
© 2026 nimisham.in


Tata Madhu : బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు తాతా మధు, నవీన్ రెడ్డి నాంపల్లి కోర్టులో ఊరట లభించింది. స్పీకర్‌ను దూషించారన్న కేసులో వీరిద్దరి రిమాండ్‌ను కోర్టు తిరస్కరించింది. రూ. 10వేల పూచీకత్తుతో రెండు షూరిటీలను సమర్పించాల్సిందిగా కోర్టు ఆదేశించింది.
షూరిటీలు సమర్పించిన తర్వాత ఎమ్మెల్సీలను విడుదల చేయాలని కోర్టు ఆదేశాల్లో పేర్కొంది. శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్‌పై అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలతో తాతా మధు, నవీన్‌కుమార్ రెడ్డిలను పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే.








