
హుస్నాబాద్ గ్రామీణం: సిద్దిపేట జిల్లాలో సోమవారం ఉదయం భారీ వర్షం కురిసింది. రాష్ట్రంలోనే అత్యధికంగా జిల్లాలోని కొండపాక మండలంలో 14.5 సెంటీమీటర్ల వర్షపాతం నమోదయింది. కుకునూరు పల్లి మండలం తిప్పాపూర్ లో 11.4, నంగునూరు మండలంలో 10.9, హుస్నాబాద్‌లో 10.1, కోహెడ మండలం సముద్రాలలో 9.7, అక్కన్నపేట మండలం కట్కూరులో 7.2 సెంటీమీటర్ల చొప్పున వర్షం కురిసింది. ఈ వర్షంతో పలు గ్రామాల్లోని ఒర్రెలు, వాగులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. అక్కన్నపేట మండలం మోత్కుల్లపల్లి వద్ద కల్వర్టు పైనుంచి వరద నీరు ప్రవహిస్తోంది. మల్లంపల్లి -గొల్లపల్లి మధ్య ఉన్న దారనూతి వాగుపై లో లెవెల్ కల్వర్టు పైనుంచి వరద నీరు ప్రవహిస్తోంది. ఈ రెండు కల్వర్టులను హుస్నాబాద్ సీఐ శ్రీధర్ , అక్కన్నపేట ఎస్సై ప్రశాంత్ పరిశీలించారు. గత ఏడాది ఈ రెండు కల్వర్టుల వద్ద నీటిలో కొట్టుకుపోయి ముగ్గురు మృతి చెందారు. దీనితో అక్కడ అలాంటి ప్రమాదం జరగకుండా ఉండేందుకు ముందు జాగ్రత్తగా రాకపోకలు నిలిపివేశారు. .నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.




