
ప్రభాస్‌కు కన్ఫ్యూజన్.. ఎలా తేల్చుకుంటారో ఏమో..?
ప్రభాస్‌కు కన్ఫ్యూజన్.. ఎలా తేల్చుకుంటారో ఏమో..?

ప్రభాస్‌కు కన్ఫ్యూజన్.. ఎలా తేల్చుకుంటారో ఏమో..?
ప్రభాస్ 'సాలార్' ను కాపీ కొట్టిన పాకిస్థాన్.. సోషల్ మీడియాలో ఫ్యాన్స్ ఫైర్!

తమిళనాడులో 100 రోజులలో 904 దాడులు, 322 ఆహార సంస్థలు మూసివేత, 457 అరెస్టులు, ₹34.7 కోట్ల నకిలీ ఉత్పత్తులు స్వాధీనం

తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి నేటితో 1,000 రోజులు పూర్తైన సందర్భంగా గాంధీభవన్‌లో కాంగ్రెస్ నేతలు విజయోత్సవాలు నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ నాయకులు, కార్యకర్తలు సంబరాలు జరుపుకున్నారు. హైదరాబాద్: తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 1,000 రోజులు పూర్తైన సందర్భంగా గాంధీభవన్‌లో పార్టీ నేతలు విజయోత్సవాలు నిర్వహించారు. ఈ సందర్భంగా తెలంగాణ పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వ పాలనపై మాట్లాడారు. గత పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో తెలంగాణ ప్రజలు నిర్బంధ వాతావరణంలో గడిపారని జగ్గారెడ్డి విమర్శించారు. స్వేచ్ఛ కావాలనే ఆకాంక్షతోనే ప్రజలు కాంగ్రెస్‌ను అధికారంలోకి తీసుకొచ్చారని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రజలు, ప్రజాప్రతినిధులు, అధికారులు స్వేచ్ఛగా పనిచేసే పరిస్థితి ఏర్పడిందని పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం 1,000 రోజుల పాలనలో పోలీసుల నిర్బంధాలు లేవని, మీడియాపై ఆంక్షలు విధించలేదని జగ్గారెడ్డి అన్నారు. ప్రజలు, ప్రజాప్రతినిధులు సచివాలయానికి స్వేచ్ఛగా వెళ్లే అవకాశాన్ని రేవంత్‌రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం కల్పించిందన్నారు. అన్ని రంగాల్లో నియంతృత్వ ధోరణికి ముగింపు పలికి స్వేచ్ఛాయుత వాతావరణాన్ని తీసుకొచ్చామని జగ్గారెడ్డి తెలిపారు. ‘త్యాగాలు విద్యార్థులవి.. పేరు మీకా?’ : జగ్గారెడ్డి బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించలేకపోయిందని జగ్గారెడ్డి విమర్శించారు. కాంగ్రెస్ 1,000 రోజుల పాలనలో 70 వేల ఉద్యోగాలు భర్తీ చేశామని, రేషన్ కార్డులు పంపిణీ చేసి, ఆరోగ్యశ్రీ పరిమితిని రూ.10 లక్షలకు పెంచామని తెలిపారు. తెలంగాణ కోసం వందలాది మంది విద్యార్థులు ప్రాణత్యాగాలు చేశారని జగ్గారెడ్డి అన్నారు. రాష్ట్రాన్ని తామే సాధించామని చెప్పుకునే కేసీఆర్ కుటుంబంలో తెలంగాణ కోసం ఆత్మబలిదానం చేసిన ఒక్కరినైనా చూపించాలని ప్రశ్నించారు. కేసీఆర్ అసెంబ్లీకి రాకపోయినా నష్టమేం లేదు: జగ్గారెడ్డి కేసీఆర్ అసెంబ్లీ సమావేశాలకు ఎందుకు హాజరు కావడం లేదని ప్రశ్నిస్తే కేటీఆర్ చెప్పే సమాధానం హాస్యాస్పదంగా ఉందని జగ్గారెడ్డి అన్నారు. కేసీఆర్ రాజీనామా చేసినా కాంగ్రెస్ ప్రభుత్వానికి ఎలాంటి నష్టం లేదని స్పష్టం చేశారు

BRS Party | స్టేషన్ ఘనపూర్, సెప్టెంబర్ 02 : అమలు కాని హామీలను ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీది అభ్యాసం కాదు అది భస్మాసుర హస్తమని స్టేషన్ ఘనపూర్ మాజీ ఎమ్మెల్యే డాక్టర్ రాజయ్య అన్నారు. మంగళవారం స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గ కేంద్రంలోని జాతీయ రహదారి బస్టాండ్ వద్ద మాజీ మండల పార్టీ అధ్యక్షుడు మాచర్ల గణేష్ అధ్యక్షతన ఏర్పాటు చేసిన కాంగ్రెస్ పార్టీ వెయ్యి రోజుల పాలనపై బీఆర్ఎస్ రణభేరి కార్యక్రమానికి మాజీ ఎమ్మెల్యే రాజయ్య ముఖ్యఅతిథిగా హాజరుకాగా, సభ్యత్వ నమోదు నియోజకవర్గ ఇన్చార్జ్, రాష్ట్ర రైతు రుణ విమోచన కమిషన్ మాజీ చైర్మన్ నాగూర్ల వెంకన్న విశిష్ట అతిథిగా హాజరై మాట్లాడారు. ఎన్నికల మేనిఫెస్టోలో 420 హామీలు, 6 గ్యారంటీలు, 13 డెకరేషన్లతో అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లో నెరవేరుస్తామని హామీ ఇచ్చి వాటిని అమలు చేయని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని వేయి అడుగుల లోతులో తొక్కిపెట్టాలని రాజయ్య మండిపడ్డారు. మళ్లీ కేసీఆర్ నాయకత్వం కోసం ప్రజలు ఎదురుచూస్తున్నారు. అమలు కాని హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం వెయ్యి రోజుల పాలనలో ప్రజలకు చేసిందేమీ లేదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చక పోగా వారి మాటలు వింటే ప్రజల రక్తం మరుగుతోందని, హామీలు నెరవేర్చని ప్రభుత్వాన్ని ప్రజలు రాజకీయంగా తగిన గుణపాఠం చెప్పాలని పిలుపునిచ్చారు. రాష్ట్రంలో మళ్లీ బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చి కేసీఆర్ సీఎం కావాలని ప్రజలు ఎదురుచూస్తున్నారని అన్నారు. తెలంగాణ పున: నిర్మాణం కోసం పార్టీ శ్రేణులు యాగంలా కృషి చేయాలని పిలుపునిచ్చారు. కేసీఆర్ పాలనలో అన్ని రంగాల్లో అభివృద్ధి జరిగి, ఆయన ప్రవేశపెట్టిన పథకాలు దేశవ్యాప్తంగా గుర్తింపు పొందాయని రాజయ్య అన్నారు. ప్రస్తుతం కాంగ్రెస్ పాలనలో సంక్షేమ పథకాలు నిర్వీర్యమవుతూ అన్ని వర్గాల ప్రజలు వెనుకబడిపోతున్నారని విమర్శించారు. మేనిఫెస్టోలో ఇచ్చిన హామీల్లో ఫ్రీ బస్సు మినహా మరే పథకాన్ని పూర్తిస్థాయిలో అమలు చేయలేదని ఆరోపించారు

BRS party | తొగుట : ఎన్నికల సమయంలో ఆరు గ్యారంటీలు, 420 హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం.. దాదాపు వెయ్యి రోజులు గడుస్తున్నా హామీలను పూర్తిస్థాయిలో అమలు చేయడం లేదని బీఆర్ఎస్ పార్టీ తొగుట మండల అధ్యక్షుడు, దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి ఆదేశాల మేరకు బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో మంగళవారం తొగుటలో నల్ల జెండాలతో నిరసన తెలుపుతూ ధర్నా నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా జీడిపల్లి రాంరెడ్డి మాట్లాడుతూ.. ఎన్నికల ముందు హామీల వర్షం కురిపించిన కాంగ్రెస్.. అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలకు ఇచ్చిన మాటలను విస్మరించిందని విమర్శించారు. ఆరు గ్యారంటీలు, 420 హామీలను ప్రజల ముందు పెట్టి అధికారంలోకి వచ్చిన ప్రభుత్వం.. వెయ్యి రోజులు దాటుతున్నా ఇచ్చిన హామీలన్నింటినీ అమలు చేయకపోవడంపై ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. హామీల అమలును ప్రశ్నిస్తూ జాబ్ కార్డులను ప్రదర్శించి, కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల దృష్టికి తీసుకెళ్లారు. సొసైటీ చైర్మన్ కె హరికృష్ణా రెడ్డి మాట్లాడుతూ.. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలకు, ప్రస్తుతం జరుగుతున్న అమలుకు పొంతన లేదని ఆరోపించారు. ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేసే వరకు బీఆర్ఎస్ పోరాటం కొనసాగుతుందని, ప్రజా సమస్యలపై ప్రభుత్వాన్ని నిరంతరం నిలదీస్తామని స్పష్టం చేశారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీలపై ప్రజలకు పూర్తి సమాధానం చెప్పే వరకు పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ సందర్భంగా సిద్దిపేటకు ఆటోలో వెళ్తున్న మహిళ బీఆర్ఎస్ ఆందోళన చూసి ఆటో దిగి వొచ్చి రేవంత్ మోసాలపై తూర్పార పట్టారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ బక్క కనకయ్య, నాయకులు చిలువేరి మల్లారెడ్డి, దోమల కొమురయ్య, సుతారి రమేష్, బోధనం కనకయ్య, మంగ నర్సింలు, నంట పరమేశ్వర్ రెడ్డి, బండారు స్వామి గౌడ్, కుర్మ యాదగిరి, అరుణ్ కుమార్, ఎల్లం, వెంకట్ రెడ్డి, అశోక్, బోయిని శ్రీనివాస్, బిక్షపతి, నరేందర్ గౌడ్, మధుసూదన్ రెడ్డి
హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారి (ఎన్‌హెచ్-65)పై ప్రయాణించే వాహనదారులతో పాటు నకిరేకల్ పరిసర ప్రాంతాల ప్రజలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఎప్పటినుంచో ఎదురుచూస్తున్న 100 పడకల ప్రభుత్వ ఏరియా ఆస్పత్రి సేవలు త్వరలోనే అందుబాటులోకి రానున్నాయి. రూ.32 కోట్ల వ్యయంతో నిర్మించిన ఈ 100 పడకల ఆస్పత్రిని ఈనెల 5వ తేదీన ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రారంభించనున్నారు. ఈ ఆస్పత్రి అందుబాటులోకి వస్తే నకిరేకల్‌తో పాటు చుట్టుపక్కల మండలాల ప్రజలకు మెరుగైన వైద్య సేవలు చేరువ కానున్నాయి.నకిరేకల్‌లో గతంలో పరిమిత వసతులతో ఉన్న ఆస్పత్రి ప్రజల అవసరాలను పూర్తిగా తీర్చలేకపోయేది. రోజుకు 350 నుంచి 500 వరకు ఓపీ నమోదవుతున్న నేపథ్యంలో ఆస్పత్రిని 100 పడకలకు అప్‌గ్రేడ్ చేయాలని 2022లో అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్ణయించింది. ఆ తర్వాత నేషనల్ హైవే పక్కనే రూ.32 కోట్లతో కొత్త భవనాన్ని నిర్మించారు. నిర్మాణ పనులు సుమారు 5 నెలల క్రితమే పూర్తి అయ్యాయి. ప్రస్తుతం ఆస్పత్రికి రోజుకు 200 నుంచి 250 వరకు ఓపీ వస్తోంది.పూర్తి స్థాయి వైద్య సేవలు ప్రారంభమైతే రోగుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని సంబంధిత వర్గాలు చెబుతున్నాయి. మరీ ముఖ్యంగా నకిరేకల్, కట్టంగూర్, కేతేపల్లి ప్రాంతాల్లో రోడ్డు ప్రమాదాలు జరిగినప్పుడు బాధితులను నల్గొండ, హైదరాబాద్‌కు తరలించాల్సిన పరిస్థితి ఉండేది. దీంతో కీలకమైన గోల్డెన్ అవర్‌లో వైద్యం అందక ప్రాణనష్టం జరిగే ప్రమాదం ఉండేది. ఈ సమస్యకు కొత్త ఆస్పత్రి పరిష్కారం చూపనుంది. అత్యవసర వైద్యం, ట్రామా కేర్, ఐసీయూ, ఆర్థోపెడిక్ సేవలతో పాటు సాధారణ శస్త్రచికిత్సలు అందుబాటులోకి రానున్నాయి.గర్భిణులకు ప్రసూతి సేవలు, ప్రసవానంతర సంరక్షణ, నవజాత శిశువుల కోసం ప్రత్యేక వైద్య సేవలు కూడా కల్పించనున్నట్లు అధికారులు తెలిపారు. డిజిటల్ ఎక్స్‌రే, స్కానింగ్ సదుపాయాలు, 24 గంటల పాథాలజీ ల్యాబ్ వంటి సౌకర్యాలు కూడా అందుబాటులోకి రానున్నాయి. ఆస్పత్రి నిర్మాణ పనులను వేగవంతం చేయడంలో ప్రభుత్వ విప్, నకిరేకల్ ఎమ్మెల్యే

చీరలు లేదా వెస్ట్రన్ దుస్తులపైకి ఇలాంటి గ్రీన్ ఏడీ స్టోన్ నక్లెస్ ట్రై చేయండి. ముఖ్యంగా లైట్ కలర్ చీరల మీదకు మరింత అందంగా ఉంటాయి. వెయ్యి రూపాయలలోపే రియల్ డైమండ్ లుక్ కావాలంటే, ఈ నెక్లెస్ మీకు పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది. ఇందులో మీకు రకరకాల డిజైన్లు కూడా దొరుకుతాయి. ఈ గ్రీన్ స్టోన్ వర్క్ ఉన్న నెక్లెస్‌ను మీరు ఏదైనా పార్టీవేర్ డ్రెస్‌పైకి ట్రై చేయొచ్చు. ఇది మీకు ప్రత్యేకమైన లుక్ ఇస్తుంది. పార్టీలలో వేసుకునే డ్రెస్సుల కోసం డబుల్ లేయర్ నెక్లెస్ కూడా ఒక పర్ఫెక్ట్ ఆప్షన్. ఇది చాలా ట్రెండీగా కనిపిస్తుంది. చీరలో మరింత అందంగా కనిపించాలంటే, జ్యువెలరీ చాలా ముఖ్యం. ఈ యూనిక్ డిజైన్ ఉన్న నెక్లెస్‌ను మీరు వెయ్యి రూపాయల లోపే కొనుగోలు చేయవచ్చు. డబుల్ లేయర్డ్ నెక్లెస్ కూడా చీరపై చాలా బాగుంటుంది. రిసెప్షన్ లేదా నైట్ పార్టీలలో కట్టుకునే చీరలపైకి దీన్ని ట్రై చేయవచ్చు. ఈ ఫ్లోరల్ డిజైన్ నెక్లెస్‌ను మీరు వెయ్యి రూపాయల కన్నా తక్కువ ధరకే కొనుగోలు చేయవచ్చు. దీనిపైకి డైమండ్ చెవిపోగులు పెట్టుకుంటే చాలా అందంగా ఉంటుంది. Gold Locket: హార్ట్ షేప్ గోల్డ్ లాకెట్స్.. చూస్తే మనసు పారేసుకుంటారు! Saree Designs: పండగలకు పర్ఫెక్ట్ మ్యాచ్ అయ్యే చీరల డిజైన్లు Asafoetida: రోజూ చిటికెడు ఇంగువ తీసుకుంటే ఏమౌతుందో తెలుసా? ఫ్యామిలీ, ఫ్రెండ్స్ ఎవరూ వద్దు.. ఏమిటీ సోలో లివింగ్ ట్రెండ్?

కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని రంగాల్లో విఫలమైందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వెయ్యి రోజుల పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా బీఆర్ఎస్ ఛార్జ్‌షీట్ విడుదల చేసింది. ఈ సందర్భంగా తెలంగాణ భవన్లో నిర్వహించిన సమావేశంలో కేటీఆర్ మాట్లాడారు.కాంగ్రెస్ పాలనలో ఎటు చూసినా విధ్వంసం, వికృతం కనిపిస్తోందని కేటీఆర్ ఆరోపించారు. ఇది వెయ్యి రోజుల పాలన కాదని.. ‘పీడన’ అని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ మేనిఫెస్టోను ఈ శతాబ్దపు అతిపెద్ద మోసంగా అభివర్ణించారు. పేదల భూములను నిషేధిత జాబితాలో పెట్టి 30 శాతం కమీషన్లు తీసుకుంటున్నారని ఆరోపించారు. అభివృద్ధి పనులు పెద్దగా చేయకుండానే రాష్ట్ర ప్రభుత్వం రూ.4.50 లక్షల కోట్ల అప్పులు చేసిందని విమర్శించారు.రూ.50 వేల కోట్ల రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చి రూ.20 వేల కోట్లు మాత్రమే చేశారని కేటీఆర్ అన్నారు. రుణమాఫీ చేస్తామని సీఎం రేవంత్‌రెడ్డి దేవుళ్లపై ఒట్టు పెట్టారని గుర్తుచేశారు. మాఫీ పూర్తిగా చేయకుండా 70 శాతం మంది రైతులను మోసం చేశారని ఆరోపించారు. కేసీఆర్ తెలంగాణను అన్నపూర్ణగా మార్చారని.. కాంగ్రెస్ ప్రభుత్వం దాన్ని నాశనం చేసిందని విమర్శించారు.కాంగ్రెస్ పాలనలో ఢిల్లీకి మూటలు మోయడం, పదవుల కోసం కొట్లాడుకోవడం తప్ప మరేమీ లేదని కేటీఆర్ విమర్శించారు. రైతుబంధు పథకాన్ని నిలిపివేసి రాహుల్ బంధుకు ప్రాధాన్యం ఇస్తున్నారని ఆరోపించారు. గోదావరి, కృష్ణా జలాల విషయంలో తెలంగాణకు అన్యాయం జరిగితే కాంగ్రెస్‌ను వదిలిపెట్టబోమని హెచ్చరించారు.కాళేశ్వరం ప్రాజెక్టుపై కక్షతో రైతులను ఇబ్బంది పెడుతున్నారని ఆరోపించారు. మిస్ వరల్డ్ పోటీలు, మెస్సీ కార్యక్రమాలకు భారీగా నిధులు

Secunderabad: ప్రభుత్వ వైఫల్యాలపై సికింద్రాబాద్‌లో బీఆర్ఎస్ నిరసన ర్యాలీ ఈ వార్తకు సంబంధించిన

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారథ్యంలో రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఇటీవలే 1,000 రోజుల పాలనను పూర్తి చేసుకుంది. ప్రజాప్రభుత్వం పాలనలో సమూల మార్పులు తీసుకువచ్చామని, ప్రజల ఆకాంక్షలను నెరవేర్చామని, సామాజిక న్యాయానికి ప్రాధాన్యత ఇచ్చామని ప్రభుత్వం చెబుతోంది. రైతులు, మహిళలు, యువత కోసం అనేక రకాల సంక్షేమ పథకాలను అమలు చేస్తోన్నట్లు చెప్పుకొచ్చింది. తెలంగాణ చరిత్రలో ఓ నూతన అధ్యాయాన్ని లిఖించామని స్పష్టం చేస్తోంది.దీనికి భిన్నంగా స్పందిస్తోంది.. బీజేపీ రాష్ట్రశాఖ. రేవంత్ రెడ్డి 1,000 రోజుల పాలన మొత్తం దోపిడీపూరకమంటూ ఆరోపణలు గుప్పిస్తోంది. అధికార పార్టీ నాయకులు వందల కోట్ల రూపాయల దోపిడీకి పాల్పడ్డారని విమర్శిస్తోంది. గతంలో ఎప్పుడూ లేనంతగా అవినీతి, అక్రమాలు చోటు చేసుకున్నాయని ధ్వజమెత్తుతోంది. దీనిపై నిరసన కార్యక్రమాలను చేపట్టింది కూడా. కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల ముందుకు తీసుకువెళ్లే ప్రయత్నాలకు తెర తీసింది.ఈ క్రమంలో.. నగరం అంతటా బీజేపీ శ్రేణులు పెద్ద ఎత్తున నిరసన పోస్టర్లను అతికించాయి. హైదరాబాద్ వ్యాప్తంగా అత్యంత రద్దీగా ఉండే దాదాపు 500కు పైగా ప్రాంతాలలో ఈ పోస్టర్లు కనిపించాయి. కొన్ని ప్రభుత్వ కార్యాలయాలు, గాంధీ భవన్ పరిసరాల్లో ఈ పోస్టర్లను అంటించారు బీజేపీ నాయకులు. అసెంబ్లీ, రవీంద్ర భారతి, లక్డీకాపుల్ బస్ స్టాప్, ముఖ్యమంత్రి అధికారిక నివాసం వెలుపల పోస్టర్లు రాత్రికి రాత్రే వెలిశాయి.సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కు అరుదైన ఘనత..: దేశంలోనేపలు ప్రధాన రహదారులు, జంక్షన్లు, రద్దీగా ఉండే బస్ స్టాండ్లు, మెట్రో రైలు పిల్లర్ల వద్ద కూడా స్థానిక బీజేపీ శ్రేణులు ఈ నిరసన పోస్టర్లను ప్రదర్శించాయి. దీంతో హైదరాబాద్ లో ఒక్కసారిగా రాజకీయ వాతావరణం వేడెక్కింది. రెండు పార్టీల మధ్య ఘర్షణపూరిత వాతావరణానికి దారితీసింది. కాంగ్రెస్ ఇచ్చిన కీలక గ్యారెంటీల అమలుపై నిరసన తెలపడమే తమ ప్రధాన లక్ష్యమని బీజేపీ నాయకులు స్పష్టం చేస్తోన్నారు.ప్రజల పక్షాన ప్రభుత్వ వైఫల్యాలను ఎప్పటికప్పుడు ఎండగడతామని బీజేపీ స్పష్టం చేసింది. ఈ

కింగ్ నాగార్జున ప్రస్తుతం కింగ్ 100 తో బిజీగా ఉన్న విషయం తెల్సిందే. రా కార్తీక్ దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. కింగ్ నాగార్జున (Nagarjuna) ప్రస్తుతం కింగ్ 100 తో బిజీగా ఉన్న విషయం తెల్సిందే. రా కార్తీక్ దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. ఇక ఇదంతా పక్కన పెడితే.. నాగ్ మరోసారి ఒక స్పెషల్ రోల్ లో మెరవనున్నాడానే వార్తలు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. కుబేర, కూలీ సినిమాలలో నాగ్ ప్రత్యేక పాత్రల్లో మెరిశాడు. నిజం చెప్పాలంటే ఈ సినిమాలకు నాగార్జుననే ప్రధాన ఆకర్షణ. కానీ, నాగ్ కి మాత్రం ఈ సినిమాలు కలిసి రాలేదు. ముఖ్యంగా కూలీలో విలన్ గా ఆయన నటన బాగున్నా కూడా ఆశించిన ఫలితం దక్కలేదు. దీంతో నాగ్.. స్పెషల్ రోల్స్ కి దూరంగా ఉండడమే బెటర్ అని అక్కినేని ఫ్యాన్స్ చెప్పుకొచ్చారు. రెండుసార్లు స్పెషల్ రోల్ చేసి దెబ్బ తిన్నా కూడా నాగ్.. మరోసారి అదే పని చేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. కోలీవుడ్ స్టార్ హీరో సూర్య ప్రస్తుతం హెచ్. వినోత్ దర్శకత్వంలో ఒక సినిమా ఓకే చేసిన విషయం తెల్సిందే. ఈ చిత్రంలో ఒక కీలకమైన పాత్ర కోసం నాగార్జునను సంప్రదించారట. ఆ పాత్రకు నాగ్ అయితేనే పూర్తి న్యాయం జరుగుతుందని భావించి వినోత్.. కథ కూడా చెప్పాడట. తన పాత్రలోని ప్రాధాన్యత నచ్చడంతో నాగార్జున కూడా ఈ ప్రత్యేక పాత్రలో నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని టాక్. ఇక నాగార్జున ఎంట్రీతో ఈ సినిమాపై ఉన్న అంచనాలు ఒక్కసారిగా రెట్టింపయ్యాయి. గతంలో కార్తీతో కలిసి ఊపిరి సినిమాలో నటించిన నాగార్జున, ఇప్పుడు సూర్య నటించబోయే రాబోయే ప్రతిష్టాత్మక చిత్రంలో ఒక పవర్ఫుల్ స్పెషల్ రోల్ చేయడం విశేషం. ఈ చిత్రంలో సూర్య, నాగార్జున మధ్య వచ్చే సన్నివేశాలు అత్యంత ఉత్కంఠభరితంగా, మాస్

అక్షర ఆంధ్ర కార్యక్రమం సత్ఫలితాలిస్తోందని.. వచ్చే ఏడాదికి సంపూర్ణ అక్షరాస్యత దిశగా అడుగులు వేస్తున్నామని మంత్రి నారా లోకేశ్ వ్యాఖ్యానించారు. అమరావతి, సెప్టెంబర్ 1 (ఆంధ్రజ్యోతి): అక్షర ఆంధ్ర కార్యక్రమం సత్ఫలితాలిస్తోందని.. వచ్చే ఏడాదికి సంపూర్ణ అక్షరాస్యత దిశగా అడుగులు వేస్తున్నామని ఆంధ్రప్రదేశ్ విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ (AP Minister Nara Lokesh) వ్యాఖ్యానించారు. అక్షర ఆంధ్రలో శాసనసభ్యులు, స్థానిక ప్రజాప్రతినిధులను భాగస్వాములను చేయాలని ఆదేశించారు. బడిబయట పిల్లలను పాఠశాలల్లో చేర్పించేలా అధికారులు చొరవ చూపాలని సూచించారు. మధ్యాహ్న భోజన పథకంపై తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు ఫీడ్ బ్యాక్ అందించాలని ఆదేశించారు. పాఠశాల విద్య, ఇంటర్మీడియట్ విద్య శాఖలపై మంత్రి నారా లోకేశ్ ఈరోజు (మంగళవారం) సచివాలయంలో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారులకు పలు కీలక అంశాలపై దిశానిర్దేశం చేశారు. 2027 సెప్టెంబర్‌కు వందశాతం అక్షరాస్యత లక్ష్యమని ఉద్ఘాటించారు. ఏడాదిలో 25 లక్షల మంది అక్షరాస్యులు పెరగడంతో కేంద్ర ప్రభుత్వం ఏపీని అభినందించిందని అన్నారు. రాష్ట్ర అక్షరాస్యత 72.6శాతం నుంచి 82.1శాతానికి పెరిగిందని అధికారులు వివరించారు. 2027 మార్చిలో మరో 25 లక్షలు.. సెప్టెంబర్‌కు మరో 27 లక్షల మందికి అక్షరాస్యత కల్పిస్తున్నట్లు అధికారులు తెలిపారు. బడిబయట ఉన్న ప్రతి చిన్నారిని స్కూళ్లలో చేర్చాలి.. 11 ప్రభుత్వ శాఖల సమన్వయంతో అక్షరాస్యత ఉద్యమం కొనసాగుతోందని మంత్రి నారా లోకేశ్ వ్యాఖ్యానించారు. బడిబయట ఉన్న ప్రతి చిన్నారిని స్కూల్లో చేర్పించాలని దిశానిర్దేశం చేశారు. ఏపీలో ఇంకా 1,64,821 మంది బడిబయట పిల్లలు ఉన్నారని.. వారిపై ప్రత్యేక దృష్టి సారించాలని మార్గనిర్దేశం చేశారు. ఈ ఏడాది 33 వేల మంది బడిబయట పిల్లలను స్కూల్లో విద్యాశాఖ చేర్చిందని వివరించారు. లీప్ యాప్ ద్వారా మిగిలిన పిల్లల వివరాలు ప్రధానోపాధ్యాయులకు అందించాలని నిర్ణయించామని అన్నారు. ఉపాధ్యాయుల హాజరు 98.97శాతం.. విద్యార్థుల హాజరు 85.41శాతం ఉందని వివరించారు. మూడు రోజులు వరుసగా గైర్హాజరైతే తల్లిదండ్రులను

10,000mAh బ్యాటరీతో రెడ్మి K100 సిరీస్ వస్తోంది భారత మార్కెట్లో పోకో X8 పవర్ రీబ్రాండెడ్ వెర్షన్ 6.59-అంగుళాల అమోల్డ్ డిస్ప్లే, 185Hz రిఫ్రెష్ రేట్ Redmi K100 Leak : రెడ్మి K100 ప్రో, రెడ్మి K100 ప్రో మ్యాక్స్ ఉండనున్నాయి. ఈ సిరీస్‌లో ఒక స్టాండర్డ్ మోడల్ కూడా లాంచ్ కానుంది. ఈ రెడ్మి ఫోన్ పవర్ఫుల్ 10,000mAh బ్యాటరీతో వస్తుందని అంచనా. భారత మార్కెట్లో పోకో X8 పవర్ రీబ్రాండెడ్ వెర్షన్ కావచ్చు. ఈ ఫోన్ డిజైన్ రెడ్మి K100 ప్రో సిరీస్ మాదిరిగా ఉండొచ్చు. 10000mAh బ్యాటరీనా? : టిప్‌స్టర్ ప్రకారం.. రెడ్మి K100కు సంబంధించి కీలక విషయాలను వెల్లడించింది. ఈ ఫోన్ 10,000mAh బ్యాటరీతో రావచ్చు. అదనంగా, 165Hz రిఫ్రెష్ రేట్ డిస్ప్లేతో వస్తుంది. ఈ ఫోన్లో 3D అల్ట్రాసోనిక్ ఫింగర్‌ప్రింట్ సెన్సార్ ఉండొచ్చు. ఈ ఫోన్ IP68 రేటింగ్‌తో వస్తుంది. వాటర్, డస్ట్ రెసిస్టెన్స్ అందిస్తుంది. ఈ రెడ్మి ఫోన్ క్వాల్కామ్ స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ 5V చిప్సెట్తో వస్తుందని భావిస్తున్నారు. ఈ ఫోన్ ఇతర ఫీచర్లపై ఎలాంటి వివరాలు వెల్లడి కాలేదు. ఇటీవల లాంచ్ అయిన రెడ్మి K100 ప్రోలో 185Hz రిఫ్రెష్ రేట్‌కు సపోర్టు ఇచ్చే 6.59-అంగుళాల అమోల్డ్ డిస్ప్లే ఉంది. ఈ ఫోన్ కూడా క్వాల్కామ్ స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ 5V చిప్సెట్తో రన్ అవుతుంది. Read Also : Gold Price Consolidation : గోల్డ్‌పై గందరగోళం వద్దు.. అమ్మేయాలా? కొనాలా? రూ.2 లక్షల దిశగా బంగారం.. ఎక్స్పర్ట్స్ ఏం చెబుతున్నారంటే? ఈ ఫోన్ 16GB వరకు ర్యామ్, 512GB స్టోరేజ్‌కు సపోర్ట్ చేస్తుంది. ప్రో మోడల్లో 8580mAh బ్యాటరీ ఉంది. 100W వైర్డ్, 50W వైర్లెస్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది. ఈ ఫోన్ బ్యాక్ సైడ్ 200MP ప్రైమరీ కెమెరా, 50MP సెకండరీ కెమెరా, 8MP టెర్షియరీ కెమెరా

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రత్యర్ధి పార్టీ ని టార్గెట్ చేయటానికి కొత్త ప్లాన్ చేశారు. వెయ్యి రోజుల కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను టార్గెట్ చెయ్యాలని, నిరసనలకు బీఆర్ఎస్ పిలుపునిచ్చిన క్రమంలో ఆయన బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎంను టార్గెట్ చేశారు. కేసీఆర్ ప్రజా సమస్యల కోసం పని చేయకపోతే ప్రతిపక్ష నేత ఎలా అవుతారని టార్గెట్ చేసిన రేవంత్ రెడ్డి కేసీఆర్ రిజైన్ చెయ్యాలని డిమాండ్ చేశారు.కేసీఆర్ గత వెయ్యి రోజుల్లో ఏం చేశారు? సీఎం రేవంత్ విమర్శలు తాజాగా అంబర్‌పేటలో మూసీ నదిపై రూ.52 కోట్లతో నిర్మించిన కొత్త వంతెనను ప్రారంభించారు. ఆ తర్వాత అక్కడే జరిగిన ప్రజా సభలో బీఆర్ఎస్ అధినేత, ప్రతిపక్ష నేత కేసీఆర్‌పై తీవ్ర విమర్శలు గుప్పించారు.ఒక ఉద్యోగి ఏడాది పని చేయకపోతే తొలగిస్తారు. కానీ కేసీఆర్ గత వెయ్యి రోజుల్లో జీతం, భద్రత, వాహనాల కోసం ప్రభుత్వం నుంచి కోట్లు తీసుకున్నారు.మూడేళ్ళలో కేసీఆర్ తీసుకున్న జీతం, భద్రతకు అయిన ఖర్చుల లెక్క చెప్పిన సీఎం ఈ మూడేళ్ళలో కేసీఆర్ ఒక కోటి 84 లక్షల, 40 వేలు జీతంగా తీసుకున్నారని, వాహనాలు భద్రతా సిబ్బంది కోసం ప్రభుత్వం ఇప్పటివరకు 22 కోట్ల 24 లక్షల 40 వేల రూపాయలు ఖర్చు చేసిందని అన్నారు. అయినా ఒక్క రోజు కూడా ప్రజల కోసం, రాష్ట్రం కోసం బయటకు రాలేదు. ఫామ్‌హౌస్‌కు పరిమితమయ్యారు. వెంటనే రాజీనామా చేయాలి అని సీఎం రేవంత్ రెడ్డి కేసీ ఆర్ ను టార్గెట్ చేశారు.కేసీఆర్ రాజీనామా చెయ్యాలన్న డిమాండ్ తో ర్యాలీలు కేసీఆర్ రాజీనామా డిమాండ్ తో కాంగ్రెస్ కార్యకర్తలు సెప్టెంబర్ 1 నుంచి 5 వరకు మండల, జిల్లా కేంద్రాల్లో ర్యాలీలు, నిరసనలు చేపట్టాలని, 6న హైదరాబాద్ ఇందిరా పార్క్ వద్ద పెద్ద సభ నిర్వహించాలని పిలుపునిచ్చారు. 7 నుంచి మొదలయ్యే అసెంబ్లీ సమావేశాలకు కేసీఆర్ తప్పక రావాలని, పదేళ్ల పాలన
Bonus Ceiling Limit: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు దసరా ధమాకా అందనుందా?అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. దసరా, దీపావళి పండగల సీజన్ సమీపిస్తున్న వేళ భారీ ఆర్థిక ప్రయోజనం చేకూరే అవకాశం కనిపిస్తోంది. నేషనల్ కౌన్సిల్ ఫర్ జాయింట్ కన్సల్టేటివ్ మెషినరీ (NC-JCM) కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల బోనస్ లెక్కించే గరిష్ట పరిమితిని పెంచాలని డిమాండ్ చేసింది. ప్రస్తుతం ఉన్న రూ.7000 నుంచి రూ.21000లకు పెంచాలని ప్రభుత్వానికి డిమాండ్ చేసింది. ఈ మేరకు ఎన్సీ-జేసీఎం సెక్రెటరీ శివ గోపాల్ మిశ్రా కేబినెట్ సెక్రెటరికీ లేఖ రాశారు. ఆ లేఖలోని ముఖ్యమైన అంశాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.ఇటీవల కేంద్ర కార్మిక, ఉపాధి మంత్రిత్వ శాఖ జారీ చేసిన నోటిఫికేషన్ ప్రకారం ఉద్యోగుల కనీస వేతనాన్ని రూ.21 వేలుగా నిర్ణయించారు. చట్టం ప్రకారం బోనస్ లెక్కించే పరిమితి రూ.7000 లేదా ప్రభుత్వం నిర్ణయించిన కనీస వేతనం వీటిలో ఏది ఎక్కువైతే దాని ఆధారంగా ఉండాలి. ఇదే విషయాన్ని ఉద్యోగుల జేఏసీ డిమాండ్ చేసింది. మే, 2026లో జరిగిన 49వ జేసీఎం సమావేశంలో బోనస్ చట్టంలో మార్పుల ఆధారంగా పరిమితి పెంపును పరిశీలిస్తామని అధికారులు హామీ ఇచ్చారు. ఆగస్టు 25, 2026న వెలువడిన ప్రభుత్వ నోటిఫికేషన్ నవంబర్ 21, 2026 నుంచి అమలులోకి వచ్చేలా అమలు చేస్తుండడంతో ఈ పెంపును తక్షణమే వర్తింపజేయాలని జేఏసీ కోరింది. లేదా అక్టోబర్ 20, 2026న వచ్చే దసరా పండుగకు ముందే దీనికి సంబంధించిన ఉత్తర్వులు జారీ చేయాలని అభ్యర్థించింది.ఎవరికి లబ్ధిసాధారణంగా లెవెల్ 8 వరకు ఉండే నాన్ గెజిటెడ్, సీ-గ్రేడ్, బీ- గ్రేడ్ ఉద్యోగుకు ప్రొడక్టివిటీ లింక్డ్ బోనస్ లేదా అడ్ హాక్ బోనస్ లభిస్తుంది. బోనస్ పరిమితి రూ.21000లకు పెంచితే ఈ కేటగిరీల్లోని ఉద్యోగులందరికీ లబ్ధి చేకూరనుంది. ఒక్కసారిగా బోనస్ మూడు రెట్లు పెరగనుంది. ప్రస్తుతం సాధారణంగా 30.4 రోజుల సగటు ఆధారంగా 60 రోజులు లేదా 70 రోజుల

