volkswagen mission efficiency: ఒక్క ఛార్జ్‌తో ఏకంగా 800 కిలోమీటర్లకు పైగా ప్రయాణించగలిగే ఒక అద్భుతమైన ఎలక్ట్రిక్ కారు వస్తే ఎలా ఉంటుంది? అది కూడా లీటరు పెట్రోల్ కాదు.. కేవలం ఒక చిన్న యూనిట్ కరెంట్‌తో మైళ్ల తరబడి దూసుకుపోయే సరికొత్త టెక్నాలజీ. జర్మన్ ఆటోమొబైల్ దిగ్గజం ఫోక్స్‌వ్యాగన్ తాజాగా ప్రపంచాన్ని విస్మరిస్తూ ‘మిషన్ ఎఫిషియెన్సీ’ పేరుతో ఒక నెక్స్ట్-జెన్ ev కాన్సెప్ట్‌ను ఆవిష్కరించింది.




