
స్మార్ట్‌ఫోన్ లవర్స్ ఎంతగానో ఎదురుచూస్తున్న ఐక్యూ నియో 11 ఆల్ట్రా (iQOO Neo 11 Ultra) లాంచ్‌కు ముహూర్తం ఖరారైంది. ఈ కొత్త ఫోన్‌ను వచ్చే, అంటే ఆగస్టు 18న సాయంత్రం 7:00 గంటలకు చైనాలో అధికారికంగా విడుదల చేయనున్నారు. ఐక్యూ బ్రాండ్ తన నియో సిరీస్‌లో 'ప్రో' అనే పేరుకు బదులుగా మొదటిసారిగా 'ఆల్ట్రా' ట్యాగ్‌ను ఉపయోగిస్తుండటం విశేషం. ఈ లాంచ్ కంటే ముందే చైనా టెలికామ్ వెబ్సైట్లో మోడల్ నంబర్ V2573A తో ఈ ఫోన్ లిస్ట్ అయింది. దాంతో లాంచ్‌కు ముందే దీని పూర్తి స్పెసిఫికేషన్లు, ఫీచర్లు లీక్ అయి టెక్ ప్రపంచంలో వైరల్ అవుతున్నాయి. ప్రస్తుతం కంపెనీ సైట్లో ఈ ఫోన్ ప్రి-ఆర్డర్ల కోసం అందుబాటులో ఉంది. ఐక్యూ నియో 11 ఆల్ట్రా ఫోన్లో ప్రధాన ఆకర్షణ దీని బ్యాటరీ కెపాసిటీనే అని చెప్పవచ్చు. ఐక్యూ నియో సిరీస్ చరిత్రలోనే అత్యంత పెద్దదైన 9,100mAh భారీ బ్యాటరీతో ఈ ఫోన్ రాబోతోంది. రోజంతా గేమింగ్ ఆడినా, ఎంత హెవీగా వాడినా బ్యాటరీ ఛార్జ్ అయిపోతుందనే భయం ఉండదు. దీనికి తోడు 100W వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా అందిస్తున్నారు. దీనివల్ల ఇంత పెద్ద బ్యాటరీని కూడా చాలా వేగంగా ఛార్జ్ చేసుకోవచ్చు. అయితే ఈ ఫోన్లో వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ ఉండదు. ఫోన్ సైజు విషయానికి వస్తే 163.42 x 75.88 x 8.6 మిమీ కొలతలతో, 225 గ్రాముల బరువుంటుంది. గేమింగ్, వీడియో కంటెంట్ లవర్స్ కోసం ఈ ఫోన్లో టాప్ నోచ్ డిస్ప్లేను ఇచ్చారు. ఇందులో 6.83-అంగుళాల ఫ్లాట్ విజనోక్స్ F2 OLED 2K రెసల్యూషన్ డిస్ప్లే ఉంటుంది. ఇది కళ్లకు ఎలాంటి హాని కలగకుండా ప్రత్యేక ప్రొటెక్షన్‌తో వస్తుంది. ప్రాసెసర్ విషయానికి వస్తే, ఇందులో మీడియాటెక్ డైమెన్సీటీ 9500ఎం ఆక్టా-కోర్ చిప్‌సెట్‌ను ఉపయోగించారు. ఇది ఫ్లాగ్షిప్ ప్రాసెసర్‌కు మోడిఫైడ్ వెర్షన్. ఇందులో 11-కోర్