
తిరుపతి (తితిదే), న్యూస్‌టుడే: తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామి దర్శనానికి తిరుపతిలో భక్తులకు జారీ చేసే ఎస్‌ఎస్‌డీ టోకెన్ల జారీని సోమవారం నుంచి ఈ నెల 19వ తేదీ వరకు నిలిపివేశారు. బ్రహ్మోత్సవాలకు భక్తుల రదీ నేపథ్యంలో ఆరు రోజుల పాటు భక్తులను నేరుగా తిరుమల క్యూలైన్లలోకి అనుమతించేలా నిర్ణయం తీసుకున్నట్లు తితిదే ఆదివారం ప్రకటించింది. ఈ నెల 21న దర్శనానికి సంబంధించిన ఎస్‌ఎస్‌డీ టోకెన్లను 20న జారీ చేయనుంది. అయితే, సోమవారం తెల్లవారుజామున ఇచ్చే టోకెన్ల కోసం ఆదివారం ఉదయం నుంచే భక్తులు తిరుపతిలోని శ్రీనివాసం, విష్ణు నివాసం, భూదేవి కాంప్లెక్స్‌ వద్ద వేచి ఉన్నారు. టోకెన్లు జారీ చేయబోమని అధికారులు ముందస్తుగా తెలపకపోవడంపై భక్తులు ఆవేదన వ్యక్తం చేశారు. తర్వాత అందరూ తిరుమలకు ప్రయాణమయ్యారు. వరుస సెలవులతో భక్తుల రద్దీ విపరీతంగా పెరిగింది. .నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.




