
WTC Points : మూడు టెస్టుల సిరీస్‌లో ఇంగ్లండ్ చేతిలో వైట్‌వాష్‌కు గురైన పాకిస్థాన్(Pakistan)కు వరసగా షాక్‌లు తగులుతున్నాయి. ఎడ్జ్‌బాస్టన్ టెస్టు (Edgebaston Test)లో ఘోర పరాజయం నుంచి తేరుకోకముందే పాక్ జట్టుకు ఐసీసీ డబుల్ స్ట్రోక్ ఇచ్చింది. ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్(WTC) 2025-27లో దాయాది టీమ్ ర్యాంక్ దిగజారింది. స్లో ఓవర్ రేటు ఫలితంగా 11 పాయింట్లు కోల్పోయిన పాక్ డబ్ల్యూటసీ పట్టికలో అట్టడుగున నిలిచింది. ఇది చాలదన్నట్టు.. మ్యాచ్ ఫీజులోనూ 50 శాతం కోత విధించింది ఐసీసీ. పాకిస్థాన్ టెస్టు క్రికెట్ మరింత సంక్షోభంలో పడింది. లార్డ్స్ టెస్టు తర్వాత ఇద్దరు ప్రధాన కోచ్‌లు, ఏడుగురు ఆటగాళ్లను స్వదేశానికి పంపించడం పెద్ద దుమారం రేపిన విషయం తెలిసిందే. ఫిక్సింగ్ ఆరోపణల నేపథ్యంలో ఆటగాళ్ల వైఫల్యంపై అంతర్గత విచారణ నిర్వహించింది పాకిస్థాన్ క్రికెట్ బోర్డు. మూడు టెస్టుల సిరీస్‌లో క్లీన్‌స్వీప్ అయిన పాక్ వరసగా 12 మ్యాచుల్లో ఓడడం ఆ జట్టు ర్యాకింగ్స్‌ను దెబ్బతీసింది. Pakistan’s points percentage in the WTC drop from 14.81 to 4.63 📉 pic.twitter.com/0sbYP6SfJC — Cricinfo (@cricinfo) September 14, 2026 పైగా ఎడ్జ్‌బాస్టన్‌లో స్లో ఓవర్ రేటుకు బాబర్ ఆజాం(Babar Azam) భారీ మూల్యం చెల్లించింది. నిర్ణీత సమయంలో ఓవర్లు పూర్తి చేయనందున డబ్ల్యూటీసీలో అట్టడుగు ర్యాంకుకు పడిపోయింది దాయాది జట్టు. ఎడ్జ్‌బాస్టన్ టెస్టుకు ముందు 14.81 విజయాల శాతంతో ఉన్న పాక్.. 4.63 శాతానికి దిగజారింది. ప్రస్తుతం డబ్ల్యూటీసీ ర్యాంకింగ్స్‌లో ఆస్ట్రేలియా అగ్రస్థానంలో ఉండగా.. దక్షిణాఫ్రికా, న్యూజిలాండ్, బంగ్లాదేశ్, భారత్.. వరసగా రెండు, మూడు, నాలుగు, ఐదు స్థానాల్లో కొనసాగుతున్నాయి. Another big blow for Pakistan The ICC found them 11 overs short of the target during the third Test against England in Birmingham pic.twitter.com/yVUoIbZARO — Cricinfo (@cricinfo) September 14, 2026