Nakrekal: నకిరేకల్‌లో సీఎం పర్యటన ఏర్పాట్లను పరిశీలించిన వీరేశం! Nakrekal: నకిరేకల్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నకిరేకల్ పర్యటన నేపథ్యంలో మినీ స్టేడియంలో జరగనున్న భారీ బహిరంగ సభ ఏర్పాట్లను చేస్తున్న ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే వేముల వీరేశం. కలెక్టర్ చంద్రశేఖర్ , ఎస్పీ శరత్ చంద్ర పవర్ వివిధ శాఖల అధికారులు పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ప్రజా ప్రభుత్వం 1000 రోజులు పూర్తి చేసుకుందని, గత విధ్వంస పాలన నుంచి వికాసం వైపు రాష్ట్రం సాగుతోందని అన్నారు. సీఎం పర్యటనలో 100 పడకల ఆసుపత్రి ప్రారంభంతో పాటు పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు ఉంటాయని తెలిపారు. గత బీఆర్ఎస్ పాలనలో రూ.8 లక్షల కోట్ల అప్పులు చేశారని, డబుల్ బెడ్రూం, ఇంటికో ఉద్యోగం, మూడెకరాల భూమి వంటి హామీలను అమలు చేయలేదని విమర్శించారు. ప్రతిపక్ష నేత అసెంబ్లీలో ప్రజా సమస్యలపై మాట్లాడలేదని, వారు సభకు రానందున దళిత నేతకు ప్రతిపక్ష నేత హోదా కూడా ఇవ్వలేదని అన్నారు. సీఎం సభను ప్రజలు, కార్యకర్తలు భారీగా తరలివచ్చి విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు

మదరసా విస్తరణ కోసం 100 ఏళ్ల నాటి హిందూ దేవాలయాన్ని కూల్చేసిన ఘటన పాకిస్థాన్‌లోని పంజాబ్ ప్రావిన్స్‌లో చోటుచేసుకుంది. ఇంటర్నెట్ డెస్క్: మదరసా విస్తరణ కోసం 100 ఏళ్ల నాటి హిందూ దేవాలయాన్ని కూల్చేసిన ఘటన పాకిస్థాన్‌లోని పంజాబ్ ప్రావిన్స్‌లో చోటుచేసుకుంది. న్యూస్ ఏజెన్సీ పీటీఐ రిపోర్టు ప్రకారం.. లాహోర్‌కు దాదాపు 130 కిలోమీటర్ల దూరంలో ఉన్న నరోవాల్ జిల్లాలోని 'సిరాజ్' అనే గ్రామంలో 100 ఏళ్లనాటి ఓ ఆలయం ఉంది. ఆ ఆలయం సుమారు 1,000 చదరపు మీటర్ల విస్తీర్ణంలో ఉంది. ఆలయం పక్కనే మదరసా ఉంది. నిషేధిత తీవ్రవాద ఇస్లామిక్ పార్టీ 'తెహ్రీక్-ఇ-లబ్బైక్ పాకిస్తాన్'కి చెందిన కొందరు వ్యక్తులు మదరసాను విస్తరించటం కోసం ఆగస్టు 21వ తేదీన ఆలయాన్ని కూల్చివేశారు. ఆలయ శిఖరానికి సంబంధించిన మెటల్ ఫిట్టింగులను, ఇటుకలను అక్కడి నుంచి తరలించారు. హక్కుల కార్యకర్తలు ఈ సంఘటనపై వెంటనే దర్యాప్తు చేయించాలని ప్రభుత్వాన్ని కోరారు. కూలగొట్టిన చోటే ఆలయాన్ని పునర్నిర్మించాలని స్థానిక నాయకులు, మైనారిటీ సంఘాలు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశాయి. ఈ సంఘటనపై ప్రభుత్వ వాదనలు భిన్నంగా ఉన్నాయి. 100 నుంచి 125 ఏళ్ల చరిత్ర కలిగిన ఆ గుడి భారీ వర్షాల కారణంగా కూలిపోయిందని ప్రభుత్వం అంటోంది. ఎవాక్యూ ట్రస్ట్ ప్రాపర్టీ బోర్డ్ అధికారి మీడియాతో మాట్లాడుతూ.. ‘ప్రభుత్వ రికార్డుల్లో గుడికి పేరు లేదు. అది చాలా పురాతనమైన గుడి. 100 నుంచి 125 సంవత్సరాల పాతది. భారీ వర్షాల కారణంగా గుడి కూలిపోయింది. ఆ భూమిని ఎవ్వరికీ లీజుకు ఇవ్వలేదు. గుడిని పునర్నిర్మించే బాధ్యత మా అధికారులు తీసుకుంటారు’ అని తెలిపారు. ఎన్ని అడ్డంకులు వచ్చినా స్థానిక ఎన్నికలు జరగడం ఖాయం: మంత్రి నారాయణ

మాట్లాడితే ప్యాన్ ఇండియా, ప్యాన్ వరల్డ్ అంటూ జబ్బలు చరుచుకుంటాం.. 1000 కోట్లు పరిచయం చేసింది మేమేనంటాం.. కానీ పర్ఫార్మెన్స్ అలా లేదు. కాస్త కఠువుగానే ఉంటుంది మరి.. ఓ పక్క సింగిల్ లాంగ్వేజ్ సినిమా 1000 కోట్లు కొడుతుంటే.. 2025 నుంచి మనోళ్లు సాధించేందేంటి..? బడ్జెట్స్‌పై పెడుతున్న ఫోకస్.. ఔట్ పుట్లో కనబడట్లేదెందుకు..? మన సినిమాలకు ఏమైంది..? ఇదే ఇవాల్టి ఎక్స్‌క్లూజివ్ స్టోరీ..! 2022లో RRR 1200 కోట్లు.. 2024లో పుష్ప 2 సినిమా 1800 కోట్లు, కల్కి 2కు 1200 కోట్లకు పైగా వచ్చాయి. 2023లో సలార్ 500 కోట్ల క్లబ్బులో చేరింది.. 2024లో దేవర 500 కోట్ల వరకు వసూలు చేసింది. 2025లో మాత్రం కేవలం మాటలే కానీ చేతలేం లేవు. వచ్చిన స్టార్స్ తోక ముడిచారు. 1000 కోట్లని కలలు గన్న గేమ్ ఛేంజర్, వార్ 2, రాజా సాబ్ దారుణంగా నిరాశ పరిచాయి. 2026లోనూ పరిస్థితులు మారలేదు. 2026 వచ్చి 8 నెలలైపోయింది.. ఈ ఏడాది ప్యాన్ ఇండియా సినిమాలకు కలిసొచ్చిందేం లేదు. అల్లు అర్జున్, మహేష్ లాంటి హీరోలు 2025 నుంచి అసలు కనబడట్లేదు. అది కూడా టాలీవుడ్‌కు మైనస్సే. దాంతో 2026లోనూ 500 కోట్లు కూడా రాబట్టలేకపోయింది టాలీవుడ్. మన శంకరవరప్రసాద్ గారు, పెద్ది సినిమాలు మాత్రమే 300 కోట్ల క్లబ్బులో చేరాయి. పుష్ప 2 తర్వాత సౌత్‌లో అసలు 1000 కోట్లు కొట్టిన సినిమానే లేదు. మరోవైపు ధురంధర్ సింగిల్ లాంగ్వేజ్‌లోనే ఫస్ట్ పార్ట్‌తో 1400 కోట్లు, సెకండ్ పార్ట్‌తో 1800 కోట్లు వసూలు చేసింది. 2025-26లో 1000 కోట్లు దాటిన ఇండియన్ సినిమా ఇదొక్కటే. కన్నడలో కాంతార ఛాప్టర్ 1 మాత్రమే 850 కోట్లకు పైగా వసూలు చేసింది. దాని తర్వాత కూలీ తెచ్చిన 518 కోట్లే సౌత్‌లో హైయ్యస్ట్. ఈ లిస్టులో తెలుగు సినిమా ఒక్కటీ లేదు. మాట్లాడితే మనమే

10,060 ప్రభుత్వ పోస్టుల భర్తీ ఏపీ జాబ్ క్యాలెండర్ ఆమోదం త్వరలోనే పూర్తి నోటిఫికేషన్ల షెడ్యూల్ AP Job Calendar: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిరుద్యోగ యువతకు బిగ్ రిలీఫ్ ఇస్తూ జాబ్ క్యాలెండర్-2026(AP Job Calendar) ప్రకటనను అధికారికంగా విడుదల చేసింది (G.O.Ms.No.81, 22-08-2026). ఈ నిర్ణయం ద్వారా రాష్ట్రవ్యాప్తంగా వివిధ ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న మొత్తం 10,060 పోస్టులను భర్తీ చేయనున్నారు. అభ్యర్థులకు స్పష్టతనిచ్చేలా ప్రత్యక్ష నియామక ప్రక్రియను మొత్తం నాలుగు దశల్లో (Phases) చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. Metro Phase 2: మెట్రో ఫేజ్-2లో సవాళ్లు, అద్భుతాలు.. భూగర్భంలో రైలు, డబుల్ డెక్కర్.. రూ.38,595 కోట్లతో భారీ ప్రాజెక్ట్ నోటిఫికేషన్ల దశలు, ఖాళీల వివరాలు: ఇప్పటికే మొదటి దశ కింద 1,523 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల కాగా, మిగిలిన మూడు దశల షెడ్యూల్ ఖరారైంది. సెప్టెంబర్ 15న రెండవ దశలో 3,231 పోస్టులు, అక్టోబర్ 15న మూడవ దశలో 2,311 పోస్టులు, అదే రోజున నాల్గవ దశ కింద మరొక 2,995 పోస్టులకు నోటిఫికేషన్లు రానున్నాయి. ఈ నియామకాలన్నీ APPSC, పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు, DSC వేదికలుగా జరగనున్నాయి. కీలక శాఖల్లో ముఖ్యమైన పోస్టులు: ఫేజ్-2 ద్వారా 149 గ్రూప్-1 పోస్టులు (డీఎస్పీ, డిప్యూటీ కలెక్టర్, మున్సిపల్ కమిషనర్), 542 కానిస్టేబుల్, 182 ఎస్ఐ, 196 అసిస్టెంట్ స్టాటిస్టికల్ ఆఫీసర్ పోస్టులను భర్తీ చేస్తారు. ఫేజ్-3లో 200 డిప్యూటీ తహసీల్దార్, 400 ఎక్సైజ్ కానిస్టేబుల్, నీటి వనరుల శాఖలో 224 ఏఈఈ, విద్యుత్ సంస్థల్లో 629 ఏఈఈ పోస్టులు రానున్నాయి. ఇక చివరిగా ఫేజ్-4 ద్వారా 2,991 DSC టీచర్ పోస్టులను నింపనున్నారు. ఈ నియామకాలన్నీ రిజర్వేషన్లు, రోస్టర్ విధానాన్ని అనుసరించి పారదర్శకంగా జరుగుతాయని జీవోలో పేర్కొన్నారు

Poco X8 Power Series Leaks: త్వరలోనే మార్కెట్లోకి పోకో X8 ప్రో పవర్ సిరీస్ మోడల్స్ విడుదల కాబోతున్నాయి. ఇది ప్రీమియం ఫీచర్స్‌తో అందుబాటులోకి రాబోతున్నట్లు తెలుస్తోంది. అయితే, వీటికి సంబంధించిన ఫీచర్స్ కూడా లీక్ అయ్యాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం. Poco X8 Power Series Leaks: మార్కెట్లోకి పోకో ఎప్పటికప్పుడు కొత్త కొత్త స్మార్ట్‌ఫోన్స్‌ను విడుదల చేస్తూ వస్తోంది. ముఖ్యంగా ఇటీవలే విడుదల చేసిన మంచి స్మార్ట్‌ఫోన్స్ మార్కెట్లో అద్భుతమైన స్పందన లభించింది. దీంతో ఈ కంపెనీ కొత్త కొత్త మొబైల్స్ లాంచ్ చేస్తూనే ఉంది. ఇదిలా ఉంటే త్వరలోనే పోకో నుంచి X సిరీస్ స్మార్ట్‌ఫోన్ లాంచ్ కాబోతోంది. దీనిని కంపెనీ పోకో ఎక్స్8 పవర్ సిరీస్‌తో అందుబాటులోకి తీసుకు రాబోతోంది. ఈ సిరీస్‌లో భాగంగా రెండు మోడల్స్ అందుబాటులోకి రాబోతున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా ఇందులో పోకో ఎక్స్ 8 పవర్ ప్రో 5Gతో పాటు పోకో ఎక్స్8 పవర్ ప్రో మాక్స్ 5G వంటి మోడల్స్ ఉండబోతున్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా ఇవి మోస్ట్ పవర్ఫుల్ ఫీచర్స్‌ను కూడా కలిగి ఉంటుంది. ఇప్పటికే దీనికి సంబంధించిన ఫీచర్స్ కూడా లీక్ అయ్యాయి. ఇందులో భాగంగా హై ఎండ్ మోడల్ మోస్ట్ పవర్ఫుల్ 10,000mAh బ్యాటరీని కూడా కలిగి ఉంటుంది. పోకో ఎక్స్8 పవర్ మోడల్‌కు సంబంధించిన ఫీచర్స్, స్పెషిఫికేషన్స్ వివరాల్లోకి వెళితే.. టిప్‌స్టర్ సంజు చౌదరి లీక్ చేసిన వివరాల ప్రకారం.. ఈ స్మార్ట్‌ఫోన్ చాలా అద్భుతమైన 6.83-అంగుళాల 1.5K డిస్ప్లేను కూడా కలిగి ఉంటుంది. అంతేకాకుండా ఇది AMOLED ప్యానెల్‌ను కలిగి రాబోతోంది. అలాగే 120Hz రిఫ్రెష్ రేట్‌కు సపోర్ట్ చేస్తుందని లీక్ అయిన వివరాలు చెబుతున్నాయి. ఈ స్మార్ట్‌ఫోన్ డిస్ప్లేకి ప్రొటెక్షన్గా గొరిల్లా గ్లాస్ విక్టస్ 2 సపోర్ట్ కూడా లభిస్తోంది. ఇక ఈ పోకో ఎక్స్8 పవర్ ప్రాసెసర్ విషయానికి వస్తే.. ఇది క్వాల్కామ్

