© 2026 nimisham.in

న్యూఢిల్లీ: మెట్రోలో ప్రయాణిస్తున్న పలువురు అమ్మాయిలకు ఓ మధ్య వయస్కుడైన వ్యక్తి చేతిలో భయానక అనుభవం ఎదురైంది. తమను ఆ వ్యక్తి రహస్యంగా వీడియో తీస్తున్నాడని ఇద్దరు యువతులు గుర్తించారు. లోక్ నాయక్ భవన్ మెట్రో స్టేషన్ వద్ద, గ్రీన్ పార్క్ వైపు ప్రయాణిస్తున్నప్పుడు ఈ ఘటన జరిగినట్టు సమాచారం. యువతుల్లో ఒకరు తెలిపిన వివరాల ప్రకారం.. తమ సమీపంలో కూర్చున్న ఆ వ్యక్తి తమకు తెలియకుండా ఫొటోలు తీస్తున్నాడనే అనుమానం వచ్చింది. తాము గమనించామని అతనికి తెలిసిన తర్వాత కూడా తమ వైపే చూస్తూ ఉండటంతో పరిస్థితి మరింత అసౌకర్యంగా మారిందని ఆమె ఆరోపించారు. దీంతో మహిళలు అతడిని నిలదీసి, ఫోన్ చూపించాలని కోరారు. తమ ఫొటోలు తీయలేదని అతడు చెప్పాడు. అయితే వారు చూస్తుండగానే తన ఫోన్లోని చిత్రాలు, వీడియోలను తొలగిస్తున్నట్టు కనిపించాడు. ఆ తర్వాత ఫొటోలు తొలగిపోయాయని భావించి వారికి ఫోన్ చూపించాడు. అయితే మహిళలు తర్వాత ఫోన్లోని రీసైకిల్ బిన్ను పరిశీలించగా, అందులో వీడియో కనిపించింది. అనుమతి లేకుండా ఎవరి ఫొటోలు లేదా వీడియోలు తీయడం సరికాదని ఆ యువతులు అతడికి చెప్పారు. ఈ వాగ్వాదానికి సంబంధించిన వీడియోను తర్వాత ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేయగా, అది విస్తృతంగా దృష్టిని ఆకర్షించింది. “మహిళలు నిజంగా సురక్షితమేనా?” అనే శీర్షికతో ఆ వీడియోను పోస్ట్ చేశారు. అనేక మంది సామాజిక మాధ్యమ యూజర్లు ఆ వ్యక్తి ప్రవర్తనపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రోజువారీ ప్రయాణాల్లో మహిళలు ఇలాంటి అసౌకర్యకర పరిస్థితులను ఎందుకు ఎదుర్కోవాల్సి వస్తోందని ప్రశ్నించారు. అనుమతి లేకుండా అపరిచితుల ఫొటోలు తీసే లేదా వీడియోలు రికార్డు చేసే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని మరికొందరు కోరారు. Best Photos Of The Week : ఈ వారం ఉత్తమ చిత్రాలు (ఆగస్టు 09- 16) గచ్చిబౌలి స్టేడియంలో ఘనంగా 'రన్ ఫర్ SMA 2026' (ఫొటోలు) టాలీవుడ్ రాజకుమారుడు.. మహేశ్
Aug 9 2026 9:09 PM | Updated on Aug 9 2026 9:22 PM
న్యూఢిల్లీ: మెట్రోలో ప్రయాణిస్తున్న పలువురు అమ్మాయిలకు ఓ మధ్య వయస్కుడైన వ్యక్తి చేతిలో భయానక అనుభవం ఎదురైంది. తమను ఆ వ్యక్తి రహస్యంగా వీడియో తీస్తున్నాడని ఇద్దరు యువతులు గుర్తించారు. లోక్ నాయక్ భవన్ మెట్రో స్టేషన్ వద్ద, గ్రీన్ పార్క్ వైపు ప్రయాణిస్తున్నప్పుడు ఈ ఘటన జరిగినట్టు సమాచారం. యువతుల్లో ఒకరు తెలిపిన వివరాల ప్రకారం.. తమ సమీపంలో కూర్చున్న ఆ వ్యక్తి తమకు తెలియకుండా ఫొటోలు తీస్తున్నాడనే అనుమానం వచ్చింది.
తాము గమనించామని అతనికి తెలిసిన తర్వాత కూడా తమ వైపే చూస్తూ ఉండటంతో పరిస్థితి మరింత అసౌకర్యంగా మారిందని ఆమె ఆరోపించారు. దీంతో మహిళలు అతడిని నిలదీసి, ఫోన్ చూపించాలని కోరారు. తమ ఫొటోలు తీయలేదని అతడు చెప్పాడు. అయితే వారు చూస్తుండగానే తన ఫోన్లోని చిత్రాలు, వీడియోలను తొలగిస్తున్నట్టు కనిపించాడు.
ఆ తర్వాత ఫొటోలు తొలగిపోయాయని భావించి వారికి ఫోన్ చూపించాడు. అయితే మహిళలు తర్వాత ఫోన్లోని రీసైకిల్ బిన్ను పరిశీలించగా, అందులో వీడియో కనిపించింది. అనుమతి లేకుండా ఎవరి ఫొటోలు లేదా వీడియోలు తీయడం సరికాదని ఆ యువతులు అతడికి చెప్పారు. ఈ వాగ్వాదానికి సంబంధించిన వీడియోను తర్వాత ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేయగా, అది విస్తృతంగా దృష్టిని ఆకర్షించింది.
“మహిళలు నిజంగా సురక్షితమేనా?” అనే శీర్షికతో ఆ వీడియోను పోస్ట్ చేశారు. అనేక మంది సామాజిక మాధ్యమ యూజర్లు ఆ వ్యక్తి ప్రవర్తనపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రోజువారీ ప్రయాణాల్లో మహిళలు ఇలాంటి అసౌకర్యకర పరిస్థితులను ఎందుకు ఎదుర్కోవాల్సి వస్తోందని ప్రశ్నించారు. అనుమతి లేకుండా అపరిచితుల ఫొటోలు తీసే లేదా వీడియోలు రికార్డు చేసే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని మరికొందరు కోరారు.
Best Photos Of The Week : ఈ వారం ఉత్తమ చిత్రాలు (ఆగస్టు 09- 16)
గచ్చిబౌలి స్టేడియంలో ఘనంగా 'రన్ ఫర్ SMA 2026' (ఫొటోలు)
టాలీవుడ్ రాజకుమారుడు.. మహేశ్ బాబు బర్త్ డే స్పెషల్ (ఫొటోలు)
ప్రెగ్నెన్సీతో సమంత.. ఆగస్టు ఎనర్జీతో ఇలా (ఫొటోలు)
వేశ్య పాత్రలో అదరగొట్టిన వామికా గబ్బి.. ఈ బ్యూటీ బ్యాగ్‌గ్రౌండ్ తెలుసా? (ఫొటోలు)
వేటపోతుకు ఇచ్చిన విలువ కూడా డాక్టర్ ప్రియాంకకు లేదా? అనితపై అడ్వకేట్ రజిని ఫైర్
ప్రజల తరపున పోరాడుతుంటే ఎందుకు ఈ నిర్లక్ష్యం..?
BB 10 లోకి శివ్ కుమార్.. ఆ సీక్రెట్ రివీల్..?
నువ్వేం మంత్రివయ్యా! పేకాటలో గెలిస్తే గవర్నమెంట్ ఉద్యోగం ఇచ్చేస్తారా..?