
డీప్ బ్రీతింగ్ తీసుకోవడం వల్ల నాడీ వ్యవస్థ రిలాక్స్ అవుతుంది. మనసు కూల్ అవుతుంది. ఒత్తిడి తగ్గుతుందని హెల్త్‌లైన్ తెలిపింది. క్రమం తప్పకుండా వ్యాయామం చేయండి. వ్యాయామం చేయడం వల్ల ఎండార్పిన్లు రిలీజ్ అవుతాయి. మనసు ప్రశాంతంగా మారుతుంది. ఒత్తిడి తగ్గుతుంది. రోజులో కాసేపు ప్రకృతిలో సమయం గడపండి. పచ్చని ప్రకృతిలో సమయం గడపటం వల్ల ఎండార్పిన్లు రిలీజ్ అవుతాయి. ఒత్తిడి తగ్గుతుంది. నిత్యం మైండ్‌ఫుల్‌నెస్‌తో మెలగండి. అన్ని పనులను ఏకాగ్రతతో పూర్తి చేయండి. దీని వల్ల ఒత్తిడి తగ్గుతుంది. రోజులో 8 గంటల పాటు ప్రశాంతంగా నిద్రపోండి. నిద్రపోవడం వల్ల మెదడు పనితీరు మెరుగుపడుతుంది. ఒత్తిడి తగ్గుతుంది. సంతోషంగా ఉండొచ్చు. ప్రశాంతమైన మ్యూజిక్ వినండి. ఇది నాడీ వ్యవస్థను రిలాక్స్ ఉంచుతుంది. మ్యూజిక్ వినడం వల్ల ఒత్తిడి మొత్తం మాయం అవుతుంది. రోజులో కాసేపు మీకు నచ్చిన పనులు చేయండి. డ్యాన్స్ చేయడం, పాటలు పాడటం వంటివి చేయండి. దీంతో ఒత్తిడి తగ్గుతుంది. రోజులో కాసేపు మీకు నచ్చిన వారితో సమయం గడపండి. దీని వల్ల మనసు రిలాక్స్ అవుతుంది. ఒత్తిడి తగ్గుతుంది. నిత్యం సంతోషంగా ఉండొచ్చు. మీ ఆలోచనలు, భావాలను ఒక చోట రాసుకోండి. దీని వల్ల మైండ్ రిలాక్స్ అవుతుంది. ఒత్తిడి తగ్గుతుంది. మనసు ప్రశాంతంగా మారుతుంది.





