంటనే మెట్రో రైలుపై ప్రత్యేక చొరవ తీసుకోవాలని కోరారు. ఫేజ్-1ను తెలంగాణకు అప్పగించే ప్రక్రియను వేగవంతం చేయాలని అభ్యర్థించారు. ఇక వాటితోపాటు ఎస్బీఐ క్యాప్స్‌ను తక్షణమే నియమించాలని.. ఒకవేళ ఆలస్యమైతే ప్రాజెక్టు వ్యయం మరింత పెరిగే ప్రమాదం ఉందని లేఖలో తెలంగాణ సీఎం ఆందోళన వ్యక్తం చేశారు. మెట్రో రైలు ఫేజ్-2 విస్తరణ ప్రాజెక్టుకు కేంద్ర ప్రభుత్వం వెంటనే ఆమోదం తెలపాలని కేంద్ర మంత్రి ఖట్టర్‌కు రాసిన లేఖలో సీఎం కోరారు. ప్రస్తుతం అమలులో ఉన్న హైదరాబాద్ మెట్రో ఫేజ్-1ను తెలంగాణ ప్రభుత్వానికి బదిలీ చేసే ప్రక్రియను వేగవంతం చేయాలని లేఖలో రేవంత్ రెడ్డి అభ్యర్థించారు. ఈ రెండు అంశాలు పరస్పరం ముడిపడి ఉండడంతో కేంద్ర ప్రభుత్వం ఎలాంటి జాప్యం లేకుండా నిర్ణయాలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఏమాత్రం ఆలస్యం చేసినా ప్రాజెక్టు అమలు దెబ్బతింటుందని, వ్యయం కూడా గణనీయంగా పెరిగే ప్రమాదం ఉందని లేఖలో రేవంత్ రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. జూన్ 24వ తేదీన కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్‌ను కలిసి హైదరాబాద్ మెట్రో ఫేజ్-1, ఫేజ్-2 అంశాలపై విస్తృతంగా చర్చించిన విషయాన్ని

కేంద్రానికి సీఎం రేవంత్ లేఖ రాసారు. కీలక అంశాలను ప్రస్తావించారు. ఢిల్లీ వేదికగా జరిగిన భేటీ లో తీసుకున్న నిర్ణయాల అమలు పైన ప్రశ్నించారు. రెండు వారాలు పూర్తయినా సమాచారం ఏదీ లేకపోవటం పైన ప్రశ్నించారు. మొదటి దశ టేకోవర్ తో పాటుగా రెండో దశ ఆర్దిక వనరుల పైన చర్చలు చేస్తున్నారు. కేంద్రం వెంటనే చర్యలు తీసుకోవాలని రేవంత్ కోరారు.మెట్రో పైన మరోసారి రేవంత్ స్పీడు పెంచారు. ఇప్పటికే ఢిల్లీలో వరుసగా రెండు రోజులు కేంద్ర మంత్రులతో ఇదే అంశం పైన చర్చలు జరిపారు. ఒక ప్రతిపాదనతో అంగీకారానికి వచ్చారు. కాగా, రెండు వారాలు అయినా కేంద్రం నుంచి స్పందన లేకపోవటంతో రేవంత్ మరోసారి కేంద్రానికి లేఖ రాసారు. అందులో కీలక అంశాలను ప్రస్తావించారు. ఢిల్లీలో మనోహర్‌లాల్ ఖట్టర్, అశ్వనీ వైష్ణవ్లతో సమావేశమై చర్చించిన అంశాలను వివరించారు. ఆ సమయంలోనే మొదటి దశ వ్యయాన్ని మళ్లీ మదింపు చేసేందుకు, రెండో దశ వ్యయ అంచనాలను నిర్ధారించేందుకు ఎస్బీఐ క్యాప్స్‌కు బాధ్యతలు అప్పగించారు. క్యాప్స్ బృందంలో కేంద్ర ప్రభుత్వం నుంచి ఒక అధికారి, రాష్ట్ర ప్రభుత్వం నుంచి మరో అధికారిని ప్రతినిధులుగా చేర్చాలని నిర్ణయించారు. రాష్ట్ర ప్రభుత్వం తన ప్రతినిధిగా మెట్రోపాలిటన్ ప్రాంతం, పట్టణాభివృద్ధి శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేశ్ రంజన్‌ను ప్రకటించింది.