
భారత్-చైనా సరిహద్దులోని వాస్తవాధీన రేఖ వెంట చైనా పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ బలగాలు గణనీయంగా తగ్గినట్లు భారత రక్షణ శాఖ తన వార్షిక నివేదికలో వెల్లడించింది. 2025 నాటి భారత్-చైనా సరిహద్దులోని వాస్తవాధీన రేఖ వెంట చైనా పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ బలగాలు గణనీయంగా తగ్గినట్లు భారత రక్షణ శాఖ తన వార్షిక నివేదికలో వెల్లడించింది. 2025 నాటికి ఈ మోహరింపులు తగ్గినప్పటికీ, ఉత్తర సరిహద్దుల్లో పరిస్థితి ఇంకా సున్నితంగా ఉందని నివేదిక పేర్కొంది. దిల్లీలో జరిగిన బ్రిక్స్ సదస్సులో ప్రధాని నరేంద్ర మోదీ, చైనా అధ్యక్షుడు జిన్పింగ్ భేటీ అయిన తర్వాత ఈ నివేదిక వెలువడటం విశేషం. 2024లో భారత్-చైనా మధ్య కుదిరిన సైనిక బలగాల ఉపసంహరణ ఒప్పందం ప్రకారం, చైనా తన సైన్యాన్ని దెప్సాంగ్, దెమ్చోక్ ప్రాంతాల్లో తగ్గించింది. అయితే, పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ సరిహద్దుల నుంచి పూర్తిగా వెనక్కి వెళ్లలేదు. చైనా తన మోహరింపులను తగ్గించినప్పటికీ, భారత్ అప్రమత్తంగా ఉంది. 2020 తర్వాత జరిగిన భారీ మోహరింపుల తీవ్రత కొంత తగ్గినప్పటికీ, వాస్తవాధీన రేఖ పొడవునా పటిష్టమైన సైనిక వ్యూహాన్ని కొనసాగిస్తోంది. భవిష్యత్తులో ఎలాంటి అత్యవసర పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు సైన్యం పూర్తి అప్రమత్తంగా ఉన్నట్లు రక్షణ శాఖ పేర్కొంది. గత కొంతకాలంగా ఇరు దేశాల మధ్య జరుగుతున్న రాజకీయ, దౌత్య చర్చల వల్లే సరిహద్దుల్లో ఉద్రిక్తతలు తగ్గుముఖం పట్టి, స్థిరత్వం నెలకొందని నివేదిక పేర్కొంది. చైనా మోహరింపులను తగ్గించినప్పటికీ, సరిహద్దు నిర్వహణ వ్యూహంలో ఎలాంటి మార్పు చేయలేదు. భారత్కు వ్యతిరేకంగా వ్యూహాత్మక లోతైన ప్రాంతాలు, శిక్షణా శిబిరాల్లో 10 'కంబైన్డ్ ఆర్మ్స్ బ్రిగేడ్' దళాలను చైనా అలాగే ఉంచింది. ఈ బ్రిగేడ్లు అవసరమైనప్పుడు వేగంగా సరిహద్దులకు చేరుకోగలవు. మరోవైపు, టిబెట్, జిన్జియాంగ్ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల నిర్మాణాన్ని చైనా కొనసాగిస్తూనే ఉంది. ఈ పరిస్థితిని సున్నితమైనదిగా పేర్కొంది. 2020 జూన్లో జరిగిన గల్వాన్ ఘర్షణల్లో 20 మంది భారత జవాన్లు, నలుగురు చైనా సైనికులు మరణించారు. ఆ తర్వాతే ఎల్ఏసీ వద్ద కనీవినీ ఎరుగని స్థాయిలో ఇరువైపులా బలగాల మోహరింపు జరిగింది. అయితే, 2024 ఉపసంహరణ ఒప్పందం తర్వాత ఉద్రిక్తతలు తగ్గుముఖం పట్టాయి. ఈ ఏడాది ఆగస్టులో ఇరుదేశాల ప్రత్యేక ప్రతినిధుల మధ్య 25వ విడత చర్చలు జరిగాయి. సైనిక హాట్లైన్ల ఏర్పాటు, దౌత్యమార్గాల ద్వారా సమస్యల పరిష్కారానికి అంగీకారం కుదిరింది. ఈ విషయంపై గతేడాది ప్రధాని మోదీ, చైనా అధ్యక్షుడు జిన్పింగ్ల మధ్య చర్చలు కూడా జరిగాయి. ఈ చర్చల ఫలితంగానే భారత్, చైనాల మధ్య ఉద్రిక్తతలు కొంత మేరకు ఉపశమించినట్లు తెలుస్తోంది.




