
యూకే ముక్కలు కాక తప్పదా ?!
1535 - 1542 హెన్రీ VIII కాలంలో వేల్స్ చట్టాల(Laws in Wales Acts) ద్వారా వేల్స్ ఇంగ్లండ్ లో విలీనం అయింది.

1535 - 1542 హెన్రీ VIII కాలంలో వేల్స్ చట్టాల(Laws in Wales Acts) ద్వారా వేల్స్ ఇంగ్లండ్ లో విలీనం అయింది.

రైల్వే సీట్లు, బెర్త్‌లు నీలం రంగులోనే ఎందుకు ఉంటాయి? దీని వెనుక ఏదైనా ప్రత్యేక కారణం ఉందా అని ఎప్పుడైనా ఆలోచించారా? అసలు కారణాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.. ఇంటర్నెట్ డెస్క్: భారతీయ రైళ్లలో ప్రయాణించేటప్పుడు సీట్లు, బెర్త్‌లు నీలం రంగులో ఉండటాన్ని చాలాసార్లు గమనించే ఉంటారు. అయితే రైల్వే సీట్లకు నీలం రంగునే ఎందుకు ఎంచుకుంటారో ఎప్పుడైనా ఆలోచించారా? రంగులు మన మానసిక స్థితిపై ప్రభావం చూపుతాయని కలర్ సైకాలజీలో చెబుతారు. నీలం రంగును సాధారణంగా ప్రశాంతత, స్థిరత్వంతో అనుసంధానిస్తారు. ఆకాశం, సముద్రం వంటి విశాలమైన ప్రకృతి దృశ్యాలు కూడా నీలం రంగుతో ముడిపడి ఉంటాయి. అందువల్ల ఎక్కువసేపు ప్రయాణించే సమయంలో నీలం వంటి ప్రశాంతమైన రంగు కంటికి సౌకర్యంగా అనిపించవచ్చని భావిస్తారు. రైళ్లలో రోజూ పెద్ద సంఖ్యలో ప్రయాణికులు రాకపోకలు సాగిస్తుంటారు. సీట్లు, బెర్త్‌లపై దుమ్ము, చిన్నపాటి మరకలు పడటం సహజం. లేత రంగులతో పోలిస్తే ముదురు నీలం రంగు ఉపరితలంపై కొన్ని రకాల మరకలు అంత స్పష్టంగా కనిపించకపోవచ్చు. దీంతో సీట్లు తరచూ మురికిగా కనిపించకుండా ఉండటానికి ఈ రంగు ఉపయోగకరంగా ఉండే అవకాశం ఉంది. సుదూర రైలు ప్రయాణాలు గంటల తరబడి సాగుతాయి. కొన్నిసార్లు ఒకటి, రెండు రోజులు కూడా ప్రయాణం చేయాల్సి ఉంటుంది. అలాంటి సమయంలో కోచ్‌లోని రంగులు, వెలుతురు, శబ్దం వంటి అంశాలు ప్రయాణికుల అనుభూతిపై ప్రభావం చూపవచ్చు. నీలం రంగు సాధారణంగా కంటికి ప్రశాంతంగా కనిపించే రంగుల్లో ఒకటిగా భావిస్తారు. Note: ఇందులోని సమాచారం ఇంటర్నెట్లో అందుబాటులో ఉన్న వివరాల ఆధారంగా మీకు అందించడం జరుగుతోంది. ABN ఆంధ్రజ్యోతి దీనిని ధ్రువీకరించడం లేదు. రక్షాబంధన్ 2026.. రాఖీ కట్టే సంప్రదాయం వెనుక ఉన్న పురాణ కథలు

ఏ పండుకు లేని విశిష్టత యాపిల్ పండుకు ఉందని చెప్పడంలో అతిశయోక్తి లేదు.. రంగులోనూ, ఆకారంలోనూ అందరినీ ఆకట్టుకునే ఈ పండు, ఆరోగ్యాన్ని అందించడంలోనూ అగ్రస్థానంలో నిలుస్తుంది. “రోజుకు ఒక యాపిల్ తింటే వైద్యుడికి దూరంగా ఉండవచ్చు” అనే పెద్దలు చెప్పే సామెత దీని ప్రాముఖ్యతను స్పష్టం చేస్తుంది. యాపిల్ పండ్లు సాధారణంగా ఎరుపు, పసుపు పచ్చ, ఆకుపచ్చ, గులాబీ రంగులలో లభిస్తాయి. ఒక సాదారణ ఆపిల్‌లో సుమారు 95 క్యాలరీలు, 25 గ్రాముల కార్బోహైడ్రేట్లు, 4 గ్రాముల ఫైబర్ (పీచు పదార్థం) ఉంటాయి. దీంతోపాటు.. విటమిన్లు విటమిన్ సి కూడా పుష్కలంగా ఉంటుంది. అంతేకాకుండా శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్లు కూడా ఉంటాయి.. ఆహారంతో పాటు యాపిల్ పండును తీసుకోవడం వల్ల మలబద్ధకం సమస్య తగ్గుతుంది. అంతేకాకుండా, ఇది శరీరంలోని ఆమ్లత్వాన్ని సమర్థవంతంగా తగ్గిస్తుంది. క్రమం తప్పకుండా యాపిల్స్ తీసుకునే వారిలో పెద్ద పేగు క్యాన్సర్ వచ్చే అవకాశం గణనీయంగా తక్కువగా ఉంటుందని అధ్యయనాలు సూచిస్తున్నాయి. యాపిల్ పండ్లు వివిధ రకాల తలనొప్పులను తగ్గించడంలో అద్భుతంగా పనిచేస్తాయి. అంతేకాకుండా యాపిల్, జీర్ణక్రియను మెరుగుపరుస్తుందని.. కొలెస్ట్రాల్‌ను తగ్గించి గుండె ఆరోగ్యాన్ని కాపాడుతుంది. రక్తపోటును నియంత్రించడంలో సహాయపడుతుంది. శరీరానికి తగినంత తేమను కూడా అందిస్తుంది. ముఖ్యంగా, బాగా పండిన యాపిల్ పండును తీసుకుని, దాని పైపొరను, మధ్యలోని గట్టి భాగాన్ని తొలగించి, కొద్దిగా ఉప్పు చేర్చి ప్రతిరోజూ ఉదయం ఖాళీ కడుపుతో తింటే రక్తహీనత వల్ల ఏర్పడిన తలనొప్పులు తగ్గుతాయి. ఆశించిన ఫలితాల కోసం దీనిని కనీసం రెండు నుండి మూడు వారాల పాటు తీసుకోవడం అవసరమని డైటీషియన్లు చెబుతున్నారు. యాపిల్ పండు ఆరోగ్యాభివృద్ధికి ఎంతగానో తోడ్పడుతుంది. దీనిని క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల అనేక వ్యాధులు తగ్గిపోతాయి. చంటి పిల్లలకు బాగా పండిన యాపిల్‌ను తినిపించడం ద్వారా వారు ఆరోగ్యవంతంగా పెరుగుతారు. సమగ్ర పోషక విలువలతో కూడిన యాపిల్ పండును మీ రోజువారీ ఆహారంలో భాగం

Pawan Kalyan: టాలీవుడ్లో పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్‌కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సినిమాల్లో తనదైన స్టైల్‌తో కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్న ఆయన ఇప్పుడు రాజకీయాల్లో కూడా కీలక పాత్ర పోషిస్తున్నారు. సెప్టెంబర్ 2న పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా అభిమానులు సందడి చేయడానికి సిద్ధమవుతున్నారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ గురించి ఆసక్తికరమైన ఐదు విషయాలను ఒకసారి తెలుసుకుందాం. పవన్ కళ్యాణ్‌ను అభిమానులు ప్రేమగా పవర్‌స్టార్ అని పిలుస్తుంటారు. ఆయన సినిమాల్లో కనిపించే ప్రత్యేకమైన స్టైల్, యాక్షన్ సన్నివేశాలు, డైలాగ్ డెలివరీ ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి. దీంతో పవర్‌స్టార్ అనే పేరు ఆయనకు బలమైన గుర్తింపుగా మారింది. పవన్ సినిమా విడుదలైతే అభిమానులు పండుగలా సెలబ్రేట్ చేసుకోవడం సాధారణంగా మారిపోయింది. పవన్ కళ్యాణ్‌కు మార్షల్ ఆర్ట్స్ అంటే చాలా ఇష్టం. ఆయన కరాటేలో శిక్షణ తీసుకున్నారు. ఆయనకు కరాటేలో బ్లాక్ బెల్ట్ కూడా ఉంది. సినిమాల్లోని యాక్షన్ సన్నివేశాల్లో ఆయన చూపించే ప్రత్యేకమైన శైలి వెనుక ఈ శిక్షణ కూడా ఒక కారణంగా చెప్పవచ్చు. మార్షల్ ఆర్ట్స్ తనకు క్రమశిక్షణ, ఏకాగ్రత, ఆత్మ నియంత్రణ నేర్పాయని పవన్ గతంలో చెప్పారు. సినిమా రంగంలో స్టార్‌గా కొనసాగుతున్న సమయంలోనే పవన్ కళ్యాణ్ రాజకీయాల్లోకి వచ్చారు. 2014లో జనసేన పార్టీని స్థాపించారు. సామాన్య ప్రజల సమస్యలను ప్రస్తావిస్తూ ఆయన రాజకీయ ప్రయాణాన్ని కొనసాగించారు. సినిమాలతో పాటు రాజకీయాల్లో కూడా తనదైన ముద్ర వేసుకున్నారు. పవన్ కళ్యాణ్ ప్రముఖ నటుడు చిరంజీవికి తమ్ముడు. మెగాస్టార్ కుటుంబం నుంచి వచ్చినప్పటికీ పవన్ కళ్యాణ్ తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్నారు. సినిమాల్లో తనదైన శైలితో ప్రత్యేక అభిమాన వర్గాన్ని ఏర్పాటు చేసుకున్నారు. పవన్ కళ్యాణ్ ఎంత పెద్ద స్టార్ అయినప్పటికీ సాధారణ జీవనశైలిని ఇష్టపడతారని ఆయనను దగ్గరగా చూసిన వారు చెబుతుంటారు. అవసరం లేని ఆర్భాటాలకు దూరంగా ఉండటం ఆయన వ్యక్తిత్వంలో కనిపించే ప్రత్యేకత

చెక్‌పై మొత్తాన్ని పదాల్లో రాసిన తర్వాత ఖాళీ స్థలం ఉంటే.. దానిని ఉపయోగించి ఎవరైనా అదనపు పదాలను చేర్చే అవకాశం ఉంటుంది. ఉదాహరణకు మీరు “Ten Thousand” అని మాత్రమే రాసి.. ఆ తర్వాత ఎక్కువ ఖాళీ స్థలం వదిలితే, అందులో అదనపు పదాలు చేర్చేందుకు ప్రయత్నించవచ్చు. దీంతో అమౌంట్ మొత్తం పెరిగే అవకాశం ఉంటుంది. అందుకే మొత్తాన్ని పదాల్లో రాసిన వెంటనే ‘Only’ అని రాస్తారు. దీనివల్ల ఆ మొత్తానికి సంబంధించిన వాక్యం అక్కడితో పూర్తయిందని స్పష్టమవుతుంది. అదనపు పదాలు చేర్చే అవకాశం ఉండదు. చెక్‌పై ‘Only’ రాయకపోతే చెక్ చెల్లదు అని కాదు. ప్రతి చెక్‌పై ‘Only’ రాయాలని RBI ప్రత్యేకంగా తప్పనిసరి చేసిన నిబంధన అంటూ ఏం లేదు. అయితే చెక్‌లో మొత్తాన్ని స్పష్టంగా రాయడం, ఎలాంటి ఖాళీలు వదలకుండా జాగ్రత్త పడటం వంటి భద్రతా సూచనలు చాలా ముఖ్యమైనవి. అందుకే బ్యాంకులు కూడా చెక్ రాసేటప్పుడు మొత్తాన్ని పదాల్లో రాసిన తర్వాత ‘Only’ చేర్చాలని సాధారణంగా సూచిస్తుంటాయి. చెక్‌లో మొత్తాన్ని సాధారణంగా రెండు విధాలుగా రాస్తారు. ఒకటి అంకెల్లో, మరొకటి పదాల్లో. ఈ రెండు చోట్ల ఉన్న మొత్తం తప్పనిసరిగా ఒకేలా ఉండాలి. ఉదాహరణకు రూ.5,000 చెల్లించాలంటే అంకెల్లో రూ. 5,000 అని రాసి.. పదాల్లో “ఐదు వేల రూపాయాలు మాత్రమే” అని రాయాలి. అంకెల్లో ఒక మొత్తం, పదాల్లో మరో మొత్తం ఉంటే చెక్ ప్రాసెసింగ్ సమయంలో సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. అందుకే చెక్ ఇచ్చే ముందు రెండు చోట్ల రాసిన మొత్తాన్ని ఒకసారి కచ్చితంగా పరిశీలించాలి. చెక్ నింపేటప్పుడు కొన్ని చిన్న జాగ్రత్తలు పాటిస్తే మోసాల అవకాశాన్ని తగ్గించుకోవచ్చు. మొత్తాన్ని పదాల్లో రాసిన తర్వాత చివర ‘Only’ రాయడం మంచిది. మొత్తాన్ని రాసే సమయంలో అవసరం లేని ఖాళీ స్థలం వదలకండి. అంకెల్లో, పదాల్లో ఉన్న మొత్తం ఒకేలా ఉందో చూడండి. చెక్‌పై ఉన్న

