
Ajit Agarkar vs Rohit Sharma: భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) పరిధిలో ఊహించని పరిణామాలు తెరపైకి వస్తున్నాయి. ప్రధాన సెలెక్టర్ అజిత్ అగార్కర్ పదవీకాలం సెప్టెంబర్ 2026తో ముగిసిపోనుంది. అయితే రోహిత్ శర్మ వన్డే కెరీర్‌కు సంబంధించిన వ్యవహారమే అగార్కర్ ను ఇంటికి సాగనంపుతున్నట్లు కనిపిస్తోంది. రాబోయే 2027 వన్డే ప్రపంచకప్ (2027 ODI world cup) వేదికగా రోహిత్‌ను పక్కనపెట్టి యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్ (Yashasvi Jaiswal) కు ప్రాధాన్యమివ్వాలని అగార్కర్ భావించాడు. ఈ క్రమంలో ఇంగ్లండ్ (England) వన్డే సిరీస్ లోని లార్డ్స్ మ్యాచ్ రోహిత్‌కు చివరి మ్యాచ్ అంటూ ప్రచారం మొదలైంది. బోర్డు పెద్దలు మాత్రం సీనియర్ బ్యాటర్‌కు పూర్తి మద్దతు పలకడంతో సెలెక్షన్ కమిటీ నిర్ణయాలు ఒక్కసారిగా ప్రశ్నార్థకమయ్యాయి.



