
Vastu tips Telugu: హిందూమతంలో వాస్తు శాస్త్రానికి ప్రత్యేకమైన ప్రాధాన్యత ఉంది. వాస్తు శాస్త్రం ప్రకారం, ఇంట్లో ఉండే కొన్ని వస్తువులు ప్రతికూల శక్తిని పెంచి.. సానుకూల శక్తి ప్రభావాన్ని తగ్గిస్తాయని నమ్ముతారు. దీనివల్ల ఇంట్లో శక్తి అసమతుల్యత ఏర్పడి, వాస్తు దోషం కలిగే అవకాశం ఉందని వాస్తు నిపుణులు చెబుతారు. ఇంట్లో వాస్తు దోషం ఉంటే కుటుంబ సభ్యుల మధ్య అనవసరమైన గొడవలు, ఆర్థిక ఇబ్బందులు, ఆదాయానికి మించి ఖర్చులు వంటి సమస్యలు ఎదురవుతాయని వాస్తు శాస్త్రంలో పేర్కొన్నారు. ఈ సమస్యలను నివారించేందుకు వాస్తు శాస్త్రంలో కొన్ని పరిహారాలను సూచించారు.