ఏపీ రాజకీయాలు కొత్త మలుపు తీసుకుంటున్నాయి. డీఎస్సీలో అక్రమాలు జరిగాయని వైసీపీ నిరసనలు కొనసాగిస్తోంది. ప్రభుత్వం అసెంబ్లీ వేదికగా వివరణ ఇచ్చింది. మండలిలోనూ చర్చ జరగాలని వైసీపీ డిమాండ్ చేస్తోంది. ఇదే సమయంలో జగన్ హయాంలో గ్రూపు-1 పరీక్షల్లోనూ అక్రమాలు జరిగాయని టీడీపీ ఆరోపిస్తోంది. వీటి పైన మాజీ సీఎం జగన్ స్పందించారు. గ్రూపు -1 అక్రమాల పై సీబీఐ విచారణకు తాను సిద్దమని.. డీఎస్సీ పైనా సీబీఐ విచారణ చేయించటానికి చంద్రబాబు సిద్దమా అంటూ జగన్ సవాల్ చేసారు.డీఎస్సీ లో అక్రమాల పైన మాజీ సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు చేసారు. ఇప్పటి వరకు తాము చేస్తున్న ఆరోపణలకు అనుగుణంగానే ప్రభుత్వం అసెంబ్లీలో ఇచ్చిన వివరణలో అంశాలు ఉన్నాయని పేర్కొన్నారు. ఇదే సమయంలో ఏపీపీఎస్సీ గ్రూపు-1 పరీక్షల నిర్వహణలో జగన్ హయాంలో అక్రమాలు జరిగాయని తాజాగా అసెంబ్లీ వేదికగా ప్రభుత్వం ఆరోపణలు చేసింది. దీని పైన స్పందించిన జగన్ తమ హయాలో ఎలాంటి అవకతవకలు జరగలేదనే అంశం.. చంద్రబాబు వేసిన సిట్ తేల్చిందని జగన్ చెప్పుకొచ్చారు. అయినా, దుష్ప్రచారం ఆపటం లేదని పేర్కొన్నారు. ఈ క్రమంలో చంద్రబాబు, లోకేష్ కు ఓపెన్ ఛాలెంజ్ చేసారు. ఏపీపీఎస్సీ గ్రూపు-1 చంద్రబాబు హయాంలోనే నోటిఫికేషన్ రిలీజ్ అయిందని చెప్పారు. ఎన్నికల ముందు హడావుడిగా ఆయన విడుదల చేసారని.. తాము అధికారం చేపట్టకముందే ప్రిలిమ్స్ పూర్తయ్యాయని చెప్పారు. అందు లో పాస్ అయిన వారికి మెయిన్, ఇంటర్వ్యూలు నిర్వహించామని వివరించారు.పాఠశాలలకు, కార్యాలయాలకు వరలక్ష్మీ వ్రతం సెలవు- తాజా ఉత్తర్వులు..!!ప్రధానికి జగన్ లేఖగ్రూపు-1 పరీక్షల్లో ఎలాంటి అవకతవకలు జరగలేదని చంద్రబాబు వేసిన సిట్ తేల్చిందని జగన్ పేర్కొన్నారు. వాల్యుయేషన్ లో ఎలాంటి తప్పులు జరగలేదని చెప్పినట్లు వివరించారు. అయినా, తప్పుడు ప్రచారాలు చేసారన్నారు. గ్రూపు- పరీక్ష నిర్వహణ పైన సీబీఐ విచారణకు తాను రెడీ అని జగన్ ప్రకటించారు. 2025 డీఎస్సీ పై విచారణకు చంద్రబాబు సిద్దమా అని

రెండు వేర్వేరు రాష్ట్రాలు, రెండు వేర్వేరు ప్రభుత్వాలు.. కానీ రాజధాని మాత్రం ఒకటే. ఇది మరెక్కడో కాదు.. మన దేశంలోనే. పంజాబ్, హర్యానా రాష్ట్రాలు రెండింటికీ ఏకైక రాజధానిగా ఉన్న నగరం చండీగఢ్.. అసలు.. రెండు రాష్ట్రాలకు ఒకే నగరం రాజధానిలా ఎలా మారింది..? భారతదేశంలోని మొదటి ప్లాన్డ్ సిటీగా పిలిచే చండీగఢ్ నగరం కథేంటి? ఈ నగరం ఎందుకు అంత స్పెషల్..? ఈ విషయం ఇప్పుడు తెలుసుకుందాం... ఈ ప్రాంతంలో ప్రసిద్ధ చండీ మందిరం ( దుర్గా దేవి గుడి) ఉంది. అలాగే ఇక్కడ ఫేమస్ గఢ్( కోట) కూడా ఉంది. ఈ రెండు పదాలను కలిపి చండీగఢ్ అనే పేరు పెట్టారు. 1947లో దేశ విభజన జరిగినప్పుడు.. పంజాబ్ పాత రాజధాని ‘లాహోర్’ పాకిస్తాన్ లోకి వెళ్లిపోయింది. దీంతో పంజాబ్ కోసం కొత్త రాజధాని నిర్మించాల్సిన అవసరం వచ్చింది. అప్పుడు చండీగఢ్ ని రాజధానిగా నియమించారు. స్వతంత్ర భారత ప్రతిభను ప్రపంచానికి చూపించేలా ఒక ఆధునిక నగరాన్ని కట్టాలని అప్పటి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ అనుకున్నారు.ఫ్రెంచ్ ఆర్కిటెక్ట్ లీ కార్బుసియర్ ఈ నగరానికి ప్లాన్ వేశారు. విచిత్రమేంటంటే.. మనిషి శరీరం ఆధారంగా ఈ నగరాన్ని డిజైన్ చేశారు. క్యాపిటల్ కాంప్లెక్స్ తల భాగంలో, సిటీ సెంటర్ గుండె ఆకారంలో, పార్కులు, చెట్లు ఊపిరితిత్తులు గా విభజించారు. ఇక ఈ నగరాన్ని 'సెక్టర్లు'గా విభజించారు. ప్రతీ సెక్టార్లోనే బడులు, మార్కెట్లు, పార్కులు ఉండేలా ప్లాన్ చేశారు. అయితే చండీగఢ్‌లో సెక్టర్ 13 ఉండదు. 1966లో పంజాబ్ నుండి 'హర్యానా' ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడింది. మన తెలుగు రాష్ట్రాలు విడిపోయినట్లే పంజాబ్, హర్యానా రెండు రాష్ట్రాలుగా విడిపోయాయి. అయితే.. విభజన తర్వాత చండీగఢ్ మాదంటే మాదని ఇరు రాష్ట్రాలూ పట్టుబట్టాయి. దాంతో కేంద్ర ప్రభుత్వం ఒక పరిష్కారం కనుగొంది. చండీగఢ్‌ను ఒక కేంద్రపాలిత ప్రాంతంగా (UT) ప్రకటిస్తూ, రెండింటికీ ఉమ్మడి రాజధానిగా చేసింది

మన చుట్టూ కనిపించే దృశ్యాలు, వాసనలు, శబ్దాలు మెదడుకు నిరంతరం సంకేతాలను పంపుతుంటాయి. మనకు ఇష్టమైన ఆహారం కనిపించినప్పుడు లేదా దాని వాసన వచ్చినప్పుడు మెదడు దాన్ని ఒక ముఖ్యమైన సంకేతంగా గుర్తిస్తుంది. అప్పుడు నాడీ వ్యవస్థ చురుకుగా మారి శరీరాన్ని తినడానికి సిద్ధం చేయడం ప్రారంభిస్తుంది. లాలాజలం ఎక్కువగా ఉత్పత్తి కావడం, జీర్ణక్రియకు సంబంధించిన కొన్ని ప్రక్రియలు మొదలవడం వంటి మార్పులు చోటుచేసుకోవచ్చు. అంటే ఆహారం మొదటి ముద్ద నోటిలోకి వెళ్లకముందే శరీరం దాని కోసం సిద్ధమవుతుందన్నమాట. అందుకే రుచికరమైన వంటకం కనిపించిన వెంటనే నోరూరుతుంది. ఆహారం తినకముందే జీర్ణవ్యవస్థ సిద్ధం కావడాన్ని వైద్య పరిభాషలో ‘సెఫాలిక్ ఫేజ్ ఆఫ్ డైజెషన్’ (Cephalic Phase of Digestion) అంటారు. ఇది జీర్ణక్రియలో ప్రారంభ దశ. ఆహారం తినడం, చూడడం, దాని వాసన పీల్చడం, దాని గురించి ఆలోచించడం వంటి విషయాలు ఈ ప్రక్రియను ప్రేరేపించవచ్చు. ఉదాహరణకు చిన్నప్పటి నుంచి ఇష్టమైన వంటకం వాసన రాగానే ఒక్కసారిగా ఆకలి పెరగడం దీనికి ఒక ఉదాహరణ. మన మెదడు ఆహారానికి సంబంధించిన సంకేతాలను గుర్తించిన తర్వాత నాడీ వ్యవస్థ ద్వారా శరీరానికి సంకేతాలు పంపుతుంది. దీంతో లాలాజలం, జీర్ణక్రియకు సంబంధించిన ఇతర స్రావాల ఉత్పత్తి పెరగవచ్చు. ఇలా ఆహారం కడుపులోకి చేరకముందే జీర్ణవ్యవస్థ పని ప్రారంభించడానికి సిద్ధమవుతుంది. నోటిలో ఉత్పత్తి అయ్యే లాలాజలం కేవలం నీటిలాంటి ద్రవం కాదు. ఆహారం తీసుకోవడంలో దీనికి ముఖ్యమైన పాత్ర ఉంటుంది. ఇది ఆహారాన్ని తడిగా, మెత్తగా మార్చుతుంది. దీంతో ఆహారాన్ని నమలడం, మింగడం సులభమవుతుంది. అలాగే లాలాజలం జీర్ణక్రియ ప్రారంభ దశలో కూడా సహాయపడుతుంది. అందుకే ఇష్టమైన ఆహారం చూసినప్పుడు నోరూరడం శరీరంలో జరుగుతున్న సహజ ప్రక్రియ. ఇక్కడ మరో విషయం గుర్తుంచుకోవాలి. నోరూరడం అంటే తప్పనిసరిగా తీవ్రమైన ఆకలి ఉందని కాదు. కడుపు నిండుగా ఉన్నప్పటికీ ఇష్టమైన ఆహారం కనిపిస్తే లాలాజలం ఎక్కువగా రావచ్చు. ఎందుకంటే ఆకలి

భారతీయులకు సాయంత్రం సమయంలో సమోసా ప్రతిరోజూ తినేవారు ఎంతో మంది. గల్లీలోని చిన్న బండి మొదలుకొని పెద్ద ఫైవ్ స్టార్ హోటళ్ల దాకా ఎక్కడ చూసినా కనిపించే రుచికరమైన స్నాక్ ఇది. నిజానికి సమోసా మనదేశానికి చెందినది కాదు. సమోసా మూలాలు 10వ శతాబ్దానికి చెందిన మధ్యప్రాచ్యం , మధ్య ఆసియా ప్రాంతాల్లో ఉన్నాయి. ప్రాచీన పర్షియాలో దీనిని 'సంబోసగ్' (Sanbosag) లేదా 'సంబుసక్' (Sambusak) అని పిలిచేవారు. ఆ కాలంలో చాలా దూర ప్రాంతాలకు ప్రయాణించే వర్తకులు, యాత్రికులు మార్గమధ్యంలో ఆహారంగా తీసుకువెళ్లడానికి మైదా పిండి పొరల్లో మాంసం, డ్రై ఫ్రూట్స్, నట్స్ నింపి నిప్పులపై లేదా నూనెలో వేయించి సమోసాలను తయారుచేసేవారు. ఈ విదేశీ వంటకం 13వ, 14వ శతాబ్దాల కాలంలో సిల్క్ రోడ్ వర్తకులు, మధ్య ఆసియా నుంచి వచ్చిన ముస్లిం పాలకులు, వంటవాళ్ల ద్వారా భారత్ లోకి అడుగుపెట్టింది. ఢిల్లీ సుల్తానుల పాలనలో రాజభవనాల్లో జరిగే విందులలో సమోసాను ఎంతో ప్రత్యేకమైన వంటకంగా వడ్డించేవారని ప్రసిద్ధ రచయిత అమీర్ ఖుస్రో, మొరాకో యాత్రికుడు ఇబ్న్ బతూతా తమ రచనల్లో చెప్పారు. అప్పట్లో ఇది మాంసంతో కూడిన రాజభోజనంగా మాత్రమే ఉండేది. అయితే 16వ శతాబ్దంలో పోర్చుగీసు వర్తకులు భారతదేశానికి బంగాళాదుంపలను (ఆలూ) పరిచయం చేయడంతో సమోసా రుచి మారింది. భారతీయ వంటగాళ్లు మాంసానికి బదులుగా ఉడకబెట్టిన ఆలూ, పచ్చి బఠానీలు, అల్లం, ధనియాలు, గరం మసాలాలను స్టఫింగ్‌గా ఉపయోగించడం ప్రారంభించారు. మాంసం బదులు బంగాళాదుంపలు చేరడంతో సమోసా సామాన్య ప్రజల నిత్య జీవితంలో భాగమైంది. తక్కువ ధర, తింటే పొట్ట నిండే గుణం, అద్భుతమైన మసాలా రుచి వల్ల ఇది దేశవ్యాప్తంగా విపరీతమైన ఆదరణ దక్కించుకుంది. ప్రాంతాన్ని బట్టి ఉత్తరాదిలో ఆలూ-సమోసా, హైదరాబాద్‌లో కీమా సమోసా, గుజరాత్లో వెజ్-పన్నీర్ సమోసాలుగా వివిధ రూపాల్లో తయారుచేస్తున్నారు. పుదీనా చట్నీ, తీపి చింతపండు చట్నీలతో వేడివేడిగా వడ్డించే సమోసా.. దేశ సరిహద్దులు

