
తిరుమల: తిరుమల ప్రధాన ప్రవేశద్వారం వద్ద అద్భుతమైన గరుడ సర్కిల్‌ను సోమవారం ఉదయం అధికారికంగా ప్రారంభించారు. సుందరమైన మొక్కలు, ఆకర్షణీయమైన నీటి ఫౌంటైన్లతో రూపుదిద్దిన ఈ సర్కిల్ భక్తులకు కనువిందు చేస్తోంది. రూ.30 లక్షల వ్యయంతో పూర్తయిన ఈ ప్రాజెక్ట్‌కు ప్రధాన దాత లెవెన్ హోల్డింగ్స్ ప్రతినిధి, లారస్ లాబ్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ వి.రవికుమార్. అదనపు ఈవో సీహెచ్‌ వెంకయ్య చౌదరి ప్రత్యేక చొరవతో ఇది సాకారమైంది. గార్డెన్ సూపరింటెండెంట్ శ్రీనివాస్ వాసులు, ల్యాండ్‌స్కేప్ డిజైనర్ శుభాకర్, నర్సరీ నరేందర్ లక్కరాజు, ఫౌంటైన్స్ నిపుణుడు రాజేష్ తదితరులు పాల్గొన్నారు.ఆధ్యాత్మిక భావనతో ఆధునిక ల్యాండ్‌స్కేప్ డిజైన్‌ను మేళవించి భక్తులకు ప్రశాంత స్వాగతం పలుకుతోందని అధికారులు తెలిపారు. .నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.





