© 2026 nimisham.in

సర్గం రవి కుమార్. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి రాజకీయాలు, స్పోర్ట్స్, వినోదం, క్రైమ్, జాతీయ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. Revanth Reddy Letter: హైదరాబాద్ మెట్రో రైలుపై కేంద్ర ప్రభుత్వం స్పందించకపోవడంతో తెలంగాణ ముఖ్యమంత్రి అసహనం వ్యక్తం చేశారు. మెట్రో రైలు ఫేజ్-2 నిర్మాణంపై ఢిల్లీ వెళ్లి విజ్ఞప్తులు చేసినా కూడా స్పందన రాకపోవడంతో రేవంత్ రెడ్డి కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాశారు. మెట్రో ఫేజ్-2కు వెంటనే ఆమోదం ఇవ్వాలని కోరుతూ కేంద్ర పట్టణ అభివృద్ధి శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్‌కు లేఖ రాసి విజ్ఞప్తి చేశారు. వెంటనే మెట్రో రైలుపై ప్రత్యేక చొరవ తీసుకోవాలని కోరారు. ఫేజ్-1ను తెలంగాణకు అప్పగించే ప్రక్రియను వేగవంతం చేయాలని అభ్యర్థించారు. ఇక వాటితోపాటు ఎస్బీఐ క్యాప్స్‌ను తక్షణమే నియమించాలని.. ఒకవేళ ఆలస్యమైతే ప్రాజెక్టు వ్యయం మరింత పెరిగే ప్రమాదం ఉందని లేఖలో తెలంగాణ సీఎం ఆందోళన వ్యక్తం చేశారు. మెట్రో రైలు ఫేజ్-2 విస్తరణ ప్రాజెక్టుకు కేంద్ర ప్రభుత్వం వెంటనే ఆమోదం తెలపాలని కేంద్ర మంత్రి ఖట్టర్‌కు రాసిన లేఖలో సీఎం కోరారు. ప్రస్తుతం అమలులో ఉన్న హైదరాబాద్ మెట్రో ఫేజ్-1ను తెలంగాణ ప్రభుత్వానికి బదిలీ చేసే ప్రక్రియను వేగవంతం చేయాలని లేఖలో రేవంత్ రెడ్డి అభ్యర్థించారు. ఈ రెండు అంశాలు పరస్పరం ముడిపడి ఉండడంతో కేంద్ర ప్రభుత్వం ఎలాంటి జాప్యం లేకుండా నిర్ణయాలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఏమాత్రం ఆలస్యం చేసినా ప్రాజెక్టు అమలు దెబ్బతింటుందని, వ్యయం కూడా గణనీయంగా పెరిగే ప్రమాదం ఉందని లేఖలో రేవంత్ రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. జూన్ 24వ తేదీన కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్‌ను కలిసి హైదరాబాద్ మెట్రో ఫేజ్-1, ఫేజ్-2 అంశాలపై విస్తృతంగా చర్చించిన విషయాన్ని
ఈ సందర్భంగా ప్రత్యేకంగా గుర్తు చేశారు. ఆ సమావేశాల్లో తీసుకున్న కీలక నిర్ణయాలు ఇప్పటికీ అమలులోకి రాకపోవడంపై ఆందోళన వ్యక్తం చేశారు. జూన్ 24వ తేదీన జరిగిన సమావేశంలో తీసుకున్న నిర్ణయాల ప్రకారం కేంద్ర ప్రభుత్వం గుర్తించిన సంస్థ ఎస్బీఐ క్యాపిటల్ మార్కెట్స్ లిమిటెడ్ (ఎస్బీఐ క్యాప్స్)కు హైదరాబాద్ మెట్రో ఫేజ్-1 విలువ నిర్ధారణ, ఆర్థిక పరిస్థితుల సమీక్ష, తెలంగాణ ప్రభుత్వానికి బదిలీకి అవసరమైన ఆర్థిక పరిశీలన వంటి కీలక బాధ్యతలు అప్పగించాలని అంగీకరించినట్లు లేఖలో రేవంత్ రెడ్డి వివరించారు.
ప్రస్తుతం హైదరాబాద్ మెట్రో రైలు ఫేజ్-1పై ఉన్న అధిక వడ్డీ రుణాలను తక్కువ వడ్డీ రుణాలుగా మార్చే (రిఫైనాన్సింగ్) అవకాశాలను కూడా ఎస్బీఐ క్యాప్స్ పరిశీలించాలని ఈ సమావేశంలో నిర్ణయించినట్లు లేఖలో రేవంత్ రెడ్డి ప్రస్తావించారు. హైదరాబాద్ మెట్రో ఫేజ్-2 నిర్మాణానికి భారీ స్థాయిలో నిధులు అవసరమవుతాయని.. దీంతో అదే సంస్థ ఫేజ్-2కు అవసరమైన ఆర్థిక నమూనా, దీర్ఘకాలిక రుణాల సమీకరణ, నిధుల సమీకరణ మార్గాలు, ఆర్థిక వ్యూహం కూడా రూపొందించాలని సమావేశంలో నిర్ణయించినట్లు లేఖలో కేంద్ర మంత్రికి వివరించారు. ఫేజ్-1 ప్రాజెక్టు విలువ నిర్ధారణ, రుణాల పునర్వ్యవస్థీకరణ, ఫేజ్-2 నిధుల సమీకరణ వంటి అంశాలన్నింటినీ సమగ్రంగా పరిశీలించేలా టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్ (టీఓఆర్) రూపొందించాలని కేంద్రాన్ని కోరారు. ఈ ప్రక్రియ సమన్వయం కోసం మున్సిపల్ పరిపాలన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిని నోడల్ అధికారిగా నియమించినట్లు ప్రస్తావించారు. ఎస్బీఐ క్యాప్స్‌కు బాధ్యతలు అప్పగించాలని నిర్ణయించినా ఇప్పటివరకు నియమించలేదని వెల్లడించారు.
టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్‌ను కూడా ఇంకా ఖరారు చేసి తెలంగాణ ప్రభుత్వానికి పంపలేదని లేఖలో రేవంత్ రెడ్డి గుర్తుచేశారు. దీంతో మెట్రో ఫేజ్-1ను రాష్ట్ర ప్రభుత్వానికి బదిలీ చేసే ప్రక్రియలో అనిశ్చితి నెలకొనడంతో పాటు రోజువారీ నిర్వహణలో కూడా ఇబ్బందులు ఎదురవుతున్నాయని వివరించారు. ఎస్బీఐ క్యాప్స్ నియామకం ఆలస్యమవడంతో హైదరాబాద్ మెట్రో ఫేజ్-2 సమగ్ర ప్రాజెక్టు నివేదికలకు (డీపీఆర్‌లు) కేంద్ర అనుమతులు రావడం మరింత ఆలస్యమవుతోందని ఆందోళన వ్యక్తం చేశారు.