World Photography Day: చిత్రాల వెనుక ఎవరికి తెలియని ఆసక్తికర విషయాలు ఇవిగో.! World Photography Day: ప్రపంచవ్యాప్తంగా ప్రతి సంవత్సరం ఆగష్టు 19వ తేదీన వరల్డ్ ఫోటోగ్రఫీ డే ఘనంగా నిర్వహిస్తారు. కళ, నైపుణ్యం, విజ్ఞాన శాస్త్రం, చరిత్రను ఆస్వాదించే ఫోటోగ్రఫీ ప్రియులు ఈ రోజును ప్రత్యేకంగా జరుపుకుంటారు. ఈ ప్రత్యేక సందర్భాన్ని పురస్కరించుకుని ఫోటోగ్రఫీకి సంబంధించిన కొన్ని ఆసక్తికరమైన అంశాలు, చారిత్రక విశేషాలు తెలుసుకోవడం ఎంతో ముఖ్యం. ఫోటోగ్రఫీ ఆవిర్భావం వెనుక అనేక ఆసక్తికరమైన మైలురాళ్లు ఉన్నాయి. ఈ డే ఏర్పాటు వెనుక ఒక భారతీయ నిపుణుడి ప్రమేయం ఉంది. భారతీయ ఫోటోగ్రఫీ ఉపాధ్యాయులు ఓపీ శర్మ 1988 సంవత్సరంలో ఈ ప్రత్యేక రోజును ప్రతిపాదించారు. ఆ తర్వాత మొట్టమొదటిసారిగా 1991 ఆగస్టు 19న ప్రపంచవ్యాప్తంగా ఈ వేడుకలు అధికారికంగా ప్రారంభమయ్యాయి. అప్పటినుంచి ప్రతి ఏటా ఈ తేదీన ఫోటోగ్రఫీ రంగంలోని గొప్పతనాన్ని ప్రపంచానికి చాటిచెప్పే కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఫోటోగ్రఫీ చరిత్ర 1839 సంవత్సరంలో ఫ్రాన్స్ దేశంలో ప్రారంభమైంది. లూయిస్ డాగ్యుర్ రూపొందించిన డాగ్యురోటైప్ పద్ధతి ద్వారా రాగి ప్లేట్లను ఉపయోగించి చిత్రాలను బంధించడం సాధ్యపడింది. ఈ ఆవిష్కరణకు నైస్‌ఫోర్ నీప్సే అందించిన కృషి కూడా ఎంతో ఉంది. ఆ కాలంలో ఫోటోలను రికార్డ్ చేయడానికి ఈ టెక్నాలజీ ఒక విప్లవాత్మక అడుగుగా నిలిచింది. ఫ్రెంచ్ ప్రభుత్వం ఈ పేటెంట్‌ను కొనుగోలు చేసిన తర్వాత, దానిని ప్రపంచ ప్రజలకు ఉచిత బహుమతిగా అందించింది. ఎటువంటి ఆంక్షలు లేకుండా అందరూ ఈ సాంకేతికతను ఉపయోగించుకునేలా ఫ్రాన్స్ ప్రభుత్వం స్వేచ్ఛనిచ్చింది. దీని ఆధారంగానే దాదాపు నలభై సంవత్సరాల తరువాత అమెరికాకు చెందిన జార్జ్ ఈస్ట్‌మన్ మరింత అధునాతన కెమెరా సాంకేతికతను అభివృద్ధి చేశారు. భారతదేశంలో ఫోటోగ్రఫీ రంగానికి బలమైన చరిత్ర ఉంది. ప్రముఖ ఫోటోగ్రాఫర్లలో లాలా దీన్ దయాల్ దేశంలో అత్యంత ప్రాచుర్యం పొందారు. అదేవిధంగా హోమై వ్యారావాలా భారతదేశపు మొదటి మహిళా ప్రెస్

భూమి ఏర్పడిన తొలినాళ్లలో సముద్రాలు నేటిలా ఉప్పగా ఉండేవి కావు. భూమి చాలా వేడిగా ఉన్న సమయంలో అగ్నిపర్వతాల నుంచి వెలువడిన ఆవిరి, వాయువులు, అంతరిక్షం నుంచి వచ్చిన ఉల్కలు వంటి వాటి ప్రభావంతో క్రమంగా నీటి వనరులు ఏర్పడ్డాయి. ఆ సమయంలో సముద్రపు నీటిలో నేటి స్థాయిలో ఉప్పు లేదు. కాలం గడిచేకొద్దీ వర్షాలు కురిశాయి. వర్షపు నీరు వాతావరణంలోని కార్బన్ డయాక్సైడ్ను కొంత గ్రహించడం వల్ల స్వల్పంగా ఆమ్ల గుణాన్ని పొందుతుంది. ఈ నీరు నేలపై ప్రవహిస్తూ రాళ్లను, మట్టిని క్రమంగా కరిగిస్తుంది. రాళ్లలో ఉండే వివిధ ఖనిజాలు నీటిలో కలుస్తాయి. వాటిలో సోడియం, క్లోరైడ్ వంటి పదార్థాలు కూడా ఉంటాయి. ఇవే తర్వాత సముద్రపు ఉప్పులో ముఖ్యమైన భాగాలుగా మారతాయి. ఈ ఖనిజాలను కలుపుకున్న నీరు వాగులు, నదుల ద్వారా సముద్రాల్లోకి చేరుతుంది. సముద్రంలోకి చేరిన తర్వాత నీరు సూర్యుడి వేడి కారణంగా ఆవిరైపోతుంది. కానీ నీటిలో కరిగి ఉన్న ఉప్పు ఆవిరితో కలిసి వెళ్లదు. అది సముద్రంలోనే మిగిలిపోతుంది. ఇలా లక్షల, కోట్ల సంవత్సరాల పాటు ఉప్పు చేరుతూ ఉండటంతో సముద్రపు నీరు ఉప్పగా మారింది. సముద్రంలోకి ఉప్పును తీసుకెళ్లేది నదులే అయినప్పుడు నదుల నీరు కూడా ఉప్పుగా ఉండాలి కదా అనే సందేహం రావచ్చు. వాస్తవానికి నదుల నీటిలో కూడా కొంత మొత్తంలో కరిగిన ఖనిజాలు, లవణాలు ఉంటాయి. అయితే వాటి పరిమాణం సముద్రంతో పోలిస్తే చాలా తక్కువగా ఉంటుంది. దీనికి ప్రధాన కారణం నదుల నీరు నిరంతరం ప్రవహిస్తూ ఉండటమే. వర్షపు నీరు రాళ్ల నుంచి ఖనిజాలను కరిగించుకుని నదుల్లోకి తీసుకువస్తుంది. ఆ నీరు ఒకే చోట ఎక్కువకాలం నిలిచిపోదు. నది ప్రవాహంతో ఆ నీరు ముందుకు సాగి చివరకు సముద్రంలో కలుస్తుంది. ఒక గిన్నెలో నీటిని ఉంచి అందులో కొద్దిగా ఉప్పు వేస్తే కొంతకాలానికి ఆ నీరు ఉప్పగా మారుతుంది. కానీ ఆ గిన్నెలోకి

Health Tips: 45 రోజులు డైలీ ఒక అరటిపండు తింటే ఏం జరుగుతుందో తెలుసా.? ఆశ్చర్యకర విషయాలు.. ఈ వార్తకు సంబంధించిన

సీనియర్ నటి ఆమని తన సినీ కెరీర్లో మైలురాళ్లుగా నిలిచిన 'శుభలగ్నం', 'మావిచిగురు' సినిమాల గురించి ఆసక్తికర విషయాలను వెల్లడించారు. ఈ రెండు చిత్రాలు తన కెరీర్‌ను మలుపు తిప్పడమే కాకుండా, నటిగా తనకు గొప్ప గుర్తింపును తెచ్చిపెట్టాయని ఆమె పేర్కొన్నారు. ముఖ్యంగా పాత్రల లోతును అర్థం చేసుకుని నటించడం వల్లే ఈ సినిమాలు ప్రేక్షకులకు అంతగా దగ్గరయ్యాయని ఆమని అభిప్రాయపడ్డారు. శుభలగ్నం సినిమా ఆమని కెరీర్లో ఒక ఎప్పటికీ గుర్తుండిపోయే హిట్ చిత్రంగా నిలిచింది. ఇందులో ఆమె పోషించిన గయ్యాళి పాత్ర నిజ జీవితంలో తన స్వభావానికి పూర్తిగా భిన్నమైనదని ఆమె తెలిపారు. అయితే నటిగా ఆ పాత్రలోని సవాలును స్వీకరించి అద్భుతంగా నటించానని, దర్శకుడు కృష్ణారెడ్డి కూడా ఇటీవల తన నటనను ప్రత్యేకంగా ప్రశంసించారని ఆమని గుర్తు చేసుకున్నారు. ఈ చిత్రంలో పాత్రల కోసం ఆమని ఎంతో శ్రమించారు, ఇది ప్రేక్షకులపై పెను ప్రభావం చూపింది. దీంతో నేటికీ ఎక్కడికి వెళ్లినా ప్రేక్షకులు ఆ పాత్రను గుర్తు చేసుకుంటూ ఉంటారు. ఇదిలా ఉండగా, మావిచిగురు సినిమాలో నటించడం తన కెరీర్లోనే అత్యంత కష్టతరమైన అనుభవం అని ఆమె వెల్లడించారు. ఆ పాత్రలో లోతైన భావోద్వేగాలను పండించడానికి గ్లిసరిన్ లేకుండానే సహజంగా కన్నీళ్లు పెట్టాల్సి వచ్చేదని ఆమని వివరించారు. కొన్ని భావోద్వేగ సన్నివేశాల తర్వాత తాను తీవ్రమైన తలనొప్పి, మానసిక అలసటకు గురయ్యేదానని ఆమె చెప్పుకొచ్చారు. ఫలితంగా ఆ పాత్రలు ప్రేక్షకులను కదిలించేలా చేశాయి, ముఖ్యంగా కుటుంబ బాధ్యతలను గుర్తు చేసే సన్నివేశాలు ఎంతో మందిని భావోద్వేగానికి గురిచేశాయి. ఈ నేపథ్యంలో నటులు తమ సొంత పాత్రలకు డబ్బింగ్ చెప్పుకోవడం ఉత్తమమని ఆమె అభిప్రాయపడ్డారు. అయితే ఈ రెండు సినిమాలకు సీనియర్ నటి సరిత డబ్బింగ్ చెప్పడం తన అదృష్టమని ఆమని కొనియాడారు. సరిత పాత్రలోని భావాలను, చిన్న చిన్న ఎక్స్‌ప్రెషన్స్‌ను కూడా అర్థం చేసుకుని అద్భుతంగా డబ్బింగ్ చెప్పారని ఆమె ప్రశంసించారు

