
సంగారెడ్డి: వినాయక నిమజ్జన వేడుకల్లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. గణనాథుడి నిమజ్జనానికి వెళ్లిన ఆరుగురు విద్యార్థులు మృతి చెందిన ఘటన సంగారెడ్డి జిల్లాలో కలకలం రేపింది. పెద్దకంజర్లలోని నేరెడుచెరువులో ఈ విషాద ఘటన జరిగినట్లు సమాచారం. మృతులంతా శిరీష చారిటబుల్ ట్రస్ట్‌లో చదువుతున్న విద్యార్థులుగా తెలుస్తోంది. వినాయక నవరాత్రుల అనంతరం విగ్రహ నిమజ్జన కార్యక్రమంలో భాగంగా విద్యార్థులు చెరువు వద్దకు వెళ్లిన సమయంలో ఈ ప్రమాదం జరిగినట్లు ప్రాథమిక సమాచారం. అయితే విద్యార్థులు నీటిలో ఎలా దిగారు? ప్రమాదానికి అసలు కారణం ఏమిటి? ఒకేసారి ఎంతమంది నీటిలోకి వెళ్లారు? అనే అంశాలపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.