ఉప ప్రధానిగా అమిత్ షా..? మోదీ నిర్ణయం వెనుక..!?కేంద్రం స్పందించి నిర్ణయం తీసుకోవాలికాగా, కేంద్ర ప్రభుత్వం ఇప్పటివరకు తన ప్రతినిధిని ప్రకటించలేదు. పైగా.. ఎస్బీఐ క్యాప్స్ కూడా బృందాన్ని ఏర్పాటు చేయలేదు. అయితే, మెట్రో తొలి దశ కోసం జపాన్ రుణం రూ 13,600 కోట్లు ఐఆర్పీఎఫ్ సీ వద్ద ఉంది. రాష్ట్ర ప్రభుత్వానికి తొలి దశ ప్రాజెక్టును అప్పగించేందు కు ఎల్ అండ్ టీతో రూ 15 వేల కోట్ల ఒప్పందం ఖరారైంది. ఇందులో రూ.13,600 కోట్లను రుణం రూపంలో తీసుకోవాలనుకున్న ప్రభుత్వం.. మిగతా రూ.1400 కోట్లను ఎల్అండ్టీకి

హైదరాబాద్: హైదరాబాద్ మెట్రో రైలు ప్రాజెక్టు (Hyderabad Metro)పై కేంద్రమంత్రులు కిషన్‌రెడ్డి, మనోహర్‌లాల్ ఖట్టర్‌కు సీఎం రేవంత్‌రెడ్డి (Revanth Reddy) వేర్వేరుగా లేఖలు రాశారు. గత నెల 23, 24 తేదీల్లో జరిగిన సమావేశాల్లో తీసుకున్న నిర్ణయాలు అమలు కావడం లేదని వారి దృష్టికి తీసుకెళ్లారు. మెట్రో రైలుపై అధ్యయన బాధ్యతలు కేంద్ర ప్రభుత్వ నోడల్ ఏజెన్సీ ఎస్బీఐ క్యాప్స్‌కు అప్పగించాలని కోరారు. దీనికి సంబంధించిన షరతులు, విధివిధానాలను వెంటనే ఖరారు చేయాలన్నారు. మెట్రో మొదటి దశ స్వాధీనం, రెండో దశకు అనుమతుల్లో జాప్యం జరుగుతోందని కేంద్రమంత్రులకు రాసిన లేఖలో సీఎం పేర్కొన్నారు. ఈ జాప్యం వల్ల మెట్రో ఫేజ్-1 నిర్వహణలో రోజువారీ ఇబ్బందులు, అనిశ్చితి ఎదురవుతున్నాయన్నారు. ఫేజ్-2 డీపీఆర్‌ల ఆమోదం, నిధుల సమీకరణ ప్రక్రియలు ఆలస్యమవుతున్నాయని పేర్కొన్నారు. దీని ఫలితంగా ప్రాజెక్టు అమలు మరింత ఆలస్యం కావడంతో పాటు వ్యయం గణనీయంగా పెరిగే అవకాశం ఉందన్నారు. కేంద్రమంత్రులు వ్యక్తిగతంగా చొరవ తీసుకోవాలని సీఎం రేవంత్ విజ్ఞప్తి చేశారు. గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు

కేంద్రమంత్రులు కిషన్‌రెడ్డి, మనోహర్ లాల్ ఖట్టర్‌లకు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి లేఖ రాశారు. ఈ లేఖలో పలు అంశాలను ప్రస్తావించారు. ముఖ్యంగా హైదరాబాద్ మెట్రో ఫేజ్-2 గురించి వివరించారు. హైదరాబాద్, జులై 5 (ఆంధ్రజ్యోతి): కేంద్రమంత్రులు కిషన్‌రెడ్డి, మనోహర్ లాల్ ఖట్టర్‌లకు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి (Telangana CM Revanth Reddy) లేఖ రాశారు. ఈ లేఖలో