Amazon River : దక్షిణ అమెరికా ఖండంలో ప్రవహించే అమెజాన్ నది కేవలం ఒక నీటి ప్రవాహం మాత్రమే కాదు, అది ఈ భూగోళానికి జీవనాడి. ప్రపంచంలోనే అత్యధిక నీటి ప్రవాహం కలిగిన నది ఈ అమెజాన్. దట్టమైన అడవుల గుండా ప్రయాణం, అరుదైన జీవరాశులు, విస్మయపరిచే సహజ వింతలతో నిండిన ఈ నది గురించి తెలుసుకోవడం ఎంతో ఆసక్తికరంగా ఉంటుంది. పెరూ దేశంలోని ఆండిస్ పర్వతాల్లో పుట్టే ఈ అమెజాన్ నది బ్రెజిల్ లో అట్లాంటిక్ మహా సముద్రంలో కలుస్తుంది. మధ్యలో మరో దేశం కొలంబియాలో కూడా ఈ నది ప్రవహిస్తుంది. ఇలా మూడు దేశాల గుండా దాదాపు 6,400 కిలోమీటర్ల (4,000 మైళ్ళు) దూరం ప్రయాణిస్తుంది. ప్రపంచంలోని అన్ని నదుల నుండి సముద్రాల్లో కలిసే నీటిలో 15 నుండి 20 శాతం ఈ అమెజాన్ నదివే. ఇలా ప్రపంచంలో అత్యధిక నీటి ప్రవాహం గల ఇలాంటి నదిపై ఒక్కటంటే ఒక్క బ్రిడ్జ్ లేకపోవడం ఆశ్చర్యకరం. వేల కిలోమీటర్ల పొడవునా ప్రవహించే అమెజాన్ నదిపై ఒక్కటంటే ఒక్క వంతెన (Bridge) కూడా లేకపోవడం అత్యంత ఆశ్చర్యకరమైన విషయం. దట్టమైన వర్షాధార అడవులు ఉండటం, తీరం వెంట జనాభా చాలా తక్కువగా నివసించడం వల్ల ఇక్కడ వంతెనల అవసరం పడలేదు. పైగా వర్షాకాలంలో ఈ నది వెడల్పు విపరీతంగా పెరిగిపోతుంది. నది ఒడ్డున ఉన్న మట్టి చాలా మెత్తగా ఉండటం వల్ల ఇక్కడ వంతెనలు నిర్మించడం భౌగోళికంగా కూడా కష్టంతో కూడుకున్న పని. ఇక్కడి ప్రజలు రవాణా కోసం ఎక్కువగా పడవలు, ఫెర్రీలనే ఉపయోగిస్తారు. అమెజాన్ నది ప్రవాహ పరిమాణం (Water Discharge) విషయంలో ప్రపంచంలోనే మొదటి స్థానంలో ఉంది. ప్రపంచంలోని సముద్రాల్లోకి కలిసే మొత్తం మంచి నీటి ప్రవాహంలో దాదాపు 20 శాతం నీరు ఒక్క అమెజాన్ నది నుంచే వస్తుంది. ఈ నది గుండా సెకనుకు ప్రవహించే నీటి పరిమాణం దాదాపు

మన శరీరంలో పుట్టుకతోనే ప్రతి అవయవం ఏర్పుడుతుంది. ప్రతి అవయవానికి ఓ ప్రత్యేకమైన పని ఉంటుంది. అందుకే ఏదైనా ఒక అవయవం లేకపోతే మనిషి బతకగలడా అనే ప్రశ్న చాలామందికి ఉంటుంది. వైద్యశాస్త్రం ప్రకారం శరీరంలో కొన్ని అవయవాలు లేకపోయినా మనుషులు ఆరోగ్యంగా జీవించగలరు. ఆ అవయవాలేంటో తెలుసుకోండి. అపెండిక్స్ (Appendix) అనేది పెద్ద ప్రేగు మొదట్లో ఉండే ఒక చిన్న గొట్టం లాంటి అవయవం. దీన్ని చాలాకాలం 'పనికిరాని అవయవం'గా భావించారు. కానీ ఇప్పుడు ఇది పేగుల్లోని మంచి బ్యాక్టీరియాను బ్యాలెన్స్ చేయడంలో, రోగనిరోధక వ్యవస్థలో పాత్ర పోషిస్తుందని పరిశోధనలు చెబుతున్నాయి. అపెండిక్స్ను తొలగించిన తర్వాత కూడా చాలామంది సాధారణ జీవితాన్ని గడపగలరు. ఎందుకంటే, శరీరంలోని మిగతా పేగులు, రోగనిరోధక వ్యవస్థ దాని లోటును భర్తీ చేస్తాయి. పిత్తాశయం (Gallbladder) అనేది కాలేయం తయారుచేసే పైత్యరసాన్ని నిల్వ చేసే చిన్న అవయవం. ముఖ్యంగా, కొవ్వు పదార్థాలున్న ఆహారాన్ని జీర్ణం చేయడానికి ఈ పైత్యరసం ఉపయోగపడుతుంది. అయితే, పిత్తాశయాన్ని తొలగించినా కాలేయం పైత్యరసాన్ని తయారు చేస్తూనే ఉంటుంది. ఆ పైత్యరసం పిత్తాశయంలో నిల్వ ఉండకుండా నేరుగా చిన్న ప్రేగులోకి వెళ్లి జీర్ణక్రియకు సహాయపడుతుంది. మొదట్లో కొందరికి జీర్ణక్రియలో చిన్న మార్పులు కనిపించినా, చాలామంది తర్వాత సాధారణ జీవితాన్ని గడుపుతారు. ప్లీహం (Spleen) మన రోగనిరోధక వ్యవస్థలో చాలా ముఖ్యమైనది. ఇది కొన్ని తెల్ల రక్త కణాల పనితీరుకు, పాత లేదా దెబ్బతిన్న రక్త కణాలను తొలగించడానికి సహాయపడుతుంది. అయినప్పటికీ కొన్నిసార్లు ప్లీహాన్ని శస్త్రచికిత్స ద్వారా తొలగించాల్సి రావచ్చు. ప్లీహం తొలగించిన తర్వాత కూడా ఒక వ్యక్తి జీవించగలడు. కానీ, ఇన్ఫెక్షన్ల నుండి తమను తాము రక్షించుకోవడానికి టీకాలు వంటి అదనపు జాగ్రత్తలు తీసుకోవడం అవసరం. మన శరీరంలో రెండు కిడ్నీలు ఉన్నప్పటికీ, చాలామంది ఒక కిడ్నీతో చాలాకాలం ఆరోగ్యంగా జీవించగలరు. ఒక కిడ్నీని దానం చేసినా లేదా మరో కిడ్నీ పనిచేయకపోయినా, మిగిలిన కిడ్నీ

మనుషులకు ఉన్నట్టే చెట్లకు, మొక్కలకు కూడా ఒక డైలీ రూటీన్ ఉంటుంది. మనం ఉదయాన్నే లేవడం, తినడం, పనులు చేసుకోవడం, రాత్రికి నిద్రపోవడం ఎలాగో.. మొక్కల్లో కూడా అలాగే ఒక నిర్దిష్టమైన సైకిల్ నడుస్తుంది. పగటి సమయంలో మొక్కల ఆకులు సూర్యరశ్మి, కార్బన్ డై ఆక్సైడ్ ఆధారంగా ఫోటోసింథసిస్ ద్వారా షుగర్‌ను తయారు చేస్తాయి. అదే రాత్రి వేళల్లో ఈ ప్రక్రియ చాలా స్లో అవుతుంది లేదా పూర్తిగా ఆగిపోతుంది. మొక్కల ఎదుగుదల, ఇతర పనులు కూడా రోజులో సమయాన్ని బట్టి మారిపోతుంటాయి. చెట్లు పగలు, రాత్రిని బట్టి మారడానికి వాటి శరీరంలో ఉండే 24 గంటల సర్కేడియన్ క్లాక్ కారణం. జీవుల బాడీలోని మెటబాలిజం, బ్లడ్ ప్రెజర్, నిద్ర, హార్మోన్ల విడుదల వంటి ప్రక్రియలను ఈ గడియారమే కంట్రోల్ చేస్తుంది. అయితే సైంటిస్టులకు ఒక ఆసక్తికరమైన విషయం తెలిసింది. ఏదైనా ఒక మొక్కను పూర్తిగా చీకటిగా ఉండే గదిలో ఉంచినా కూడా, దాని పగలు-రాత్రి సైకిల్ కొన్ని రోజుల పాటు అలాగే నడుస్తుంది. అంటే మొక్కలు కేవలం సూర్యుడి వెలుగును చూసి మాత్రమే సమయాన్ని లెక్కించవు. వాటి బాడీ లోపల ఒక ప్రత్యేకమైన ఇంటర్నల్ క్లాక్ పనిచేస్తుంది. సూర్యరశ్మి ద్వారా మొక్కల్లో తయారయ్యే సుక్రోజ్ ఈ జెనెటిక్ క్లాక్‌ను రన్ చేయడంలో కీలక పాత్ర పోషిస్తుంది. చీకటిలో మొక్కల సర్కేడియన్ రిథమ్‌ను కాపాడటానికి షుగర్ అవసరం. అదే సమయంలో నిరంతరం వెలుతురు ఉంటే, ఈ షుగర్ సైకిల్ సమయాన్ని తగ్గిస్తుంది. అంటే మొక్కలు వెలుతురుతో పాటు తమలో తయారయ్యే షుగర్ ఆధారంగా కూడా పగలు, రాత్రిని గుర్తుపడతాయి. దీంతో పాటు మొక్కలు ఎథిలీన్ అనే గ్యాస్‌ను ఉత్పత్తి చేస్తాయి. దీనిని ఏజింగ్ హార్మోన్ అని పిలుస్తారు. పండ్లు త్వరగా పండటానికి ఇది ఉపయోగపడుతుంది. బాగా పండిన అరటిపండును ఎవోకాడో పక్కన పెడితే, దాని నుంచి వచ్చే ఎథిలీన్ గ్యాస్ వల్ల ఎవోకాడో కూడా

ఎక్కువశాతం విమానయాన సంస్థలు తమ విమానాలను తెలుపు రంగులోనే ఉంచుతాయి. కేవలం ఆకర్షనీయంగా కనిపించడం కోసమే తెలుపు రంగులో ఉండవు... దీని వెనుక చాలా కారణాలు ఉన్నాయి. ముఖ్యంగా సైన్స్, భద్రతా కారణాలు విమానాల రంగు విషయంలో కీలక పాత్ర పోషిస్తాయి. వాటి గురించి పూర్తి వివరాలు ఇక్కడ చూద్దాం. విమానాలకు తెలుపు రంగు ఉండటం వల్ల, దానిపై పడే సూర్యకిరణాలు రిఫ్లెక్ట్ అవుతాయి. తెలుపు రంగు సూర్యకిరణాలను ఎక్కువగా గ్రహించదు. దీంతో విమానం లోపల ఉష్ణోగ్రత కంట్రోల్లో ఉంటుంది. విమానం ఆకాశంలో ఎగిరేటప్పుడు సూర్యరశ్మి వేడి చాలా ఎక్కువగా ఉంటుంది. అయితే తెలుపు రంగు వల్ల విమానం లోపల వేడి తగ్గి, ఏసీ సిస్టమ్‌పై భారం తగ్గుతుంది. దీనివల్ల ఇంధనం ఆదా అవుతుంది. విమానయాన సంస్థలకు ఇది మంచి లాభం తెచ్చిపెట్టే ట్రిక్ అన్నమాట. భద్రత విషయంలో కూడా తెలుపు రంగే ఉత్తమమని చెప్పొచ్చు. ఎందుకంటే విమానం తెలుపు రంగులో ఉంటే, దానిపై ఏర్పడిన పగుళ్లు, తుప్పు లేదా ఆయిల్ లీక్‌లను సులభంగా గుర్తించవచ్చు. వేరే రంగులు వేస్తే ఇవి అంత స్పష్టంగా కనిపించవు. అందుకే భద్రతా కారణాల వల్ల కూడా విమానానికి తెలుపు రంగును ఎంచుకుంటారు. విమానాలు సహజంగానే చాలా బరువుగా ఉంటాయి. ముదురు రంగులు వేయడం వల్ల విమానం బరువు మరింత పెరుగుతుంది. అందుకే తక్కువ పిగ్మెంట్ ఉండే తెలుపు రంగును వాడటం వల్ల బరువు తగ్గుతుంది. ఇది కూడా ఇంధనాన్ని ఆదా చేయడానికి సహాయపడుతుంది. తెలుపు రంగు వాడటం వల్ల విమానయాన సంస్థలకు లక్షల రూపాయలు ఆదా అవుతాయి. నీలి ఆకాశంలో ఎగిరేటప్పుడు పక్షులు తెల్లటి విమానాన్ని సులభంగా గుర్తించగలవు. దీనివల్ల విమానాన్ని పక్షులు ఢీకొట్టే ప్రమాదం కూడా తగ్గుతుందని చెబుతారు. తెలుపు రంగు వెనుక ఒక చారిత్రక కారణం కూడా ఉంది. విమానాలను తయారుచేసిన తొలి రోజుల్లో వాటిని అల్యూమినియంతో చేసేవారు. అల్యూమినియం సహజంగానే వెండిలాంటి తెలుపు

