
తప్పుడు ప్రచారాన్ని నమ్మొద్దు: తితిదే తిరుమల, న్యూస్‌టుడే: తిరుమలకు వచ్చే ప్రైవేట్‌ వాహనాలపై ఆంక్షలు విధిస్తున్నట్లు సామాజిక మాధ్యమాల్లో జరుగుతున్న తప్పుడు ప్రచారాన్ని నమ్మొద్దని తితిదే ఆదివారం ఒక ప్రకటనలో తెలిపింది. ‘బ్రహ్మోత్సవాల సమయంలో తిరుమలకు రోజుకు 15,000 వాహనాలకు మాత్రమే అనుమతి ఉంటుందని, ఆ తర్వాత వచ్చే వాహనాలను చెక్‌ పాయింట్ల వద్ద నిలిపేస్తారని ప్రచారం చేస్తున్నారు. ఇది పూర్తిగా అవాస్తవం. తిరుమలకు వచ్చే ప్రైవేట్‌ వాహనాల సంఖ్యపై ఈ తరహా ఎలాంటి నిర్ణయాన్ని తీసుకోలేదు’ అని పేర్కొంది. తితిదే పేరుతో తప్పుడు వార్తలు, సమాచారాన్ని ప్రచారం చేసేవారిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. కాగా, ప్రైవేట్‌ వాహనాల విషయంపై అవాస్తవాలు ప్రచారం చేసిన వారిపై తిరుమల టూటౌన్‌ పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదు చేసినట్లు ఎస్పీ సుబ్బరాయుడు తెలిపారు. ఘటనపై విచారణ జరుపుతున్నామని, నిందితుల వివరాలు త్వరలో వెల్లడిస్తామన్నారు. .నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.