పలు అంశాలను ప్రస్తావించారు. ముఖ్యంగా హైదరాబాద్ మెట్రో ఫేజ్-2 గురించి వివరించారు. మెట్రో ఫేజ్-2కు కేంద్రం ఆమోదం వేగవంతం చేయాలని అభ్యర్థించారు. మెట్రో ఫేజ్-1 స్వాధీనం ప్రక్రియ త్వరగా పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. ఎస్బీఐ క్యాపిటల్స్‌కు వెంటనే బాధ్యతలు అప్పగించాలని విజ్ఞప్తి చేశారు. జాప్యంతో మెట్రో ఫేజ్-2 వ్యయం పెరిగే ప్రమాదం అవకాశం ఉందని వెల్లడించారు. కేంద్రం జోక్యంతో ప్రక్రియ వేగవంతం చేయాలని కిషన్‌రెడ్డిని కోరారు సీఎం రేవంత్‌రెడ్డి. అలాగే, కేంద్రమంత్రి మనోహర్‌లాల్ ఖట్టర్‌కు ముఖ్యమంత్రి లేఖ రాశారు. హైదరాబాద్ మెట్రో ఫేజ్-2కు కేంద్రప్రభుత్వం తక్షణ ఆమోదం ఇవ్వాలని సీఎం విజ్ఞప్తి చేశారు. హైదరాబాద్ మెట్రో ఫేజ్-1 స్వాధీనం, ఫేజ్-2 విస్తరణపై కేంద్రంతో రాష్ట్రం చర్చలు జరిపిందని చెప్పారు. మెట్రో ఫేజ్-1 విలువ నిర్ధారణకు ఎస్బీఐ క్యాపిటల్స్‌ను నియమించాలని తెలంగాణ ప్రభుత్వం ప్రతిపాదించిందని తెలిపారు. ఫేజ్-1 రుణాల రీఫైనాన్సింగ్ అవకాశాలను కూడా ఎస్బీఐ క్యాపిటల్స్ పరిశీలించనుందని వివరించారు. హైదరాబాద్ మెట్రో ఫేజ్-2కు దీర్ఘకాలిక ఆర్థిక ప్రణాళిక రూపొందించాలని విజ్ఞప్తి చేశారు. మెట్రో ఫేజ్-1, ఫేజ్-2 అంశాలను సమగ్రంగా పరిశీలించాలని కోరారు సీఎం రేవంత్‌రెడ్డి. ఫేజ్-2 డీపీఆర్‌ల ఆమోదం, నిధుల సమీకరణ ప్రక్రియ కూడా ఆలస్యం.. ఈ సమావేశంలో తీసుకున్న నిర్ణయాల అమల్లో జాప్యంపై సీఎం ఆందోళన వ్యక్తం చేశారు. ఎస్బీఐ క్యాపిటల్స్‌కు బాధ్యతలు అప్పగించడంలో ఆలస్యం జరుగుతోందని వ్యాఖ్యానించారు. ఫేజ్-1 స్వాధీనం ఆలస్యంతో మెట్రో నిర్వహణపై అనిశ్చితి నెలకొనే అవకాశం ఉందని అన్నారు. ఫేజ్-2 డీపీఆర్‌ల ఆమోదం, నిధుల సమీకరణ ప్రక్రియ కూడా ఆలస్యమవుతోందని
సాయంత్రం 4 దాటితే చాలు క్యూ కట్టాల్సిందే.. హైదరాబాద్ ఫేమస్ మిల్క్ హౌస్ విశేషాలు హైదరాబాద్ పాతబస్తీలో దాదాపు 70 సంవత్సరాలకు పైగా విపరీతమైన ఆదరణ పొందుతున్న ఐకానిక్ స్ట్రీట్ ఫుడ్ సెంటర్ "బి. సత్యనారాయణ మిల్క్ హౌస్"ను 'సమయం తెలుగు' బృందం సందర్శించింది. నాంపల్లి మెట్రో స్టేషన్ సమీపంలో ఉండే ఈ చిన్న దుకాణంలో లభించే మలై పాలు, బన్ మలై, లస్సీ, మజ్జిగల రుచిని స్వయంగా రుచి చూసి లైవ్ రివ్యూ ఇచ్చింది. పక్కా లోకల్ స్ట్రీట్ ఫుడ్ స్టైల్లో ఉండే ఈ మిల్క్ హౌస్‌లో హైజీన్ కాస్త తక్కువగా ఉన్నప్పటికీ, అల్టిమేట్ టేస్ట్‌ను ఇష్టపడే ఫుడ్ లవర్స్‌కు ఇది ఒక అద్భుతమైన స్పాట్ అని తేల్చింది. ఈ వార్తకు సంబంధించిన