కిరణ్ కుమార్ శర్మ తంజావూర్ జీ తెలుగు తెలుగు న్యూస్‌లో ఛీఫ్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి వినోదం, ఆధ్యాత్మికం, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. సినిమా రివ్యూలు, సినిమాలకు సంబంధించి ప్రత్యేక కథనాలు కూడా రాస్తుంటారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో 18 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. Garuda Panchami Or Shravana Panchami: కశ్యప ప్రజాప్రతి భార్యలైన కద్రువ సంతానం నాగులు. వినతల సంతానమే గరుడుడు , అనూరుడు. వీరు ఇద్దరూ శ్రావణ శుద్ధ పంచమి నాడే జన్మించారని పురాణ కథనం. మహావిష్ణువు ఆదిశేషుని భక్తికి మెచ్చి, శ్రావణ పంచమి నాడు మానవులు సర్పాలను, నాగులను పూజిస్తారని వరం ఇచ్చాడు. అందువల్ల ఈ రోజును నాగ పంచమిగా మరియు గరుడ పంచమిగా సమానంగా జరుపుకోవడం ఆనవాయితీ వస్తోంది. ఈ నాగ / గరుడ పంచమి అనేది భారతదేశం, నేపాల్ సనాతులు నివసించే ఇతర దేశాలలో హిందువులు పాటించే ఒక సాంప్రదాయక సర్ప పూజ. హిందూ పంచాంగం ప్రకారం శ్రావణ మాసం శుక్ల పక్షం ఐదవ రోజైన పంచమి రోజున ఈ పూజను నిర్వహిస్తారు. సర్పాల నివాసం పాతాళ లోకం. ఇది భూమికి దిగువన ఉన్న విశ్వంలోని ఏడు లోకాలని మన ధర్మశాస్త్ర గ్రంథంలో ప్రస్తావించబడింది. వాటిలో అత్యంత దిగువన ఉన్న దానిని నాగలోకం, అంటే నాగు పాములు నివసించే ప్రాంతం. సృష్టి శక్తిలో భాగంగా, కుటుంబ శ్రేయస్సు కోసం వారి ఆశీర్వాదాలను కోరుకుంటారు. అర్హతగల పురోహితులచే నాగదేవతకు అభిషేకంతో పాటు పూజ చేయడం వల్ల కుజ దోషంతో పాటు కాలసర్ప దోషాలు తొలగిపోతాయి. ఇది కుటుంబ శ్రేయస్సును కలిగిస్తుంది. అష్ఠాదశ పురాణాల ప్రకారం, గరుత్మంతుడు సూర్య రథసారధి అయిన అనూరుడికి తమ్ముడు. మేరు పర్వతంతో సమానమైన శరీరం ఉన్నవాడు. సప్త సముద్రాలను ఒక్క రెక్క

స్ట్రాబెర్రీ పండ్లలో విటమిన్ సి, యాంటీఆక్సిడెంట్లు, ఫైబర్ వంటి ముఖ్యమైన పోషకాలు సమృద్ధిగా ఉంటాయి. స్ట్రాబెర్రీలలో ఆంథోసైనిన్లు, పొటాషియం ఎక్కువగా ఉంటాయి. ఇవి రక్తపోటును, చెడు కొలెస్ట్రాల్ ను తగ్గించడంలో సహాయపడతాయి. స్ట్రాబెర్రీలకు గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువ. ఫైబర్ కంటెంట్ ఎక్కువ. అందువల్ల ఇవి రక్తంలో చక్కెర స్థాయిలు ఒక్కసారిగా పెరగకుండా నియంత్రిస్తాయి. స్ట్రాబెర్రీలలో విటమిన్ సి అధికంగా ఉంటుంది. ఇది రోగనిరోధక వ్యవస్థను బలపరుస్తుంది. అలాగే కణజాలాల పునరుత్పత్తికి సహాయపడుతుంది. స్ట్రాబెర్రీలలో ఉండే ఫ్లేవనాయిడ్లు వయసు పెరగడం వల్ల వచ్చే మతిమరుపును తగ్గించడంలో సహాయపడతాయి. జ్ఞాపకశక్తిని కాపాడతాయి. స్ట్రాబెర్రీలు కొల్లాజెన్ ఉత్పత్తిని పెంచుతాయి. తద్వారా చర్మం బిగుతుగా ఉంటుంది. అలాగే UV కిరణాల వల్ల కలిగే నష్టం నుంచి చర్మాన్ని కాపాడుతుంది. ఒక కప్పు స్ట్రాబెర్రీలలో 3 గ్రాముల డైటరీ ఫైబర్ ఉంటుంది. ఇది పేగులలోని మంచి బ్యాక్టీరియాను పెంచి, జీర్ణక్రియకు సహాయపడుతుంది. Thread Bangles: అద్దాలతో మెరిసే థ్రెడ్ బ్యాంగిల్స్ డిజైన్స్ చూసేయండి Kitchen Hacks: తాళింపు వేసేటప్పుడు ఇలా చేస్తే నూనె అస్సలు చిందదు Bangle Designs: డైలీవేర్ కి పర్ఫెక్ట్ గా సెట్ అయ్యే గాజుల డిజైన్స్ Farming : ఆగస్టులో ఈ 3 కూరగాయలు పండించండి.. లక్షల్లో లాభాలు పొందండి!

వర్షపు నీరు చూడటానికి శుభ్రంగా కనిపించినా అందులో దుమ్ము, ధూళి, ఇతర సూక్ష్మ కణాలు ఉండవచ్చు. ఇవి నీటిలో విద్యుత్ ప్రవాహానికి కొంతవరకు మార్గం కల్పించగలవు. విద్యుత్ తీగల జాయింట్లు, మీటర్ బాక్సులు, స్విచ్ బోర్డులు, బయట ఉన్న విద్యుత్ కనెక్షన్లలోకి నీరు చేరితే సమస్యలు ఏర్పడే అవకాశం ఉంటుంది. ఇలాంటి సందర్భాల్లో లీకేజీ కరెంట్, షార్ట్ సర్క్యూట్, ఫ్యూజ్ లేదా బ్రేకర్ ట్రిప్ కావడం వంటి సమస్యలు ఎదురవుతాయి. ముఖ్యంగా సరైన ఇన్సులేషన్ లేని లేదా ఎక్కువ కాలం వాడిన తీగల్లో వర్షం ప్రభావం ఎక్కువగా ఉండొచ్చు. అందుకే తేమ నుంచి విద్యుత్ కనెక్షన్లను రక్షించడం చాలా ముఖ్యం. మన ఇళ్లకు విద్యుత్ చేరడానికి ఒక పెద్ద నెట్వర్క్ పనిచేస్తుంది. దూర ప్రాంతాల నుంచి విద్యుత్‌ను తీసుకువచ్చే ట్రాన్స్మిషన్ లైన్లు, నగరాలు, గ్రామాలకు సరఫరా చేసే డిస్ట్రిబ్యూషన్ లైన్లు, భవనాల వైరింగ్, చివరగా ఇంట్లోని విద్యుత్ తీగలు ఇందులో భాగంగా ఉంటాయి. భారీ వర్షం, ఈదురుగాలులు వచ్చినప్పుడు చెట్లు లేదా కొమ్మలు విద్యుత్ తీగలపై పడవచ్చు. పిడుగులు విద్యుత్ నెట్‌వర్క్‌పై ప్రభావం చూపవచ్చు. నేల పూర్తిగా తడిసిపోవడం వల్ల ఎర్తింగ్ వ్యవస్థలో కూడా మార్పులు రావచ్చు. ఇలాంటి పరిస్థితుల్లో విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడే అవకాశం ఉంటుంది. కొన్ని సందర్భాల్లో సమస్య చిన్నదే అయినా, భద్రత కోసం సంబంధిత లైన్‌ను తాత్కాలికంగా నిలిపివేస్తారు. సమస్యను సరిచేసిన తర్వాత విద్యుత్ సరఫరాను తిరిగి ప్రారంభిస్తారు. వర్షం సమయంలో కరెంట్ పోతే చాలామంది పెద్ద ప్రమాదం జరిగిందని భావిస్తారు. కానీ ప్రతి విద్యుత్ అంతరాయం పెద్ద నష్టం వల్లే జరుగుతుందని చెప్పలేం. విద్యుత్ వ్యవస్థలో భద్రత కోసం ఏర్పాటు చేసిన పరికరాలు ప్రమాదాన్ని గుర్తించినప్పుడు ఆటోమేటిక్‌గా సరఫరాను నిలిపివేస్తాయి. ఉదాహరణకు షార్ట్ సర్క్యూట్, అధిక కరెంట్, లీకేజీ లేదా లైన్లో మరో సమస్య గుర్తించినప్పుడు బ్రేకర్లు, ఫ్యూజులు, ఇతర రక్షణ పరికరాలు పనిచేస్తాయి. దీని వల్ల

1947, ఆగస్టు 15న భారత్‌కు ఆంగ్లేయుల పాలన నుంచి స్వేచ్ఛ లభించింది. శతాబ్దాల నిరీక్షణ ఫలించడంతో దేశవ్యాప్తంగా ప్రజలు ఆనందోత్సాహాల్లో తేలిపోయారు. పల్లెల నుంచి పట్టణాల వరకు ఎక్కడ చూసినా పండుగ వాతావరణం కనిపించింది. అయితే, భారతదేశానికి స్వాతంత్య్రం తెచ్చిన జాతిపిత మహాత్మా గాంధీ ఆ చరిత్రాత్మక రోజున ఏం చేస్తున్నారు? వేడుకల్లో పాల్గొన్నారా? లేదా? అనే ప్రశ్న ప్రతి ఒక్కరి మనసులోనూ మెదులుతుంది. నిజానికి, ఆ రోజున గాంధీజీ చేసిన పనుల గురించి చాలామందికి తెలిసింది చాలా తక్కువ. గాంధీ హెరిటేజ్ పోర్టల్ లోని వివరాల ప్రకారం ఆ రోజు ఆయన ఏం చేశారో పూర్తి వివరాలు తెలుసుకుందాం. భారతదేశమంతా స్వాతంత్య్ర సంబరాలు జరుపుకుంటున్న సమయంలో మహాత్మా గాంధీ రాజధాని ఢిల్లీలో లేరు. ఆయన ఆ సమయంలో కలకత్తా లో ఉన్నారు. అందరినీ ఆశ్చర్యపరిచే విషయమేమిటంటే, దేశానికి స్వేచ్ఛ వచ్చిన ఆ శుభదినాన గాంధీజీ ఎలాంటి పెద్ద వేడుకలు జరుపుకోలేదు. కనీసం స్వాతంత్య్ర ఉత్సవాల గురించి ఉపన్యాసం కూడా ఇవ్వలేదు. ఆయన ఆ రోజంతా ఉపవాసం, ప్రార్థనలు, ప్రజలను కలవడానికే కేటాయించారు. గాంధీ హెరిటేజ్ పోర్టల్ సమాచారం ప్రకారం.. ఆగస్టు 15, 1947న ఆయన పూర్తిగా ప్రార్థనలు, ఉపవాసంలో గడిపారు. ఒకవైపు స్వాతంత్య్రం వస్తుందన్న ఆనందం ఉన్నప్పటికీ, మరోవైపు దేశం రెండు ముక్కలుగా విడిపోతోంది. నాటి విభజన కారణంగా అనేక ప్రాంతాల్లో హిందూ-ముస్లింల మధ్య ఘోరమైన అల్లర్లు జరుగుతున్నాయి. ఇలాంటి ఉద్రిక్త పరిస్థితుల్లో గాంధీజీ ఢిల్లీలో సంబరాలు చేసుకోకుండా, కలకత్తాలోనే ఉండి శాంతి భద్రతలను కాపాడేందుకు ప్రయత్నించారు. ఆగస్టు 13 నుంచే ఆయన కలకత్తాలోని బెలియాఘాటా ప్రాంతంలో ఉన్న 'హైదరీ మ్యాన్షన్'లో బస చేశారు. మతపరమైన అల్లర్ల మధ్య హిందూ-ముస్లింల మధ్య ఐక్యత, శాంతిని నెలకొల్పడానికే ఆయన అక్కడ ఉన్నారు. ఆగస్టు 14 సాయంత్రం జరిగిన ప్రార్థనా సమావేశంలోనే గాంధీజీ ఒక కీలక విషయాన్ని వెల్లడించారు. ఆగస్టు 15న తాను 24 గంటల

