
Rishabh Pant : టీమ్ఇండియా క్రికెటర్ రిషబ్ పంత్ చరిత్ర సృష్టించాడు. టెస్టుల్లో వంద సిక్సర్లు కొట్టిన తొలి భారత బ్యాటర్‌గా చరిత్ర సృష్టించాడు. గాలే వేదికగా శ్రీలంకతో జరుగుతున్న తొలి టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో రెండు సిక్సర్లు బాదడంతో పంత్ సుదీర్ఘ ఫార్మాట్లో వంద సిక్సర్ల మైలురాయిని చేరుకున్నాడు. అంతేకాదండోయ్.. ఓవరాల్‌గా టెస్టు క్రికెట్లో 100 సిక్సర్లు కొట్టిన నాలుగో బ్యాటర్‌గా రికార్డులకు ఎక్కాడు. బెన్ స్టోక్స్, బ్రెండన్ మెక్కల్లమ్, ఆడమ్ గిల్ క్రిస్ట్లు మాత్రమే పంత్ కన్నా ముందు ఈ మైలురాయిని చేరుకున్నారు. టెస్టుల్లో 100 సిక్సర్లు కొట్టిన మైలురాయిని అత్యంత వేగంగా చేరుకున్న ఆటగాడిగానూ పంత్ రికార్డులకు ఎక్కాడు. AUS vs BAN : బంగ్లా చేతిలో ఓటమి.. దెబ్బకు ఓపెనర్‌ను మార్చేసిన ఆసీస్.. మూడేళ్లు టెస్టులు ఆడని ప్లేయర్‌కు చోటు.. Maximum number 1⃣0⃣0⃣ in Test Cricket for Rishabh Pant! 💥 He becomes the first #TeamIndia batter to reach that special milestone in men's cricket 🫡🫡 Updates ▶️ — BCCI (@BCCI) August 18, 2026 బంతుల పరంగా అత్యంత వేగంగా టెస్టుల్లో 100 సిక్సర్లు కొట్టిన ప్లేయర్లు వీరే.. * రిషబ్ పంత్ (భారత్) - 4918 బంతులు * ఆడమ్ గిల్ క్రిస్ట్ (ఆస్ట్రేలియా) - 6578 బంతులు * బెన్ స్టోక్స్ (ఇంగ్లాండ్) - 9042 బంతులు * బ్రెండన్ మెక్ కల్లమ్ (న్యూజిలాండ్) - 9856 బంతులు