
అమరావతి : ఏపీలోని పల్నాడు జిల్లాలో విషాదం( Tragedy ) చోటు చేసుకుంది. ఆదివారం సాయంత్రం పిడుగుపాటు (Lightning) కు గురై నలుగురు మృతి చెందారు. ఏపీలోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయి. దీనికితోటు ఈదురుగాలులు, పిడుగుల పడుతున్నాయి. ఇందులో భాగంగా నరసరావుపేట నియోజకవర్గంలో పిడుగుపాటుతో నాగమ్మ, వెంకాయమ్మ, వెంకటయ్య, చిన్న కోటేశ్వరావు అనే నలుగురు మృతి చెందారు. ఈ ఘటనలో మూడు ఆటోలు,కొబ్బరి, మామిడి చెట్లు దెబ్బతిన్నాయి .