సాధారణంగా చలిగా ఉన్నప్పుడు ఒక్కసారిగా శరీరంపై చిన్న చిన్న పొక్కుల్లా కనిపించడం, భయపడినప్పుడు లేదా ఉత్కంఠ కలిగించే సందర్భంలో చేతులపై రోమాలు నిక్కబొడుచుకోవడం చాలామందికి అనుభవమే. దీన్నే ‘గూస్బంప్స్’ అంటారు. అయితే ఆసక్తికరమైన విషయం ఏంటంటే.. చలిలో మాత్రమే కాదు, ఒక మంచి పాట విన్నప్పుడు, భావోద్వేగానికి లోనైనప్పుడు, భయపడినప్పుడు, ఒక్కసారిగా ఉత్సాహం కలిగినప్పుడు కూడా కొంతమందికి గూస్బంప్స్ వస్తాయి. అసలు ఇలా ఎందుకు జరుగుతుందో ఇక్కడ తెలుసుకుందాం. గూస్బంప్స్ అనేది మన శరీరం కొన్ని పరిస్థితులకు స్పందించే సహజమైన ప్రతిచర్య. మన చర్మంపై ఉన్న ప్రతి వెంట్రుకకు దగ్గరగా చాలా చిన్న కండరాలు ఉంటాయి. చలి, భయం, ఉత్సాహం లేదా కొన్ని బలమైన భావోద్వేగాల సమయంలో ఈ కండరాలు సంకోచిస్తాయి. దాంతో చర్మంపై ఉన్న వెంట్రుకలు నిటారుగా నిలబడతాయి. వాటి చుట్టూ ఉన్న చర్మం కూడా పైకి లేచినట్లు కనిపించడంతో మనకు గూస్బంప్స్ వచ్చినట్లు అనిపిస్తుంది. శరీరం ఇలా స్పందించడానికి మన పరిణామ క్రమంతో సంబంధం ఉందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. మన పూర్వీకుల శరీరంపై నేటి కంటే చాలా ఎక్కువగా రోమాలు ఉండేవి. చలిగా ఉన్నప్పుడు వెంట్రుకలు నిక్కబొడుచుకోవడం వల్ల వాటి మధ్య గాలి పొర ఏర్పడి శరీరానికి కొంత వెచ్చదనం అందేది. అంటే గూస్బంప్స్ ఒకప్పుడు శరీర ఉష్ణోగ్రతను కాపాడుకోవడంలో కొంత ఉపయోగపడే ప్రక్రియగా ఉండేది. నేటి కాలంలో శరీరంపై అంతగా రోమాలు లేకపోవడంతో ఆ ప్రయోజనం చాలా తక్కువగా ఉన్నప్పటికీ, ఆ సహజ ప్రతిచర్య మాత్రం ఇప్పటికీ మనలో కొనసాగుతోందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. గూస్‌బంప్స్‌కు మరో ముఖ్యమైన కారణం భయం లేదా అకస్మాత్తుగా వచ్చే ఒత్తిడి. మనం ప్రమాదకరమైన పరిస్థితిని ఎదుర్కొన్నప్పుడు శరీరం వెంటనే అప్రమత్తమవుతుంది. ఈ సమయంలో ‘ఫైట్ ఆర్ ఫ్లైట్’ అనే సహజ ప్రతిస్పందనలో భాగంగా సింపథెటిక్ నర్వస్ సిస్టమ్ చురుకుగా పనిచేస్తుంది. దానివల్ల గుండె వేగం, శ్వాస, అప్రమత్తత వంటి శరీర ప్రతిస్పందనల్లో మార్పులు రావచ్చు

ఆగస్టు 13న అంతర్జాతీయ ఎడమచేతి వాటం వారి దినోత్సవాన్ని నిర్వహిస్తారు. ఈ సందర్భంగా ఎడమచేతితో పనులు చేసే వారి ప్రత్యేకతలు, అలవాట్లు, ఆసక్తికరమైన విషయాల గురించి తెలుసుకుందాం.. ఇంటర్నెట్ డెస్క్: ప్రతి ఏడాది ఆగస్టు 13న అంతర్జాతీయ ఎడమచేతి వాటం వారి దినోత్సవాన్ని నిర్వహిస్తారు. ఎడమ చేతితో రాయడం, తినడం, ఇతర పనులు చేయడం అలవాటుగా ఉన్నవారు ప్రపంచ జనాభాలో సుమారు 10 శాతం మంది ఉన్నట్లు అంచనాలు చెబుతున్నాయి. ఈ రోజును ఎడమచేతి వాటం వారు ఎదుర్కొనే ఇబ్బందులు, వారి ప్రత్యేకతలపై అవగాహన కల్పించేందుకు నిర్వహిస్తారు. ప్రపంచంలోని చాలా వస్తువులు, పనిముట్లు కుడిచేతి వాటం వారికి అనుకూలంగా రూపొందించబడి ఉంటాయి. దీంతో ఎడమచేతి వాటం వారు కొన్ని సందర్భాల్లో ఇబ్బందులు ఎదుర్కొంటారు. అయినప్పటికీ వారు తమకు అనుకూలమైన విధంగా వాటిని ఉపయోగిస్తూ పనులను పూర్తి చేస్తారు. లెఫ్ట్-హ్యాండర్స్ క్లబ్ వ్యవస్థాపకుడు డీన్ ఆర్. క్యాంప్‌బెల్ 1976లో ఈ దినోత్సవాన్ని ప్రారంభించారు. కొన్ని అధ్యయనాల ప్రకారం.. ఎడమచేతి వాటం వారి ఆలోచనా విధానం, సృజనాత్మకతలో కొన్ని ప్రత్యేకతలు కనిపిస్తాయి. అయితే ఎడమచేతి వాటం ఉన్న ప్రతి ఒక్కరూ ఎక్కువ తెలివితేటలు లేదా అధిక ఐక్యూ కలిగి ఉంటారని చెప్పడానికి తగిన ఆధారాలు లేవు. వారిలో సృజనాత్మకత, సమస్యలను విభిన్నంగా పరిష్కరించే సామర్థ్యం, పరిస్థితులకు అనుగుణంగా మారే లక్షణాలు కనిపించవచ్చని కొన్ని పరిశోధనలు సూచిస్తున్నాయి. క్రికెట్, టెన్నిస్, బాక్సింగ్ వంటి క్రీడల్లో ఎడమచేతి వాటం ఆటగాళ్లు ప్రత్యర్థులకు భిన్నమైన సవాలుగా నిలుస్తారు. రఫెల్ నాదల్, డియెగో మారడోనా, బ్రియాన్ లారా, పీలే వంటి ప్రముఖ క్రీడాకారులు ఎడమచేతి వాటం వారిగా గుర్తింపు పొందారు. మొత్తంగా చూస్తే, ఎడమచేతి వాటం అనేది లోపం కాదు.. ఒక సహజమైన భిన్నత్వం. తమకు అనుకూలంగా లేని పరిస్థితులను అధిగమిస్తూ ప్రత్యేక గుర్తింపు సాధిస్తున్న ఎడమచేతి వాటం వారిని గౌరవించడమే ఈ దినోత్సవం ముఖ్య ఉద్దేశం. Note: ఇందులోని సమాచారం ఇంటర్నెట్లో

డిజిటల్ టెక్నాలజీ వేగంగా అభివృద్ధి చెందడంతో, ఆన్లైన్ లావాదేవీలు మన దైనందిన జీవితంలో ఒక అంతర్భాగంగా మారాయి. ఆన్లైన్లో షాపింగ్ చేయడం, నిధులను బదిలీ చేయడం లేదా వ్యాపారం చేయడం వంటి ఏ విషయంలోనైనా, డిజిటల్ లావాదేవీల సౌలభ్యం మనం ఆర్థిక కార్యకలాపాలు నిర్వహించే విధానంలో విప్లవాత్మక మార్పులు తెచ్చింది. ఆన్లైన్ లావాదేవీలలో మోసాలను నివారించడానికి డిజిటల్ సంతకాలు ఒక శక్తివంతమైన సాధనంగా ఆవిర్భవించాయి. ఎలక్ట్రానిక్ పత్రాల ప్రామాణికతను ధ్రువీకరించడానికి, సంతకం చేసేవారి గుర్తింపును నిర్ధారించడానికి సురక్షితమైన, ట్యాంపర్-ప్రూఫ్ పద్ధతిని అందించడం ద్వారా, ఆన్లైన్ లావాదేవీల భద్రత, విశ్వసనీయతను పెంచడంలో డిజిటల్ సంతకాలు కీలక పాత్ర పోషిస్తున్నాయి. ఆన్లైన్ లావాదేవీల్లో మోసాలను నివారించడానికి ఇవి ఎలా దోహదపడుతున్నాయో తెలుసుకుందాం. డిజిటల్ సంతకమనేది ఒక డిజిటల్ పత్రం లేదా సందేశానికి సంబంధించిన సమగ్రతను, ప్రామాణికతను ధ్రువీకరించడానికి ఉపయోగించే ఒక క్రిప్టోగ్రాఫిక్ పద్ధతి. ఒక వ్యక్తికి సంబంధించిన గుర్తింపును చేతితో రాసి తెలిపే సంప్రదాయ సంతకానికి భిన్నంగా, క్రిప్టోగ్రాఫిక్ కీలను ఉపయోగించి రూపొందించిన ఒక గణిత అల్గారిథమే డిజిటల్ సంతకం. సంతకం చేసే వ్యక్తికి సంబంధించిన ప్రైవేట్ కీతో పాటు, సంతకం చేస్తున్న పత్రం లేదా సందేశంలోని విషయానికి ఒక గణిత ఫంక్షన్‌ను వర్తింపజేయడం ద్వారా డిజిటల్ సంతకాలు సృష్టిస్తారు. ఆదాయపు పన్ను రిటర్నులను దాఖలు చేయడానికి, కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖకు సమర్పణలు చేయడానికి లేదా ఇ-టెండర్లలో పాల్గొనడానికి, అద్దె ఒప్పందాలు, ఉద్యోగ ఒప్పందాలు వంటి వ్యక్తిగత చట్టపరమైన పత్రాల కోసం డిజిటల్ సంతకాలను ఉపయోగించవచ్చు. పూర్తిగా ఎలక్ట్రానిక్ రూపంలో రూపొందించి, ప్రాసెస్ చేసిన పత్రాలకు ఇ-సంతకాలు ఉత్తమంగా సరిపోతాయి. ఇవి వేగం, భద్రత, చట్టపరమైన చెల్లుబాటును నిర్ధారిస్తాయి. వీలునామాలు, రిజిస్ట్రేషన్, భౌతిక సంతకాలు అవసరమయ్యే సేల్ డీడ్, గిఫ్ట్ డీడ్ వంటి కొన్ని ఆస్తి పత్రాలు, పవర్ ఆఫ్ అటార్నీ, ట్రస్ట్ డీడ్లు లాంటి వాటిలో వీటిని అంగీకరించరు. ఇంకా, కోర్టులు కేవలం క్రిప్టోగ్రాఫిక్

భారతదేశంలో గంగా, యమునా, గోదావరి, కృష్ణా, కావేరి, నర్మదా, తపతి.. ఇలా ఎన్నో నదులు ఉన్నాయి. నదుల పేర్లన్నీ స్త్రీల పేర్లుగానే ఉంటాయి. అయితే భారతదేశంలో ఒక నది మాత్రం దీనికి పూర్తి భిన్నంగా ఉంటుంది. అదే బ్రహ్మపుత్ర నది. పేరు చూస్తేనే ఇది ప్రత్యేకంగా అనిపిస్తుంది. ‘బ్రహ్మపుత్ర’ అంటే ‘బ్రహ్మ దేవుడి కుమారుడు’ అని అర్థం. అందుకే బ్రహ్మపుత్రను భారతదేశంలోని ఒకే ఒక్క ‘మగ నది’గా చాలామంది చెబుతుంటారు. నిజానికి ఇది కేవలం పేరు విషయంలోనే కాదు.. తన ప్రవాహం, స్వభావం విషయంలోనూ ప్రత్యేకత ఉంటుంది. టిబెట్‌లో పుట్టిన ఈ నది భారత్‌లోకి అరుణాచల్‌ప్రదేశ్ మీదుగా ప్రవేశిస్తుంది. అక్కడ దీనిని ‘సియాంగ్’ అని పిలుస్తారు. ఆ తర్వాత అసోంలోకి చేరినప్పుడు బ్రహ్మపుత్రగా మారుతుంది. చివరికి బంగ్లాదేశ్‌లోకి వెళ్లి గంగానదితో కలిసి సముద్రంలో కలుస్తుంది. బ్రహ్మపుత్ర నదికి సంబంధించిన కథలు భారతీయ పురాణాల్లో కూడా కనిపిస్తాయి. పురాణాల ప్రకారం బ్రహ్మ దేవుడి కుమారుడిగా ఈ నదిని భావిస్తారు. అందుకే దీనికి ‘బ్రహ్మపుత్ర’ అనే పేరు వచ్చింది. సంస్కృతంలో ‘పుత్ర’ అంటే కుమారుడు. ఈ కారణంగానే ఇతర ప్రధాన నదులతో పోలిస్తే బ్రహ్మపుత్ర పేరు ప్రత్యేకంగా కనిపిస్తుంది. మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. బ్రహ్మపుత్ర నదిని భారత్‌లో మాత్రమే కాకుండా టిబెట్, చైనా, బంగ్లాదేశ్‌లో కూడా వేర్వేరు పేర్లతో పిలుస్తారు. టిబెట్‌లో దీనిని ‘యార్లుంగ్ సాంగ్పో’ అని అంటారు. భారత్‌లోకి వచ్చిన తర్వాత ‘సియాంగ్’, ‘దిహాంగ్’ వంటి పేర్లు వినిపిస్తాయి. అసోంలోకి వచ్చిన తర్వాతే ఇది బ్రహ్మపుత్రగా ప్రసిద్ధి చెందింది. ఈ నది కేవలం పేరుతోనే ప్రత్యేకం కాదు. భారీ నీటి ప్రవాహం, పొడవైన ప్రయాణం, వర్షాకాలంలో వచ్చే వరదల కారణంగా కూడా ఇది ప్రపంచంలోని ముఖ్యమైన నదుల్లో ఒకటిగా నిలిచింది. బ్రహ్మపుత్ర నది ఈశాన్య భారతదేశానికి ఎంతో ముఖ్యమైనది. ముఖ్యంగా అసోం రాష్ట్రంలోని ప్రజల జీవితం ఈ నదితోనే ముడిపడి ఉంది. వ్యవసాయం, చేపల