మావుళ్లమ్మకు 100 కేజీల బంగారం దేశంలోనే ఏకైక గ్రామదేవతగా రికార్డ్ ఆలయంలో అత్యున్నత స్థాయి భద్రత Mavullamma Temple: పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం నడిబొడ్డున కొలువై ఉన్న శ్రీ మావుళ్లమ్మ అమ్మవారి దివ్యక్షేత్రం త్వరలో ఒక అరుదైన, సువర్ణ ఘట్టానికి వేదిక కాబోతోంది. భక్తుల కొంగుబంగారంగా పూజలందుకుంటున్న మావుళ్లమ్మ తల్లిని సంపూర్ణ స్వర్ణమయం చేయడానికి ఆలయ కమిటీ, ప్రజాప్రతినిధులు, భక్తులు మహత్తర సంకల్పాన్ని చేపట్టారు. ఈ మహాకార్యం పూర్తయితే, ఏకంగా 100 కిలోల బంగారు ఆభరణాలు, విశేషమైన స్వర్ణ చీరతో నిత్యం దర్శనమిచ్చే దేశంలోని మొట్టమొదటి, ఏకైక గ్రామదేవతగా శ్రీ మావుళ్లమ్మ తల్లి సరికొత్త చరిత్ర సృష్టించనున్నారు. Rain Alert: తెలుగు రాష్ట్రాలకు అలర్ట్.. రాబోయే 3 రోజులు భారీ వర్షాలు.. వాతావరణ శాఖ హెచ్చరికలు స్వర్ణ చీర తయారీ.. కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు: ప్రస్తుతం అమ్మవారిపై(Mavullamma Temple) సుమారు 52 కిలోల స్వర్ణాభరణాలు ఉండగా, భక్తుల నుంచి సేకరించిన రూ.35 కోట్ల విలువైన 23.43 కిలోల బంగారాన్ని స్థానిక ఎమ్మెల్యే స్వర్ణమయం కమిటీకి అందజేశారు. మిగిలిన 27 కిలోల సేకరణ కోసం ప్రత్యేక విరాళాల కౌంటర్‌ను ప్రారంభించారు. 100 కేజీల బంగారం నిక్షిప్తం కానున్న నేపథ్యంలో ఆలయ భద్రతను అత్యున్నత స్థాయికి పెంచుతున్నారు. భద్రత కోసం గన్ మెన్లను కేటాయించాలని కోరడంతో పాటు, సీసీ కెమెరాలు, మెటల్ డిటెక్టర్లు, ఫేషియల్ రికగ్నిషన్ లాంటి ఆధునిక వ్యవస్థలను అందుబాటులోకి తీసుకువస్తున్నారు. శాకాంబరీ అలంకారం.. ఆషాఢ సారె సంప్రదాయం: ఈ ఆలయంలో ఉత్సవాలు సైతం అత్యంత వైభవంగా జరుగుతాయి. ఆషాఢ పౌర్ణమి పర్వదినం సందర్భంగా అమ్మవారిని 6 టన్నుల కూరగాయలు, ఆకుకూరలు, ఫలాలతో నయనానందకరంగా శాకాంబరీ దేవిగా అలంకరించారు. పాడిపంటలు సమృద్ధిగా పండాలని ఈ పూజలు నిర్వహిస్తారు. అలాగే అమ్మవారిని తమ ఇంటి ఆడపడుచుగా భావించి భక్తులు సమర్పించే ఆషాఢ సారె సంప్రదాయం ఇక్కడి భక్తిభావానికి, ఆధ్యాత్మిక విశిష్టతకు సజీవ సాక్ష్యంగా నిలుస్తోంది

ఒకప్పుడు ఇమ్రాన్ హష్మీ అంటే రొమాన్స్, మ్యూజిక్, ఇంటెన్స్ లవ్ స్టోరీస్ కానీ ఆ ఇమేజ్‌కి కాలం చెల్లిపోయిందనే టైమ్‌లో ‘ఆవారాపన్ 2’తో మళ్లీ బాక్సాఫీస్‌పై తన మార్క్ చూపించాడు. ‘ఆవారపన్ 2’... విడుదలైన ఐదు రోజుల్లోనే ఇండియాలో 100.75 కోట్ల నెట్, వరల్డ్‌వైడ్‌గా 144.13 కోట్ల వసూళ్లు సాధించినట్లు ట్రేడ్ అంచనాలు చెబుతున్నాయి. ముఖ్యంగా ఇమ్రాన్ హష్మీ మెయిన్ లీడ్‌గా నటించి 100 కోట్ల క్లబ్‌లోకి వెళ్లిన తొలి సినిమా ఇదే. అంటే చాలా కాలంగా ఎదురుచూస్తున్న సోలో సక్సెస్ ఇప్పుడు సీక్వెల్ రూపంలో దక్కింది. అసలు ఈ సక్సెస్‌కి బలం 2007లో వచ్చిన ‘ఆవారపన్’కున్న కల్ట్ ఫాలోయింగే. ఆ సినిమా అప్పట్లో థియేటర్లలో పెద్దగా ఆడకకపోయినా కాలక్రమంలో శివ్ పండిట్ క్యారెక్టర్, మ్యూజిక్, ఇమ్రాన్ ఎమోషనల్ పెర్ఫార్మెన్స్కి స్పెషల్ ఫ్యాన్ బేస్ క్రియేట్ అయ్యింది. దాదాపు రెండు దశాబ్దాల తర్వాత అదే నోస్టాల్జియా థియేటర్లలోకి ఆడియన్స్‌ను తీసుకొచ్చిందనే చర్చ జరుగుతోంది. రీసెంట్ టైమ్‌లో ఇమ్రాన్ హీరోగా మాత్రమే కాకుండా యాంటాగనెస్ట్, క్యారెక్టర్ రోల్స్ కూడా ఎంచుకున్నాడు ‘OG’, ‘G2’ వంటి సినిమాలతో కొత్త ఇమేజ్‌కి షిఫ్ట్ అవుతున్న టైమ్‌లో ‘ఆవారపన్ 2’ మాత్రం ఇప్పుడు సోలో హీరోగా తన మార్కెట్ ఇంకా ఉందని ప్రూవ్ చేసింది. అందుకే ఇది కేవలం మరో హిట్ కాదు ఒకప్పుడు తగ్గిపోయిందనుకున్న స్టార్ మార్కెట్‌ను మళ్లీ రీసెట్ చేసిన కెరీర్ కంబ్యాక్ అంటున్నారు ఫ్యాన్స్

స్టార్ డైరెక్టర్ లోకేష్ కనకరాజ్ హీరోగా మరి నటించిన మొదటి మూవీ 'DC'. అరుణ్ మాథేశ్వరన్ దర్శకత్వంలో సన్ పిక్చర్స్ నిర్మించిన ఈ యాక్షన్ థ్రిల్లర్ ఆగష్టు 7న థియేటర్లలో అడుగుపెట్టింది. ఇప్పుడు ఈ మూవీ రెండు వారాల్లో రూ.100 కోట్ల గ్రాస్ క్లబ్ లో చేరింది. కథలో 'దాస్' పాత్రలో లోకేష్ కనకరాజ్, 'చంద్ర' పాత్రలో వామికా గబ్బి నటించారు. వీరిద్దరి పేర్లలోని మొదటి అక్షరాల కలయికే ఈ 'DC'. లోకేష్ ఫుల్ లెంగ్త్ లీడ్ రోల్ చేస్తున్నారని తెలిసినప్పుడు మొదట్లో కొందరు అనుమానాలు వ్యక్తం చేసినా, లోకేష్ తన ఇంటెన్స్ పర్ఫార్మెన్స్తో, రా అండ్ రస్టిక్ యాక్షన్‌తో అందరినీ మైండ్ బ్లాక్ చేశారు, ఈ సినిమా ఇంత పెద్ద బ్లాక్‌బస్టర్ కావడానికి కారణం కేవలం లోకేష్ క్రేజ్ మాత్రమే కాదు. అరుణ్ మాథేశ్వరన్ మార్క్ కల్ట్ విజువల్స్, వామికా గబ్బి పవర్ఫుల్ యాక్టింగ్, అనిరుధ్ రవిచందర్ అందించిన మైండ్ బ్లోయింగ్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ఈ సినిమాకి అసలైన ప్రాణం పోశాయి. అనిరుధ్ ఇచ్చిన బిజీఎమ్ థియేటర్లలో సీన్స్ ప్లే అవుతున్నంతసేపు ప్రేక్షకులకు గూస్బంప్స్ తెప్పిస్తోంది. ఒక సెన్సేషనల్ ఫిల్మ్‌మేకర్ తన తొలి ప్రాజెక్ట్‌తోనే నటుడిగా ఈ స్థాయిలో బాక్సాఫీస్‌ను షేక్ చేయడం ఇండియన్ సినీ చరిత్రలోనే ఒక అరుదైన రికార్డు. 100 కోట్ల క్లబ్లో చేరి సంచలనం సృష్టించిన 'DC' చిత్ర బృందానికి సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. 'స్పిరిట్' మూవీ నుంచి ప్రకాష్‌రాజ్ ఔట్.. క్లారిటీ ఇచ్చిన నిర్మాత.!
Judge Ravi Kumar Diwakar : ఉత్తరప్రదేశ్ న్యాయశాఖలో ఎవరూ ఊహించని ఓ కీలక పరిణామ చోటు చేసుకుంది. ముజఫ్ఫర్ నగర్‌లోని ఫాస్ట్‌ట్రాక్ కోర్టు అదనపు జిల్లా, సెషన్స్ జడ్జి రవికుమార్ దివాకర్ విచారిస్తున్న దాదాపు 100 హత్య కేసులను ఇతర న్యాయమూర్తికి బదిలీ చేశారు. అయితే ఈయన గడిచిన నాలుగు నెలల వ్యవధిలోనే ఒకరు కాదు ఇద్దరు కాదు ఏకంగా 22 మంది నిందితులకు మరణశిక్ష విధిస్తూ ఆయన సంచలన తీర్పులు ఇచ్చారు. ఈక్రమంలోనే 100 కేసులు బదిలీ చేయడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ముఖ్యంగా న్యాయవాదులు, వ్యాజ్యదార్లలో వ్యక్తమవుతున్న తీవ్ర ఆందోళనలను పరిగణనలోకి తీసుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.కేసులు బదిలీకి కారణమిదే..!ఉరిశిక్ష, యావజ్జీవ కారాగార శిక్ష పడే అవకాశం ఉన్న తీవ్రమైన కేసులను జడ్జి రవికుమార్ దివాకర్ బెంచ్ నుంచి జిల్లా మరియు సెషన్స్ జడ్జి వీరేంద్ర కుమార్ సింగ్ కోర్టుకు మారుస్తున్నట్లు ప్రభుత్వ న్యాయవాది ధృవీకరించారు. వరుసగా మరణశిక్షలు విధిస్తుండటంతో.. న్యాయవాదులతో పాటు కేసులతో సంబంధం ఉన్న వ్యక్తుల్లో కూడా తీవ్రమైన భయాందోళనలు నెలకొన్నాయని, ఈ విషయాన్ని పరిగణనలోకి తీసుకునే కేసుల బదిలీ నిర్ణయం జరిగిందని జిల్లా బార్ అసోసియేషన్ అధ్యక్షుడు ప్రమోద్ త్యాగి స్పష్టం చేశారు.అసలెవరీ జడ్జి రవికుమార్ దివాకర్?లక్నోకు చెందిన 46 ఏళ్ల రవి కుమార్ దివాకర్ 2009లో ఆజంగఢ్‌లో అదనపు సివిల్ జడ్జిగా తన కెరియర్ ప్రారంభించారు. 2015లో సుల్తాన్‌పూర్‌లో సివిల్ జడ్జిగా, ఆ తర్వాత జ్యుడీషియల్ మేజిస్ట్రేట్‌గా పదోన్నతి పొందారు. బీకామ్, ఎల్ఎల్ఎమ్ చదివిన ఆయన.. నవంబర్ 2025 నుంచి ముజఫ్ఫర్ నగర్లో అదనపు జిల్లా మరియు సెషన్స్ జడ్జిగా విధులు నిర్వర్తిస్తున్నారు. గతంలో 2022లో వారణాసిలోని గ్యాన్వాపి కాంప్లెక్స్‌లో వీడియోగ్రఫీ సర్వేకు ఆదేశాలు ఇచ్చి దేశవ్యాప్తంగా వార్తల్లో నిలిచారు.ఏయే కేసుల్లో దోషులకు ఉరిశిక్ష వేశారంటే..? ఆగస్టు 13వ తేదీన ఇచ్చిన తీర్పు.. షామ్లీ జిల్లాలో 2014 జులై 14న తేదీ జరిగిన

1600 × 720 పిక్సెల్ రిజల్యూషన్‌కు సపోర్టు ప్రాసెసర్‌గా క్వాల్కామ్ స్నాప్‌డ్రాగన్ 4 జెన్ 5 చిప్ 13MP మెయిన్ కెమెరా, 6.9-అంగుళాల LCD డిస్ప్లే Redmi M100 Launch : కొత్త స్మార్ట్‌ఫోన్ కొనేందుకు చూస్తున్నారా? రెడ్మి నుంచి M100 సరికొత్త స్మార్ట్‌ఫోన్ వచ్చేసింది. ఈ ఫోన్లో 1600 × 720 పిక్సెల్ రిజల్యూషన్‌తో 6.9-అంగుళాల ఎల్సీడీ డిస్ప్లే ఉంది. 120Hz రిఫ్రెష్ రేట్‌కు సపోర్ట్ చేస్తుంది. కార్నింగ్ గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్ అందిస్తుంది. ఇందులో 7,900mAh బ్యాటరీ స్పెషల్ అట్రాక్షన్. 45W ఫాస్ట్ ఛార్జింగ్‌కు కూడా సపోర్ట్ చేస్తుంది. వైల్డర్నెస్ గ్రీన్ వేరియంట్లో ఈ ఫోన్ అద్భుతంగా ఉంటుంది. ఈ ఫోన్ ధర, ఫీచర్లకు సంబంధించి పూర్తి వివరాలపై ఓసారి లుక్కేయండి.. ధర ఎంతంటే? : ఈ ఫోన్ మిడ్నైట్ బ్లాక్, స్టార్రీ వైట్ వైల్డర్నెస్ గ్రీన్ కలర్ ఆప్షన్లలో లభిస్తుంది. రెడ్మి M100 ఫోన్ 8GB+128GB వేరియంట్ ధర 1,799 యువాన్లు (సుమారుగా రూ. 25,500) ఉండగా, 6GB+256GB మోడల్ ధర 1,999 యువాన్లు (సుమారుగా రూ. 28,300)కు అందిస్తుంది. టాప్-ఎండ్ 8GB+256GB వేరియంట్ ధర 2,199 యువాన్లు (సుమారుగా రూ. 31,200)కు లభిస్తుంది. కంపెనీ అధికారిక వెబ్సైట్ నుంచి కొనేసుకోవచ్చు. స్పెసిఫికేషన్లు, ఫీచర్లు : రెడ్మి M100 ఫోన్లో 6.9-అంగుళాల LCD డిస్ప్లే ఉంది. ఈ ఫోన్ డిజైన్ అత్యంత ఆకర్షణీయంగా ఉంది. బ్యాక్ సైడ్ 4-డైమెన్షనల్ మైక్రో-కర్వ్డ్ డిజైన్ ఉండగా, కెమెరా ప్రాంతంలో RGB డైనమిక్ లైటింగ్ అందించారు. 1600 × 720 పిక్సెల్ రిజల్యూషన్‌కు సపోర్ట్ చేస్తుంది. Read Also : Nothing Phone 4a : వారెవ్వా.. ఈ నథింగ్ ఇంతకన్నా తక్కువ ధరకు దొరకదు.. ఫీచర్ల కోసమైన కొనేసుకోవచ్చు! ఈ ఫోన్లో 120Hz రిఫ్రెష్ రేట్ ఉంది. కార్నింగ్ గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్ అందిస్తుంది. ఇందులో ఐ ప్రొటెక్షన్ ఫీచర్ కూడా ఉంది
శ్రీలంకతో గాలేలో జరుగుతున్న తొలి టెస్టులో భారత వికెట్ కీపర్ బ్యాటర్ రిషభ్ పంత్ రికార్డుల వేట కొనసాగించాడు. టెస్టుల్లో అత్యంత వేగంగా 100 సిక్సర్లు బాదిన ఆటగాడిగా నిలిచాడు. ఇదే సమయంలో ఈ ఇన్నింగ్స్‌లో మొత్తంగా 69 బంతుల్లో 66 పరుగులు సాధించి సరికొత్త రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు. ఈ అద్భుత ఇన్నింగ్స్‌తో వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ (డబ్ల్యూటీసీ) చరిత్రలోనే అత్యధిక పరుగులు చేసిన భారత బ్యాటర్‌గా అవతరించాడు. ఇప్పటి వరకు అగ్రస్థానంలో ఉన్న భారత కెప్టెన్ శుభ్‌మన్ గిల్‌ను పంత్ దాటేశాడు.మొదటి ఇన్నింగ్స్‌లో 39 పరుగులు చేసిన పంత్, రెండో ఇన్నింగ్స్ 66 పరుగులతో కలిపి డబ్ల్యూటీసీలో తన మొత్తం పరుగుల సంఖ్యను 2,885కి చేర్చుకున్నాడు. గిల్ (2,867 పరుగులు) కంటే పంత్ ప్రస్తుతం 18 పరుగులు ముందంజలో ఉన్నాడు. గాలే టెస్టులో గిల్ కేవలం 16, 8 పరుగులు మాత్రమే చేసి నిరాశపరిచాడు. ఇద్దరూ 41 డబ్ల్యూటీసీ మ్యాచ్‌లు ఆడినప్పటికీ, పంత్ 73 ఇన్నింగ్స్‌ల్లోనే ఈ రికార్డు సాధించాడు. గిల్ మాత్రం ఇందుకు 75 ఇన్నింగ్స్‌లు తీసుకున్నాడు. ఈ జాబితాలో రోహిత్ శర్మ (2,716), రవీంద్ర జడేజా (2,632), విరాట్ కోహ్లీ (2,617) తదుపరి స్థానాల్లో ఉన్నారు.ఈ మ్యాచ్‌లోనే పంత్ మరొక చారిత్రాత్మక మైలురాయిని అధిగమించాడు. రెండో ఇన్నింగ్స్‌లో లహిరు కుమార బౌలింగ్‌లో రెండు భారీ సిక్సర్లు బాదడం ద్వారా టెస్ట్ క్రికెట్లో 100 సిక్సర్లు పూర్తి చేసిన తొలి భారతీయ బ్యాటర్‌గా నిలిచాడు. ప్రపంచంలో ఈ ఘనత సాధించిన కేవలం నాలుగో ప్లేయర్‌గా చరిత్రకెక్కాడు.డబ్ల్యూటీసీలో పంత్ ఇప్పటివరకు 6 సెంచరీలు, 17 అర్ధసెంచరీలు బాదాడు. ఇందులో అతడు అత్యుత్తమ స్కోరు 146 పరుగులు కాగా, సగటు 41.81గా ఉంది. కాగా, ప్రపంచ వ్యాప్తంగా డబ్ల్యూటీసీ అత్యధిక పరుగుల రికార్డు ఇంగ్లాండ్ స్టార్ జో రూట్ (77 మ్యాచ్‌ల్లో 6,651 పరుగులు) పేరిట ఉంది. దీంతో ఎవరికీ అందనంత

