
భక్తులకు దర్శనమివ్వనున్న విజయగణపతి - మంగినపూడి(మచిలీపట్నంరూరల్‌), న్యూస్‌టుడే మం గినపూడి సాగర తీరాన ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది. మట్టితో రూపొందించిన 63 అడుగుల విజయగణపతి విగ్రహానికి సోమవారం ఉదయం 10:14 గంటలకు ప్రాణప్రతిష్ఠ చేయనున్నారు. ఉత్సవాలకు సంబంధించిన ఏర్పాట్లను మంత్రి కొల్లు రవీంద్ర స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. వి నాయక మండపానికి ఇరువైపులా.. పలు ఉపాలయాలు ఏర్పాటు చేశారు. వీటిలో తిరుమల వేంకటేశ్వరస్వామి, విజయవాడ కనకదుర్గ, భద్రాద్రి రామయ్య, అంతర్వేది లక్ష్మీనరసింహస్వామి వారి విగ్రహాలు ప్రతిష్ఠించారు. భక్తుల సౌకర్యార్థం: ఈనెల 14 నుంచి 24 వరకు జరగనున్న ఉత్సవాలకు లక్షల సంఖ్యలో భక్తులు వస్తారని అంచనా వేస్తున్నారు. ఇందుకు అనుగుణంగా జిల్లా యంత్రాంగం తగిన ఏర్పాట్లు చేస్తోంది. మరుగుదొడ్లు, తాగునీరు, పారిశుద్ధ్యం, విద్యుత్తు, రవాణా సదుపాయాలు సమకూరుస్తున్నారు. వన్‌వే ట్రాఫిక్‌ను ప్రవేశపెడుతున్నారు. ల క్ష్మీగణపతి హోమం, రుద్రహోమం, చండీహోమం, పురుషసూక్త, విష్ణుసూక్త హోమాలు, నవగ్రహ హోమాలు నిర్వహించనున్నారు. .నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.




