
Longest Dot Ball Streak: ఆధునిక టెస్ట్ క్రికెట్ దూకుడుగా సాగుతున్న వేళ, పరిస్థితులకు అనుగుణంగా ఓపికతో నిలబడటం ఎంతో కీలకం. అలా ఒక టెస్టు ఇన్నింగ్స్లో తన తొలి పరుగు చేయడానికి ఏకంగా 53 డాట్ బాల్స్ ఎదుర్కొని, 54వ బంతికి ఖాతా తెరిచిన భారత టెస్ట్ స్పెషలిస్ట్ చేతేశ్వర్ పుజారా (Cheteshwar Pujara) ప్రదర్శన క్రికెట్ చరిత్రలోనే ప్రత్యేకంగా నిలిచింది.