రాష్ట్రంలోని వివిధ ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న 10,060 పోస్టులను భర్తీ చేయాలని మంత్రివర్గం నిర్ణయించింది. 2026-27 జాబ్ క్యాలెండర్లో భాగంగా ఈ నియామకాలు చేపట్టనున్నారు. దీంతో ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగులకు భారీగా అవకాశాలు అందుబాటులోకి రానున్నాయి. అలాగే పట్టణ స్థానిక సంస్థల్లో రహదారులు, కాల్వలు, విద్యుత్ సదుపాయాలు, పార్కుల అభివృద్ధి కోసం హైబ్రిడ్ యాన్యుటీ మోడల్ (HAM) కింద రూ.7,469.46 కోట్ల పనులకు పరిపాలనా అనుమతి ఇచ్చింది. హంద్రీ-నీవా సుజల స్రవంతి (HNSS) ఫేజ్-2 పనులకు రూ.1,323.75 కోట్లను కేటాయించింది. శ్రీసత్యసాయి జిల్లాలో మెయిన్ కెనాల్ సీసీ లైనింగ్ పనులకు రూ.750.07 కోట్లు, అన్నమయ్య, తిరుపతి, చిత్తూరు జిల్లాల్లో మెయిన్ కెనాల్ పనులకు రూ.573.68 కోట్లు కేటాయించింది. విశాఖపట్నం జిల్లా ఆనందపురం మండలం జగన్నాథపురం వద్ద 486 మెగావాట్ల సామర్థ్యంతో హైపర్‌స్కేల్ డేటా సెంటర్ ఏర్పాటు చేయడానికి డేటా సెంటర్ హోల్డింగ్స్ ఇండియాకు 200 ఎకరాలు కేటాయించేందుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. సంస్థకు ప్రత్యేక ప్రోత్సాహకాలు ఇవ్వడానికి కూడా అనుమతించింది. అనకాపల్లి జిల్లా మాకవరపాలెం వద్ద 1,000 మెగావాట్ల హైపర్‌స్కేల్ డేటా సెంటర్ ఏర్పాటుకు రెన్యూ ఏపీ గ్రీన్ డేటా సెంటర్ లిమిటెడ్‌కు 433.30 ఎకరాలు కేటాయించనున్నారు. ఈ ప్రాజెక్టులో రూ.85,200 కోట్ల పెట్టుబడి పెట్టడంతో పాటు 1,880 మందికి ఉద్యోగాలు కల్పించాలనే లక్ష్యం ఉంది. విశాఖ జిల్లా భీమునిపట్నం మండలం అమనం వద్ద 512 మెగావాట్ల సామర్థ్యంతో ఏఐ డేటా సెంటర్ ఏర్పాటు చేయనున్నారు. రూ.31,387 కోట్ల పెట్టుబడితో చేపట్టే ఈ ప్రాజెక్టు ద్వారా 1,000 మందికి ఉపాధి లభించనుంది. ఈ ప్రాజెక్టుకు ఆర్థిక, ఆర్థికేతర ప్రోత్సాహకాలు ఇవ్వడానికి కేబినెట్ అంగీకరించింది. తిరుపతిలో మునోత్ లిథియం బ్యాటరీ ప్రైవేట్ లిమిటెడ్ రూ.500 కోట్ల పెట్టుబడితో లిథియం అయాన్ సెల్ తయారీ ప్లాంట్ ఏర్పాటు చేయడానికి కేబినెట్ ఆమోదం తెలిపింది. దీంతో రాష్ట్రంలో బ్యాటరీ తయారీ రంగానికి మరింత ప్రోత్సాహం

పాక్‌లో స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఓ మతబోధకుడు చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. పంజాబ్ ప్రావిన్స్‌లోని బహావల్నగర్లోజరిగిన సమావేశంలో ప్రజలను ఉద్దేశించి ప్రసంగించిన నసీర్ మాద్నీ కశ్మీర్ గురించి పలు సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఇంటర్నెట్ డెస్క్: పాక్ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఓ మతబోధకుడు చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. పంజాబ్ ప్రావిన్స్‌లోని బహావల్‌నగర్‌లో ఆగస్టు 14న జరిగిన సమావేశంలో ప్రజలను ఉద్దేశించి ప్రసంగించిన నసీర్ మాద్నీ కశ్మీర్ గురించి పలు సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఉగ్రసంస్థ ఎల్ఈటీ చీఫ్ హఫీజ్ సయీద్ కశ్మీర్లోకి 10 వేల మంది ఉగ్రవాదులను పంపించినట్టు చెప్పాడు. దీంతో, కశ్మీర్లో ఉగ్ర నెట్వర్క్ వ్యాప్తిపై ఆందోళన వ్యక్తం అవుతోంది. హఫీజ్ సయీద్ సారథ్యంలోని లష్కరే తొయిబా భారత్‌లో అనేక దాడులకు పాల్పడిన విషయం తెలిసిందే. ఇందుకు సంబంధించి హఫీజ్‌పై పలు కేసులు నమోదయ్యాయి. 26/11 దాడుల్లో మంది పాక్ ఉగ్రవాదులు సముద్రమార్గంలో ముంబైలోకి ప్రవేశించి నాలుగు రోజుల పాటు మారణ హోమం సృష్టించారు. ఈ ఉగ్రవాద దాడిలో 166 మంది మరణించగా 300 మంది గాయపడ్డారు. ఇక గతేడాది పహల్గాం దాడిలో 26 మంది సాధారణ పౌరులు కన్నుమూసిన విషయం తెలిసిందే. ఈ కేసుకు సంబంధించి జమ్మూలోని కోర్టు హఫీజ్‌పై నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. ఐక్యరాజ్య సమితి, అమెరికా కూడా ఎల్ఈటీని ఉగ్రవాద సంస్థగా ప్రకటించాయి. హోర్ముజ్ మాదే.. కొత్త మ్యాప్ షేర్ చేసిన ట్రంప్ మీరు గట్టిగా మాట్లాడుతున్నారు.. నిశ్శబ్దంగా ఉండండి: వైట్ హౌస్‌లో విలేకరిపై ట్రంప్ ఆగ్రహం

100 Cr Movies : సంక్రాంతి తర్వాత కాస్త డల్ అయిన టాలీవుడ్ బాక్సాఫీస్‌కి దాదాపు 400 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసి మంచి బూస్టప్ అందించింది రామ్ చరణ్ పెద్ది సినిమా. ఈ పాన్ ఇండియా మూవీ తర్వాత ఆడియెన్స్ ముందుకొచ్చిన మరిన్ని సినిమాలు కూడా ఇదే బాటలో సక్సెస్‌ని కంటిన్యూ చేశాయి. ఈ లిస్ట్‌లో చిన్న సినిమాలు హిట్ అవ్వడమే కాక కలెక్షన్స్ కూడా రాబట్టాయి. కొన్ని సినిమాలు అయితే వంద కోట్ల జాబితాలో చేరాయి. గత శుక్రవారం బాక్సాఫీస్ ముందుకొచ్చిన సూర్య విశ్వనాథ్ అండ్ సన్స్ సినిమా కేవలం రెండ్రోజుల్లోనే 100కోట్ల మార్క్ అందుకుని రికార్డ్ క్రియేట్ చేసింది. వెంకీ అట్లూరి తెరకెక్కించిన ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఓవర్సీస్లో 1.6 మిలియన్ డాలర్స్‌కి పైగా కలెక్ట్ చేసింది. ఇప్పటికే 150 కోట్లు వసూలు చేసినట్టు మూవీ యూనిట్ ప్రకటించింది. పాజిటివ్ వైబ్స్‌తో విడుదలైన విశ్వనాథ్ అండ్ సన్స్ సినిమా 3 మిలియన్‌కి పైగా బుకింగ్స్‌తో అదరగొడుతోంది. విశ్వనాథ్ అండ్ సన్స్ సినిమాతో పాటు శ్రీకర స్టూడియోస్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్, సితార ఎంటర్టైన్మెంట్స్ కంబైన్డ్‌గా ప్రొడ్యూస్ చేసిన మరో సినిమా లెనిన్ కూడా ఈ ఇయర్ వందకోట్ల క్లబ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. రూరల్ బ్యాక్‌డ్రాప్‌లో ఎమోషన్స్ హైలైట్‌గా వచ్చిన లెనిన్ సినిమా మౌత్‌టాక్‌తో లాంగ్ రన్లో వందకోట్లు కొల్లగొట్టి అఖిల్‌కి మెమరబుల్ బ్లాక్ బాస్టర్ సక్సెస్ అందించింది లెనిన్ సినిమా. ఎన్నో ఏళ్లుగా హిట్ కోసం ఎదురుచూసిన అఖిల్ కి ఆ లోటు తీర్చేసింది. భారీ సెట్టింగులు, వందల కోట్ల VFX లేకపోయినా కంటెంట్‌లో విషయం ఉంటే కలెక్షన్లు ఆటోమేటిక్టగా వస్తాయని లెనిన్ సినిమా మరోసారి ప్రూవ్ చేసింది. ఇక లెనిన్ సినిమా కంటే ముందుగా ఈ వంద కోట్ల ఫీట్ సాధించింది సమంత. నందిని రెడ్డి తెరకెక్కించిన ఈ వుమెన్ ఓరియెంటెడ్ ఫ్యామిలీ యాక్షన్ డ్రామా స్ట్రాంగ్ మౌత్

ఇల్లు బాగు చేయించుకుందామని తవ్వకాలు జరిపితే ఏకంగా వంద కోట్ల రూపాయల నిధి బయటపడితే ఎలా ఉంటుంది? బెల్జియంలో సరిగ్గా అలాంటి ఘటనే జరిగింది. ఈస్ట్ ఫ్లాండర్స్‌లో ఓ పురాతన భవనం రెనోవేషన్ పనులు జరుగుతున్నాయి. ఇందులో భాగంగా డ్రైనేజీ సిస్టమ్ మార్పు కోసం ఇంటి పునాదుల వద్ద కార్మికులు డ్రిల్లింగ్ చేపట్టారు. ఆ సమయంలో డ్రిల్లింగ్ మిషన్‌కు ఏదో పసుపు రంగు అంటుకోవడం గమనించిన కార్మికులు ఆశ్చర్యపోయారు. మరింత లోతుగా తవ్వి చూడగా కుప్పలు కుప్పలుగా బంగారు నాణేలు, బిస్కెట్లు బయటపడ్డాయి. సుమారు 9 మిలియన్ల యూరోలు, అనగా భారత కరెన్సీలో దాదాపు రూ. 100 కోట్ల విలువైన ఈ భారీ నిధిని చూసి వారంతా ఖంగుతిన్నారు. సైట్ మేనేజర్ మారియోకు ఈ విషయం తెలపగా.. ఆయన ఏమాత్రం ఆశపడకుండా వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఆ బంగారాన్ని స్వాధీనం చేసుకుని భద్రపరిచారు. బెల్జియం చట్టాల ప్రకారం ఈ నిధిని క్లెయిమ్ చేయడానికి ఐదేళ్ల సమయం ఉంటుందని, ఆ నిధికి సంబంధించి ఎవరైనా అసలు ఓనర్ ఉంటే వచ్చి ఐదేళ్లలోపు క్లెయిమ్ చేసుకోవాలని, లేనిచో అది ఆ స్థలం యజమానికి, కార్మికులకు చెందుతుందని అధికారులు తెలిపారు. ఈ అపారమైన సంపద ఇక్కడకు ఎక్కడి నుంచి వచ్చింది అనే కోణంలో పోలీసులు ప్రస్తుతం విచారణ జరుపుతున్నారు. మీ చెప్పులు పోయాయా.. అయితే చాట్ జీపీటీని అడగండి.. ఇట్టే దొరికేస్తాయ్

Rishabh Pant : టీమ్ఇండియా క్రికెటర్ రిషబ్ పంత్ చరిత్ర సృష్టించాడు. టెస్టుల్లో వంద సిక్సర్లు కొట్టిన తొలి భారత బ్యాటర్‌గా చరిత్ర సృష్టించాడు. గాలే వేదికగా శ్రీలంకతో జరుగుతున్న తొలి టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో రెండు సిక్సర్లు బాదడంతో పంత్ సుదీర్ఘ ఫార్మాట్లో వంద సిక్సర్ల మైలురాయిని చేరుకున్నాడు. అంతేకాదండోయ్.. ఓవరాల్‌గా టెస్టు క్రికెట్లో 100 సిక్సర్లు కొట్టిన నాలుగో బ్యాటర్‌గా రికార్డులకు ఎక్కాడు. బెన్ స్టోక్స్, బ్రెండన్ మెక్కల్లమ్, ఆడమ్ గిల్ క్రిస్ట్లు మాత్రమే పంత్ కన్నా ముందు ఈ మైలురాయిని చేరుకున్నారు. టెస్టుల్లో 100 సిక్సర్లు కొట్టిన మైలురాయిని అత్యంత వేగంగా చేరుకున్న ఆటగాడిగానూ పంత్ రికార్డులకు ఎక్కాడు. AUS vs BAN : బంగ్లా చేతిలో ఓటమి.. దెబ్బకు ఓపెనర్‌ను మార్చేసిన ఆసీస్.. మూడేళ్లు టెస్టులు ఆడని ప్లేయర్‌కు చోటు.. Maximum number 1⃣0⃣0⃣ in Test Cricket for Rishabh Pant! 💥 He becomes the first #TeamIndia batter to reach that special milestone in men's cricket 🫡🫡 Updates ▶️ — BCCI (@BCCI) August 18, 2026 బంతుల పరంగా అత్యంత వేగంగా టెస్టుల్లో 100 సిక్సర్లు కొట్టిన ప్లేయర్లు వీరే.. * రిషబ్ పంత్ (భారత్) - 4918 బంతులు * ఆడమ్ గిల్ క్రిస్ట్ (ఆస్ట్రేలియా) - 6578 బంతులు * బెన్ స్టోక్స్ (ఇంగ్లాండ్) - 9042 బంతులు * బ్రెండన్ మెక్ కల్లమ్ (న్యూజిలాండ్) - 9856 బంతులు

దేశంలో కొబ్బరి అంటే గుర్తొచ్చే పేరు కోనసీమ అని.. ఆ జిల్లాకు తాను ఇన్‌ఛార్జి మంత్రిగా వ్యవహరిస్తున్నానని మంత్రి అచ్చెన్నాయుడు అన్నారు. గత ప్రభుత్వ హయాంలో కాలువల్లో తట్టమట్టి కూడా తీయకపోవడం వల్ల సముద్రం నీరు వెనెక్కి వచ్చి చెట్టు ఉన్నపళంగా కుంగిపోయిందని చెప్పుకొచ్చారు. అమరావతి, ఆగస్టు 18: దేశంలో కొబ్బరి అంటే గుర్తొచ్చే పేరు కోనసీమ అని.. ఆ జిల్లాకు తాను ఇన్‌ఛార్జి మంత్రిగా వ్యవహరిస్తున్నానని మంత్రి అచ్చెన్నాయుడు అన్నారు. ఏపీ శాసనసభలో ప్రశ్నోత్తరాల సమయంలో కొబ్బరి సాగుకు సంబంధించి ఎమ్మెల్యే బండారు సత్యానందరావు అడిగిన ప్రశ్నలకు మంత్రి అచ్చెన్నాయుడు సమాధానం ఇచ్చారు. కొబ్బరి సాగులో 10వేల హెక్టార్లలోని కొబ్బరితోటలు కాలం చెల్లినవి ఉన్నాయన్నారు. గత ప్రభుత్వ హయాంలో కాలువల్లో తట్టమట్టి కూడా తీయకపోవడం వల్ల సముద్రం నీరు వెనెక్కి వచ్చి చెట్టు ఉన్నపళంగా కుంగిపోయిందని చెప్పుకొచ్చారు. ప్రతి చెడిపోయిన మొక్కకు వెయ్యి సాయం చేసి కొత్తమొక్కలు పెట్టించాలని ప్రతిపాదన ఉందన్నారు. డ్రెయిన్లు శుభ్రం చేయకపోతే ఎంత పెట్టుబడి పెట్టినా, కొత్త మొక్కలు నాటినా ఫలితాలు ఉండవని మంత్రి తెలిపారు. అందుకే మొదటి దశలో శంఖరగుప్తం కాలువ పూడిక తీస్తే రెండు, మూడు నియోజకవర్గాల్లో సమస్య పరిష్కారమవుతుందన్నారు. కొత్త ప్లాంటేషన్‌కు వీబీ రాంజీ పథకం కింద కేంద్రంలోని కోకో బోర్డు ద్వారా ఆర్థిక సాయం అందజేస్తున్నామని ప్రకటించారు. మొత్తం ఒక ప్రాజెక్ట్ రూపంలో తీసుకొని కోనసీమలో కొత్తమొక్కలు పెట్టిస్తామమని చెప్పారు. ఎమ్మెల్యే బండారు సత్యానందరావు చెప్పినట్లు అంతర పంటలు వేయాలని రైతులకు సూచించారు. కొబ్బరితోటల్లో కోకో, అరటి, అంతర పంటలు వేయొచ్చని చెప్పుకొచ్చారు. ఈ కార్యక్రమాన్ని సక్రమంగా అమలు అయ్యేలా చూస్తున్నామని, రైతులకు అదనపు ఆదాయం వచ్చేలా ప్రయత్నాలు చేస్తున్నామని మంత్రి అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. ఏపీ మండలిలో పోడియం వద్ద బల్లలు చరుస్తూ వైసీపీ ఆందోళన.. సభ వాయిదా స్లీపర్ బస్సుల్లో అగ్ని ప్రమాదాల నివారణకు పటిష్ఠ చర్యలు: మంత్రి మండిపల్లి రాంప్రసాద్

