
రాకింగ్ స్టార్ యశ్ కథానాయకుడిగా గీతూ మోహన్ దాస్ దర్శకత్వంలో వచ్చిన భారీ యాక్షన్ చిత్రం ‘టాక్సిక్: ఏ ఫెయిరీ టేల్ ఫర్ గ్రోన్-అప్స్’ ఓటీటీ విడుదలకు ముస్తాబైంది. బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో మెప్పించలేకపోయిన ఈ చిత్రం, సెప్టెంబర్ 25 నుండి ప్రముఖ ఓటీటీ వేదిక ‘జీ5’ (ZEE5) లో పలు భాషల్లో స్ట్రీమింగ్ కానున్నట్లు సమాచారం. విడుదలకు ముందు రూ.150 కోట్ల దాకా పలికిన ఈ చిత్ర డిజిటల్ హక్కులు, థియేట్రికల్ ఫలితం అనంతరం సుమారు రూ.30 కోట్లకు మాత్రమే అమ్ముడుపోయినట్లు ట్రేడ్ వర్గాల్లో ప్రచారం సాగుతోంది. నయనతార, కియారా అద్వానీ కీలక పాత్రలు పోషించిన ఈ సినిమా ఓటీటీ స్ట్రీమింగ్పై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.




