
గాల్వన్ ఘర్షణల తర్వాత భారత్, చైనా మధ్య తారా స్థాయికి చేరిన ఉద్రిక్తతలు.. గత రెండేళ్లుగా క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి. ఇరు దేశాల మధ్య సంబంధాలు తిరిగిన గాడిన పడే దిశగా సాగుతున్నాయి. గత ఏడాది ఆగస్టులో షాంఘై సహకార సంస్థ సదస్సులో పాల్గొనడం కోసం ప్రధాని మోదీ చైనా వెళ్లిన తర్వాత రెండు అతిపెద్ద దేశాల మధ్య సంబంధాల్లో పురోగతి కనిపించడం మొదలైంది. గత ఏడాది ఎల్ఏసీ వెంబడి చైనా సైనికుల మోహరింపును గణనీయంగా తగ్గించడమే దీనికి నిదర్శనం.