మెట్రో రైల్లో ఒక యువతి చదివిన *" How to Kill Men and Get Away With It "* నవల వైరల్ అయిన కొద్ది రోజులకే, మరో వ్యక్తి *" భార్యను బొందపెట్టడం ఎలా ? – RGV"* అనే ఫేక్ బుక్ కవర్‌తో కనిపించడం సోషల్ మీడియాలో కొత్త చర్చకు దారితీసింది. అసలు అలాంటి పుస్తకం మార్కెట్లో లేకపోయినా, ఇది మీమ్ వార్‌గా మారింది. అయితే భార్యాభర్తల మధ్య పెరుగుతున్న హత్యల నేపథ్యంలో ఇలాంటి ట్రెండ్లు సరదా కంటే సమాజంలో మారుతున్న మానసిక ధోరణులపై ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి.సోషల్ మీడియాలో ఎప్పుడు ఏ ట్రెండ్ వైరల్ అవుతుందో చెప్పడం చాలా కష్టం. కొన్నిసార్లు ఒక ఫోటో, ఒక వీడియో లేదా ఒక పుస్తకం కవర్ కూడా నెట్టింట వైరల్ అయి.. దేశవ్యాప్తంగా చర్చకు దారి తీసిన సంఘటనలు ఎన్నో ఉన్నాయి. తాజాగా మెట్రో రైళ్లలో కనిపించిన రెండు పుస్తకాల వ్యవహారం సోషల్ మీడియాను ఊపేస్తోంది. ఈ బుక్ వార్ ఇప్పుడు నెటిజన్ల మధ్య ఆసక్తికరమైన చర్చకు దారితీసింది. అందులో ఒకటి "How to Kill Men and Get Away With It" (పురుషులను చంపి, ఎలాంటి శిక్షా పడకుండా తప్పించుకోవడం ఎలా?) అనే ఇంగ్లిష్ నవల చదువుతున్న యువతి వీడియో వైరల్ కాగా.. దానికి కౌంటర్ అన్నట్టుగా "భార్యను బొందపెట్టడం ఎలా? RGV" అనే ఫేక్ బుక్ కవర్ సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది.కొన్ని రోజుల క్రితం ఓ యువతి మెట్రో రైలులో ప్రయాణిస్తూ.. బ్రిటిష్ రచయిత్రి కేటీ బ్రెంట్ రాసిన "How to Kill Men and Get Away With It" అనే సైకలాజికల్ థ్రిల్లర్ నవలను చదువుతూ కనిపించింది. అయితే ఆ బుక్ పూర్తిగా కల్పిత కథ ఆధారంగా రాసిన ఫిక్షన్ నవల అయినప్పటికీ.. ఒక యువతి మెట్రోలో చదవడంతో.. ఆ ఫోటో సోషల్

హైదరాబాద్ మెట్రోలో రద్దీ సమయాల్లో (పీక్ అవర్స్) ప్రయాణించే వారికి నిరీక్షణ తప్పేలా లేదు. రైళ్లలో రద్దీ సమస్యకు ఇప్పట్లో పరిష్కారం లభించే అవకాశాలు కనిపించడం లేదు. కొత్తగా 60 కోచ్‌లను కొనుగోలు చేసే ప్రక్రియ సుమారు రెండేళ్ల పాటు ఆలస్యమయ్యే సూచనలు కనిపిస్తుండటమే ఇందుకు ప్రధాన కారణం.మెట్రో ఫేజ్-1 నిర్వహణను కేంద్ర ప్రభుత్వం నుంచి తెలంగాణ ప్రభుత్వానికి బదిలీ చేసే ప్రక్రియలో జాప్యం నెలకొంది. ఈ బదిలీ పూర్తయ్యాకే కొత్త కోచ్‌ల కోసం ఆర్డర్ ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం భావించినప్పటికీ, కేంద్రం నుంచి వచ్చిన తాజా ఆదేశాలతో ప్రతిపాదన నిలిచిపోయింది. మెట్రో ప్రాజెక్టు విలువను మరోసారి అంచనా వేయాలని కేంద్రం ఆదేశించడంతో కోచ్‌ల కొనుగోలుతో పాటు ఇతర కీలక నిర్ణయాలు వాయిదా పడ్డాయి.