గాలే వేదికగా భారత్‌తో జరుగుతున్న మొదటి టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో శ్రీలంక 284 పరుగులకు ఆలౌటైంది. లంక బ్యాటర్ నోనాల్ దినుశా(100) సెంచరీ బాదాడు. వికెట్ కీపర్, బ్యాటర్ నిరోషాన్ డిక్వెల్లా(80) రాణించాడు. వీరిద్దరూ మినహా ఇతర బ్యాటర్లు ఎవరూ ప్రభావం చూపలేకపోయారు. ఇంటర్నెట్ డెస్క్: గాలే వేదికగా భారత్‌తో జరుగుతున్న మొదటి టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో శ్రీలంక 284 పరుగులకు ఆలౌటైంది. లంక బ్యాటర్ నోనాల్ దినుశా(100) సెంచరీ బాదాడు. వికెట్ కీపర్, బ్యాటర్ నిరోషాన్ డిక్వెల్లా(80) రాణించాడు. వీరిద్దరూ మినహా ఇతర బ్యాటర్లు ఎవరూ ప్రభావం చూపలేకపోయారు. భారత బౌలర్లలో మానవ్ సుతార్ 4 వికెట్లతో అదరగొట్టాడు. రవీంద్ర జడేజా 3, సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ, కుల్దీప్ యాదవ్ తలొక వికెట్ పడగొట్టారు. శ్రీలంకపై భారత్ ఇంకా 178 పరుగుల ఆధిక్యంలో ఉంది. అంతకు ముందు 460/9 ఓవర్ నైట్ స్కోర్‌తో మూడో రోజు ఆటను ప్రారంభించిన టీమిండియా.. 462 పరుగులకు ఆలౌటైన సంగతి తెలిసిందే. తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన లంకకు ఆదిలోనే బిగ్ షాక్ తగిలింది. నిషాన్ ఫెర్నాండో(0), లాహీరు ఉదారా(27), దినేశ్ చండిమాల్(4), కమిందు మెండిస్(14), ధనంజయ డిసెల్వా(21) స్వల్ప వ్యవధిలోనే పెవిలియన్ చేరారు. పీకల్లోతు కష్టాల్లో పడిన లంకను సోనాల్ దినుశా, డిక్వెల్లా గాడిలో పెట్టే ప్రయత్నం చేశారు. వీరిద్దరూ కలిసి ఆరో వికెట్‌కు 146 పరుగులు జోడించారు. ఆ తర్వాత కేశారా నువాంత(2), ప్రభాత్ జయసూర్య(10), లాహిరు కుమార(10) వరుసగా ఔటయ్యారు. గంగూలీ కెప్టెన్సీకే ఎసరు పెట్టిన భారత ప్లేయర్లు.. అసలేం జరిగిందంటే? శుభ్‌మన్ గిల్ సింగిల్ హ్యాండ్ క్రేజీ క్యాచ్.. వీడియో చూశారా?

TVK Vijay Government Completes 100 Days in Tamil Nadu : తమిళనాడులో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో సినీ నటుడు విజయ్ సారథ్యంలోని తమిళగ వెట్రి కళగం (టీవీకే) పార్టీ సంచలన విజయాన్ని నమోదు చేసిన విషయం తెలిసిందే. అయితే, విజయ్‌కు అధికారం చేపట్టేందుకు పూర్తిస్థాయి మెజార్టీ రాకపోవటంతో కాంగ్రెస్‌సహా ఇతర పార్టీల మద్దతుతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. సీఎంగా విజయ్ బాధ్యతలు చేపట్టారు. కాగా.. విజయ్ తమిళనాడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి 100 రోజులు పూర్తయింది. ఈ వంద రోజుల పాలనలో విజయ్ ఎలాంటి సంచలన నిర్ణయాలు తీసుకున్నారు.. ఏ మేరకు హామీలను అమలు చేశారు.. 100రోజుల విజయ్ పాలన ఎలా ఉందనే విషయాలను పరిశీలిద్దాం.. విజయ్ ప్రభుత్వం తొలి 100 రోజుల పాలన తమిళనాడు రాజకీయాల్లో కొత్త చర్చకు తెరలేపింది. సినిమాలో 100వ రోజు విజయానికి సంకేతమైతే.. రాజకీయాల్లో మాత్రం అది పాలనకు తొలి పరీక్ష. అయితే, ఈ వంద రోజుల పాలనలో సీఎం విజయ్ అవినీతి నిర్మూలపై ప్రత్యేక దృష్టిసారించారు. అవినీతి రహిత పాలన అందించడమే లక్ష్యంగా ప్రత్యేక కార్యాచరణను టీవీకే సర్కార్ చేపట్టింది. మంచి పాలన అంటే కేవలం ప్రభుత్వ పథకాలను అమలు చేయడం మాత్రమే కాదు. ప్రభుత్వ నిర్ణయాల్లో పారదర్శకత, అధికార వ్యవస్థలో జవాబుదారీతనం, ప్రజలకు ప్రభుత్వ సేవలు సులభంగా అందడం కూడా కీలకమే. ముఖ్యమంత్రి విజయ్ అవినీతిని అంతం చేసేందుకు తన వంతు ప్రయత్నం చేస్తున్నారనే చెప్పొచ్చు. ప్రభుత్వ కార్యాలయాల్లో అధికారులు ఎవరైనా కేవలం రూ. 1,000 లంచం డిమాండ్ చేసినా, ఆడియో లేదా వీడియో సాక్ష్యాలతో ఫిర్యాదు చేసే పౌరులకు రూ. 1,00,000 నగదు బహుమతి ప్రకటిస్తూ విజయ్ సంచలన ప్రకటన చేశారు. అంతేకాదు.. అవినీతి ఫిర్యాదుల స్వీకరణ కోసం 24 గంటలు పనిచేసేలా ప్రత్యేక టోల్‌ఫ్రీ నంబర్, వాట్సాప్ వేదికలను అందుబాటులోకి తెచ్చారు. అవినీతికి పాల్పడితే మంత్రులైనా, అధికారులైనా ఎలాంటి

Parkal: పరకాలలో రూ. వందల కోట్ల పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు! పరకాల: ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారు హనుమకొండ జిల్లా పరకాల నియోజకవర్గం పరిధిలో పలు అభివృద్ధి పనులను ప్రారంభించారు. కొత్తగా చేపట్టబోయే పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. 🔹రూ. 200 కోట్లతో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ 🔹రూ. 82 కోట్లతో పరకాల మున్సిపాలిటీలో వివిధ అభివృద్ధి పనులు 🔹రూ. 65 కోట్లతో పరకాల నుంచి ఎర్రగట్టు గుట్ట వరకు నాలుగు లేన్ల రోడ్డు నిర్మాణం 🔹రూ. 45.15 కోట్లతో అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్ (ATC) నిర్మాణం 🔹రూ. 32.17 కోట్ల అంచనా వ్యయంతో దామెర మండలం ల్యాదేళ్లలో పరకాల ఇందిరా మహిళా డెయిరీ ప్లాంట్ నిర్మాణం 🔹రూ. 10 కోట్ల అంచనా వ్యయంతో అక్కంపేట గ్రామంలో అభివృద్ధి ప్రణాళిక పనులు 🔹రూ. 5 కోట్లతో శ్రీ కుంకుమేశ్వర స్వామి దేవాలయ అభివృద్ధి పనులు 🔹ఆత్మకూర్‌లో టౌన్షిప్ అండర్ ల్యాండ్ పూలింగ్ స్కీమ్‌కు శంకుస్థాపన 🔹రూ. 3 కోట్లతో పరకాల పట్టణంలో 33/11 కేవీ విద్యుత్ సబ్ స్టేషన్‌కు శంకుస్థాపన 🔹రూ. 1.10 కోట్లతో విద్యుత్ డివిజనల్ ఇంజనీర్ కార్యాలయ నిర్మాణం 🔹పరకాలలో రూ. 35 కోట్లతో నిర్మించిన 100 పడకల ఏరియా ఆసుపత్రి ప్రారంభం. 🔹ఆత్మకూర్‌లో రూ. 1 కోటితో నిర్మించిన అధునాతన SPM సెంటర్ ప్రారంభం. 🔹పరకాలలో రూ. 5 కోట్లతో నిర్మించిన ప్రభుత్వ డిగ్రీ కళాశాల భవనం ప్రారంభం
కోలీవుడ్ స్టార్ హీరో సూర్య బాక్సాఫీస్ వద్ద తన స్టామినా మరోసారి నిరూపించుకున్నారు. ఈ ఏడాది ‘కరుప్పు’తో రూ.300 కోట్లకు పైగా కలెక్షన్లతో కెరీర్లోనే బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్ అందుకున్న ఆయన తాజాగా ‘ విశ్వనాథ్ అండ్ సన్స్ ’తో మరో బిగ్ హిట్‌ని తన ఖాతాలో వేసుకున్నారు. టాలెంటెడ్ తెలుగు డైరెక్టర్ వెంకీ అట్లూరి దర్శకత్వంలో సూర్య కథానాయకుడిగా తెరకెక్కిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ చిత్రం ఆగస్టు 14న ప్రపంచవ్యాప్తంగా విడుదలై తొలి ఆట నుంచే యునానిమస్‌గా పాజిటివ్ టాక్ తెచ్చుకుని అప్రతిహతంగా దూసుకుపోతోంది. ఈ క్రమంలోనే ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద కనీవినీ ఎరుగని సరికొత్త సంచలనాన్ని నమోదు చేసింది.రెండు రోజుల్లోనే రూ. 100 కోట్ల గ్రాస్ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో రికార్డు స్థాయి వసూళ్లను సాధిస్తున్న ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ విడుదలైన కేవలం రెండు రోజుల్లోనే రూ. 100 కోట్ల గ్రాస్ మైలురాయిని అధిగమించింది. మాస్ ఎలిమెంట్స్ లేకుండా పక్కా ఫ్యామిలీ ఎంటర్టైనర్గా వచ్చిన ఈ చిత్రం ఇంత తక్కువ టైమ్‌లోనే వంద కోట్ల క్లబ్లో చేరడం సినీ వర్గాలను సైతం విస్మయానికి గురిచేస్తోంది. ఇందుకు సంబంధి మేకర్స్ ఓ ప్రత్యేక పోస్టర్‌ను విడుదల చేశారు. ప్రస్తుతం ఈ పోస్టర్ సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతూ అభిమానుల్లో పండుగ వాతావరణాన్ని నింపింది.* మెగాస్టార్ vs సూపర్ స్టార్... బాక్సాఫీస్ వద్ద చిరంజీవి - రజనీకాంత్ మధ్య ‘డబుల్ క్లాష్’!ఫ్యామిలీ ఆడియెన్స్ ప్రభంజనంక్లీన్ ఎంటర్టైన్మెంట్, హృదయాలను హత్తుకునే బలమైన ఫ్యామిలీ ఎమోషన్ష్తో తెరకెక్కిన చిత్రం కావడంతో ప్రేక్షకులు కుటుంబ సమేతంగా థియేటర్లకు పోటెత్తుతున్నారు. రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు తమిళనాడు, కేరళ, కర్ణాటక, ఓవర్సీస్ అంతటా దాదాపు అన్ని ప్రధాన కేంద్రాల్లో హౌస్‌ఫుల్ బోర్డులు దర్శనమిస్తున్నాయి. ముఖ్యంగా ఫస్ట్ షో, సెకండ్ షోలకు ఉన్న డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకుని పంపిణీదారులు అనేక ప్రాంతాల్లో అదనపు స్క్రీన్లను, ప్రత్యేక షోలను కేటాయిస్తున్నారు. ఆదివారం కూడా ఇదే

బీఎస్ఎన్ఎల్ రూ.2,399 ప్లాన్‌ను సాధారణంగా ఏడాది పాటు ఉపయోగించుకోవచ్చు. అయితే ప్రత్యేక ఆఫర్ కింద రీఛార్జ్ చేస్తే మొత్తం 412 రోజుల వ్యాలిడిటీ లభిస్తుంది. అదనంగా 47 రోజులు రావడంతో మరోసారి రీఛార్జ్ చేయాల్సిన అవసరం మరింత ఆలస్యమవుతుంది. ఆగస్టు 12 నుంచి సెప్టెంబర్ 12, 2026 మధ్య ఈ ప్లాన్‌తో రీఛార్జ్ చేసుకునే వారికి ఈ ప్రయోజనం వర్తిస్తుంది. ఈ ప్లాన్‌తో యూజర్లకు దేశవ్యాప్తంగా అన్లిమిటెడ్ వాయిస్ కాల్స్ లభిస్తాయి. అలాగే రోజుకు 100 ఉచిత SMSలు, రోజుకు 2GB హైస్పీడ్ డేటా, 2 జీబీ పూర్తయిన తర్వాత 40 kbps వేగంతో అన్లిమిటెడ్ డేటా పొందొచ్చు. ఆఫర్ కాలంలో రీఛార్జ్ చేస్తే అదనంగా 47 రోజుల వ్యాలిడిటీ పొందొచ్చు. ఈ ప్లాన్‌ను నెలవారీ ఖర్చుతో పోలిస్తే మరింత ఆదా అవుతుంది. సాధారణ 365 రోజుల వ్యాలిడిటీ ప్రకారం నెలకు సుమారు రూ.200 మాత్రమే పడుతుంది. అయితే 412 రోజుల ఆఫర్ వ్యాలిడిటీ ప్రకారం నెలకు సగటున రూ.175 వరకు మాత్రమే అవుతుంది. రోజువారీ ఖర్చు కూడా కేవలం రూ.5.82 మాత్రమే పడుతుంది. ప్రతి నెల విడిగా రీఛార్జ్ చేసుకునే వారితో పోలిస్తే, ఈ ప్లాన్ తీసుకుంటే ఎక్కువ కాలం టెన్షన్ లేకుండా సేవలను ఉపయోగించుకోవచ్చు. తరచూ రీఛార్జ్ చేయడం ఇష్టంలేని వారికి, తక్కువ ఖర్చుతో ఏడాదికిపైగా మొబైల్ సేవలు ఉపయోగించాలనుకునే వారికి ఈ ప్లాన్ మంచి ఎంపికగా చెప్పవచ్చు. ముఖ్యంగా BSNL 4G సేవలు అందుబాటులో ఉన్న ప్రాంతాల్లో ఉన్న యూజర్లు ఈ ఆఫర్‌ను ఉపయోగించుకుంటే అదనపు 47 రోజుల ప్రయోజనం పొందవచ్చు. స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా యూజర్లకు ప్రత్యేక ఆఫర్‌గా BSNL ఈ ఆఫర్‌ను తీసుకొచ్చింది. సెప్టెంబర్ 12, 2026లోపు రీఛార్జ్ చేసుకుంటే మాత్రమే ఈ అదనపు వ్యాలిడిటీ వర్తిస్తుంది

నాగార్జున.. టాలీవుడ్లో కింగ్‌గా, మన్మథుడుగా పేరుతెచ్చుకున్న విషయం తెలిసిందే. సీనియర్లలో అత్యంత ప్రయోగాత్మక చిత్రాలు చేసిన హీరోగా నిలిచారు. గీతాంజలి, శివ, అన్నమయ్య వంటి డిఫరెంట్ చిత్రాలు చేశారు. మల్టీస్టారర్స్ చేశారు. ఇటీవల విలన్ రోల్స్ కూడా చేస్తున్నారు. రజనీకాంత్ `కూలీ`లో ఆయన విలన్‌గా నటించిన విషయం తెలిసిందే. ఇలా ఎప్పటికప్పుడు తన రూట్ మారుస్తూ మెప్పిస్తున్నారు. యంగ్ జనరేషన్ కి ఆదర్శంగా నిలుస్తున్నారు. ప్రస్తుతం ఆయన కింగ్ 100లో నటిస్తున్నారు. ఇదిలా ఉంటే నాగార్జున ఒకప్పుడు చేసిన కామెంట్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. తాను కరప్ట్ అయినట్టు చెప్పారు. మీలో మీకు నచ్చని క్వాలిటీ ఏంటి అని ప్రశ్నించినప్పుడు నాగార్జున ఈ విషయాన్ని వెల్లడించారు. మంచు లక్ష్మి షోలో పాల్గొన్న ఆయన తన జర్నీ గురించి వెల్లడించారు. పిల్లల కెరీర్ గురించి స్పందించారు. చైతన్యకి స్వతంత్ర్య భావాలు ఎక్కువ అని, పెద్ద స్థాయికి వెళ్తాడని చెప్పారు నాగార్జున. అన్ని రకాల పనులను మ్యానేజ్ చేయడంపై ఆయన రియాక్ట్ అవుతూ, ఎప్పుడు ఏం చేయాలో అది చేస్తానని, ఒకదాంట్లో మరోటి కలుపను అని చెప్పారు. సినిమాలు, పర్సనల్ లైఫ్‌ని మిక్స్ చేయను అని వెల్లడించారు. తనకు కూడా కోపం వస్తుందని, అందరిపై అరుస్తానని చెప్పారు. అయితే ముందు తిట్టేసి తర్వాత సారీ చెబుతానని, ఏదో కోపంలో అన్నాను అని చెప్పి సారీ చెబుతానని వెల్లడించారు. సారీ చెబితే చాలా సమస్యలు క్లీయర్ అవుతాయని, సారీ చెప్పడంలో ఈగో ప్రాబ్లమ్ ఏం లేదన్నారు. ఇప్పుటి తరం కుర్రాళ్లు ప్రయోగాలు చేయడం లేదని, రెగ్యూలర్ కమర్షియల్ చిత్రాలు చేస్తున్నారని వెల్లడించారు. డిఫరెంట్ గా చేస్తేనే మంచి సినిమాలు వస్తాయన్నారు. చైతూకి కూడా అదే చెబుతుంటానని వెల్లడించారు. ఈ క్రమంలో మీలో మీకు బాగా నచ్చిన క్వాలిటీ ఏంటని మంచు లక్ష్మి అడగ్గా, ఆయన చెప్పలేదు. నచ్చని క్వాలిటీ గురించి అడగ్గా, ఆలోచించి.. `నేను కరప్ట్ అయ్యాను, అదే

