© 2026 nimisham.in

రేణుక గొడుగు జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా 2024 నుంచి పనిచేస్తున్నారు. హెల్త్, లైఫ్‌స్టైల్, ఆస్ట్రోలజీ, బ్రేకింగ్, వైరల్ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన 6 ఏళ్ల అనుభవం ఉంది. New ATM Rules 2026: ఏటీఎం కార్డు వినియోగదారుల విషయానికి వస్తే, ఆర్బీఐ ఆమోదంతో వినియోగదారులపై అదనపు చార్జీల భారం పడనుంది. గతంతో పోలిస్తే ఇప్పుడు ఏటీఎం ఇంటర్‌ఛేంజ్ ఛార్జీలు పెరిగే అవకాశం ఉన్నందున, వినియోగదారుల ఇబ్బందులు మరింత పెరగవచ్చు. ఉదాహరణకు, మీరు మీ సొంత బ్యాంకు ఏటీఎం కాకుండా ఇతర బ్యాంకులకు చెందిన ఏటీఎం యంత్రాల వద్ద బ్యాలెన్స్ చెక్ చేయాలన్నా లేదా నగదు విత్ డ్రా చేయాలన్నా, వారు అధిక చార్జీలను వసూలు చేస్తారు. వైట్ లేబుల్ ఏటీఎం ఆపరేటర్లు కూడా ఆర్బీఐ ఆమోదంతో ఈ అదనపు భారాన్ని వినియోగదారులపై విధించనున్నారు. మీరు ఏటీఎం కార్డును తరచూ ఎక్కువగా ఉపయోగిస్తుంటే, కచ్చితంగా అదనపు ఖర్చులు ఎదుర్కోవాల్సి వస్తుంది. గతంలో ఈ ఛార్జీలను రూ.17 నుండి రూ.19 వరకు పెంచారు. కేవలం బ్యాలెన్స్ ఎంక్వైరీ చేసినా కూడా రూ.7 వరకు వసూలు చేసే అవకాశం ఉంది. గతంలో నెలకు ఒకసారిగా లావాదేవీల ఆధారంగా ఈ చార్జీలను వసూలు చేసేవారు. సాధారణంగా మెట్రో నగరాల్లో నివసించే కస్టమర్లకు ఐదు ఉచిత లావాదేవీలు లభిస్తే, నాన్-మెట్రో లేదా గ్రామీణ ప్రాంతాల్లో నివసించే వారికి మూడు ఉచిత లావాదేవీలు మాత్రమే చేసుకునే అవకాశం ఉంది. ఎంపీసీఐ (MPCI) ఆమోదం, ప్రస్తుత పరిస్థితి.. ప్రస్తుతం ఈ అదనపు చార్జీల విషయంలో ఆర్బీఐ ఆమోదం తెలిపింది. ఈ అంశం ప్రస్తుతం ఎంపీసీ ముందుకు వెళ్ళింది. ఏటీఎం ఆపరేటర్లు తమ నిర్వహణ ఖర్చులు పెరగడం వల్ల, పాత ధరల పద్ధతిని కాకుండా కొత్తగా ధరలను పెంచాలని డిమాండ్ చేస్తున్నారు. అయితే, ఇప్పటివరకు ఆర్బీఐ మాత్రం ఎలాంటి అధికారిక
ధరల సవరణను చేయలేదు.
బ్యాంకులపై పడే ప్రభావం: వివిధ నివేదికలు, రిపోర్టుల ప్రకారం, చిన్న బ్యాంకులు లేదా మైనర్ బ్యాంకులు ఈ చార్జీలు పెంచినప్పుడు తీవ్ర ప్రభావానికి గురవుతాయి. ఎందుకంటే అటువంటి బ్యాంకులకు సొంత ఏటీఎం నెట్వర్క్ చాలా తక్కువగా ఉంటుంది. అవి ఎక్కువగా ఇతర బ్యాంకుల ఏటీఎంలపైనే ఆధారపడి ఉంటాయి. ఈ చార్జీల పెరుగుదల వల్ల కస్టమర్లపై తీవ్ర ప్రభావం పడటమే కాకుండా, ఇంటర్ ఛార్జీల వల్ల తమ సొంత బ్యాంకు ఏటీఎం ద్వారా వచ్చే లాభాలు లేదా చార్జీలు ఇతర బ్యాంకులకు వెళ్లే ప్రమాదం కూడా ఉంది.
అదనపు ఖర్చులు పడకుండా ఉండాలంటే ఏం చేయాలి?: మీకు అధిక చార్జీలు పడకూడదు అనుకుంటే, మీ హోమ్ బ్యాంక్ ఏది అయి ఉండి, ఆ బ్యాంకుకు చెందిన ఏటీఎంను మాత్రమే ఉపయోగించడం ఉత్తమమైన పద్ధతి. ఒకవేళ వేరే బ్యాంకు ఏటీఎంను వాడాల్సి వస్తే, దానికి బదులుగా డిజిటల్ పేమెంట్స్ పద్ధతులను అనుసరించడం చాలా మంచిది. సాధారణంగా మీరు నగదు విత్ డ్రా చేసినట్లయితే, రూ.17 నుండి రూ.19 వరకు వసూలు చేస్తారు. దీనికి అదనంగా బ్యాలెన్స్ ఎంక్వైరీల కోసం రూ.6 నుండి రూ.7 వరకు విధించవచ్చు. ఈ చార్జీల భారం ప్రధానంగా ఏటీఎం కార్డును నిర్ణీత పరిమితి కంటే ఎక్కువగా ఉపయోగించే వారికి మాత్రమే పడుతుంది. బ్యాంక్ కార్డు వినియోగదారులు మెట్రో నగరాల్లో కేవలం ఐదు మాత్రమే ఉచిత లావాదేవీలు చేయగలరు. అదే గ్రామీణ ప్రాంతాల్లో అయితే మూడు ఉచిత లావాదేవీలు మాత్రమే చేసుకునే అవకాశం ఉంటుంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.