ప్రస్తుతం ఎస్బీఐ క్యాప్స్ సంస్థ ఈ వాల్యుయేషన్ ప్రక్రియను నిర్వహిస్తోంది. ఇది పూర్తవడానికి సుమారు రెండు నెలల సమయం పట్టవచ్చని, పూర్తి స్థాయి బదిలీ ప్రక్రియ 2026 చివరి నాటికి కొలిక్కి వచ్చే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. ఆ తర్వాతే బెంగళూరుకు చెందిన భారత్ ఎర్త్ మూవర్స్ లిమిటెడ్‌కు కోచ్‌ల తయారీ కోసం ఆర్డర్ ఇవ్వడం సాధ్యమవుతుంది. ఆర్డర్ అందిన తర్వాత కోచ్‌ల తయారీ, సరఫరాకు కనీసం 15 నెలల సమయం పడుతుందని సదరు సంస్థ ఇప్పటికే స్పష్టం చేసింది.ప్రస్తుతం హైదరాబాద్ మెట్రోలో ప్రతిరోజూ సుమారు 4.5 లక్షల మంది ప్రయాణిస్తున్నారు. ముఖ్యంగా ఐటీ కారిడార్, నాగోల్-రాయదుర్గం, ఎల్బీ నగర్-మియాపూర్ వంటి మార్గాల్లో ఉదయం, సాయంత్రం వేళల్లో రైళ్లు ప్రయాణికులతో కిక్కిరిసిపోతున్నాయి

పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్ స్టైల్ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. How to kill men VS How to bury your wife row: ఇటీవల సమాజంలో భార్యభర్తలు ఒకర్నిమరోకరు చంపుకొవడమే పనిగా పెట్టుకున్నారు. ప్రతిరోజు ఎక్కడో ఒక చోట భార్యలు తమ భర్తల్ని, భర్తలు తమ భార్యల్ని చంపిన ఘటనలు వార్తలలో నిలిచాయి. మొత్తంగా ఇలాంటి ఘటనలో వివాహ వ్యవస్థ ప్రశ్నార్థకంగా మారింది. చాలా మంది అసలు పెళ్లిలంటేనే హడలెత్తిపోతున్నారు. ఇటీవల సియాగోయల్ ఘటన దేశ వ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారిన విషయం తెలిసిందే. ఈ ఘటన దేశంలో పెళ్లిళ్లకు ప్లాన్ లు చేసుకుంటున్న మగాళ్లను హడలెత్తించేదిగా మారింది. ఇటీవల మెట్రోలో ఇద్దరు అమ్మాయిలు How To Kill Men అన్నబుక్ చదువుతున్న వీడియో నెట్టింట తెగ వైరల్ గా మారింది. ఈ ఘటన మరువక ముందే మరో వీడియో తెరమీదకు వచ్చింది. దీనిలో ఒక వ్యక్తి భార్యను బొందపెట్టడం ఎలా అని చదువుతూ కన్పించాడు. దాన్ని ఆర్జీవీ రాసినట్లు ఉంది. మొత్తంగా మెట్రోలో ఉన్న వాళ్లు అతని వంక చాలా వింతగా చూశారు. మరోవైపు ఈ వీడియో వైరల్ కావడంతో అసలు భార్య భర్తలు అన్యోన్యంగా ఉండాలని కాకుండా ఒకర్నిమరోకరు చంపుకొవడానికి బుక్ లు ఏంటని నెటిజన్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. Read more: Video Viral: మరో మగాడి ప్రాణం బలి..?.. మెట్రోలో How To Kill Men బుక్ చదువుతున్న యువతి.. వీడియోపై నెట్టింట దుమారం.. మరికొంత మంది ఇలాంటి బుక్ లు చదువుతు సమాజంకు ఎలాంటి మెస్సెజ్ లు ఇస్తున్నారని తిట్టిపోస్తున్నారు. మరీ ఇది కావాలని