ఎన్నో ఆశలతో కొనుక్కున్న అత్యంత ఖరీదైన లగ్జరీ యాట్ (విలాసవంతమైన పడవ), యజమానికి చేరిన నాలుగే రోజులకే సముద్రంలో జలసమాధి అయింది. సుమారు 9.1 మిలియన్ డాలర్ల (దాదాపు రూ.75 కోట్లు) విలువైన ఈ నౌక, ఇంజిన్‌లో సాంకేతిక లోపం తలెత్తి మంటలు రేగాయి. ఎలాగో మంటలు ఆర్పినప్పటికీ, ఆ పడవ మధ్యధరా సముద్రంలో మునిగిపోయింది. ఈ ఘటన ఇటలీలోని సార్డీనియా తీరంలో చోటుచేసుకుంది. ప్రమాద సమయంలో నౌకలో 14 మంది ఉన్నప్పటికీ, వారందరూ సురక్షితంగా బయటపడటంతో పెను విషాదం తప్పింది.వివరాల్లోకి వెళితే, ఇటలీకి చెందిన ప్రముఖ నౌకా నిర్మాణ సంస్థ పెర్మారే (Permare) నిర్మించిన 'అంగియోలా-2' అనే 98 అడుగుల అమెర్ F100 మోడల్ యాట్‌ను ఇటీవలే ఓ ఇటాలియన్ వ్యాపారవేత్త కొనుగోలు చేశారు. మంగళవారం నాడు ఆ నౌకలో 14 మంది అతిథులు, సిబ్బందితో కలిసి ఆయన సార్డీనియాలోని పోర్టో సెర్వో తీరంలో విహారానికి వెళ్లారు. ప్రయాణం మధ్యలో నౌక ఇంజిన్‌లో సాంకేతిక సమస్య తలెత్తింది. కొద్దిసేపటికే మంటలు చెలరేగి నౌక మొత్తం వ్యాపించాయి.ప్రమాదాన్ని గమనించిన సిబ్బంది వెంటనే సహాయం కోసం అభ్యర్థించారు. మంటల కారణంగా నౌకలోకి భారీగా నీరు చేరడంతో అది ఒక పక్కకు ఒరిగి నెమ్మదిగా సముద్రంలోకి మునిగిపోవడం ప్రారంభించింది. ఈ దృశ్యాలు వీడియోలో రికార్డయ్యాయి. దగ్గరలో ఉన్న మరో నౌక సిబ్బంది వెంటనే స్పందించి, ప్రమాదంలో చిక్కుకున్న 14 మందిని సురక్షితంగా కాపాడారు. అందరినీ కాపాడిన తర్వాతే యజమాని చివరి వ్యక్తిగా నౌకను వీడినట్లు సమాచారం.ప్రస్తుతం ఈ నౌక శిథిలాలు

విష్ణు ప్రియ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సీనియర్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. సినిమాల మీద ఆసక్తితో ఎక్కువగా వినోదం కేటగిరిలో వార్తలు రాస్తున్నారు. అదేవిధంగా హెల్త్, లైఫ్ స్టైల్, క్రైమ్ కేటగిరీలకు సంబంధించిన వార్తలు కూడా రాస్తూ ఉంటారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆమెకు జర్నలిజంలో పదేళ్లకు పైగా అనుభవం ఉంది. Samantha:మా ఇంటి బంగారం సినిమా విజయంలో భాగమైన ప్రతి ఒక్కరిని అభినందించడమే ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశంగా కనిపించింది. ఈ వేడుకకు సమంత రూత్ ప్రభు, రాజ్ నిడిమోరు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. చిత్ర బృందంలోని పలువురు సభ్యులకు సమంత, రాజ్ కలిసి ప్రత్యేక షీల్డులను అందించారు. సినిమా కోసం కష్టపడి పనిచేసిన టీమ్‌ను ఈ సందర్భంగా వారు అభినందించారు. అంతేకాదు, చిత్ర బృందానికి మరిన్ని ప్రత్యేక బహుమతులను కూడా మేకర్స్ ప్రకటించారు. ఇందులో నగదు బహుమతులతో పాటు కార్లు, బంగారు నాణేలు వంటి రివార్డులు ఉన్నాయి. దీంతో సక్సెస్ సెలబ్రేషన్ కార్యక్రమం మరింత ప్రత్యేకంగా మారింది. మా ఇంటి బంగారం రూ.100 కోట్ల మార్క్‌ను అందుకోవడం చిత్ర బృందానికి పెద్ద విజయంగా చెప్పవచ్చు. మహిళా ప్రధాన పాత్రతో వచ్చిన తెలుగు సినిమాల్లో ఈ స్థాయిలో వసూళ్లు సాధించిన చిత్రంగా ఇది గుర్తింపు పొందుతున్నట్లు వార్తలు వచ్చాయి. సినిమా విడుదలకు ముందు మహిళా లీడ్ ఉన్న సినిమాకు థియేటర్లలో ప్రేక్షకుల నుంచి ఎంతవరకు స్పందన వస్తుందనే సందేహాలు కూడా ఉన్నాయి. అయితే సినిమా విడుదలైన తర్వాత వచ్చిన ప్రేక్షకుల స్పందన ఆ అనుమానాలకు సమాధానం ఇచ్చింది. థియేటర్లలో మంచి ఆదరణతో సినిమా విజయవంతంగా ముందుకు సాగింది. కథ, నటీనటుల నటన, సినిమా ప్రజెంటేషన్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. మా ఇంటి బంగారం కథను రాజ్ నిడిమోరు రూపొందించగా, నందినీ రెడ్డి దర్శకత్వం వహించారు. రాజ్ నిడిమోరు, సమంత రూత్ ప్రభు, హిమాన్క్ రెడ్డి

బాకీ తీర్చలేదని రెండేళ్ల బాలికను కిడ్నాప్‌నకు ఓ వ్యక్తి యత్నించాడు. అప్పు తీర్చలేదనే కోపంతో బాలికను తీసుకెళ్లేందుకు ఓ వ్యక్తి ప్రయత్నించాడు. హైదరాబాద్, ఆగస్టు 13 (ఆంధ్రజ్యోతి): హైదరాబాద్‌లో బాకీ తీర్చలేదని రెండేళ్ల బాలికను కిడ్నాప్‌నకు ఓ వ్యక్తి యత్నించాడు. అప్పు తీర్చలేదనే కోపంతో బాలికను తీసుకెళ్లేందుకు ఓ వ్యక్తి ప్రయత్నించాడు. పోలీసులకు ఫోన్ చేసి బాలిక కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేశారు. హనుమాన్ నగర్లో అద్దె ఇంట్లో ఈ కుటుంబం నివాసం ఉంటోంది. మానికేశ్వరీ నగర్లో నివాసం ఉన్న సమయంలో పరిచయస్తుడి వద్ద రూ.30 వేల అప్పును బాలిక కుటుంబ సభ్యులు తీసుకున్నారు. అప్పు తిరిగి చెల్లించకపోవడంతో బుధవారం ఇంటికి ఆ వ్యక్తి వచ్చాడు. ఈ క్రమంలో డబ్బులు ఇవ్వాలంటూ కుటుంబ సభ్యులతో సదరు వ్యక్తి వాగ్వాదానికి దిగాడు. డబ్బులు ఇచ్చే వరకు మీ కుమార్తెను తీసుకెళ్తానంటూ అతడు బెదిరించాడు. రెండేళ్ల బాలికను తీసుకెళ్లేందుకు ప్రయత్నించిన వ్యక్తిపై బాధిత కుటుంబం పోలీసులకు ఫోన్ చేసి ఫిర్యాదు చేసింది. సమాచారం అందుకున్న రాజేంద్రనగర్ పోలీసులు వెంటనే ఘటనాస్థలికి చేరుకుని వివరాలు సేకరించారు. ఆ బాలికను తీసుకెళ్లేందుకు ప్రయత్నించిన వ్యక్తిని అదుపులోకి తీసుకుని పోలీసులు విచారిస్తున్నారు. ఆ బ్యారేజీల్లో ఎన్డీఎస్ఏ సూచనలు పాటించాలి: సీఎం రేవంత్‌రెడ్డి జీఆర్ఎంబీ అజెండాపై తెలంగాణ సర్కార్ అభ్యంతరాలు మహిళా సంఘాలను ఆర్థిక శక్తిగా తీర్చిదిద్దడమే మా ప్రభుత్వ లక్ష్యం: మంత్రి సీతక్క

హైదరాబాద్‌లో ట్రాఫిక్‌జామ్‌కు చెక్ పెట్టడంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. హైదరాబాద్ సిటీ ఇన్నోవేటివ్ ట్రాన్స్ఫర్మేటివ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్(హెచ్-సిటీ)లో భాగంగా వంతెనలు, అండర్‌పాస్‌ల నిర్మాణాన్ని వేగవంతం చేసింది. ఇప్పటికే పలు ప్రాంతాల్లో పనులు ప్రారంభం అయ్యాయి. నిర్మాణ సంస్థ ఎంపిక.. ఆమోదించిన పురపాలక శాఖ హైదరాబాద్ సిటీ: మహా నగరంలో ట్రాఫిక్‌జామ్‌కు చెక్ పెట్టడంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. హైదరాబాద్ సిటీ ఇన్నోవేటివ్ ట్రాన్స్ఫర్మేటివ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్(హెచ్-సిటీ)లో భాగంగా వంతెనలు, అండర్‌పాస్‌ల నిర్మాణాన్ని వేగవంతం చేసింది. ఇప్పటికే పలు ప్రాంతాల్లో పనులు ప్రారంభం అయ్యాయి. మరికొన్ని జంక్షన్ల వద్ద వంతెనల నిర్మాణానికి పాలనాపరమైన అనుమతులు జారీ చేస్తోంది. టెండర్ ప్రక్రియలో భాగంగా ఏజెన్సీల ఎంపికకూ ఆమోదం తెలుపుతోంది. ఇప్పటికే అందుబాటులోకి వచ్చిన ఓవైసీ ఫ్లై ఓవర్ నుంచి సంతోష్‌నగర్ వైపు వెళ్లేలా ఎడమ వైపు ర్యాంపు, హఫీజ్‌బాబా నగర్ జంక్షన్ నుంచి బాలాపూర్ 100 అడుగుల రోడ్డు వరకు, బండ్లగూడ- ఎర్రకుంట ఎక్స్ రోడ్ వద్ద ఆరు లేన్ల వంతెనల నిర్మాణం కోసం ఏజెన్సీ ఎంపికకు సర్కార్ ఆమోదం తెలుపుతూ బుధవారం పురపాలక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. రూ.242.72 కోట్ల నిర్మాణ వ్యయంతో ఈ వంతెనలు, ర్యాంప్‌ను ఒకే ప్యాకేజీగా చేపట్టనున్నారు. వాస్తవంగా ప్రాజెక్టు నిర్మాణ వ్యయం రూ.231.87 కోట్లుగా అంచనా వేయగా.. 4.68 శాతం ఎక్కువకు కేఎన్ఆర్ కన్స్ట్రక్షన్స్ లిమిటెడ్ బిడ్ దాఖలు చేసింది. రెండు పర్యాయాలు టెండర్ ప్రకటించినా.. సింగిల్ బిడ్ దాఖలు కావడంతో అదే సంస్థను ఎంపిక చేశారు. ఆస్తుల సేకరణతో కలిపి ప్రాజెక్టుకు రూ.385 కోట్లు అవసరమని అంచనా వేయగా సర్కారు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.పనులు చేపట్టేందుకు ఏజెన్సీతో జీహెచ్ఎంసీ కమిషనర్ ఒప్పందం కుదర్చుకోవాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. వంతెనలు పూర్తయితే పాతబస్తీలో పలు ప్రాంతాల నుంచి శంషాబాద్ విమానాశ్రయానికి రాకపోకలు సులువు కానున్నాయి. ప్రియాంక కుటుంబానికి రూ.20 లక్షల ఆర్థికసాయం

పత్తికి డిమాండ్ బాగా పెరిగింది. పంటంతా రైతుల చేయి దాటిపోయిన తర్వాత ధర పెరుగుతోంది. రైతుల చేతిలో పంట ఉన్నప్పుడు క్వింటా రూ.6 వేలకు కూడా కొనేవారు లేరు. నేడు కనీస మద్దతు ధరను మించిపోయింది. అమరావతి, ఆగస్టు 12(ఆంధ్రజ్యోతి): పత్తికి డిమాండ్ బాగా పెరిగింది. పంటంతా రైతుల చేయి దాటిపోయిన తర్వాత ధర పెరుగుతోంది. రైతుల చేతిలో పంట ఉన్నప్పుడు క్వింటా రూ.6 వేలకు కూడా కొనేవారు లేరు. నేడు కనీస మద్దతు ధరను మించిపోయింది. దాదాపు ఏడాది పొడవునా పత్తి క్రయవిక్రయాలు జరిగే ఆదోని మార్కెట్లో ప్రస్తుతం క్వింటాకు రూ.10వేలుపైనే లభిస్తోంది. తాజాగా క్వింటా పత్తి రూ.10,350 పలికింది. ఈ నెల ఒకటో తేదీన రూ.9,830 పలికిన ధర.. పది రోజుల్లో రూ.500దాకా పెరిగింది. మార్చి నెలలో కనీస మద్దతు ధర కూడా లేకపోగా.. ఇప్పుడు డిమాండ్ వచ్చింది. గతేడాది పత్తికి డిమాండ్ ఉన్నా.. ఉత్పత్తి లేకపోవడం, తుఫాన్ల వల్ల పంట దెబ్బతినడంతో రైతులు నష్టపోయారు. వర్షాలకు దెబ్బతిన్న పత్తిని రైతులు నిల్వ ఉంచుకోలేక, వచ్చిన ధరకు అమ్మేశారు. ఇప్పుడు సీజన్ ముగిసిపోయి, పత్తి నిల్వలు తరిగిపోయిన తర్వాత మంచి ధర వస్తోంది. రాష్ట్రంలో 2025-26 మార్కెటింగ్ సీజన్లో సుమారు ఐదు లక్షల హెక్టార్లలో పత్తి పండించగా, దాదాపు 8 లక్షల మెట్రిక్ టన్నులు ఉత్పత్తి అయ్యింది. పత్తి క్వింటా కనీస మద్దతు రూ.7,710-8,110 ఉండగా, 38,940 మంది రైతుల నుంచి రూ.1,556.93కోట్ల విలువైన 19,99లక్షల క్వింటాళ్లను సీసీఐ కొనుగోలు చేసిందని మార్కెటింగ్ శాఖ అధికారులు తెలిపారు. అయితే గతేడాది పత్తి తీసే తరుణంలో మొంథా, దిత్వా తుఫాన్లతో భారీ వర్షాలు కురిసి, పత్తి తడిసి, పాడైపోయి రైతులు భారీగా నష్టపోయారు. ఆ సమయంలో ప్రైవేట్ వ్యాపారులు క్వింటాకు రూ.6వేలు కూడా ఇవ్వకపోవడంతో రైతులు కొంత పత్తిని సీసీఐ కేంద్రాల్లో అమ్మారు. సీసీఐ కేంద్రాలు ఆలస్యంగా తెరవడంతో బయట ధరలు ఎమ్మెస్పీ

భారీ బ్యాటరీలతో కొత్త రెడ్మి K100 సిరీస్ వచ్చేసింది 185Hz డిస్ప్లే, స్నాప్ డ్రాగన్ 8 ఎలైట్ జెన్ 5 ఎస్ఓసీ ఈ సిరీస్ ఫోన్లు రెడ్మి K90 సిరీస్‌కు అప్‌గ్రేడ్ వెర్షన్ Redmi K100 Pro Series : కొత్త రెడ్మి ఫోన్ కోసం చూస్తున్నారా? రెడ్మి K100 ప్రో సిరీస్‌లో 2 ప్రీమియం ఫోన్లు వచ్చేశాయ్. ఈ ఫోన్లు 200MP కెమెరా, పవర్ఫుల్ 9070mAh బ్యాటరీ, క్వాల్కామ్ ఫ్లాగ్షిప్ చిప్సెట్తో రన్ అవుతాయి. ఈ స్మార్ట్‌ఫోన్ సిరీస్ గత ఏడాదిలో వచ్చిన రెడ్మి K90 సిరీస్‌కు అప్‌గ్రేడ్ వెర్షన్. ప్రస్తుతం రెడ్మి K100 ప్రో, రెడ్మి K100 ప్రో మాక్స్ అనే రెండు ఫోన్లను లాంచ్ చేసింది. పూర్తి ఫీచర్లు, ధర వివరాలపై ఓసారి లుక్కేయండి. రెడ్మి K100 సిరీస్ ధర ఎంతంటే? : రెడ్మి K100 ప్రో బేస్ 12GB ర్యామ్ + 256GB వేరియంట్ ధర CNY 3,999 (సుమారుగా రూ. 57వేలు). అలాగే మూడు (Redmi K100 Pro Series) వేరియంట్లు 16GB ర్యామ్+ 256GB, 12GB ర్యామ్ + 512GB, 16GB ర్యామ్ + 512GB ధరలు వరుసగా CNY 4,399 (రూ. 62వేలు ), CNY 4,599 (రూ. 65వేలు), CNY 4,999 (రూ. 71వేలు) ధరకు లభించనున్నాయి. అదేవిధంగా, బ్లాక్, కాబెర్నెట్ సావిగ్నాన్, ఫైర్‌ఫ్లైస్ చేజింగ్ ది లైట్, వైట్ కలర్ ఆప్షన్లలో కొనుగోలు చేయొచ్చు. 12GB ర్యామ్ + 256GB : CNY 3999 (రూ. 57వేలు) 16GB ర్యామ్ + 256GB : CNY 4399 ( రూ. 62వేలు) 12GB ర్యామ్ + 512GB : CNY 4599 (రూ. 65వేలు) 16GB ర్యామ్ + 512GB : CNY 4999 (రూ. 71వేలు) Read Also : TRAI New Rules : TRAI కొత్త రూల్స్