90ల కాలంలో పుట్టి పెరిగిన వారికి 'ఆశ చాక్లెట్' (Asha Chocolates) అంటే తెలియనివారు ఉండరు. స్కూల్ బెల్ మోగగానే జేబులో ఉన్న 25 పైసలు, 50 పైసలు లేదా రూపాయి నాణేన్ని పట్టుకుని కొట్టు దగ్గరకు పరుగెత్తి, ఆశ చాక్లెట్ కొనుక్కొని తినడంలో ఉన్న ఆనందమే వేరు. ప్రతి ఒక్కరి చిన్ననాటి తీపి జ్ఞాపకాలలో ఈ చాక్లెట్‌కు ప్రత్యేక స్థానం ఉంది. అయితే అప్పట్లో ఎంతో ప్రాచుర్యం పొందిన ఈ ఐకానిక్ చాక్లెట్ కాలక్రమేణా మార్కెట్ నుంచి ఎందుకు కనుమరుగైంది? దీని వెనుక ఉన్న కారణాలను ప్రముఖ యూట్యూబర్ విఆర్ రాజా (V R Raja) గతంలో తన వీడియో ద్వారా వివరించారు. ఆశ చాక్లెట్‌ను ఆంధ్రప్రదేశ్‌లోని చిత్తూరుకు చెందిన ప్రముఖ 'నూట్రిన్ కాన్ఫెక్షనరీ' (Nutrine Confectionery) సంస్థ తయారు చేసింది. ఈ సంస్థను 1952లో బి. వెంకటరామరెడ్డి గారు స్థాపించగా, ఆ తర్వాత ఆయన కుమారుడు ద్వారకానాథ్ రెడ్డి దీనిని భారతీయ మార్కెట్లో అగ్రగామి బ్రాండ్‌గా తీర్చిదిద్దారు. అ కంపెనీ చిత్తూరు జిల్లాలో స్టార్ట్ అయ్యింది. మన దేశంలోనే కాదు దాదాపు 10 దేశాల్లో ఆశా చక్లెట్ ఎగుమతులు, విక్రయాలు జరిగాయి. ఆశా బ్రాండ్ కింద ప్రధానంగా 'ఆశ స్వీట్ మేజిక్' (Asha Sweet Magic) చాక్లెట్లు ఎంతో ప్రజాదరణ పొందాయి. ఇవి మాత్రమే కాకుండా నూట్రిన్ సంస్థ ఆశ ఫ్లేవర్‌తో పాటు మహాలాక్టో (Maha Lacto), కొకోనట్, పైన్ఆపిల్, కాఫీ, మ్యాంగో బార్ వంటి అనేక రకాల మిఠాయిలు, టాఫీలను మార్కెట్లోకి తీసుకొచ్చింది. ఆశ చాక్లెట్ సాధించిన అపారమైన విజయంలో దాని 'ధర' అతి ముఖ్యమైన పాత్ర పోషించింది. 25 పైసలు, 50 పైసలు ఆతర్వాత కాలంలో రూపాయి ధరల్లో లభించడం వల్ల సామాన్య కుటుంబాల పిల్లలకు ఇది ఎంతో అందుబాటులో ఉండేది. అయితే కాలక్రమేణా చాక్లెట్ తయారీకి కావలసిన ప్రధాన ముడిసరుకులైన కోకో (Cocoa), పాలు, చక్కెర, ప్యాకింగ్

కొత్తిమీరలో విటమిన్ ఎ, సి, కె, ఫోలేట్ పుష్కలంగా ఉంటాయి. దీన్ని రోజూ తినడం వల్ల ఆరోగ్యం మెరుగుపడుతుంది. జీర్ణక్రియను మెరుగుపరచడానికి, కడుపు ఉబ్బరం సమస్యను నివారించడానికి కొత్తిమీరను ఆహారంలో చేర్చుకోవడం మంచిది. కొత్తిమీరలో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. ఇది శరీర శుద్ధికి సహాయపడుతుంది. కొత్తిమీరలో యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరంలోని వాపును తగ్గించడంలో సహాయపడతాయి. కొత్తిమీరలో యాంటీ-బ్యాక్టీరియల్ గుణాలు ఉంటాయి. దీన్ని రోజూ తినడం వల్ల చర్మ ఆరోగ్యం మెరుగుపడుతుంది. కొత్తిమీరలో ఉండే యాంటీ ఆక్సిడెంట్ గుణాలు చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించి, గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో సహాయపడతాయి. రోగనిరోధక శక్తిని పెంచుకోవడానికి రోజూ కొత్తిమీర తినడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. Sarees: వావ్ అనిపించే వర్క్ శారీస్.. డిజైన్లు చూస్తే ఫిదా కావాల్సిందే! Bridal Jewellery:పెళ్లిళ్లకు అదిరిపోయే జ్యూవెలరీ సెట్స్ ఫిదా అయిపోతారు Gold Haaram: 5 తులాల్లో మెడ నిండుగా వచ్చే గోల్డ్ హారం డిజైన్లు Mini Jhumka: కేవలం 2 గ్రాముల్లో డైలీవేర్ కి అదిరిపోయే జుంకా డిజైన్లు

మనిషి మెదడు చాలా శక్తివంతమైనది. మనిషి మనుగడ సాగుతున్నది మెదడు పనితీరు మీదనే.. మెదడు ఎంత ఆరోగ్యంగా ఉంటే మనిషి జీవితం అంత బాగుంటుంది. కానీ మెదడు పనితీరు సరిగా లేకపోతే చాలా సమస్యలు వస్తాయి. అయితే మనిషి మెదడు ఎల్లప్పుడూ నిష్పక్షపాతంగా ఉండదని అంటున్నారు నిపుణులు. సమాచారాన్ని వేగంగా గ్రహించడంలో సహాయపడటానికి.. మనస్సు కాగ్నిటివ్ బయాసెస్ అని పిలువబడే మానసిక పరిస్థితి పై ఆధారపడుతుంది. ఈ మార్గాలు సమయాన్ని ఆదా చేయగలిగినప్పటికీ, అవి ఆలోచించే, నిర్ణయాలు తీసుకునే , చుట్టూ ఉన్న వ్యక్తులను అర్థం చేసుకునే విధానాన్ని కూడా వక్రీకరించగలవని అంటున్నారు. దీని ఫలితంగా మెదడు ఒక విషయాన్ని వేరేగా అన్వయించుకుంటుంది, అందుకే అదే నిజమని నమ్మే అవకాశం ఉంటుంది. దీని గురించి మరింత వివరంగా తెలుసుకుంటే.. నిర్థారణలో పక్షపాతం.. ఇప్పటికే నమ్ముతున్న విషయాలను బలపరిచే సమాచారం కోసం మెదడు సహజంగానే వెతుకుతూ ఉంటుందట. ఎవరితోనైనా విభేదిస్తే, వారితో విభేధించడానికి గల అభిప్రాయానికి గల కారణాలను, సాక్ష్యాలను విస్మరించి, వారు తప్పు అని చెప్పడానికి గల ప్రతి కారణంపై దృష్టి పెడతారట. నిజాన్ని తెలుసుకోవడానికి బదులుగా, మనస్సు తరచుగా తను అనుకున్నదే కరెక్ట్ అనే విషయాన్ని నిరూపించడం కోసం వెతుకుతూ ఉంటుందట. ఇలా నిజాలు తెలుసుకునే విషయంలో మెదడు పక్షపాతం వహిస్తుందట. హెలో ఎఫెక్ట్.. చాలామంది చక్కగా దుస్తులు ధరించి, శుభ్రంగా ఉంటూ, చాలా ఆత్మవిశ్వాసంతో ఉంటుంటారు. ఇలాంటి వారి విషయంలో చాలామంది పాజిటివ్ గానూ, వాళ్లదిమంచి వ్యక్తిత్వం అని అనుకుంటారు. దీని కారణం మెదడే.. ఇలాంటి వాళ్లు మంచోళ్లు అని మెదడు అనుకుంటుందట. ఇలాంటి ప్రభావాన్ని హెలో ఎఫెక్ట్ అని అంటారు. ఒక వ్యక్తిలో మంచి గుణాన్ని గమనించినప్పుడు, ఎటువంటి నిజమైన ఆధారం లేకపోయినా, మెదడు వారికి ఇతర మంచి లక్షణాలు కూడా ఉన్నాయని దానంతట అదే ఊహించుకుంటుంది. వాస్తవాల ఆధారంగా ఒకరిని అంచనా వేయడానికి బదులుగా, మనస్సు దానికి నచ్చినట్టు

Agriculture : అభివృద్ధి, టెక్నాలజీ అవసరమే... కానీ వీటికోసం జీవితాలనే పనంగా పెట్టేంత అవసరం కాదు. కానీ నేటి తరం ఇదే చేస్తోంది. ఈ అభివృద్ధి మాయలో పడి అన్నీ కలుషితం చేసేస్తున్నారు... దీంతో మనిషికి సౌకర్యాలు పెరిగాయి కానీ ఆయుష్షు తగ్గింది. అందుకే ఇప్పుడు చాలామంది సౌకర్యాలకు త్యాగం చేసి గతంలో మాదిరిగా ప్రకృతితో మమేకం అయ్యేందుకు సిద్దమవుతున్నారు. ఈ క్రమంలోనే ''ప్రకృతి వ్యవసాయం (Natural Farming)'' బాగా ఆదరణ పొందుతోంది. మన పూర్వీకుల మాదిరిగా రసాయన ఎరువులు, పురుగుమందులు వాడకుండా ప్రకృతి సిద్ధమైన పదార్థాలతో భూమి సారాన్ని పెంచుతూ పంటలు పండించడమే ప్రకృతి వ్యవసాయం. ఇలా సహజసిద్దంగా పండించిన కూరగాయలు, ధాన్యాలు, పండ్లను తినేందుకు చాలామంది ఇష్టపడుతున్నారు... ఇది ఇప్పుడు పెద్ద బిజినెస్ గా మారింది. అయితే ఇంతకంటే సహజసిద్దంగా పంటలు పండించే మరో కాన్సెప్ట్ బాగా ప్రాచుర్యం పొందుతోంది... అదే ''డూ నథింగ్ ఫార్మింగ్ (Do Nothing Farming)''. ప్రకృతి వ్యవసాయం మాదిరిగానే ఈ డూ నథింగ్ ఫార్మింగ్ కూడా జపాన్‌కు చెందిన ఒక వినూత్న వ్యవసాయ పద్ధతి. ఈ విధానం ప్రకారం... ప్రకృతి తన పనిని తాను చేసుకునేలా వదిలివేయాలి... వ్యవసాయంలో మన జోక్యం చాలా తక్కువగా ఉండాలి. భూమిని దున్నడం, కలుపు తీయడం, పురుగు మందులు వాడటం వంటి పనులను తగ్గించడం దీని ముఖ్య ఉద్దేశ్యం. ఇంకా చెప్పాలంటే అడవుల్లో చెట్లకు పండ్లు మన ప్రమేయం లేకుండా ఎలా కాస్తాయో భూమిలో పంటలు కూడా అలా పండించాలి. మనం ఏమీ చేయకుండానే పంటలు పండించడమే డూ నథింగ్ ఫార్మింగ్. ఈ వ్యవసాయ పద్దతి ద్వారా రైతులు తమ శ్రమను, ఖర్చులను గణనీయంగా తగ్గించుకోవచ్చు. ఇది భూమిని సహజసిద్ధంగా సారవంతం చేసి, పంటలకు మెరుగైన వాతావరణాన్ని అందిస్తుంది. ఇది ఆధునిక వ్యవసాయానికి భిన్నమైన మార్గం. ఇది స్థిరమైన, పర్యావరణ అనుకూలమైన వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తుంది. ఈ పద్ధతి రైతుల జీవితాల్లో