.webp)
రాష్ట్ర ప్రయోజనాలే పరమావధిగా దిల్లీ వేదికగా కీలక అడుగులు పడ్డాయి. తెలంగాణ రాజధాని హైదరాబాద్ నగర ప్రజా రవాణా వ్యవస్థలో అత్యంత కీలకమైన మెట్రో రైలు ప్రాజెక్టుల పురోగతిపై కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌తో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డి సంయుక్తంగా భేటీ అయ్యారు. దేశ రాజధానిలో జరిగిన ఈ ఉన్నత స్థాయి సమావేశంలో హైదరాబాద్ మెట్రో ఫేజ్-1 బదలాయింపుతో పాటు, ఫేజ్-2 విస్తరణకు సంబంధించిన కీలక అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు. హైదరాబాద్ మెట్రో ఫేజ్-2 విస్తరణ పనులను వేగవంతం చేయడమే లక్ష్యంగా ఈ సమావేశం సాగింది. ఇండియన్ రైల్వే ఫైనాన్స్ కార్పొరేషన్ (IRFC) నుంచి మెట్రో ప్రాజెక్టుకు అందాల్సిన సుమారు రూ. 13,600 కోట్ల రుణాల విడుదలలో ఎదురవుతున్న సాంకేతిక ఇబ్బందులను ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేంద్రమంత్రి దృష్టికి తీసుకెళ్లారు. భాగ్యనగరానికి ఈ నిధులు ఎంతో అవసరమని, పెండింగ్ సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని కోరారు. ఈ కీలక భేటీలో మెట్రో విస్తరణకు సంబంధించిన సమగ్ర నివేదికలను, ఒప్పంద పత్రాలను సీఎం రేవంత్ రెడ్డి కేంద్ర రైల్వే మంత్రికి స్వయంగా అందజేశారు. శంషాబాద్ ఎయిర్పోర్ట్ కనెక్టివిటీతో పాటు నగరంలోని వివిధ ప్రాంతాలను అనుసంధానించే 76.4 కిలోమీటర్ల మేర ప్రతిపాదించిన ఐదు ప్రధాన కారిడార్ల ప్రాధాన్యతను వివరించారు. ఈ ప్రాజెక్టుల నిర్మాణ వ్యయంలో కేంద్రం తన వాటాను సకాలంలో విడుదల చేయాలని విజ్ఞప్తి చేశారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సైతం ఈ చర్చల్లో చురుగ్గా పాల్గొని, తెలంగాణలోని రైల్వే, మెట్రో మౌలిక వసతుల కల్పనకు కేంద్ర ప్రభుత్వం ఎల్లప్పుడూ సానుకూలంగానే ఉంటుందని స్పష్టం చేశారు. సాంకేతిక, ఆర్థిక పరమైన నిబంధనలకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం సహకరిస్తే, కేంద్ర నిధుల విడుదలకు ఎలాంటి అడ్డంకులు ఉండవని పేర్కొన్నారు. ప్రాజెక్టుల పురోగతిపై రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు సమన్వయంతో ముందుకు వెళ్లాలని అభిప్రాయపడ్డారు