
పత్తికి డిమాండ్ బాగా పెరిగింది. పంటంతా రైతుల చేయి దాటిపోయిన తర్వాత ధర పెరుగుతోంది. రైతుల చేతిలో పంట ఉన్నప్పుడు క్వింటా రూ.6 వేలకు కూడా కొనేవారు లేరు. నేడు కనీస మద్దతు ధరను మించిపోయింది. అమరావతి, ఆగస్టు 12(ఆంధ్రజ్యోతి): పత్తికి డిమాండ్ బాగా పెరిగింది. పంటంతా రైతుల చేయి దాటిపోయిన తర్వాత ధర పెరుగుతోంది. రైతుల చేతిలో పంట ఉన్నప్పుడు క్వింటా రూ.6 వేలకు కూడా కొనేవారు లేరు. నేడు కనీస మద్దతు ధరను మించిపోయింది. దాదాపు ఏడాది పొడవునా పత్తి క్రయవిక్రయాలు జరిగే ఆదోని మార్కెట్లో ప్రస్తుతం క్వింటాకు రూ.10వేలుపైనే లభిస్తోంది. తాజాగా క్వింటా పత్తి రూ.10,350 పలికింది. ఈ నెల ఒకటో తేదీన రూ.9,830 పలికిన ధర.. పది రోజుల్లో రూ.500దాకా పెరిగింది. మార్చి నెలలో కనీస మద్దతు ధర కూడా లేకపోగా.. ఇప్పుడు డిమాండ్ వచ్చింది. గతేడాది పత్తికి డిమాండ్ ఉన్నా.. ఉత్పత్తి లేకపోవడం, తుఫాన్ల వల్ల పంట దెబ్బతినడంతో రైతులు నష్టపోయారు. వర్షాలకు దెబ్బతిన్న పత్తిని రైతులు నిల్వ ఉంచుకోలేక, వచ్చిన ధరకు అమ్మేశారు. ఇప్పుడు సీజన్ ముగిసిపోయి, పత్తి నిల్వలు తరిగిపోయిన తర్వాత మంచి ధర వస్తోంది. రాష్ట్రంలో 2025-26 మార్కెటింగ్ సీజన్లో సుమారు ఐదు లక్షల హెక్టార్లలో పత్తి పండించగా, దాదాపు 8 లక్షల మెట్రిక్ టన్నులు ఉత్పత్తి అయ్యింది. పత్తి క్వింటా కనీస మద్దతు రూ.7,710-8,110 ఉండగా, 38,940 మంది రైతుల నుంచి రూ.1,556.93కోట్ల విలువైన 19,99లక్షల క్వింటాళ్లను సీసీఐ కొనుగోలు చేసిందని మార్కెటింగ్ శాఖ అధికారులు తెలిపారు. అయితే గతేడాది పత్తి తీసే తరుణంలో మొంథా, దిత్వా తుఫాన్లతో భారీ వర్షాలు కురిసి, పత్తి తడిసి, పాడైపోయి రైతులు భారీగా నష్టపోయారు. ఆ సమయంలో ప్రైవేట్ వ్యాపారులు క్వింటాకు రూ.6వేలు కూడా ఇవ్వకపోవడంతో రైతులు కొంత పత్తిని సీసీఐ కేంద్రాల్లో అమ్మారు. సీసీఐ కేంద్రాలు ఆలస్యంగా తెరవడంతో బయట ధరలు ఎమ్మెస్పీ