
మండపాలకు శాస్త్రీయ రసాయన సంరక్షణ ప్రక్రియ మండపం పైకప్పును శుభ్రం చేస్తున్న కార్మికులు తిరుమల, న్యూస్‌టుడే: తిరుమలేశుడి ఆలయంలోని పురాతన మండపాలకు శాస్త్రీయ రసాయన సంరక్షణ పనులను పుణెకు చెందిన ‘లార్డ్‌ వేంకటేశ్వర ఛారిటబుల్‌ అండ్‌ రెలిజియస్‌ ట్రస్ట్‌’ ముందుకొచ్చి చేయిస్తోంది. మొదటి దశలో ఆలయానికి చెందిన ఉత్తర, పశ్చిమ, దక్షిణ వైపుల్లోని పైకప్పులు, స్తంభాలకు సంబంధించిన పనులను నిపుణులైన కార్మికులు పూర్తిచేశారు. మిగిలిన పనులు కొనసాగుతున్నాయి. మైసూరు పురావస్తు శాఖ విశ్రాంత కెమిస్ట్‌ అంబేడ్కర్‌ పర్యవేక్షణలో ఈ పనులు చేస్తున్నారు. ప్రక్రియ పూర్తయ్యాక పైకప్పు ఇలా మండప స్తంభాలు శుభ్రం చేయక ముందు, తర్వాత .నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.