స్మార్ట్‌ఫోన్ లవర్స్ ఎంతగానో ఎదురుచూస్తున్న ఐక్యూ నియో 11 ఆల్ట్రా (iQOO Neo 11 Ultra) లాంచ్‌కు ముహూర్తం ఖరారైంది. ఈ కొత్త ఫోన్‌ను వచ్చే, అంటే ఆగస్టు 18న సాయంత్రం 7:00 గంటలకు చైనాలో అధికారికంగా విడుదల చేయనున్నారు. ఐక్యూ బ్రాండ్ తన నియో సిరీస్‌లో 'ప్రో' అనే పేరుకు బదులుగా మొదటిసారిగా 'ఆల్ట్రా' ట్యాగ్‌ను ఉపయోగిస్తుండటం విశేషం. ఈ లాంచ్ కంటే ముందే చైనా టెలికామ్ వెబ్సైట్లో మోడల్ నంబర్ V2573A తో ఈ ఫోన్ లిస్ట్ అయింది. దాంతో లాంచ్‌కు ముందే దీని పూర్తి స్పెసిఫికేషన్లు, ఫీచర్లు లీక్ అయి టెక్ ప్రపంచంలో వైరల్ అవుతున్నాయి. ప్రస్తుతం కంపెనీ సైట్లో ఈ ఫోన్ ప్రి-ఆర్డర్ల కోసం అందుబాటులో ఉంది. ఐక్యూ నియో 11 ఆల్ట్రా ఫోన్లో ప్రధాన ఆకర్షణ దీని బ్యాటరీ కెపాసిటీనే అని చెప్పవచ్చు. ఐక్యూ నియో సిరీస్ చరిత్రలోనే అత్యంత పెద్దదైన 9,100mAh భారీ బ్యాటరీతో ఈ ఫోన్ రాబోతోంది. రోజంతా గేమింగ్ ఆడినా, ఎంత హెవీగా వాడినా బ్యాటరీ ఛార్జ్ అయిపోతుందనే భయం ఉండదు. దీనికి తోడు 100W వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా అందిస్తున్నారు. దీనివల్ల ఇంత పెద్ద బ్యాటరీని కూడా చాలా వేగంగా ఛార్జ్ చేసుకోవచ్చు. అయితే ఈ ఫోన్లో వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ ఉండదు. ఫోన్ సైజు విషయానికి వస్తే 163.42 x 75.88 x 8.6 మిమీ కొలతలతో, 225 గ్రాముల బరువుంటుంది. గేమింగ్, వీడియో కంటెంట్ లవర్స్ కోసం ఈ ఫోన్లో టాప్ నోచ్ డిస్ప్లేను ఇచ్చారు. ఇందులో 6.83-అంగుళాల ఫ్లాట్ విజనోక్స్ F2 OLED 2K రెసల్యూషన్ డిస్ప్లే ఉంటుంది. ఇది కళ్లకు ఎలాంటి హాని కలగకుండా ప్రత్యేక ప్రొటెక్షన్‌తో వస్తుంది. ప్రాసెసర్ విషయానికి వస్తే, ఇందులో మీడియాటెక్ డైమెన్సీటీ 9500ఎం ఆక్టా-కోర్ చిప్‌సెట్‌ను ఉపయోగించారు. ఇది ఫ్లాగ్షిప్ ప్రాసెసర్‌కు మోడిఫైడ్ వెర్షన్. ఇందులో 11-కోర్

రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తున్న దేశాలపై అమెరికా వంద శాతం సుంకాలు విధించాలనుకుంటున్న సంగతి తెలిసిందే. ఈ సుంకాల సమస్యను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, భారత ప్రధాని నరేంద్ర మోదీ కలిసి పరిష్కరించుకుంటారని వైట్‌హౌస్ వాణిజ్య సలహాదారు పీటర్ నవారో తెలిపారు. ఇంటర్నెట్ డెస్క్: రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తున్న దేశాలపై అమెరికా వంద శాతం సుంకాలు విధించాలనుకుంటున్న సంగతి తెలిసిందే. ఈ సుంకాల సమస్యను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, భారత ప్రధాని నరేంద్ర మోదీ కలిసి పరిష్కరించుకుంటారని వైట్‌హౌస్ వాణిజ్య సలహాదారు పీటర్ నవారో తెలిపారు. ఇరువురు నేతల మధ్య మంచి బంధం ఉందని ఆయన పేర్కొన్నారు (Trump Modi Russian Oil). రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తున్న దేశాలపై అమెరికా కఠిన చర్యలకు సిద్ధమవుతోంది. రష్యా చమురును అత్యధికంగా కొనుగోలు చేసే ఐదు దేశాలపై 100 శాతం వరకు సుంకాలు విధించేందుకు అధ్యక్షుడికి అధికారం కల్పించే బిల్లును అమెరికా సెనేట్ ఇటీవల ఆమోదించింది. రష్యా చమురు కొనుగోళ్లు ఉక్రెయిన్ యుద్ధానికి నిధులు సమకూర్చుతున్నాయన్నది అమెరికా వాదన. రష్యా నుంచి భారత్ ప్రస్తుతం భారీగా ముడి చమురును దిగుమతి చేసుకుంటోంది (India US Tariff Dispute). రష్యా చమురు కొనుగోళ్ల నేపథ్యంలో భారత్‌పై అమెరికా విధించనున్న సుంకాల గురించి అడిగిన ప్రశ్నకు నవారో స్పందించారు (Russian Oil Trade). ఈ అంశాన్ని ట్రంప్, మోదీ స్వయంగా చర్చించి పరిష్కరించుకుంటారని చెప్పారు. ఇరువురి మధ్య మంచి సంబంధాలు ఉన్నందున ఈ సమస్యకు పరిష్కారం లభిస్తుందనే నమ్మకం వ్యక్తం చేశారు. ఇరాన్ ముప్పు నుంచి తప్పించుకునేందుకు అలా చేశా: డొనాల్డ్ ట్రంప్ ప్రయోగించిన 85 సెకన్లకే పేలిపోయిన చైనా రాకెట్.. వీడియో వైరల్

Infinix Note Edge 5G Offer: ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్‌లో ఇన్ఫినిక్స్ నోట్ ఎడ్జ్ 5G (Infinix Note Edge 5G) స్మార్ట్‌ఫోన్ అద్భుతమైన ఆఫర్స్‌తో అందుబాటులో ఉంది. దీనిని ఎక్చేంజ్ ఆఫర్‌తో పాటు మరికొన్ని ఆఫర్స్ వినియోగించి కొనుగోలు చేసేవారికి రూ.9,774కే దీనిని సొంతం చేసుకోవచ్చు. Infinix Note Edge 5G Offer: ఇన్ఫినిక్స్ (Infinix) బ్రాండ్‌కి సంబంధించిన మంచి స్మార్ట్‌ఫోన్ ఏదైన కొనుగోలు చేయాలనుకుంటున్నారా? అయితే, మీకు మంచి సమయం రానే వచ్చేసింది. ప్రముఖ ఈ కామర్స్ కంపెనీ ఫ్లిప్‌కార్ట్‌లో ఫ్రిడమ్ సేల్‌లో భాగంగా ఇన్ఫినిక్స్ నోట్ ఎడ్జ్ 5G స్మార్ట్‌ఫోన్ చాలా తక్కువ ధరకే అందుబాటులో ఉంది. దీనిపై అదనంగా బ్యాంక్ ఆఫర్స్ కూడా లభిస్తున్నాయి. అయితే, దీనిపై లభిస్తున్న ఆఫర్స్ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.. ఈ ఇన్ఫినిక్స్ నోట్ ఎడ్జ్ 5G (Infinix Note Edge 5G) స్మార్ట్‌ఫోన్ అద్భుతమైన ఫీచర్స్‌తో పాటు స్పెషిఫికేషన్స్‌తో అందుబాటులోకి వచ్చింది.. ఇది చాలా ప్రత్యేకమైన 7.2mm స్లిమ్ డిజైన్‌ను కూడా కలిగి ఉంటుంది. అంతేకాకుండా 3D కర్వ్డ్ డిస్ప్లేను కూడా కలిగి ఉంటుంది. ముఖ్యంగా ఇది ఎంతో శక్తివంతమైన 6500mAh భారీ బ్యాటరీని కలిగి ఉంటుంది. ఈ మొబైల్ మోస్ట్ పవర్ఫుల్ 6.78-అంగుళాల 1.5K 3D కర్వ్డ్ AMOLED డిస్ప్లేను కూడా కలిగి ఉంటుంది. అంతేకాకుండా 120Hz రీఫ్రెష్ రేట్, 4500 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌తో పాటు కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 7i ప్రొటెక్షన్ సపోర్ట్‌తో అందుబాటులోకి వచ్చింది. ఇది ఎంతో శక్తివంతమైన మీడియాటెక్ డైమెన్సిటీ 7100 (6nm) ప్రాసెసర్‌ను కూడా కలిగి ఉంటుంది. ఇక వెనక భాగంలో ఇది మోస్ట్ పవర్ఫుల్ 50MP ప్రధాన కెమెరా సెన్సార్‌ను కూడా కలిగి ఉంటుంది. ఇక ఫ్రంట్ భాగంలో 13MP సెల్ఫీ కెమెరాతో అందుబాటులోకి వచ్చింది. ఈ రెండు కెమెరాలతో 2K 30fps వీడియో రికార్డింగ్ సపోర్ట్ చేస్తుందని కంపెనీ క్లైమ్ చేస్తోంది. ఇది

అమరావతికి గేట్ వేగా ఐకానిక్ బ్రిడ్జ్ అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మాణం రూ.వెయ్యి కోట్ల మేరకు వ్యయ అంచనా మంగళవారం ముగిసిన ప్రీ-బిడ్ మీటింగ్ ఈ నెల 26 వరకు బిడ్ దాఖలుకు గడువు గుంటూరు(రాజధాని), ఆగస్టు 11(ఆంధ్రజ్యోతి): రాజధాని అమరావతిని విజయవాడతో అనుసంధానం చేస్తూ మరో ప్రతిష్ఠాత్మకపైన బ్రిడ్జి నిర్మాణానికి ప్రభుత్వం, అమరావతి గ్రోత్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్(ఏజీఐసీఎల్) శ్రీకారం చుట్టాయి. బ్రిడ్జి నిర్మాణానికి సంబంధించిన ఫీజిబిలిటీ, సమగ్ర ప్రాజెక్టు నివేదిక కోరుతూ ఏజీఐసీఎల్ కొద్దిరోజుల క్రితం టెండర్లను ఆహ్వానించింది. ఈ నేపథ్యంలో మంగళవారం రాయపూడిలోని ఏజీఐసీఎల్ కార్యాలయంలో కన్సల్టెన్సీలతో ప్రీ-బిడ్ మీటింగ్ జరిగింది. ఈ సమావేశంలో బ్రిడ్జి నిర్మాణానికి సంబంధించి పలు అంశాలపై చర్చించారు. ఈ వంతెనను ప్రస్తుతం నిర్మించిన సీడ్ యాక్సిస్ రోడ్డుతో అనుసంధానించడం ద్వారా అమరావతికి మరింత మెరుగైన కనెక్టివిటీని కల్పించనున్నారు. ఏజీఐసీఎల్ టెండర్ల ప్రకారం కొత్తగా నిర్మిస్తున్న ఈ బ్రిడ్జికి ‘సిగ్నేచర్ బ్రిడ్జ్’గా పేరును ఖరారు చేశారు. హైదరాబాద్-మచిలీపట్నం జాతీయరహదారి(ఎన్‌హెచ్-65), విజయవాడ నగరాలతో అమరావతి అనుసంధానాన్ని మెరుగుపరచనున్నారు. దీనికిగాను బ్యారేజీకి 300 మీటర్ల దిగువన, అంటే ప్రకాశం బ్యారేజీ, రైలు బ్రిడ్జిలకు మధ్యలో సిగ్నేచర్ బ్రిడ్జిని నిర్మిస్తారు. సీతానగరం ఘాట్ నుంచి కనకదుర్గ ఫ్లై ఓవర్ ద్వారా, మచిలీపట్నం-హైదరాబాద్ జాతీయ రహదారిని(ఎన్‌హెచ్-65) అనుసంధానిస్తూ ఈ ప్రాజెక్టును చేపడతారు. రాజధానికి గేట్వేగా, ప్రముఖ పర్యాటక ఆకర్షణగా నిలిచేలా ఈ ప్రాజెక్టును 6 వరుసలతో అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించేందుకు ప్రణాళికలు సిద్ధం చేశారు. ప్రయాణికుల సౌకర్యార్థం ఈ వంతెనను ఆరు వరుసల రహదారులతోపాటు, రెండువైపులా ప్రత్యేకంగా ఫుట్‌పాత్‌లు, సైకిల్ ట్రాక్‌లు ఏర్పాటు చేయనున్నారు. ఇంజనీరింగ్, ప్రొక్యూర్మెంట్, కన్స్ట్రక్షన్(ఈపీసీ) పద్ధతిలో చేపట్టనున్న ఈ ప్రాజెక్టు నిర్మాణం కోసం కాన్సెప్ట్, డిజైన్లు, వ్యయ అంచనాల ఆధారంగా ఎంపికైన కన్సల్టెన్సీ సంస్థ నిర్మిస్తుంది. ప్రాజెక్టు అధ్యయనం కోసం బిడ్లు దాఖలు చేయడానికి ఈ నెల 26 వరకు గడువు ఉంది. ఎంపికైన సంస్థ 3 నెలల్లోగా డీపీఆర్‌ను
SSY Calculator: ఆడ పిల్లల భవిష్యత్తు, ఉన్నత చదువులు, వివాహ ఖర్చుల కోసం కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న అత్యతం ప్రజాదరణ పొందిన పొదుపు పథకం సుకన్య సమృద్ధి యోజన (Sukanya Samriddhi Yojana). ఇతర చిన్న మొత్తాల పొదుపు పథకాలతో పోలిస్తే ఇందులో ప్రభుత్వం అత్యధికంగా 8.20 శాతం వార్షిక వడ్డీ రేటును అందిస్తోంది. ఇందులో కాంపౌండింగ్ ఇంట్రెస్ట్ మ్యాజిక్ పని చేస్తుంది. అంటే వడ్డీపైన వడ్డీ జనరేట్ అవుతూ పెద్ద మొత్తంలో కార్పస్ ఏర్పడేందుకు అవకాశం ఉంటుంది. మరి ఇందులో నెలకు రూ.500, రూ.1000 చొప్పున పెట్టుబడి పెడితే ఎంతొస్తుంది? అనే వివరాలు తెలుసుకుందాం.సుకన్య సమృద్ధి యోజన నిబంధనల ప్రకారం 15 సంవత్సరాల పాటు డబ్బులు జమ చేయాల్సి ఉంటుంది. అది నెల నెలా, ఆరు నెలలు, ఏడాది చొప్పున మనకు నచ్చినట్లుగా జమ చేయవచ్చు. కనీసం ఏడాదికి ఒకసారి రూ.250 ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది. ఖాతా తెరిచిన 21 సంవత్సరాల తర్వాత మొత్తం నిధి మెచ్యూరిటీకి వస్తుంది. 10 సంవత్సరాల లోపు ఆడ పిల్లల పేరుపై ఈ ఖాతా తెరవవచ్చు. పోస్టాఫీస్ లేదా బ్యాంకుల్లో అకౌంట్ తీసుకోవచ్చు.నెలకు రూ.500 జమ చేస్తే ఎంతొస్తుంది?5 ఏళ్ల వయసు ఉన్న మీ పాప పేరుపై మీరు సుకన్య సమృద్ధి యోజన అకౌంట్ తెరిచారు అనుకుందాం. అంటే ఆమెకు 26 ఏళ్ల వయసు వచ్చాక అకౌంట్ మెచ్యూర్ అవుతుంది. అయితే, 18 ఏళ్ల తర్వాత ఉన్నత చదువులకు, 21 ఏళ్ల తర్వాత పెళ్లి కోసం విత్ డ్రా చేసుకోవచ్చు. ఉదాహరణకు మీరు నెలకు రూ.500 చొప్పున డిపాజిట్ చేశారు అనుకుందాం. వార్షిక పెట్టుబడి రూ.6000 అవుతుంది. 15 సంవత్సరాల్లో మీరు మొత్తం రూ.90 వేలు పెట్టుబడి పెడతారు. దీనిపై ప్రస్తుతం ఇస్తోన్న 8.20 శాతం వడ్డీ ప్రకారం రూ.1,87,103 వరకు వడ్డీ వస్తుంది. అంటే 21 ఏళ్ల తర్వాత చేతికి రూ.2,77,103 వరకు వస్తాయి.నెలకు రూ.1000