
© 2026 nimisham.in


MLC Thatha Madhu : తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ కంటతడి పెట్టారు. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ తాతా మధు చేసిన వ్యాఖ్యలపై ఆయన తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. ఆ తరువాత అసెంబ్లీలో మంత్రి సీతక్క మాట్లాడుతూ.. స్పీకర్ ప్రసాద్ కుమార్ తల్లిని కించపరుస్తూ తాతా మధు వ్యాఖ్యలు చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. కాగా ఈ సమయంలో ఆమె భావోద్వేగానికి గురై కంటతడి పెట్టుకున్నారు. ఇదే సమయంలో స్పీకర్ ప్రసాద్ కుమార్ సైతం భావోద్వేగానికి గురై కంటతడి పెట్టారు. సీతక్క మాట్లాడుతూ.. తాతా మధుపై కఠిన చర్యలు తీసుకోవాలని.. ఆయన సభ్యత్వాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ సభ్యులు మధు సభ్యత్వాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నారు.