పాములకు అసలు వినికిడి శక్తే ఉండదు, అవి పూర్తిగా చెవిటివి అని చాలామంది అనుకుంటారు. కానీ ఇది కేవలం ఒక ప్రచారంలో ఉన్న అపోహ మాత్రమే. నిజానికి పాములకు బయటకు కనిపించే చెవులు గానీ, మనలాగా చెవి తమ్మలు, ఇయర్ డ్రమ్స్ గానీ ఉండవు. అయినప్పటికీ, అవి నేల ద్వారా వచ్చే కంపనాలను, గాలిలో వచ్చే తక్కువ ఫ్రీక్వెన్సీ శబ్దాలను చాలా స్పష్టంగా గ్రహించగలవు. మనకు బయటకు కనిపించే చెవుల వ్యవస్థ ఉన్నట్లే, పాములకు తమ దవడ ఎముకలకు అనుసంధానమై ఉండే ఒక వినూత్న అంతర్గత వినికిడి వ్యవస్థ ఉంటుంది. మీరు ఏదైనా పాము తలను జాగ్రత్తగా గమనిస్తే, అక్కడ ఎటువంటి చెవి రంధ్రాలు గానీ, బయటకు కనిపించే చెవి భాగాలు గానీ ఉండవు. చాలా జీవుల్లో గాలి ద్వారా వచ్చే శబ్ద తరంగాలు చెవిపాపిడిని తాకినప్పుడు అది కంపించి, ఆ శబ్ద సంకేతాలను మధ్య చెవి ఎముకల ద్వారా లోపలి చెవికి పంపుతుంది. కానీ, పాములు తమ పరిణామ క్రమంలో బయటకు కనిపించే చెవి, మధ్య చెవి నిర్మాణాలను కోల్పోయాయి. అయితే, వాటి పుర్రె లోపల లోతుగా పూర్తిస్థాయిలో అభివృద్ధి చెందిన అంతర్గత చెవి ఉంటుంది. ఇందులో కాక్లియా లాంటి నిర్మాణం, గ్రాహక రోమ కణాలు ఉంటాయి. బయటి కంపనాలను ఈ అంతర్గత చెవికి చేరవేయడానికి పాములు కొలుమెల్లా అనే ఒక ప్రత్యేకమైన చిన్న ఎముకపై ఆధారపడతాయి. మానవులలో ఉండే స్టాప్స్ ఎముక లాగే ఇది పనిచేస్తుంది. పాము శబ్దాలను గ్రహించే అత్యంత సమర్థవంతమైన మార్గం ఎముకల ప్రసరణ (బోన్ కండక్షన్): • దవడ ఎముక ద్వారా సమాచారం: పాము నేలపై పడుకున్నప్పుడు, దాని కింద దవడ నేరుగా నేల ఉపరితలాన్ని తాకి ఉంటుంది. • కంపనాల బదిలీ: నేలపై ఏ చిన్న కదలిక జరిగినా.. అంటే మనుషుల అడుగుల చప్పుడు, వేటాడే జంతువుల రాక, లేదా చిన్న చిన్న జీవుల కదలికలు

మనిషికి కళ్లు ముందువైపు ఉంటాయి... కాబట్టి ముందు ఏం జరుగుతుందో మాత్రమే చూడగలం. వెనక ఏం జరుగుతుందో చూడాలంటే కచ్చితంగా తల తిప్పాల్సిందే. కాని పాడిపశువులు ఆవులు, బర్రెలు తల తిప్పకుండానే వెనకాల ఏం జరుగుతుందో చూడగలవట. వాటికి కూడా మనలాగే ముందువైపేగా కళ్లు ఉండేది... మరి వెనకాల ఎలా చూడగలవు? అనేగా మీ డౌట్. అయితే ఇది ఏదో మంత్రజాలం కాదు... మనుగడ కోసం పశువులకు ప్రకృతి ప్రసాదించిన వరమే ఈ వెనక చూపు. మరి ఆవులు, గేదెల కంటి అమరిక, వాటి చూపు వెనుక ఉన్న ఆసక్తికరమైన సైంటిఫిక్ నిజాల గురించి ఇక్కడ తెలుసుకుందాం. మానవులకు కళ్లు ముఖానికి ముందు భాగంలో అమర్చబడి ఉంటాయి. దీనివల్ల మన చూపు కేవలం 180 డిగ్రీల పరిధికి మాత్రమే పరిమితమవుతుంది. కానీ ఆవులు, బర్రెల విషయానికి వస్తే వాటి కళ్లు తలకు ఇరువైపులా (లాటరల్ పొజిషన్) ఉంటాయి. ఈ ప్రత్యేకమైన శరీర నిర్మాణం వల్ల వాటికి 'పనోరమిక్ విజన్' (Panoramic Vision) లభిస్తుంది. అంటే అవి తల తిప్పకుండానే దాదాపు 300 నుండి 330 డిగ్రీల విశాలమైన కోణంలో తమ చుట్టూ ఉన్న పరిసరాలను గమనించగలవు. దీనివల్ల తమ వెనుక నుంచి ఎలాంటి ముప్పు లేదా శబ్దం వచ్చినా వెంటనే గ్రహించగలుగుతాయి. ఆవులు, గేదెల కనుపాప (Pupil) నిర్మాణం మన కళ్ల కంటే పూర్తిగా విభిన్నంగా ఉంటుంది. మనుషుల కనుపాప గుండ్రంగా ఉంటే, పశువుల కనుపాప అడ్డంగా (Horizontal Slit) ఉంటుంది. ఇలాంటి కనుపాప అమరిక వల్ల నేలమట్టానికి సమాంతరంగా ఉండే విశాల ప్రాంతాన్ని కూడా ఒకేసారి స్పష్టంగా చూడటానికి పశువులకు వీలవుతుంది. ముఖ్యంగా పశువులు మేత మేసేటప్పుడు తల కిందకు దించినప్పటికీ, ఇరువైపులా, వెనుక భాగంలో ఏం జరుగుతుందో ఈ ప్రత్యేకమైన కనుపాప సహాయంతో గమనించవచ్చు. పశువుల దేన్నయినా చూసేటప్పుడు రెండు రకాల దృష్టి వ్యవస్థలు ఒకే సమయంలో పనిచేస్తాయి. ఏక నేత్ర
నట సింహం నందమూరి బాలకృష్ణ , యంగ్ డైరెక్టర్ బాబీ కొల్లి కాంబినేషన్లో వచ్చిన ‘డాకు మహారాజ్’ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని సాధించి, వసూళ్ల సునామీ సృష్టించిన సంగతి తెలిసిందే. ఫస్ట్ డే రూ.56 కోట్ల గ్రాస్ రాబట్టి, బాలయ్య కెరీర్లోనే అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రాల్లో ఒకటిగా నిలిచింది. తమన్ అందించిన స్వరాలు, బీజీఎం సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. ముఖ్యంగా మాస్ ప్రేక్షకులను ఊపేసిన ‘దబిడి దిబిడి’ సాంగ్ సోషల్ మీడియాలో ట్రెండ్ క్రియేట్ చేసింది. అయితే ఈ పాటలోని ఓ డాన్స్ మూమెంట్ తీవ్ర విమర్శలకు, వివాదానికి దారితీసింది. దీనిపై సోషల్ మీడియాలో నెటిజన్లు రెండు వర్గాలుగా విడిపోయి చర్చించుకున్నారు. బాలయ్య లాంటి సీనియర్ హీరో ఇలాంటి స్టెప్ వేయడం ఏంటని కొందరు, మిగతా హీరోలు తక్కువేమీ కాదని మరికొందరు ఇలా ఎవరి వెర్షన్లో వారు వాదోపవాదాలు చేసుకుంటూ కొంతకాలం చర్చ కొనసాగించారు.* కొడుక్కి రామ్‌చరణ్’ పేరు... అభిమాని ప్రేమకు చలించి పోయిన చిరంజీవి, ఊహించని సర్ ప్రైజ్ఈ పాటలోని వివాదాస్పద స్టెప్ క్రియేట్ చేసిన ప్రముఖ కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్ ఏడాదిన్నర తర్వాత తాజాగా స్పందిస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు. ఆ డాన్స్ మూమెంట్ కంపోజ్ చేసినందుకు తానెంతో పశ్చాత్తాపపడుతున్నానని తాజాగా ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. మాస్ ట్యూన్‌కి తగ్గట్లుగానే ఆ సీక్వెన్స్ క్రియేట్ చేశానని, అయితే ప్రేక్షకులు దానిని వేరే ఉద్దేశంతో అర్థం చేసుకుని వివాదాస్పదం చేస్తారని తాను ఊహించలేదని చెప్పారు. ఆసక్తికరమైన విషయం ఏంటంటే.. ట్రెండ్ అయిన ఆ స్టెప్ కొరియోగ్రఫీ చేసింది తానే అనే విషయం చాలామందికి తెలియదని కూడా ఆయన వ్యాఖ్యానించారు.* మెగా ఆఫర్ కొట్టేసిన మీనాక్షి చౌదరి... చిరంజీవి ' మెగా 158 'లో కీలక పాత్ర ?ఈ పాటకు సంబంధించి రేగిన వివాదంపై హీరోయిన్ ఊర్వశీ రౌతేలా గతంలోనే క్లారిటీ ఇచ్చారు. బాలకృష్ణ ఒక లెజెండ్ అని

ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి పడుకునే వరకు మనం చేసే ప్రతి పనిలో విద్యుత్ కీలకమైంది. లైట్, ఫ్యాన్, ఛార్జింగ్, ఇంటర్నెట్ ఇలా ప్రతి విషయం కరెంట్‌పై ఆధారపడి ఉంటుంది. అలాంటి విద్యుత్ ఒక వారం రోజుల పాటు లేకపోతే మన జీవితం ఎలా మారిపోతుంది? మొదట చిన్న అసౌకర్యంగా అనిపించినా, రోజులు గడిచే కొద్దీ దాని ప్రభావం ఎలా ఉంటుంది? వంటి ఆసక్తికరమైన విషయాలను ఇక్కడ తెలుసుకుందాం. వారం రోజులు కరెంట్ లేకపోతే, ఉదయం లేవగానే ఫ్యాన్ తిరగదు, మోటర్ పనిచేయదు, ఫోన్ ఛార్జింగ్ ఉండదు, ఇంటర్నెట్ ఉండదు, టీవీ పనిచేయదు. ఫ్రిజ్‌లో నిల్వ ఉంచిన పాలు, కూరగాయలు, పండ్లు, ఇతర పదార్థాలు పాడైపోతాయి. అనేక ప్రాంతాల్లో తాగునీటి సరఫరా కూడా నిలిచిపోతుంది. నగరాల్లో అపార్ట్మెంట్లలో నివసించే వారికి లిఫ్ట్‌లు పనిచేయవు. వృద్ధులు, చిన్నపిల్లలు, అనారోగ్యంతో ఉన్నవారు మెట్లు ఎక్కి దిగడమే సవాలుగా మారుతుంది. మొబైల్ ఫోన్లకు ఛార్జింగ్ లేక కుటుంబ సభ్యులతో, స్నేహితులతో లేదా అత్యవసర సేవలతో సంబంధాలు తెగిపోతాయి. ఇంటర్నెట్ లేక ఆన్లైన్ బ్యాంకింగ్, డిజిటల్ చెల్లింపులు, ఆఫీసు పనులు, ఆన్లైన్ చదువులు అన్నీ నిలిచిపోతాయి. అంతేకాదు ఆసుపత్రుల్లో పరిస్థితి మరింత క్లిష్టంగా మారుతుంది. పెద్ద ఆసుపత్రుల్లో జనరేటర్లు ఉన్నప్పటికీ అవి కూడా పరిమిత సమయం వరకు మాత్రమే పనిచేస్తాయి. ఇంధనం అయిపోతే వెంటిలేటర్లు, ఐసీయూ పరికరాలు, ఆపరేషన్ థియేటర్లు, రక్త నిల్వ కేంద్రాల వంటివి ప్రమాదంలో పడతాయి. పరిశ్రమలు మూతపడతాయి. వేలాది మంది కార్మికులకు పని ఉండదు. ఉత్పత్తి నిలిచిపోవడంతో ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం పడుతుంది. రైళ్లు, విద్యుత్‌తో నడిచే అనేక రవాణా సేవలు నిలిచిపోతాయి. ట్రాఫిక్ సిగ్నల్స్ పనిచేయక రోడ్లపై గందరగోళం ఏర్పడుతుంది. అలాగే రాత్రిపూట స్ట్రీట్ లైట్స్ లేకపోవడం వల్ల ప్రమాదాలు, దొంగతనాలు, ఇతర నేరాలు పెరిగే అవకాశం ఉంటుంది. విద్యుత్‌పై ఆధారపడే వ్యవసాయ రంగం కూడా తీవ్రంగా ప్రభావితమవుతుంది. బోర్లు పనిచేయక పంటలకు