
Asia Cup Row : ఎనిమిదోసారి మహిళల ఆసియా కప్ విజేతగా నిలిచిన భారత జట్టు ఈసారి ట్రోఫీని స్వీకరించలేదు. ఫైనల్లో శ్రీలంకను చిత్తుగా ఓడించిన టీమిండియా పురుషుల జట్టు మాదిరిగానే ఆసియా క్రికెట్ మండలి(ACC) అధ్యక్షుడి మొహ్సిన్ నఖ్వీ (Mohsin Naqvi) చేతుల మీదుగా టైటిల్‌ను అందుకోలేదు. భారత్‌పై, బీసీసీఐపై విషం చిమ్మే అతడికి షేక్ హ్యాండ్ ఇచ్చి.. ట్రోఫీ తీసుకోవడం ఇష్టం లేక మైదానం నుంచి వెళ్లిపోయింది భారత బృందం. దాంతో.. సూర్యకుమార్ యాదవ్ సేన లెక్కనే హర్మన్‌ప్రీత్ కౌర్ బృందం కూడా ఛాంపియన్ హోదాలో.. ఉత్త చేతులతోనే స్వదేశానికి రానుంది. ఆసియా కప్‌లో మళ్లీ అదే రచ్చ జరిగింది. పురుషుల ఫైనల్ అనంతరం ఆసియా క్రికెట్ మండలి అధ్యక్షుడి హోదాలో ట్రోఫీ బహూకరించేందుకు వచ్చిన మొహ్సిన్ నఖ్వీ చేతులు మీదుగా భారత జట్టు అవార్డు అందుకోలేదు. ఇప్పుడు మహిళల జట్టు సైతం అదే పంథాను అనుసరించింది. శ్రీలంకపై 7 వికెట్ల విజయంతో టైటిల్ ప్రదానం కోసం వేచి ఉన్న భారత్.. నఖ్వీ రాకతో తమ నిర్ణయాన్ని మార్చుకుంది. పీసీబీ ఛీఫ్ కూడా అయిన నఖ్వీ చేతుల మీదుగా ట్రోఫీని అందుకునే ప్రసక్తే లేదని చెప్పేసింది. దాంతో.. ఏం పాలుపోక పరుగుపరుగున స్టేజి దిగి వెళ్లిపోయాడు నఖ్వీ. Indian Womens team last night won ASIA CUP 2026 Final and declined to receive trophy from “Trophy chor” Mohsin Naqvi. As he did in last year he kept Trophyvin his office today too pic.twitter.com/p8cHILV094 — OSINT Digest (@Indowatchosint) September 14, 2026 ఈ విషయంపై భారత కోచ్ అన్మోల్ మజుందార్ మాట్లాడుతూ.. ‘నఖ్వీ చేతుల మీదుగా ట్రోఫీ తీసుకోవద్దనేది బీసీసీఐ నిర్ణయం. మేము బోర్డు నిర్ణయానికి కట్టుబడి ఉన్నాం. మా దృష్టిలో ఈ టోర్నమెంట్ పూర్తైంది. మేము ఛాంపియన్లం. మాకిది చాలు. ఆసియా క్రీడలపై దృష్టి సారిస్తాం’ అని అన్నాడు. బీసీసీఐ సెక్రటరీ దేవజిత్ సైకియా సైతం ఇదే అభిప్రాయం వ్యక్తం చేశాడు. The turn of events mirrored the men’s Asia Cup final last September, which concluded with India refusing to accept the trophy from Naqvi. At the time, BCCI secretary Devajit Saikia had said the team didn’t want to take the trophy from someone who also happened to be “one of the… pic.twitter.com/Jh0pZnaG9S — Cricinfo (@cricinfo) September 13, 2026 మహిళల ఆసియా కప్‌ను ఎనిమిదోసారి ముద్దాడింది భారత జట్టు. అజేయంగా ఫైనల్ చేరిన టీమిండియా ఏకపక్ష పోరులో శ్రీలంకను చిత్తుగా ఓడించింది. దెబ్బకు దెబ్బ అన్నట్టుగా గత సీజన్లో ఎదురై ఓటమికి ప్రతీకారం తీర్చుకుంది. మెరుపు బ్యాటింగ్‌తో లంక బౌలర్లను హడలెత్తించిన ఓపెనర్లు షఫాలీ వర్మ(68), స్మృతి మంధాన(59) అర్ధ శతకాలతో భారీ స్కోరందించగా.. ఆపై శ్రీచరణి(4-20) తిప్పేసింది. బంతితోనూ షఫాలీ ఓ చేయి వేయగా వరసగా రెండో టైటిల్ సాధించాలనుకున్న డిఫెండింగ్ ఛాంపియన్ కల చెదిరింది.




